‘వెట్టిచాకిరీ నిర్మూలన’ ఎప్పుడు అమలులోకి వచ్చింది
ప్రాథమిక హక్కులు
-ఇప్పటివరకు ప్రాథమిక హక్కుల ప్రాముఖ్యత, సమానత్వపు హక్కు, స్వాతంత్య్రపు హక్కు గురించి చూశాం. ప్రస్తుతం పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్య్రపు హక్కు, సాంస్కృతిక విద్యావిషయ హక్కుల గురించి చర్చిద్దాం…
పీడనాన్ని నిరోధించే హక్కు (23-24 ప్రకరణలు)
-23వ నిబంధన ప్రకారం: వెట్టిచాకిరి, బానిసత్వం, మనుషుల క్రయ విక్రయాలు నిషేధం.
-23వ నిబంధనను అమెరికాలో బానిసత్వ నిర్మూలన కోసం రూపొందించిన 13వ రాజ్యాంగ సవరణతో పోల్చవచ్చు.
-జంతువులు, వస్తువులను కొని అమ్మినట్లుగా మనుషులను క్రయవిక్రయాలు చేయడాన్ని ట్రాఫికింగ్ అం టారు.
-Begar అంటే వెట్టి. వెట్టి అంటే ఏ విధమైన ప్రతిఫలం చెల్లించకుండా వారిచేత పని చేయించుకోవడం.
-తెలంగాణ ప్రాంతంలో నిజాం హయాంలో దేశ్‌ముఖ్‌లు, దేశ్‌పాండేలు, జాగీర్దార్లు ఏ విధమైన ప్రతిఫలం చెల్లించకుండా వెట్టి చేయించేవారు.
-23 (1)వ నిబంధన పరిధిలో బాల బాలికల క్రయ విక్రయాలు, దేవదాసి, జోగిని, వెట్టిచాకిరీ, బానిసత్వం, వ్యభిచారం లాంటివన్నీ నేరాలుగా పరిగణించబడుతా యి. నేరాలను నిర్మూలన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలను తీసుకోవాలి.
-ఈ హక్కు స్వదేశీయులతోపాటు విదేశీయులకు కూడా వర్తిస్తుంది.
-విశాల్ జీత్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (1990)లో మనుషుల క్రయవిక్రయాలు అనే పదం లో దేవదాసి పద్ధతిలో భాగమని సుప్రీంకోర్టు ప్రకటించింది.
-పీపుల్స్ యూనియన్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా (1982) కేసులో ఏషియాడ్ క్రీడలు ఢిల్లీలో జరిగిన సందర్భంగా కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం కన్నా తక్కువగా చెల్లించడం రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీంకోర్టు తన తీర్పులో ప్రకటించింది.
ch-bixamaiah-వెట్టిచాకిరీ, బానిసత్వ నిర్మూలన కోసం భారత పార్లమెంటు 35వ నిబంధన ప్రకారం ప్రత్యేక శాసనాలను రూపొందించవచ్చు. అవి..
-అశ్లీల, అసభ్య వ్యాపార నిరోధక చట్టం 1956లో ప్రకటించారు.
-కనీస వేతనాల చట్టం- 1976
-వెట్టి (బేగార్) చాకిరీ నిర్మూలన చట్టం- 1976
-23 (2) నిబంధన ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి కోసం అవసరమైతే ప్రజల నుంచి వారి శ్రమను ఎలాంటి వేతనం చెల్లించకుండా ఉపయోగించుకోవచ్చు.
ఉదా: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014, ఆగస్టు 19న సమగ్ర కుటుంబ సర్వే కోసం ఉచితంగా అందరి సేవలను వినియోగించుకొంది. ఇది వెట్టి చాకిరి పరిధిలోకి రాదు.
24వ నిబంధన: బాల కార్మిక వ్యవస్థ నిషేధం
-14 ఏండ్లలోపు పిల్లలను కఠినమైన శ్రమతో కూడిన గనులు, కర్మాగారాల్లో పనిచేయించకూడదు. బాల కార్మిక నిషేధ చట్టాలను పార్లమెంటు రూపొందించాలి.
-ఐక్యరాజ్యసమితి బాలల హక్కులపై 1989లో నిర్ణయించిన ప్రకారం 18 ఏండ్లలోపు వారు బాలలు.
-అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) ప్రకారం 15 ఏండ్లలోపు వారు బాల కార్మికులు.
-భారత రాజ్యాంగం, భారత పార్లమెంటు రూపొందించిన బాలకార్మిక నిషేధ నియంత్రణ చట్టం ప్రకారం దేశంలో 14 ఏండ్లు దాటని వారంతా బాలలే.
-భారతదేశంలో స్వాతంత్య్రానికి ముందు, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలన కోసం అనేక చట్టాలను రూపొందించారు. అవి..
-1933లో బాలల చట్టాన్ని రూపొందించి, వివిధ రం గాల్లో బాలకార్మికులకు దోపిడీ నుంచి విముక్తి కల్పించి వారి తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం చేయాలని చట్టంలో పొందుపర్చారు.
-1938లో రూపొందించిన బాలల ఉపాధి చట్టం ప్రకా రం పిల్లల చేత కర్మాగారాల్లో పని చేయించకూడదు.
-1974లో జాతీయ బాలల విధానాన్ని రూపొందించా రు. ఈ విధానం ప్రకారం బాలలకు కింది హక్కులు కల్పించారు.
1. జీవించే హక్కు
2. రక్షణ పొందే హక్కు
3. అభివృద్ధి చెందే హక్కు
4. భాగస్వామ్య హక్కు
-1986లో బాల కార్మిక నిషేధ, నియంత్రణ చట్టాన్ని రూపొందించారు. దీనిని 2006, అక్టోబర్ నెలలో సవరించారు.
-బాల కార్మిక నిరోధక సవరణ చట్టం ప్రకారం ఏడాది జైలు శిక్ష, రూ. 25,000 జరిమాన విధిస్తారు.
-1997లో సుప్రీంకోర్టు ఎంసీ మెహ తా Vs స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో బాల బాలికలకు విద్య, ఆరోగ్యం, పౌష్ఠికాహారం అందించాలని, బాలల కోసం పునరావా స నిధిని ఏర్పాటు చేయాలని ప్రమాదకరమైన పనుల్లో బాలల చేత పని చేయించకూడదని తీర్పులో ప్రకటించారు.
-బందువా ముక్తి మోర్చా Vs యూనియన్ ఆఫ్ ఇండియా (1997) కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం బాలల సంరక్షణ కోసం ప్రత్యేక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని, బాలలతో పనిచేయించుకొనే యజమానికి రూ. 20,000 జరిమాన విధించాలని తీర్పు ప్రకటించింది.
-పాఠశాలలో ఉపాధ్యాయులు పిల్లలను దండించడం పీడన పరిధిలోకి వస్తుందని 2004లో ఢిల్లీ హైకోర్టు ప్రకటించింది.
-2009లో రూపొందించిన ఉచిత నిర్భంద విద్యా హక్కు చట్టం ప్రకారం బాలలకు ఉచిత విద్య అందించాలి, వారిని దండించకూడదు.
-2004లో బాల కార్మికుల సంరక్షణ కోసం ఎంఎస్ గురుపాదస్వామి అధ్యక్షతన పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేశారు.
-బాలల హక్కుల పరిరక్షణ చట్టాన్ని 2005, డిసెంబర్లో భారత పార్లమెంటు ఆమోదించింది.
-జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ను 2007, మార్చిలో శాంతాసిన్హా చైర్‌పర్సన్‌గా ఏర్పాటు చేశారు.
-బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రస్తుత చైర్పర్సన్ Struto Kacker (2015 సెప్టెంబర్ నుంచి)
సాంస్కృతిక విద్యావిషయక హక్కు – (29-30 నిబంధనలు)
-సాంస్కృతిక విద్యావిషయక హక్కు ప్రత్యేకంగా రాజ్యాంగంలో అల్ప సంఖ్యాక వర్గాల రక్షణ కోసం కల్పించబడింది.
29వ నిబంధన: మైనరిటీలకు రక్షణలు
-29 (1) ప్రకరణ ప్రకారం అల్ప సంఖ్యాక వర్గాల వారి భాష, లిపి పరిరక్షించుకునే స్వేచ్చ ఉంది.
-29 (2) ప్రభుత్వం నిర్వహించే లేదా ప్రభుత్వ సహాయంతో నిర్వహిచబడే విద్యా సంస్థల్లో మతం, జాతి, కులం, భాషా ప్రాతిపదికగా ప్రవేశాలను నిరోధించకూడదు.
30వ నిబంధన: విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవడానికి మైనారిటీలకు అవకావం
-30 (1) నిబంధన ప్రకారం అల్ప సంఖ్యాక వర్గాలవారు తమ భాష, ప్రత్యేక లిపిని పరిరక్షించుకోవడానికి విద్యా సంస్థలను స్థాపించుకొని పరిరక్షించుకోవచ్చు.
-30 (2) నిబంధన ప్రకారం మైనారిటీలకు విద్యా అవకాశాలు కల్పించడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాలయాలు ఏర్పాటు చేసి ప్రత్యేక గ్రాంట్లు మం జూరు చేయాలి.
మత స్వాతంత్య్రపు హక్కు – 25 నుంచి 28 అధికరణాలు
-మత స్వాతంత్య్రపు హక్కు భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా పెంపొందించడానికి ఈ హక్కు ఉపయోగపడుతుంది.
-మతస్వాతంత్య్రపు హక్కు భారతీయులతోపాటు మన దేశానికి చెందని విదేశీలకు కూడా వర్తిస్తుంది.
25వ నిబంధన: ప్రతి భారతీయ పౌరుడు తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు.
-25 (1) ప్రకారం ప్రతి పౌరుడు తనకు విశ్వాసం ఉన్న మతాన్ని స్వీకరింవచ్చు, ఆచరించవచ్చు. బలవంతంగా మత మార్పిడులు చేయకూడదు.
-25 (2ఎ) నిబంధన ప్రకారం బలవంతపు మత మార్పిడులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించవచ్చు.
-25 (2బి) నిబంధన ప్రకారం బౌద్ధులు, జైనులు, సిక్కు మతానికి చెందిన వారు కూడా హిందువులని అర్థం.
-మత మార్పిడులను నిషేధిస్తూ మొదటిసారిగా 1967లో ఒడిశా రాష్ట్రం ప్రత్యేక చట్టం చేసింది. తరువాత కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ర్టాలు కూడా మత మార్పిడులను నిషేధిస్తూ చట్టాలు చేశాయి.
-మతం అనేది వ్యక్తిగతమైనది, మతం విశ్వాసానికి సంబంధించింది.
-స్టాలిన్ Vs మధ్యప్రదేశ్ (1947) కేసులో సుప్రీంకోర్టు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మత మార్పిడులను నిషేధిస్తూ చేసిన చట్టం రాజ్యాంగబద్ధ్దమేనని సమర్థించింది.
26వ నిబంధన: మత సంస్థల నిర్వహణలో ప్రతి పౌరుడికి స్వేచ్ఛ
-ప్రతి పౌరుడు తనకు నచ్చిన విధంగా మత ధార్మిక సంస్థలను స్థాపించుకోవచ్చు.
-మతానికి, ధార్మిక సంస్థకు కావాల్సిన స్థిర, చర ఆస్తులను సమకూర్చుకొని నిర్వహించుకోవచ్చు.
27వ నిబంధన: ప్రజల నుంచి మత నిర్వహణకు ఏ విధమైన పన్నులను వసూలు చేయకూడదు
-దేవస్థానాల్లో ప్రత్యేక దర్శనం, ప్రత్యేక సేవల కోసం అవసరమైన వారి నుంచి ఫీజులు వసూలు చేయడం రాజ్యాంగ వ్యతిరేకం కాదు.
28వ నిబంధన: ప్రభుత్వ విద్యాలయాల్లో మతబోధన నిషేధం
-కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో, ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నిర్వహించబడే ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యాలయాల్లో మత బోధన నిషేధం.
-మదరసాలు, క్రైస్తవ విద్యా సంస్థలు తమ విద్యాలయాల్లో మత బోధన జరపవచ్చు. ఇది రాజ్యాంగ విరుద్ధం కాదు.
-28వ అధికరణం భారతదేశ లౌకిక దేశం అనే భావనను తెలుపుతుంది.
-ఎస్ఆర్ బొమ్మయ్ Vs కర్ణాటక (1994) కేసులో సుప్రీంకోర్టు లౌకిక తత్వం భారత రాజ్యాంగ మౌళిక లక్షనం అని తెలిపింది.
ప్రాక్టీస్ బిట్స్
1. లౌకిక స్వభావం మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని సుప్రీంకోర్టు ఏ తీర్పులో ప్రకటించింది?
1) చరణ్‌లాల్ సాహు Vs యూనియన్ ఆఫ్ ఇండియా
2) ఎస్ఆర్ బొమ్మై Vs యూనియన్ ఆఫ్ ఇండియా 3) గోలక్‌నాథ్ Vs పంజాబ్
4) కేశవానంద భారతి Vs కేరళ
2. మైనారిటీల రక్షణ కోసం పొందుపర్చిన ప్రాథమిక హక్కు ఏది?
1) సమానత్వపు హక్కు
2) విద్యా, సాంస్కృతిక హక్కు
3) మతస్వాతంత్య్రపు హక్కు
4) సాతంత్య్రపు హక్కు
3. కింది వాటిలో ప్రాథమిక హక్కులో లేనిది?
1) జీవించే హక్కు
2) సంఘంగా ఏర్పడేహక్కు
3) ఓటు హక్కు
4) మత సంస్థకు ఏర్పాటు చేసుకునే హక్కు
4. భారతదేశంలో ప్రస్తుతం జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అధిపతి ఎవరు?
1) శాంతాసిన్హా
2) లలితా కుమార మంగళం
3) జస్టిస్ సీ సిరియా జోసెఫ్
4) స్తుతి నరేన్ కాకర్
5. వెట్టి చాకిరీ నివారణ చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది ?
1) 1956 2) 1961 3) 1976 4) 1986
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు