Elladasu, the poet of philosophical | తత్వ కీర్తనల కవి ఎల్లదాసు
ఆధ్యాత్మిక తత్వ కీర్తనల కవి, రచయిత ఎల్లదాసు. ఈయన 17, 18వ శతాబ్దానికి చెందినవాడు. గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వర్తిస్తూ రాజయోగియై ఎన్నో ఆధ్యాత్మిక కీర్తనలను రచించారు. అంతేకాకుండా మెదక్ సమీపంలోని ముత్తాయి కోట సిద్ధేశ్వరాలయ నిర్మాణ ప్రదాత అయిన శ్రీసిద్ధేశ్వరభజనమాల అనే 4 ఆశ్వాసాల కీర్తనలు, ద్విపద కావ్యాలను రచించాడు. సర్వాన నిశిరోగ్రివః సర్వభూత గృహాశయః సర్వవ్యాపీస భగవాన్ తస్మాత్ సర్వగతః శివః అని శ్వేతాశ్వరోపనిషత్లో చెప్పినట్లుగా, సర్వం శివమయం శివాలయం అంటాడు.
ఉదా: కీర్తన- ఆసావేరి-ఆది తాళం
స్మరియింతు సిద్ధానామం శివా శివ
స్మరియింతు సిద్ధా నామం చింతలు దొలుగగ
సంత సమాయెను స్థిరమును గలిగెను ॥స్మరి॥
సిద్ధ నీనామము అమృతసారము
భవరోగ హరణము బాధ నివారము ॥స్మరి॥
తల్లివి దండ్రివి దైవమునీవే
యెల్ల లోకంబుల వెలుగువు నీవే
పంకజ చరణా పార్వతీ రమణా ॥స్మరి॥
సంకట హరణా కింకర భరణా
స్థిరము ముత్యాల కోట శ్రీ సిద్ధేశ్వరుని చోట
పరమభక్తుల పాట యెల్ల దాసుల నోట ॥స్మరి॥
ఈ విధంగా ఎన్నో కీర్తనలను రచించిన తెలంగాణ తత్వ కవి. దేశంలోని కవి పండితులందరూ గొప్పవారే అని ఎంతో వినయంగా చెప్పారు. ఈ కవి సమాధి ముత్తాయికోట సిద్ధేశ్వరాలయంలో ఉన్నది.
గజల్ తరజు (ఈశ తెర అమరీతి) జులువ
శివ సిద్ధూల బ్రోచె శివుడవూ సిద్ధేశుడవూ
పరమ భక్తుల బ్రోచె ప్రభుడవూ పరమేశుడవూ
దేవదేవ దీనబంధూ కావు కావుమయ్యా ముందూ
ముందు జ(న్మ)న్మామునందు యేమి తెలియదు యిందూ ॥శివ॥
దాతమాతావు నీవే ఆత్మ పరమాత్మవు నీవే
ఇందు నందూన నీవే రెంటి సందూన నీవే
చూపు రూపులు నీవే రేపు మాపులు నీవే
ద్రష్ట దృష్టాలు నీవే స్రష్ట సృష్టాలు నీవే ॥శివ॥
ధర (ధరణి)లో ముత్యాల కోట శ్రీ సిద్ధేశ్వరుని చోట
పరమ భక్తుల మాట యెల్ల దాసుల పాట ॥శివ॥
ఇలాంటి భక్తి తత్వ కీర్తనలను రచించాడు. వీరు ప్రతిష్టించిన మహాశివలింగం ముత్తాయికోట సిద్ధేశ్వరాలయుడై వెలుగతున్నాడు. గోవింద్ మహారాజు ప్రధాన పూజారి సహాయంతో ఈ ఆధ్యాత్మిక కవిని వెలుగులోకి తెచ్చారు.
ముత్యంపేట సాంబారాధ్యులు
గొప్ప సంస్కృత, తెలుగు కవి. ఈయనది ఒకప్పటి లచ్చపేట గ్రామం. శార్దూల పద్యాలతో శతకాన్ని, కొన్ని పద్యాలను రచించారు.
శా. శశిమాళ నవరత్న మాలిక భవత్సత్పాద పద్మంబునం
దుశుచీ భూతపు భక్తిచే నిడితి ముందున్ దీని గైకొమ్ముబా
విశుడంచున్ నను బుజ్జ గింపక యఘాళిన్ బాపి శంభూయాహ
ర్నిశమున్ సాకుము భక్తి పాలన దయానిత్యాత్మ సిద్ధేశ్వరా॥
అలాగే లచ్చపేట గ్రామంలో వేలేటి వంశస్థులు- ఆరాధ్య మహాకవులు చాలా మంది ఉన్నారు.
వీరప్ప-వీరభద్రప్ప
17, 18వ శతాబ్దంనాటి కవి ద్వయం. వీరు సోదరులు. గొప్పకవులు. శ్రీశైలం నుంచి సింహాచలం వరకు పాదయాత్ర చేసి శివునిపై శ్లోకాలు తెలుగు శతకాలను రచించారని చరిత్ర ద్వారా తెలుస్తున్నది. వీరిది పెద్ద చెల్మడ గ్రామం.
మహాశివుడిలో వెన్నెలను కురిపించే చంద్రుడు ఉన్నాడని శివపురాణం పేర్కొంటే, శివనామ స్మరణ చేయని మానవుల నాలుకలు ముక్తి చెందరని బొందితో కైలాసం చేరరని వీరి నమ్మకం.
గౌరీభట్ల (తూర్పు) మెట్రామశర్మ
సిద్దిపేట భోగేశ్వరాలయ దేవస్థాన రచయిత, యాజ్ఞక పౌరాణిక బ్రహ్మ. బ్రాహ్మణులకు ఎంతోమందికి సహాయంచేసి ఆశ్రయం కల్పించిన ఆధ్యాత్మిక తత్వవేత్త, పురోహితుడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?