Start-Camera-Action | స్టార్ట్-కెమెరా-యాక్షన్
సినిమా ఇండస్ట్రీ… అదో కలల ప్రపంచం. యాక్టింగ్, డైరెక్షన్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలని ఎంతోమంది కోరిక. హైదరాబాద్‌లోని ప్రముఖ స్టూడియోల వద్దకు వెళ్లి ఒక్క అవకాశం ఇవ్వండి మా టాలెంట్‌ను చూపిస్తాం అని ప్రాధేయపడేవారిని అడుగడుగునా చూస్తుంటాం…కానీ సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించాలంటే మార్గం అదికాదు. అందుకు వేరే మార్గం ఉంది. అందుకు తగిన కోర్సును అభ్యసించాలి. కానీ ఎక్కడ ఈ కోర్సులను ఆఫర్ చేస్తున్నారు. అందులో ఏయే కోర్సులు ఉంటాయి. వాటిని ఎలా చేయాలనే విషయం చాలామందికి తెలియదు అందుకోసం ఆయా కోర్సుల వివరాలు..
ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా
-ఫిలిం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను 1960లో పుణెలోని ప్రభాత్ స్టూడియోలో ఏర్పాటు చేశారు. . దీన్ని1971లో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాగా మార్చారు. అయితే టెలివిజన్ విభాగం అప్పటికే ఢిల్లీలోని మండీహౌస్లో ఉంది. దాన్ని కూడా పుణెకు మార్చి 1974లో సినిమా, టెలివిజన్ కోర్సులో శిక్షణను ఒకే విభాగం కిందకు తెచ్చారు. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ) స్వతంత్ర సంస్థ. ఇది కేంద్ర సమాచార, ప్రచారశాఖ కింద పనిచేస్తుంది.
FTII కోర్సులు
-పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ డైరెక్షన్ అండ్ స్క్రీన్‌ప్లే రైటింగ్
-పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ సినిమాటోక్షిగఫీ
-పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ సౌండ్ రికార్డింగ్ అండ్ సౌండ్ డిజైన్
-పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ఎడిటింగ్
-పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ యాక్టింగ్
-పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ఆర్ట్ డైరెక్షన్ అండ్ ప్రొడక్షన్ డిజైన్
-పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ఫ్యూచర్స్ ఫిల్మ్ స్క్రీన్‌ప్లే రైటింగ్
-పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఎలక్ట్రానిక్ సినిమాటోక్షిగఫీ
-పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ టీవీ డైరెక్షన్
-పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ ఇన్ వీడియో ఎడిటింగ్
-పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ఇన్ సౌండ్ రికార్డింగ్ అండ్ టీవీ ఇంజినీరింగ్
FTII అడ్మిషన్స్
-దరఖాస్తుల స్వీకరణ జూన్‌లో ప్రారంభమై జూలైలో ముగుస్తుంది. ఆగస్టులో ప్రవేశ పరీక్ష ఉంటుంది.
-పూర్తి వివరాలకు వెబ్సైట్: www.ftiindia.com
అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా (ఏఐఎస్ఎఫ్ఎం)
-దీన్ని జూన్ 20, 2012లో స్థాపించారు.
-ఇది హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఉంది. అత్యాధునిక సాంకేతిక ఫిల్మ్ అండ్ మీడియా హబ్ కలిగి ఉంది. ఇది జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి అనుబంధంగా ఏర్పడింది. ఇది భారతదేశ మొదటి ప్రభుత్వ గుర్తింపు పొందిన ఫిల్మ్‌మేకింగ్ ఫుల్‌టైమ్ డిగ్రీ కోర్సు కలిగిన సంస్థ.
స్వల్పకాలిక కోర్సులు
-ఇంట్రడక్షన్ టు డైరెక్షన్ ఫర్ ఫిల్మ్ అండ్ టీవీ
-ఫండమెంటల్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్
-ఫండమెంటల్స్ ఆఫ్ స్క్రిప్ట్ రైటింగ్
-ఫండమెంటల్స్ ఆఫ్ ఫిల్మ్ డైరెక్షన్ (తెలుగు)
-డీఎస్ఎల్ఆర్ ఫొటోక్షిగఫీ
-యాక్టింగ్, మోడలింగ్ అండ్ వీజే కోర్స్
-అడ్వాన్స్డ్ డిప్లొమా 3డీ యానిమేషన్ అండ్ వీఎఫ్ఎక్స్
డిగ్రీ కోర్సులు (నాలుగేండ్లు)
-బ్యాచిలర్స్ ఇన్ ఫిల్మ్‌మేకింగ్, బ్యాచిలర్స్ ఇన్ మాస్ కమ్యూనికేషన్స్, బ్యాచిలర్స్ ఇన్ యానిమేషన్
-మాస్టర్స్ ఇన్ ఫిల్మ్‌మేకింగ్, మ్యాస్టర్స్ ఇన్ మాస్ కమ్యూనికేషన్స్
-మాస్టర్స్ మీడియా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్
-పూర్తి వివరాలకు ఈ మెయిల్ info@aisfm.edu.in, 07093404369, 07680074134 నంబర్లలో సంప్రదించవచ్చు.
రామానాయుడు ఫిల్మ్ స్కూల్కోర్సులు
-మాస్టర్స్ ఇన్ డైరెక్షన్ అండ్ స్క్రీన్‌ప్లే రైటింగ్
-మాస్టర్స్ ఇన్ సినిమాటోక్షిగఫీ
-డి.ఎఫ్. టెక్ ఇన్ డైరెక్షన్ అండ్ స్క్రీన్‌ప్లే రైటింగ్
-వెబ్సైట్ : www.ramanaidufilmschool.net
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?