పరస్పర ఆధారం.. సంఘజీవనం
అరిస్టాటిల్ వ్యాఖ్యానించినట్లుగానే మానవుడు సంఘజీవి. మానవుడు తన ప్రాథమిక అవసరాలు, ద్వితీయ అవసరాలు లేదా శారీరక, మానసిక, ఉద్వేగ, ఆర్థికపరమైన అవసరాలను సంఘజీవనం ద్వారానే నెరవేర్చుకోగలడు. ఒంటరిగా సాధ్యం కాదు. జంతువుల నుంచి కూడా కొద్ది వరకు సమూహజీవనం ఉన్నప్పటికి అది ఆహారం సంపాదించడం, రక్షణకు మాత్రమే పరిమితమవుతుంది. సామాజిక సంస్థల(వివాహం, మతం, బంధుత్వం) వంటి వాటి ద్వారా క్రమయుతమైన జీవనాన్ని కలిగి ఉండటం, నాగరికత, సంస్కృతిని కలిగి ఉండటం, అత్యుత్తమమైన సమాచార ప్రసారం కోసం భాషను కలిగి ఉండటం వంటివి జంతు సమాజంలో కనిపించవు. మానవుల్లా వ్యవస్థీకృతంగా, పరస్పర ఆధారయుతంగా, నాగరికతతో కూడిన జీవనాన్ని కలిగి ఉండటానికి, మానవునికి మేధస్సు, వివేచన, పరిజ్ఞానం, ప్రత్యేకమైన శారీరక నిర్మాణంతో పాటు అత్యున్నత నాడీవ్యవస్థను కలిగి ఉండటమే ఇలా మానవుడు పరస్పరం ఆధారంతో కూడిన సంఘజీవనం ఎలా ఏర్పరుచుకున్నాడో వివరించేందుకు, మానవునికి సమాజానికి మధ్యగల సంబంధాన్ని వివరించేందుకు శాస్త్రవేత్తలు తమ సిద్ధాంతాలు రూపొందించారు. అవి
1. సామాజిక ఒడంబడిక సిద్ధాంతం
(Social Contract Theory)
2. సమూహ మనస్తత్వ సిద్ధాంతం
(Group Mind Theory)
3. సామాజిక జైవిక లేదా ఆంగిక సిద్ధాంతం
(Organismic Theory of Society)
సామాజిక ఒడంబడిక సిద్ధాంతం
- ఈ సిద్ధాంతాన్ని బలపరిచినవారు హబ్స్, లాక్, రూసోలు
- ఈ సిద్ధాంతం ప్రకారం ప్రాకృతిక వ్యవస్థ నుంచి ఇప్పటి సమాజం, సమాజ సభ్యులందరూ కలిసి ఉమ్మడి ఒప్పందం ఏర్పరుచుకోవడం వల్ల ఏర్పడింది.
- ప్రాకృతిక సమాజపు లక్షణాలు తెలిపే క్రమంలో హబ్స్.. లాక్, రూసోలతో విభేదించాడు.
- థామస్ హబ్ తన ‘లెవియాధిన్’ గ్రంథంలో ప్రాకృతిక వ్యవస్థ అనేది ఒంటరితనం, దారిద్య్రం, పాశవికత వంటి అవలక్షణాలతో కూడుకున్నవని పేర్కొన్నాడు. ఇలాంటి పశుప్రాయమైన జీవితం నుంచి బయట పడేందుకు మనుషులు కొన్ని ఉమ్మడి నియమాలు ఏర్పరుచుకున్నారని, వాటిని అనుసరిస్తున్నారని తెలిపాడు. అందువల్ల వీరి ప్రకారం సమాజం ‘సామాజిక ఒప్పందం’ ద్వారా వ్యవస్థీకృతమైనదిగా భావించవచ్చు.
- జాన్లాక్ తన గ్రంథమైన ‘Two treaties on Civil Government’లో హబ్స్ అభిప్రాయపడినట్లు కాకుండా ప్రాకృతిక వ్యవస్థలో సహజీవనం, సహకారం అనేవి ఉన్నాయని కానీ న్యాయసూత్రాలు లేనివి అందువల్ల సమాజం భవిష్యత్తులో ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఉమ్మడి ఒప్పందాన్ని ఏర్పరుచుకున్నారని తెలిపారు.
- Social Contract Theory అనే గ్రంథంలో రూసో సామాజిక ఒడంబడిక గురించి వివరించాడు. వీరి ప్రకారం ప్రాకృతిక వ్యవస్థలో సంతోషకరమైన జీవితం ఉన్నప్పటికీ కాలక్రమంలో జనాభా పెరగడం, సొంత ఆస్తులు పెరగడం, పోటీ ప్రపంచం ఏర్పడడంతో సహకారం స్థానంలో సంఘర్షణ ఏర్పడిందని అందువల్లనే ఉమ్మడి ఒప్పందాలు చేసుకుని అనుసరిస్తున్నారని అభిప్రాయపడ్డారు. స్వేచ్ఛగా జన్మించిన వ్యక్తులు ఈ ఒప్పందాల వల్ల సామాజిక సంకెళ్లతో బంధించబడ్డారని మళ్లీ తిరిగి ప్రాకృతిక స్థితిలోకి కూడా మానవ ఆర్థిక కోరికలు తీరడానికి కృత్రిమ సాధనమే సమాజం అని అభిప్రాయపడ్డారు.
- ప్రాకృతిక వ్యవస్థను అధిగమించడానికి మానవులందరూ ఉమ్మడిగా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని ఈ Social Contract Theory తెలుపుతుంది.
సమూహ మనస్తత్వ సిద్ధాంతం
- ప్రతి మనిషికి తనదైన మనస్తత్వం ఎలాగైతే ఉంటుందో, ప్రజలందరిని నడిపించే ఉమ్మడి మనస్తత్వం సమాజానికి ఉంటుందని ఈ సిద్ధాంత సారాశం.
- ఈ సిద్ధాంతాన్ని బలపరిచినది హెగెల్, గ్రీన్, బ్రాడ్లీ, ఎమర్సన్ వాగ్నర్, మెక్డోగేల్లు
- వ్యక్తులందరికి విభిన్న మనస్తత్వాలుంటాయి, అవి వారి పెంపకం, బాల్యం, కుటుంబం వారి సంస్కృతి, సామాజీకరణల వల్ల ఆయా మనస్తత్వాలు ఏర్పడతాయి. మనుషుల సొంత మనస్తత్వాన్ని ఒంటరిగా ఉన్నప్పుడు అనుసరిస్తూ, సమాజ కార్యకలాపాల్లో పాల్గొన్నప్పుడు అతని మనస్తత్వాన్ని వదిలి సమాజ ఆలోచనలను అంటే ఉమ్మడి మనస్తత్వాలను అనుసరిస్తారని, వ్యక్తి తన మనస్తత్వానికి, సమాజ మనస్తత్వానికి మధ్య పొంతన కుదరనప్పడు సమాజ మనస్తత్వాన్నే అనుసరిస్తాడని లేకపోతే అతను సమాజంలో విచలితను కలిగి ఉన్న వ్యక్తిగా పరిగణించబడుతాడు. సామూహిక మనస్తత్వాన్ని అనుసరిస్తే అతడు సంఘ జీవనాన్ని కొనసాగించలేడని ఈ సిద్ధాంతం సారాశం.
- సామూహిక మనస్తత్వం కంటికి కనిపించదు. కానీ వ్యక్తుల ప్రవర్తనను నియంత్రించేందుకు సాధనంగా దోహదపడుతుంది. వ్యక్తుల మనస్తత్వం కంటే సామాజిక మనస్తత్వం డర్క్హైమ్ తెలిపాడు.
- ఎవరైతే సామాజిక మనస్తత్వాన్ని అనుసరిస్తారో వారు తన మస్తిష్కంలో ఉన్న విపరీత, చెడు ధోరణులను అణచివేసుకుంటారరు. ఇలా సామూహిక మనస్తత్వం అనేది సమాజం ఒక క్రమపద్ధతిలో, అవాంఛనీయ ధోరణులు లేకుండా సమాజ ఏర్పడేలా దోహదపడిందని ఈ సిద్ధాంతం తెలుపుతుంది. సమాజంలోని రకరకాల సమూహాలకు, సామాజిక సంస్థలకు కూడా తనదైన సమూహ మనస్తత్వం ఉంటుంది.
ఉదా : వివాహం అనే సామాజిక సంస్థకు ఉమ్మడి అనుసరణ పద్ధతులు ఉండడం. - ఒక మతాన్ని ఆచరించే వారందరూ కూడా ఉమ్మడి జీవన విధానాన్ని అనుసరించడం The Group Mind అనే గ్రంథంలో లెబాన్ మెక్డోనాల్డ్ , ఈ సమూహ మనస్సునే సామూహిక మానసిక జీవితం లేదా సమూహ వ్యక్తిత్వం అని ఉదహరించాడు.
సామాజిక జైవిక (లేదా) సామాజిక ఆంగిక సిద్ధాంతం
- చార్లెస్ డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం నుంచి ప్రేరణ పొందిన ‘హెర్బర్ట్స్పెన్సర్’ అనే శాస్త్రవేత్త ఈ సిద్ధాంతాన్ని వివరించాడు.
- ఈ సిద్ధాంతంలో సారాంశం ఎలాగైతే ప్రకృతిలో ఏకకణ జీవులు ఉద్భవించి పరిణామ క్రమంలో సంక్లిష్టమైన నిర్మాణం కలిగిన ఉన్నతస్థాయి జీవులు ఏర్పడ్డాయో, అదేవిధంగా ఎలాంటి క్రమపద్ధతి లేని జీవనాన్ని కలిగి ఉండే మానవులు శరీరంలో వివిధ అవయవాల మధ్య ఎలాంటి సంబంధాలుంటాయో అలాంటి సంబంధాలను తమ మధ్య ఏర్పరుచుకుని పరిణామ క్రమంలో ప్రస్తుత నాగరిక సమాజం ఏర్పడిందని అభిప్రాయపడ్డాడు.
- స్పెన్సర్ సమాజాన్ని ఒక జీవితో పోల్చి Social Organismగా పిలిచాడు. ఒక జీవి వివిధ రకాల కణాల కలయిక వల్ల ఏవిధంగా ఏర్పడిందో అలాగే సమాజంలో ఒక్కొక్క వ్యక్తి కణంలా పనిచేస్తూ అలా అందరూ కలిసి సోషల్ ఆర్గనిజమ్ లేదా సమాజం ఏర్పడిందని భావించాడు.
- జీవిలో ఎలాగైతే కణం ఎలాంటి విధులను నిర్వర్తిస్తుందో సమాజంలో కూడా ప్రతి మానవుడు ఒక కణం వలే తన విధులను నిర్వర్తిస్తాడని అభిప్రాయపడ్డాడు.
- జీవులు ఎలాగైతే ఏకకణ దశ నుంచి ఉన్న తస్థాయి జీవులుగా పరిణామం చెందాయో సమాజం కూడా పాశవిక, ఆటవిక స్థాయి నుంచి ప్రస్తుత దశకు చేరుకుందని తెలిపాడు. విపత్తులు వచ్చినప్పుడు జీవులు ఎలా అవస్థలు పడతాయో, సమాజంలో సమస్యలు తలెత్తినప్పుడు సమాజం కూడా అవస్థలు పడుతుందని తెలిపారు.
- జీవుల్లో వివిధ అంతర్గత వ్యవస్థల మధ్య సమన్వయం ఉంటుందో అలాగే సమాజంలో ఉన్న మనుషుల మధ్య, సమూహాల మధ్య సమన్వయం ఉంటుందని తెలిపాడు. అవయవాల మధ్య సమన్వయం కోల్పోయినప్పుడు జీవి ఎలా ఇబ్బందిపడుతుందో అలాగే సమాజంలో కూడా వివిధ సమూహాలు, మనుషుల మధ్య సమన్వయం, సహకారం కొరవడినప్పుడు కూడా సమాజం లేని ఇబ్బందులను ఎదుర్కొంటుందని తెలిపారు.
- జీవుల్లో వివిధ అంగాలు, వ్యవస్థలను సమాజంలో గల వివిధ వ్యవస్థలతో పోల్చి ఈ సిద్ధాంతంలో స్పెన్సర్ వివరించాడు. అవి..
1. పోషణ వ్యవస్థ (Sustaining System)
2. పంపిణీ వ్యవస్థ (Distributary System)
3. నియంత్రణ వ్యవస్థ (Regulatory System) - జీవులలో నీరు, అన్నవాహిక, చిన్న పేగులు, ఇతర జీర్ణవ్యవస్థ అనేది ఎలాగైతే జీవించడానికి కావల్సిన శక్తి వనరులను అందిస్తుందో, అదేవిధంగా సమాజంలో వ్యవసాయం, ఇతర ఉత్పత్తి వ్యవస్థలు సమాజం కొనసాగడానికి ఉపయోగపడతాయని తెలిపారు. శ్రామికులు, కార్మికులు, రైతులు ఈ వ్యవస్థలో అంగాల వంటి వారని తెలిపారు.
- జీవులకు ఎలాగైతే గుండె, ధమనులు, సిరలతో కూడిన ప్రసరణ వ్యవస్థ ఉందో, అలాగే సమాజంలో కణాల వంటి వ్యక్తులకు అవసరమైన సదుపాయాలు అందించేందుకు రైల్వేలు, రోడ్డు, రవాణా టెలిగ్రాఫ్, బ్యాంకింగ్ లాంటివి పనిచేస్తాయని తెలిపాడు.
జీవులను ఎలాగైతే నాడీ నియంత్రణ వ్యవస్థ నియంత్రిస్తుందో అలాగే సమాజంలో ప్రభుత్వం, ఇతర నైతిక విలువలు నియమాలు వ్యక్తులను నియంత్రిస్తాయని తెలిపారు. జీవుల్లో మెదడు ఎలా పనిచేస్తుందో సమాజంలో మేధావులు, డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లు, పాలకులు, మతబోధకులు, తత్వబోధకులు, తత్వవేత్తలు కూడా తమ సేవలను సమాజానికి అందిస్తారని తెలిపారు.
ప్రాక్టీస్ బిట్స్
1. సామాజిక సంస్థ లక్షణం?
ఎ) విశ్వవ్యాప్తమైనది
బి) ఉమ్మడి ప్రవర్తన నియమాలు ఉంటాయి
సి) ఉమ్మడి కార్యకలాపాలు ఉంటాయి
డి) పైవన్నీ
2. ప్రాథమిక సామాజిక సంస్థకానిదేది?
ఎ) కుటుంబం బి) కులం
సి) బంధుత్వం డి) జాతీయత
3. కుటుంబ జీవన చక్రాన్ని 8 దశల్లో తెలిపినది?
ఎ) రూసో బి) అరిస్టాటిల్
సి) డూవల్ డి) మైకెవర్
4. అభిలషణీయం కాని పెంపకం?
ఎ) హెలికాప్టర్ బి) పర్మిసివ్
సి) డెమోక్రటిక్ డి) పాజిటివ్
5. ఎవరి నిర్వచనాన్ని కుటుంబానికి సంబంధించి సమగ్ర నిర్వచనంగా భావిస్తారు?
ఎ) ముర్దోక్ బి) ఎడ్మండ్లీజ్
సి) రూసో డి) పెస్టాలజీ
6. కుటుంబ త్రికోణాన్ని తెలిపినది ఎవరు?
ఎ) ముర్దోక్ బి) ఎడ్మండ్లీజ్
సి) రేమండ్ ఫర్త్ డి) పెస్టాలజీ
7. నగరీకరణ, పారిశ్రామికీకరణ అధికంగా ఉండే సమాజాలలో ఏర్పడే కుటుంబాలు?
ఎ) నూతన స్థానిక బి) పతిస్థానిక
సి) పత్రి స్థానిక డి) ఉభయ స్థానిక
8. భారతీయ కుటుంబాలను 5 రకాలుగావర్గీకరించినది ఎవరు?
ఎ) ఎ.ఆర్.దేశాయ్ బి) ఐ.సి. దేశాయ్
సి) ఎం.ఎన్. శ్రీనివాస్ డి) ఐరావతి కార్వే
9. బహుభర్తృత్వం కుటుంబాలకు ఉదాహరణ గుర్తించండి?
ఎ) బైగా కుటుంబాలు బి) లస్సు కుటుంబాలు
సి) తోడా కుటుంబాలు డి) కిప్సిజి కుటుంబాలు
10. పత్ని స్థానిక కుటుంబాలకు ఉదాహరణ?
ఎ) ఖాసీలు బి) గారోలు
సి) నాయర్లు డి) పైవన్నీ
11. సంప్రదాయ ఉమ్మడి కుటుంబంలో కనీసం ఎన్ని తరాలు ఉమ్మడిగా నివసిస్తాయి?
ఎ) 3 బి) 4 సి) 5 డి) 6
12. ధనుర్బాణోత్సవం ఏ గిరిజన తెగలలో కనిపిస్తుంది?
ఎ) ముండాలు బి) సంతాలులు
సి) భిల్లులు డి) తోడాలు
13. బహుభర్తృత్వాన్ని పాటించే గిరిజన తెగను గుర్తించండి.
ఎ) ఖాసాలు బి) తోడాలు
సి) గారోలు డి) పైఅందరూ
14. దేవరన్యాయాన్ని పాటించే గిరిజన తెగను గుర్తించండి.
ఎ) భగతలు బి) సవరలు
సి) గదవలు డి) పైఅందరూ
15. హిందూ పురాతన వివాహాల్లో అత్యంత పవిత్రమైన వివాహ రూపం?
ఎ) బ్రహ్మ బి) దైవ
సి) ఆర్య డి) ప్రజాపత్య
16. హిందూ పురాతన వివాహాల్లో అత్యంత హీనంగా భావించే వివాహ రూపం?
ఎ) గాందర్వ బి) అసుర
సి) రాక్షస డి) పైశాచ
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?