Energy sector in the country | దేశంలో ఇంధన రంగం
-భారతదేశానికి స్వాతంత్య్ర వచ్చినప్పుడు విద్యుచ్ఛక్తి ఉత్పాదన 1400 మెగావాట్లు.
-దేశంలో విద్యుదుత్పత్తి 1897లో డార్జిలింగ్‌లో ప్రారంభమైంది.
-నైవేలీ థర్మల్ పవర్ స్టేషన్ తమిళనాడులో ఉంది.
-చంద్రాపూర్ థర్మల్ పవర్ స్టేషన్ మహారాష్ట్రలో ఉంది.
-ఫరక్కా థర్మల్ పవర్ స్టేషన్ పశ్చిమబెంగాల్లో ఉంది.
-తాల్చేర్ థర్మల్ పవర్ స్టేషన్ ఒడిశాలో ఉంది.
-ఒబ్రా థర్మల్ పవర్ స్టేషన్ ఉత్తరప్రదేశ్‌లో ఉంది.
-నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ)ను 1975లో ప్రారంభించారు.
-నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ)ను 1975లో ప్రారంభించారు.
-దాద్రి థర్మల్ పవర్ కార్పొరేషన్ ఉత్తరప్రదేశ్‌లో ఉంది.
-దేశంలో అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ సాధించిన థర్మల్ కేంద్రం- విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్.
-బైరాసిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ హిమాచల్‌ప్రదేశ్‌లో ఉంది.
-లోక్తక్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ మణిపూర్‌లో ఉంది.
-గ్రామీణ విద్యుద్దీకరణ కార్పొరేషన్‌ను 1969లో స్థాపించారు.
-విద్యుత్ ప్రాజెక్ట్‌లకు ఆర్థిక సహాయం చేయడం కోసం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను ప్రారంభించారు.
-పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను 1986లో స్థాపించారు.
-నార్త్ ఈస్ట్రన్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను 1976లో స్థాపించారు.
-నార్త్ ఈస్ట్రన్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయం షిల్లాంగ్‌లో ఉంది.
-నాథ్పా జక్రి కార్పొరేషన్ సిమ్లాలో ఉంది.
-తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉత్తరాఖండ్‌లో ఉంది.
-భారతదేశపు మొదటి బాహుళార్థసాధక ప్రాజెక్ట్ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్.
-దామోదర్ వ్యాలీ కార్పొరేషన్‌ను 1948లో స్థాపించారు.
-దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ వలన లబ్ధి పొందే రాష్ర్టాలు-పశ్చిమబెంగాల్, జార్ఖండ్.
-సెంట్రల్ పవర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ను 1960లో స్థాపించారు.
-అతి ఎక్కువ బొగ్గు నిల్వలు గల రాష్ట్రం- జార్ఖండ్
-ఇండియాలో ఉన్న మొత్తం లిగ్నైట్ నిల్వల అంచనా 34,763 మిలియన్ టన్నులు.
-నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్‌ను 1956లో స్థాపించారు.
-లిగ్నైట్ నిల్వలు ఎక్కువగా నైవేలీ (తమిళనాడు)లో ఉన్నాయి.
-నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్‌ను 1986 నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చారు.
-పవన విద్యుదుత్పత్తిలో భారత్ 15,691 మెగావాట్ల సామర్థ్యంతో మొదటి 5 దేశాల సరసన చేరింది.
-సంప్రదాయ ఇంధన వనరులు- బొగ్గు, పెట్రోల్.
-సంప్రదాయేతర ఇంధన వనరులు- బయో ఎనర్జీ, సౌరశక్తి, జియోథర్మల్ ఎనర్జీ, మాగ్నెటో హైడ్రో డైనమిక్స్, తరంగశక్తి, విండ్ ఎనర్జీ.
-భుజ్ సోలార్ పాండ్ ప్రాజెక్ట్‌ను గుజరాత్లో ప్రారంభించారు.
-ప్రపంచంలో పవన శక్తిని ఉపయోగించి ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న దేశం- డెన్మార్క్.
-తమిళనాడులోని రాయతర్, ముప్పండల్లో విండ్ ఎనర్జీని ఉపయోగించుకొని విద్యుత్ ఉత్పాదన చేస్తున్నారు.
-సూర్యుని నుంచి భూమికి శక్తి రేడియేషన్ రూపంలో చేరుతుంది.
-సోలార్ కాన్స్టెంట్ అంటే 1.36 కిలోవాట్
-బయోగ్యాస్ ప్లాంట్ ద్వారా మీథేన్ గ్యాస్ తయారవుతుంది.
-హిమాచల్‌ప్రదేశ్‌లో మణికరణ్‌లో జియోథర్మల్ ప్రాజెక్ట్‌ను స్థాపించారు.
-ప్రపంచంలో ఉత్తత్తి అవుతున్న మొత్తం విద్యుత్‌లో జల విద్యుత్ వాటా 23 శాతం.
-ఇండియాలో ఉత్పత్తి చేయడానికి అవకావం ఉన్న హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ సామర్థ్యం 472X109 కిలోవాట్ అవర్స్.
-కేరళలోని విజింజంలో తరంగ విద్యుత్ ప్లాంట్‌ను నెలకొల్పారు.
-రిలయన్స్ కంపెనీ కృష్ణా-గోదావరి బేసిన్లో అపార సహజ వాయు నిక్షేపాలను కనుగొన్నది.
-1 మెగావాట్ ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ విద్యుత్ కేంద్రం ట్యుటికోరన్‌లో ప్రారంభించారు.
-ప్రపంచంలో అతిపెద్ద సౌరవిద్యుత్ కేంద్రాన్ని దక్షిణ పోర్చుగీసులోని మౌరా పట్టణ సమీపంలో ఏర్పరుస్తున్నారు. దీని సామర్థ్యం 62 మెగావాట్లు.
-ఆసియాలోని ఏకైక సోలార్ పాండ్ ప్రాజెక్ట్ గుజరాత్‌లోని భుజ్‌లో ఉంది.
-ప్రపంచంలోనే అతిపెద్ద పవన విద్యుత్ కేంద్రం ఇంగ్లండ్‌లోని కెంట్ సాగర తీరానికి ఆవల సముద్రంలో 1.38 బిలియన్ డాలర్లతో 3.5 చ.కి.మీ. విస్తీర్ణంలో స్వీడన్ విద్యుత్ కంపెనీ వాటిన్ఫాల్ నెలకొల్పింది.
-రాజస్థాన్ అటామిక్ పవర్ పార్క్ దేశంలోనే అతిపెద్దది.
-కోట (రాజస్థాన్)లో ఉన్న భారజల ప్లాంట్‌లో భారజలం తయారు చేయడానికి హైడ్రోజన్ సల్ఫైడ్ను ఉపయోగిస్తారు.
-తాల్చేర్ (ఒడిశా)లో గల భారజల ప్లాంట్‌లో భారజలం తయారు చేయడానికి అమ్మోనియా హైడ్రోజన్‌ను ఉపయోగిస్తారు.
-మణుగూరు (తెలంగాణ)లో గల భారజల ప్లాంట్‌లో భారజలం తయారు చేయడానికి హైడ్రోజన్ సల్ఫైడ్ను ఉపయోగిస్తారు.
-స్వీడన్‌కు చెందిన బయోగ్యాస్ కంపెనీ టెకినిస్కావెర్క్, రైల్వేల అనుబంధ సంస్థ యూరోమెంట్లు సంయుక్తంగా బయోగ్యాస్ రైల్ ఆమందాను రూపొందించాయి.
-న్యూఢిల్లీలోని ఉదజని (హైడ్రోజన్)తో నడిచే ఆటోరిక్షాను 2005, సెప్టెంబర్12న ప్రారంభించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు