‘హౌ టు పే ఫర్ ది వార్’ గ్రంథ రచయిత ఎవరు?
1. అభివృద్ధికి అనుకూలమైన వనరులు కలిగి ఉండి వాటిని సరిగ్గా వినియోగించుకోలేని దేశాలను ఏమంటారు?
ఎ) అభివృద్ధి చెందుతున్న దేశాలు
బి) అల్పాభివృద్ధి చెందిన దేశాలు
సి) మూడో ప్రపంచ దేశాలు
డి) పైవన్నీ
2. ఆర్థికాభివృద్ధి పరిణామక్రమంలో ఆర్థిక వ్యవస్థను ఐదు దశలుగా వర్గీకరించినది ఎవరు?
ఎ) రాగ్నర్ నర్క్స్
బి) డబ్ల్యూ. డబ్ల్యూ. రోస్టోవ్
సి) జె.బి. సే డి) హార్షమన్
3. పేదరిక విషవలయం గురించి వివరించిన ఆర్థిక వేత్త?
ఎ) దండేకర్ & రథ్ బి) హార్షమన్
సి) రాగ్నర్ నర్క్స్
డి) గున్నార్ మిర్దాల్
4. ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ప్రవ హించే వస్తుసేవల ద్రవ్య విలువనే జాతీయాదాయం అని నిర్వచించిన ఆర్థిక వేత్త ఎవరు?
ఎ) మార్షల్ బి) ఫిషర్
సి) పిగూ సి) శామ్యూల్ సన్
5. ఒక దేశంలోని జనాభాను ఏమంటారు?
ఎ) వనరులు
బి) మానవ వనరులు
సి) ఆర్థిక వనరులు
డి) సహజ వనరులు
6. 15 నుంచి 64 సంవత్సరాల మధ్య వయస్సుగల జనాభాను ఏమంటారు?
ఎ) ఉత్పాదక జనాభా
బి) అనుత్పాదక జనాభా
సి) డెమోగ్రఫీ సి) పైవన్నీ
7. భారతదేశానికి ప్రణాళికబద్ధమైన ఆర్థిక వ్యవస్థ గ్రంథ రచయిత?
ఎ) టాటా-బిర్లా
బి) మోక్షగుండం విశ్వేశ్వరయ్య
సి) ఎం.ఎన్.రాయ్
డి) ఎస్.ఎన్. అగర్వాల్
8. నీతి ఆయోగ్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 2014 జనవరి 1
బి) 2015 జనవరి 1
సి) 2016 జనవరి 1
డి) 2013 జనవరి 1
9. ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఉపాంత ఉత్పాదకత రుణాత్మకం అని పేర్కొన్నది ఎవరు?
ఎ) రాగ్నర్ నర్క్స్ బి) రాబిన్సన్
సి) సే డి) మార్షల్
10. పేదరికాన్ని లెక్కించడానికి పి-ఇండెక్స్ పద్ధతిని రూపొందించినది?
ఎ) దండేకర్ & రథ్ బి) గౌరవ్రాటే
సి) అమర్త్యసేన్ డి) లారెంజ్
11. వనరులను ఎన్నిసార్లు వాడుకుంటున్నప్పటికీ ఎలాంటి తరుగుదల లేకుండా నిల్వ ఉండే వనరులను ఏమంటారు?
ఎ) సహజ వనరులు
బి) పునరావృత వనరులు
సి) పునరావృతం కాని వనరులు
డి) సుస్థిర వనరులు
12. కరువులు, కాటకాలు, వరదలు, భూకంపాలు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస పోవడాన్ని ఏమంటారు?
ఎ) దుర్భిక్ష వలస బి) సోపాన వలస
సి) చక్రీయ వలస డి) అంతర వలస
13. కుటుంబ సభ్యులందరికీ సముచిత జీవన ప్రమాణం, ఉపాధి అవకాశాలు కల్పించే భూ పరిమాణాన్ని ఏమంటారు?
ఎ) కమతం బి) భూ కమతం
సి) ఆర్థిక కమతం డి) పైవన్నీ
14. ఒక హెక్టార్‌కు పండిన సగటు పంటను ఏమంటారు?
ఎ) ఉత్పత్తి బి) ఉత్పాదకత
సి) దిగుబడి డి) బి, సి
15. వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధిలో శిఖరాగ్ర సంస్థ, అపెక్స్ బ్యాంక్ ఏది?
ఎ) నాబార్డ్ బి) ఐడీబీఐ
సి) ఎస్బీఐ డి) ఆర్బీఐ
16. హరిత విప్లవం అనే పదాన్ని మొట్టమొదట ఎవరు ప్రతిపాదించారు?
ఎ) నార్మన్ బోర్లాగ్
బి) ఎం.ఎస్. స్వామినాథన్
సి) విలియం ఎస్.గ్రాండ్
డి) కీన్స్
17. కోళ్లు, గుడ్ల పెంపకంలో పెరుగుదలను ఏమంటారు?
ఎ) వెండి విప్లవం బి) బంగారు విప్లవం
సి) గులాబి విప్లవం డి) ఎరుపు విప్లవం
18. మేక్ ఇన్ ఇండియాను ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 2013 జూన్ 14
బి) 2014 సెప్టెంబర్ 25
సి) 2014 మే 29
డి) 2015 జనవరి 1
19. భారతదేశంలో రూపాయి చిహ్నం రూపకర్త?
ఎ) ఉదయ్‌కుమార్ బి) అజయ్‌కుమార్
సి) వినయ్‌కుమార్ డి) ప్రణయ్‌కుమార్
20. సేవా రంగానికి మరొకపేరు
ఎ) మూడో రంగం బి) తృతీయ రంగం
సి) గౌణరంగం డి) పైవన్నీ
21. జీవిత బీమా సంస్థను ఏ సంవత్సరంలో స్థాపించారు?
ఎ) 1950 బి) 1955
సి) 1956 డి)1960
22. పర్యాటకానికి మరొక పేరు?
ఎ) అదృశ్య వాణిజ్యం
బి) ధూమ రహిత పరిశ్రమ
సి) ఎ, బి డి) పైవేవీ కాదు
23. రహదారి నిర్మాణం, భవన నిర్మాణం, పారిశుదద్ధ్య కార్యకలాపాలలో పనిచేసే శ్రామికులను ఏమంటారు?
ఎ) ఎల్లో కాలర్ పనివారు
బి) ఆరెంజ్ కాలర్ పనివారు
సి) పింక్ కాలర్ పనివారు
డి) బ్లూ కాలర్ పనివారు
24. ప్రభుత్వం పూర్తి బడ్జెట్‌ను కాకుండా తాత్కాలికంగా కొన్ని నెలల కోసం ప్రతిపాదించిన బడ్జెట్‌ను ఏమంటారు?
ఎ) ఓట్ ఆన్ అకౌంట్
బి) కుంటి బాత్ బడ్జెట్
సి) మధ్యంతర బడ్జెట్
డి) ఎ, సి
25. రక్షణ వ్యయం, రుణాలపై వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు మొదలైనవి ఏ రకమైన వ్యయం?
ఎ) మూలధన వ్యయం
బి) కోశ వ్యయం
సి) రెవెన్యూ వ్యయం డి) పైవన్నీ
26. ఆంధ్రబ్యాంకును ఎప్పుడు యూనియన్ బ్యాంక్‌లో విలీనం చేశారు?
ఎ) 2020 ఏప్రిల్ 1 బి) 2021 ఏప్రిల్ 1
సి) 2019 మార్చి 31 డి) 2019 ఏప్రిల్ 1
27. వారసులు లేనివారు ఎటువంటి వీలునామా లేకుండా చనిపోయిన వారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని
ఏమంటారు?
ఎ) జప్తు బి) ఎచ్చీట్స్
సి) కానుక డి) విరాళం
28. ఆర్థిక సంఘాన్ని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేశారు?
ఎ) 260 బి) 270
సి) 280 డి) 290
29. నీటి పారుదల ప్రాజెక్టులు, రైల్వే నిర్మాణం కోసం చేసే రుణాన్ని ఏమంటారు?
ఎ) ఉత్పాదక రుణం
బి) నిధీకృత రుణం
సి) అనుత్పాదక రుణం డి) ఎ, బి
30. వస్తుమార్పిడి పద్ధతికి మరొక పేరు?
ఎ) వస్తు వినిమయ పద్ధతి
బి) బార్టర్ పద్ధతి
సి) సి-సి ఎకానమీ డి) పైవన్నీ
31. ప్రస్తుతం అమల్లో ఉన్న కాగితపు ద్రవ్యం ఏవి?
ఎ) 10, 20, 50, 100, 200, 1000, 2000
బి) 10, 20, 50, 100, 500, 2000
సి) 10, 20, 50, 100, 200, 2000
డి) 5, 10, 20, 50, 100, 1000, 2000
32. అత్యవసర పరిస్థితుల్లో జారీ చేసే ద్రవ్యాన్ని ఏమంటారు?
ఎ) శాసనపు ద్రవ్యం
బి) ప్రామాణిక ద్రవ్యం
సి) ఐచ్చిక ద్రవ్యం డి) పిలుపుద్రవ్యం
33. కేంద్రబ్యాంకు కొనే, అమ్మే సెక్యూరిటీ వ్యవహారాలను ఏమంటారు?
ఎ) బహిరంగ మార్కెట్ వ్యవహారాలు
బి) రెపోరేటు
సి) రివర్స్ రెపోరేటు డి) మార్జిన్
34. ఏటీఎం అంటే
ఎ) ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్
బి) ఆల్వేస్ టెల్లర్ మనీ
సి) ఎనీ టైం మనీ
డి) ఆల్వేస్ టెల్లర్ మెషిన్
35. ఒక రోజు కోసం ద్రవ్యం రుణంగా తీసుకున్నా, ఇచ్చినదాన్ని ఏమంటారు?
ఎ) పిలుపుద్రవ్యం
బి) ఓవర్ నైట్ ద్రవ్యం
సి) తక్షణ ద్రవ్యం డి) బి, సి
36. మిశ్రమ ద్రవ్యోల్బణాన్ని ప్రతిపాదించిన ఆర్థిక వేత్త ఎవరు?
ఎ) మాల్థస్ బి) సెడ్జివిక్
డి) కెంట్ డి) చార్లెస్ షుల్జ్
37. ‘హౌ టు పే ఫర్ ది వార్’ గ్రంథ రచయిత ఎవరు?
ఎ) జేబీసే బి) జేఎం కీన్స్
సి) శామ్యూల్ సన్ డి) మార్షల్
38. వివిధ దేశాలు తమ ఎగుమతులను అమ్మచూపే రేఖలను ఏమంటారు?
ఎ) ఎగుమతి రేఖలు బి) దిగుమతి రేఖలు
సి) ఆఫర్ రేఖలు డి) పైవన్నీ
39. గ్యాట్ (GATT)కు వారసురాలిగా ఏర్పాటైన సంస్థ?
ఎ) WTO బి) MFN
సి) GATS డి) SEZ
40. సమతౌల్య స్థితి అంటే?
ఎ) కదలలేని స్థితి బి) విరామ స్థితి
సి) మార్పులేని స్థితి డి) పైవన్నీ
41. చిన్న పరిశ్రమల విత్తంలో శిఖరాగ్ర సంస్థ ఏది?
ఎ) ఎస్ఐడీబీఐ బి) ఐడీబీఐ
సి) యూటీఐ డి) ఆర్ఆర్బీ
42. ప్రజా పంపిణీ వ్యవస్థ రూపకల్పనలో ఏర్పాటై న కమిటీ ఏది?
ఎ) దారియా కమిటీ
బి) చక్రవర్తి కమిటీ
సి) కేల్కర్ కమిటీ డి) కార్వే కమిటీ
43. మొదటి పంచవర్ష ప్రణాళిక నమూనా?
ఎ) హరడ్ నమూనా
బి) డోమర్ నమూనా
సి) హరడ్, డోమర్ నమూనా
డి) మహలనోబిస్ నమూనా
44. ప్రస్తుత (15) ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు?
ఎ) ఎన్.కె.సింగ్ బి) వై.వి. రెడ్డి
సి) విజయ్ కేల్కర్ డి) ఎ.ఎం. ఖుస్రో
45. ఆధునిక అర్థశాస్త్ర పితామహుడు ఎవరు?
ఎ) ఆడమ్‌స్మిత్ బి) జే. ఎం. కీన్స్
సి) మార్షల్ డి) మహలనోబిస్
46. సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు?
ఎ) హర్షమన్ బి) నైట్
సి) రాగ్నర్ నర్క్స్ డి) మాల్థస్
47. రిజర్వు బ్యాంకు తొలి భారతీయ గవర్నర్ ఎవరు?
ఎ) ఒస్బోర్న్ స్మిత్ బి) సి.డి. దేశ్‌ముఖ్
సి) వై.వి. రెడ్డి
డి) దువ్వూరి సుబ్బారావు
48. భారతదేశానికి ప్రణాళికా సంఘం కావాలని మొదట సూచించినది ఎవరు?
ఎ) మోక్షగుండం విశ్వేశ్వరయ్య
బి) జేఆర్డీ టాటా
సి) సుభాష్ చంద్రబోస్
డి) అమర్త్యసేన్
49. మానవ అభివృద్ధి సూచిక అనే పదాన్ని రూపొందించినది?
ఎ) మహబూబ్ ఉల్ హక్
బి) మహలనోబిస్
సి) మార్షల్ డి) యూఎన్ఓ
50. సామ్యవాద ఆర్థిక వ్యవస్థకు ఉదాహరణ?
ఎ) అమెరికా బి) రష్యా
సి) బ్రిటన్ డి) భారతదేశం
51. ఎమిగ్రేషన్ అంటే ?
ఎ) ఒక ప్రాంతాన్ని విడిచిపెట్టి పోవడం
బి) ఒక రాష్ర్టాన్ని విడిచిపెట్టి పోవడం
సి) ఒక దేశాన్ని విడిచి పెట్టి పోవడం
డి) ఒక గ్రామాన్ని విడిచి పెట్టి పోవడం
52. నూతన ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఎవరు?
ఎ) మన్మోహన్సింగ్
బి) పీవీ నరసింహారావు
సి) నెహ్రూ డి) మొరార్జి దేశాయ్
53. హైదరాబాద్ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదం చేసిన సంస్కరణలు ఎవి?
ఎ) నిజాం సంస్కరణలు
బి) సాలార్జంగ్ సంస్కరణలు
సి) గోల్కొండ సంస్కరణలు
డి) ఆంధ్రప్రదేశ్ సంస్కరణలు
54. హైదరాబాద్ రాష్ట్రంలో ప్రణాళిక శాఖను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
ఎ) 1940 బి) 1941
సి) 1942 డి) 1943
55. గిర్గ్లానీ కమిషన్‌ను ఎప్పుడు నియమించారు?
ఎ) 2000 జూన్ 20 బి) 2001 జూన్ 25
సి) 2002 జూన్ 25 డి) 2001 జూలై 1
56. జై ఆంధ్ర ఉద్యమం ఎప్పడు ప్రారంభం అయింది.
ఎ) 1971 బి) 1972
సి) 1973 డి) 1974
57. మానవ జాతి అమూల్య సంపద?
ఎ) ద్రవ్యం బి) పరిశ్రమలు
సి) భూమి డి) బంగారం
58. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతికి మరొక పేరు?
ఎ) జమిందారీ పద్ధతి
బి) రైత్వారీపద్ధతి
సి) మహల్వారీ పద్ధతి డి) పైవన్నీ
59. భారతదేశంలో విత్తన భాండాగారంగా పేరొందిన రాష్ట్రం ఏది?
ఎ) ఆంధ్రప్రదేశ్ బి) తెలంగాణ
సి) హైదరాబాద్ డి) హర్యానా
60. తెలంగాణ ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన పథకం ఏది?
ఎ) మిషన్ భగీరథ
బి) మిషన్ కాకతీయ
సి) కృష్ణా వాటర్‌గ్రిడ్ పథకం
డి) పాలమూరు ఎత్తిపోతల పథకం
61. తెలంగాణలో పేదరికం జాతీయ సగటు కంటే?
ఎ) తక్కువ బి) ఎక్కువ
సి) సమానం డి) పైవేవీకావు
62. తెలంగాణలో స్త్రీ, పురుష నిష్పత్తి తక్కువగా ఉన్న జిల్లా ఏది?
ఎ) నిర్మల్ బి) హైదరాబాద్
సి) ములుగు డి) రంగారెడ్డి
63. కల్యాణ లక్ష్మిపథకం ఏ తేదీ నుంచి అమలవుతుంది?
ఎ) 2014 ఆగస్టు 15
బి) 2015 ఆగస్టు 15
సి) 2016 ఆగస్టు 15
డి) 2017 ఆగస్టు 15
సమాధానాలు
1-డి 2-బి 3-సి 4-డి
5-బి 6-ఎ 7-బి 8-బి
9-బి 10-సి 11-బి 12-ఎ
13-సి 14-డి 15-ఎ 16-సి
17-ఎ 18-బి 19-ఎ 20-డి
21-సి 22-సి 23-బి 24-డి
25-సి 26-ఎ 27-బి 28-సి
29-డి 30-డి 31-బి 32-ఎ
33-ఎ 34-ఎ 35-డి 36-డి
37-బి 38-సి 39-ఎ 40-డి
41-ఎ 42-ఎ 43-సి 44-ఎ
45-బి 46-సి 47-బి 48-సి
49-ఎ 50-బి 51-సి 52-బి
53-బి 54-డి 55-బి 56-బి
57-సి 58-ఎ 59-బి 60-బి
61-ఎ 62-డి 63-ఎ
పానుగంటి కేశవ రెడ్డి: రచయిత వైష్ణవి పబ్లికేషన్స్ గోదావరిఖని 9949562008
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు