విలువనివ్వాలా? నిలువరించాలా?
క్రిప్టో కరెన్సీ
బిట్ కాయిన్
2008లో ‘సతోషి నకమోతో’ అనే వ్యక్తి బ్లాక్ చైన్ సాంకేతికతను ఉపయోగించి బిట్ కాయిన్‌ను కనిపెట్టాడు. 2022 ఆగస్టు 6 నాటికి దేశంలో బిట్‌కాయిన్ ధర దాదాపు రూ.18,42,581.68 గా ఉంది. ఈ విలువ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. రూపాయిని పైసలుగా విభజించినట్లు బిట్‌కాయిన్‌ను సతోషిలుగా విభజిస్తారు. 1 బిట్ కాయిన్ 10 కోట్ల సతోషిలు ఉంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
– ఇది మార్పిడి మాధ్యమంగా పనిచేయడానికి రూపొందించిన డిజిటల్ ఆస్తి, క్రిప్టో కరెన్సీకి సంబంధించి వ్యక్తిగత నాణేల యాజమాన్య రికార్డులు కంప్యూటరైజ్డ్ డేటాబేస్ రూపంలో ఉన్న లెడ్జర్లో నిల్వ చేస్తారు.
ఎందుకు ఉపయోగిస్తారంటే..
-ఈ కరెన్సీలో లావాదేవీ రికార్టులను భద్రపరచడానికి అదనపు నాణేల సృష్టిని నియంత్రింయడానికి, నాణేల యాజమాన్యం బదిలీని ధృవీకరించడానికి బలమైన క్రిప్టోగ్రఫీని ఉపయోగిస్తారు.
ఎలా లభిస్తుంది?
-క్రిప్టో కరెన్సీ సాధారణంగా భౌతిక రూపంలో (కాగితపు డబ్బు) లభించదు. ఇది కేంద్ర అధికారం ద్వారా జారీ చేయబడదు. పూర్తిగా ఇంటర్నెట్లో కనిపించే డిజిటల్ కరెన్సీ మాత్రమే. అయితే ఈ కరెన్సీని సాధారణ నగదు నోట్ల రూపంలోకి మార్చుకోవచ్చు. క్రిప్టో కరెన్సీలో ముద్రణ ఉండదు. కేవలం మైనింగ్ మాత్రమే జరుగుతుంది.
‘మైనింగ్’ అంటే ఏంటి..?
-మైనింగ్ అంటే కంప్యూటర్లలో కొన్ని సంక్లిష్టమైన గణిత సమస్యలను పరిష్కరించడం (మైనింగ్) ద్వారా కొత్త నాణేలను సృష్టించవచ్చు. ఇది పూర్తిగా సాంకేతిక అంశం.
ఎవరు ఈ ‘మైనర్స్’ ?
– మైనింగ్ చేయడానికి అత్యంత శక్తిమంతమైన కంప్యూటర్లు కావాలి. క్రిప్టో కరెన్సీ లావాదేవీలను ‘మైనర్స్’ పర్యవేక్షిస్తూ ఉం టారు. క్రిప్టో కరెన్సీ కాయిన్స్‌ను మింట్ చేసినందుకు ప్రతిఫలంగా ‘మైనర్స్’ (miners)కు కమిషన్ అందుతుంది.
దేనికి ఉపయోగిస్తారంటే..
– క్రిప్టోకరెన్సీలో సాధారణంగా కేంద్రీకృత డిజిటల్ కరెన్సీ, సెంట్రల్ బ్యాంకింగ్ వ్యవస్థలకు విరుద్ధంగా వికేంద్రీకరణను ఉపయోగిస్తారు. క్రిప్టో కరెన్సీ రూపొందించడానికి ప్రభుత్వాల అనుమతులు అవసరం లేదు.
ఎలా కొనాలి?
-స్టాక్ మార్కెట్లలో షేర్లు కొన్న విధంగానే క్రిప్టో కరెన్సీలు కొనుగోలు చేయవచ్చు, అమ్మొచ్చు. క్రిప్టోను ఎక్స్ఛేంజ్ల ద్వారా చేసుకోవచ్చు.
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలంటే ముందుగా క్రిప్టో వాలెట్లను తెరవాలి. ‘యూనోకాయిన్ వజీర్ ఎక్స్’ వంటి ప్లాట్‌ఫామ్స్ ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్నాయి.
ఎందుకు ఇంత డిమాండ్ ?
– క్రెడిట్/ డెబిట్ కార్డులు లేదా బ్యాంక్ వంటి థర్డ్ పార్టీ అవసరం లేకుండానే రెండు పార్టీల మధ్య నిధుల బదిలీ సులభం అవుతుంది. ఇతర ఆన్లైన్ లావాదేవీలతో పోలిస్తే ఇది క ప్రత్యామ్నాయం.
– క్రిప్టో చెల్లింపులు చాలా సురక్షితంగా ఉంటాయి.
– ఆధునిక క్రిప్టో కరెన్సీ సిస్టమ్స్ పబ్లిక్ ‘కీ’ లేదా ప్రైవేట్ ‘కీ’ ద్వారా మాత్రమే యాక్సెస్ చేయగల వినియోగదారు ‘వాలెట్’ లేదా ఖాతా చిరునామాతో వస్తాయి.
– ప్రైవేట్ ‘కీ’ అనేది కేవలం వాలెట్ యజమానికి మాత్రమే తెలిసే అవకాశం ఉంది.
– క్రిప్టో కరెన్సీ ద్వారా కనీస ప్రాసెసింగ్ రుసుములతో నిధుల బదిలీలు పూర్తవుతాయి.
ఆందోళనలు?
– క్రిప్టోకి ఎటువంటి నియంత్రణ వ్యవస్థలేదు. ‘పీర్-టు-పీర్ నెట్వర్క్’ ద్వారా పనిచేసే ఆన్లైన్ లెడ్జర్లో మాత్రమే లావాదేవీలు నమోదు అవుతాయి.
-తెరవెనుక జరిగే లావాదేవీలను కనుక్కోవడం కష్టం. టెరర్ ఫండింగ్, మనీ లాండరింగ్ వంటి అంశాలకు ఆస్కారం ఎక్కువ
-క్రిప్టో కరెన్సీకి భౌతిక రూపం లేనందున ప్రభుత్వ వ్యవస్థలు వీటిని జప్తు చేయలేవు.
– అధికశాతం ప్రజలు క్రిప్టో కరెన్సీలను విశ్వసించకపోవడానికి ప్రధాన కారణం వికేంద్రీకృత స్వభావం
-క్రిప్టో కరెన్సీలపై ప్రభుత్వం పర్యవేక్షణ ఉండదు కాబట్టి మోసాలు, నష్టాలకు ఆస్కారం ఉంటుంది.
-చట్టబద్ధత లేకపోవడం వల్ల మదుపర్లకు భరోసా లభించడం లేదు.
బ్లాక్ చైన్ గురించి తెలుసా?
– క్రిప్టో కరెన్సీ బ్లాక్ చైన్ టెక్నాలజీతో తయారవుతుంది. బ్లాక్ చైన్ ఒక పబ్లిక్ లెడ్జర్ వంటిది. ఈ డేటా అనేక బ్లాకుల్లో స్టోర్ అవుతుంది. అందుకే బ్లాక్ చైన్ హ్యాక్ చేయడం అంత కష్టం. ఇలా రికార్డ్‌ని ఎక్కువ బ్లాక్‌లలో స్టోర్ చేయడాన్ని ‘ట్రస్ట్ లెస్ అండ్ ఫుల్లీ డీ సెంట్రలైజ్డ్ పీర్-టు-పీర్ ఇమ్యూటబుల్ డేటా స్టోరేజ్’ అంటారు.
భారత్‌లో క్రిప్టో కరెన్సీ
-దేశంలో క్రిప్టో కరెన్సీని పూర్తిగా బ్యాన్ చేస్తూ 2018లో ‘రిజర్వు బ్యాంక్’ నిర్ణయం తీసుకుంది. కానీ 2020లో సుప్రీంకోర్టు ఆ బ్యాన్‌ను ఎత్తివేసింది. ప్రస్తుతం భారత్‌లో క్రిప్టో కరెన్సీనీ కొనవచ్చు, ఉపయోగించ వచ్చు కూడా. కాకపోతే అధికారికంగా గుర్తింపు, అనుమతి ఉండదు. ఇటీవల భారత ప్రభుత్వం ‘క్రిప్టో కరెన్సీ, రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు, 2021’ ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా కింద పేర్కొన్నవి చేయవచ్చు..
1. సావరిన్ డిజిటల్ కరెన్సీని సృష్టించడం
2. అన్ని పైవేట్ క్రిప్టోకరెన్సీలను ఏకకాలంలో నిషేధించడం
ఎన్ని రకాల క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి?
-బిట్ కాయిన్ ఎథెరియా, రిపెల్, లైట్ కాయిన్, బిట్ కాయిన్ క్యాష్, బినాన్స్, సోలానా, టెథర్, కార్డనో, పోల్కా డోట్ డోజ్ కాయిన్, ఒష్ట్రా, ఏఐఈ కాయిన్, మూన్ కాయిన్, మోనెరో, జెడ్ క్యాష్, అవలాంచ్, క్రిప్టో కాయిన్, టెరా, పొలిగాన్, చైన్ లింక్, స్టెల్లార్, వుయ్ చైన్, శాండ్ బాక్స్, కాస్మోస్, ఫాంటమ్ వంటివి ప్రధానమైనవి.
తెలుసుకుందాం..
ప్రపంచంలో మొట్టమొదటిసారి బిట్‌కాయిన్‌తో ఏం కొనుగోలు చేశారో తెలుసా?
– 2010, మే 22న ఫ్లోరిడాలో 10,000 బిట్‌కాయిన్స్‌తో రెండు పీజ్జాలు కొనుగోలు చేశారు. దీన్ని బిట్‌కాయిన్ మొదటి అధికారిక లావాదేవీగా గుర్తించారు. అప్పటి 1 బిట్‌కాయిన్ విలువ 40 డాలర్లుగా ఉంటేది. నేడు దాని విలువ 350 డాలర్లుగా ఉన్నది.
9,500కు పైగా క్రిప్టోకరెన్సీలు ఉన్నాయా?
-2022 మార్చి నాటికి ప్రపంచవ్యాప్తంగా 9,500కు పైగా క్రిప్టోకరెన్సీలు ఉన్నట్లు తెలుస్తోంది. నేడు క్రిప్టోకరెన్సీని సృష్టించడం సులభమవడంతో ఎన్నో కాయిన్స్ అందుబాటులో ఉంటున్నాయి. కానీ, 2022 మార్చి నాటికి 87శాతం క్రిప్టోకరెన్సీ మార్కెట్లో 20 కాయిన్స్ మాత్రమే అగ్రస్థానంలో నిలిచాయి.
విలువ తెలియక విసిరేశా.. దయచేసి నా డిజిటల్ వాలెట్‌ను వెనక్కి ఇప్పించండి.
2013లో జేమ్స్ హోవెల్స్ అనే వ్యక్తి 7,500 బిట్‌కాయిన్స్ ఉన్న తన హార్డ్ డ్రైవ్‌ను వాటి విలువ తెలియక పనికిరావనే ఉద్దేశంతో డంప్ చేసేశాడు. నేడు బిట్‌కాయిన్స్ విలువ పెరిగిందని తెలుసుకొని ఆ హార్డ్ డ్రైవ్‌ను వెతికే పనిలో పడ్డాడు. ఇందుకోసం లోకల్ సిటీ కౌన్సిల్‌ను డంప్‌యార్డ్ ను తన డ్రైవ్ కోసం వెతికేందుకు అనుమతిని ఇవ్వమని కోరుతూ.. తనకు అనుమతిస్తే ప్రతిఫలంగా ఆకర్షణీయమైన ఆఫర్‌ను కూడా ప్రకటించాడు.
‘క్రిప్టోకిట్టీస్’ బ్లాక్‌చైన్ గేమ్స్‌లో ఒకటి.
– అవును.. క్రిప్టోకిట్టీస్ అనేది బ్లాక్‌చైన్ గేమ్స్‌లో ఒకటి మాత్రమే కాదు ప్రప్రథమైనది కూడా. దీన్ని కరెన్సీలో భాగానికి బదులుగా నాన్-ఫంజిబుల్ టోకెన్ (non-fungible token) వరల్డ్‌లో భాగంగా పరిగణిస్తారు. ప్రతి కిట్టీ కూడా ప్రత్యేకమైనదే కాకుండా డూప్లికేట్ చేయడానికి అవకాశం లేనిది. దీనికంటూ ప్రత్యేకమైన విలువ ఉంది. అంతేకాదు క్రిప్టోకిట్టీస్ను ఇథెరియం బ్లాక్‌చైన్‌తో నిర్మిస్తారు.
Dogecoin ఒక జోక్‌గా మొదలైంది.
-ఇటీవల హాటెస్ట్ క్రిప్టోకరెన్సీగా పేరొందిన డోజ్కాయిన్ తొలిదశలో ఒక జోక్‌గా ప్రారంభమైంది. కారణం ఏంటంటే డోజ్ కాయిన్ ప్రకటించే సమయానికి మార్కెట్లో ఎన్నో కాయిన్స్ చలామనిలో ఉండగా మళ్లీ కొత్తగా మరో కాయిన్‌ను ప్రవేశపెడుతున్నారా అని షిబా ఇను అనే కుక్క ఆశ్చర్యంతో చూస్తున్న మీమ్‌ను ఇంటర్నెట్లో విడుదల అయ్యింది. ఇది డోజ్కాయిన్పై విడుదలైన 2013 సంవత్సరంలోనే వైరల్ అయిన మీమ్. కానీ, నేడు డోజ్ కాయిన్లో అధికమొత్తంలో డబ్బు నిల్వ ఉండటమే కాదు.. దాని విలువ అనిశ్చితం అని చెప్పవచ్చు.
ప్రాక్టీస్ బిట్స్
1. లంచ వ్యతిరేక ప్రమాణాల రూపకల్పన సంస్థ ట్రేస్ నివేదిక ప్రకారం లంచం సూచీ-2021లో భారత్ స్థానం ఎంత? (3)
1) 53 2) 77
3) 82 4) 95
2. భారతదేశంలో ఫుట్‌బాల్‌ను ప్రోత్సహించడానికి, మద్దతు ఇవ్వడానికి టాటా స్టీల్ వారి పూర్తి యాజమాన్యం లోని అనుబంధ సంస్థ జంషెడ్పూర్ ఫుట్‌బాల్ క్లబ్‌తో ఏ బ్యాంకు వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది? (2)
1) హెచ్డీఎఫ్సీ బ్యాంక్
2) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
3) ఆర్బీఎల్ బ్యాంక్
4) ఐసీఐసీఐ బ్యాంక్
3. కేంద్రపాలిత ప్రాంతమైన లఢక్‌లో ప్రపంచంలోనే ఎత్తయిన మోటర్ బుల్ రోడ్ ‘ఉమ్లింగ్ లా పాస్’ను
నిర్మించడం, బ్లాక్ టాపింగ్ చేసి- నందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ను అందుకున్న సంస్థ ? (1)
1) బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్
2) బబోర్క్యూరిటీ ఫోర్స్
3) మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హవేస్
4) ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్
4. ట్రైఫెడ్ ఆది మహోత్సవ్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? (2)
1) నీరజ్ చోప్రా 2) మేరీ కోమ్
3) మీరాబాయి చాను 4) పీఆర్ శ్రీజేష్
విజేత కాంపిటీషన్స్, బతుకమ్మకుంట సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు