టూత్ పేస్ట్ తయారీలో వాడే రసాయనం ఏది?
మూలకాలు-సమ్మేళనాలు
1. కింది వాటిలో సంయోగ ఎరువు ఏది?
1) పొటాషియం నైట్రేట్
2) మోనో అమ్మోనియం పాస్ఫేట్
3) 1, 2 4) ఏదీకాదు
2. జతపర్చండి?
ఎ. పైరోల్యూసైట్ 1. సల్ఫైడ్
బి. హార్న్ సిల్వర్ 2. సల్ఫేట్
సి. సిన్నబార్ 3. సిలికేట్
డి. జిప్సమ్ 4. ఆక్సైడ్
5. హాలైడ్
1) ఎ-5, బి-4, సి-3, డి-1
2) ఎ-4, బి-5, సి-1, డి-2
3) ఎ-4, బి-2, సి-1, డి-5
4) ఎ-2, బి-3, సి-4, డి-1
3. ఒక మూలకం ఒకటి కంటే ఎక్కువ భౌతిక రూపాల్లో ఉండటాన్ని ఏమంటారు?
1) రూపాంతరత 2) విద్రావణీయత
3) స్ఫటికీకరణం 4) అంశికీకరణం
4. భూపటలంలో లభించే కింది మూలకాలు అవరోహణ క్రమంలో..
ఆక్సిజన్ (O)
సిలికాన్ (Si)
ఇనుము (Fe)
అల్యూమినియం (Al)
1) O, Si, Fe, Al
2) O, Si, Al, Fe
3) Fe,AI, Si,O
4) O, Fe, Al, Si
5. బేకింగ్ సోడాకు రసాయనిక పేరు?
1) సోడియం బైకార్బోనేట్
2) సోడియం హైడ్రాక్సైడ్
3) కాల్షియం కార్బోనేట్
4) సోడియం క్లోరైడ్
6. కింది అంశాల్లో హైడ్రోజన్ ప్రత్యేకత ఏమిటి?
ఎ. పరమాణు సంఖ్య, పరమాణు భారం సమానం
బి. న్యూట్రాన్లు లేనిది
సి. జ్వలన శీల (మండే స్వభావం గల) వాయువు
డి. అత్యంత తేలికైన మూలకం
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) సి, డి 4) పైవన్నీ
7. సున్నపురాయి రసాయన నామం?
1) కాల్షియం కార్బోనేట్
2) సోడియం క్లోరైడ్
3) కాల్షియం సల్ఫేట్
4) కాపర్ సల్ఫేట్
8. ద్వితీయ అయనీకరణ శక్మం వీలుకాని మూలకం ఏది?
1) లిథియం 2) హైడ్రోజన్
3) హీలియం 4) ఫ్లోరిన్
9. ఎల్పీజీ లీకేజీని గుర్తించడానికి కలిపే దుర్వాసన గల సల్ఫర్ సమ్మేళనాలు ఏవి?
1) మెర్కాప్టేన్లు 2) టెఫ్లాన్లు
3) ఫ్రియాన్లు 4) రేయాన్లు
10 .జతపర్చండి?
ఎ. తేలికైన వాయువు 1. హైడ్రోజన్
బి. తేలికైన 2. లిథియం జడవాయువు
సి. తేలికైన లోహం 3. హీలియం
డి. తేలికైన 4. డ్యుటీరియం రేడియోధార్మిక కేంద్రకం
5. ట్రిటియం
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-1, బి-3, సి-2, డి-5
3) ఎ-1, బి-3, సి-5, డి-2
4) ఎ-4, బి-2, సి-3, డి-5
11. నీటిలో దేని గాఢత 3పీపీఎం కంటే ఎక్కువగా ఉంటే ఫ్లోరోసిస్ వ్యాధి (ఎముకలు వంకర పోవడం, దంతాలు పసుపు రంగులోకి మారడం) వస్తుంది?
1) ఫ్లోరైడ్ 2) క్లోరైడ్
3) అయోడైడ్ 4) బ్రోమైడ్
12. ఐస్‌కు సంబంధించిన సరైన వాక్యాలు ఏవి?
ఎ. ఐస్ సమయోజనీయ స్ఫటికం
బి. నీరు ఐస్‌గా మారినప్పుడు వ్యాకోచిస్తుంది
సి. నీటిపై ఐస్ తేలుతుంది
డి. ఐస్‌కు ఉప్పు కలిపితే 0 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత లభిస్తుంది
1) బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) పైవన్నీ
13. కింది వాటిలో సరికాని జత ఏది?
1) సున్నపురాయి- కాల్షియం కార్బోనేట్ (CaCO3)
2) పొడి సున్నం- కాల్షియం ఆక్సైడ్ (CaO)
3) తడిసున్నం- కాల్షియం హైడ్రాక్సైడ్ (Ca(OH2)
4) సున్నపుతేట- కాల్షియం సల్ఫేట్ (CaSO4)
14. భోపాల్ వాయు విస్ఫోటనంలో బయటికి వెలువడిన వాయువు?
1) మిథైల్ ఐసోసైనైడ్
2) మిథైల్ ఐసోసైనేట్
3) మిథైల్ ఐసోక్లోరైడ్
4) మిథైల్ ఐసోక్లోరేట్
15. నిశ్చితం(A): గోడలకు వెల్ల వేసినప్పుడు తెల్లగా కనిపిస్తుంది
కారణం (R): సున్నపు తేటలోని కాల్షియం హైడ్రాక్సైడ్, గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్ వాయువుతో చర్య జరిపి కాల్షియం కార్బోనేట్ అనే తెల్లని పదార్థాన్ని ఏర్పరుస్తుంది.
1) (A), (R) రెండూ సరైనవి. (A) కు (R) సరైన వివరణ
2) (A), (R) రెండూ సరైనవి కానీ (A) కు (R) సరైన వివరణ కాదు
3) (A) సరైనది కానీ (R) సరైనది కాదు
4) (A) సరైనది కాదు కానీ (R) సరైనది
16. కింది వాటిలో దేన్ని టపాకాయల (బాణాసంచా) తయారీలో ఉపయోగిస్తారు?
1) సోడియం 2) కాల్షియం
3) సల్ఫర్ 4) పాస్ఫరస్
17. నిశ్చితం(A): భాస్వరాన్ని నీటిలో నిల్వ చేస్తారు
కారణం (R): పొడిగాలిలో అది మండుతుంది
1) (A), (R) రెండూ సరైనవి. (A) కు (R) సరైన వివరణ
2) (A), (R) రెండూ సరైనవి కానీ (A) కు (R) సరైన వివరణ కాదు
3) (A) సరైనది కానీ (R) సరైనది కాదు
4) (A) సరైనది కాదు కానీ (R) సరైనది
18. జతపర్చండి?
ఎ. రిఫ్రిజిరెంట్ 1. కాల్షియం ఫాస్పేట్
బి. లాఫింగ్ గ్యాస్ 2. కాల్షియం డైహైడ్రో జన్ పాస్ఫేట్
సి. ట్రిపుల్ సూపర్ పాస్ఫేట్ 3. ద్రవ అమ్మోనియా
డి. వాటర్ గ్లాస్ 4. నైట్రస్ ఆక్సైడ్
5. సోడియం సిలికేట్
1) ఎ-1, బి-4, సి-2, డి-5
2) ఎ-3, బి-4, సి-1, డి-5
3) ఎ-3, బి-4, సి-1, డి-2
4) ఎ-3, బి-4, సి-5, డి-2
19. సున్నపురాయి రసాయన నామం?
1) కాల్షియం హైడ్రాక్సైడ్
2) కాల్షియం కార్బోనేట్
3) కాల్షియం ఆక్సైడ్
4) కాల్షియం డై ఆక్సైడ్
20. జతపర్చండి?
ఎ. అల్యూమినియం 1. మాగ్నటైట్ ధాతువు
బి. ఐరన్ ధాతువు 2. బాక్సైట్
సి. కాపర్ ధాతువు 3. ఫిలాసఫర్ వూల్
డి. జింక్ ధాతువు 4. మాలాకైట్
1) ఎ-3, బి-2, సి-1, డి-4
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-4, బి-2, సి-3, డి-1
4) ఎ-2, బి-3, సి-4, డి-1
21. చిప్స్ పాడవకుండా ఉండటానికి ప్యాకెట్ల్లో నింపే చర్యాశీలత లేని వాయువు ఏది?
1) కార్బన్ డై ఆక్సైడ్ 2) ఆక్సిజన్
3) నైట్రోజన్ 4) సల్ఫర్ డై ఆక్సైడ్
22. నీరు లేదా గాలి నుంచి మొక్కలు గ్రహించే సహజ పోషకాలు ఏవి?
1) కార్బన్ 2) హైడ్రోజన్
3) ఆక్సిజన్ 4) పైవన్నీ
23. నవ్వుల వాయువు?
1) నైట్రోజన్ పెంటాక్సైడ్
2) నైట్రోజన్
3) నైట్రస్ ఆక్సైడ్ 4) నైట్రిక్ ఆక్సైడ్
24. కింది వాటిలో కాల్షియం కార్బోనేట్ ఉపయోగం కానిది?
1) మేలు రకం కాగితం తయారీలో వాడుతారు
2) టూత్‌పేస్ట్‌లో సున్నితమైన అపఘర్షకంగా వాడుతారు
3) చూయింగ్ గమ్‌లో ఒక అనుఘటకంగా ఉపయోగిస్తారు
4) ఎముకలు విరిగినప్పుడు కట్లు కట్టడానికి వాడుతారు
25. అత్యుత్తమ విద్యుత్ వాహకం?
1) వెండి 2) బంగారం
3) రాగి 4) సీసం
26. రసాయన ఎరువులో ఉండే ప్రధాన మూలకాలు ఏవి?
ఎ. నైట్రోజన్ (N) బి.పాస్ఫరస్ (P)
సి. పొటాషియం (K) డి. క్లోరిన్ (Cl)
1) ఎ, బి 2) బి, సి
3) డి 4) ఎ, బి, సి
27. నీటిని క్రిమిరహితంగా చేసే ప్రక్రియ?
ఎ. బ్లీచింగ్ పౌడర్ కలపడం
బి. క్లోరినీకరణం చేయడం
సి. అతినీలలోహిత కిరణాలకు గురిచేయడం
డి. ఓజోనీకరణం చేయడం
ఇ. ఫ్లోరినీకరణం
1) ఎ, ఇ 2) బి, ఇ
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి, సి
28. అయోడిన్‌కు సంబంధించి సరైన వాక్యాలు ఏవి?
ఎ. దీనికి యాంటీసెప్టిక్ ధర్మం ఉంటుంది
బి. స్టార్చ్‌తో నీలిరంగును ఇస్తుంది (అయోడిన్ పరీక్ష)
సి. థైరాయిడ్ హార్మోన్‌ను నియంత్రిస్తుంది
డి. ఉత్పతనం చెందే ధర్మం ఉంటుంది
ఇ. సముద్రపు మొక్కల్లో ఉంటుంది
1) ఎ, బి 2) ఎ, సి
3) ఎ, బి, సి, డి 4) పైవన్నీ
29. అత్యంత తేలికైన మూలకం?
1) హైడ్రోజన్ 2) ఆస్మియం
3) లిథియం 4) పాదరసం
30. ఆక్సిజన్ రూపాంతరమైన ఓజోన్ స్ట్రాటో ఆవరణంలో ఉండి మనకు చేసే మేలు ఏమిటి?
1) ఎండను ఆపుతుంది
2) హానికరమైన అతినీలలోహిత కిరణాలు భూమిని చేరకుండా కాపాడుతుంది
3) ఆమ్లవర్షాలను ఆపుతుంది
4) కాస్మిక్ కిరణాలను ఆపుతుంది
31. భూపటలంలో ఎక్కువగా లభించే మూలకం?
1) కార్బన్ 2) ఐరన్
3) నైట్రోజన్ 4) సిలికాన్
32. ముత్యంలో ప్రధాన అనుఘటకాలేవి?
1) సోడియం కార్బోనేట్, కాల్షియం కార్బోనేటు
2) కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం కార్బోనేట్
3) కాల్షియం ఆక్సైడ్, అల్యూమినియం ఆక్సైడ్
4) కాల్షియం సల్ఫేట్, కాల్షియం కార్బోనేట్
33. రేడియో ధార్మికత గల హాలోజన్ ఏది?
1) ఫ్లోరిన్ 2) క్లోరిన్
3) బ్రోమిన్ 4) అస్టాటిన్
34. జతపర్చండి?
మంటరంగు మూలకం
ఎ. మిరుమిట్లు 1. కాల్షియం ఆక్సైడ్
గొలిపే తెలుపు
బి. సింధూర ఎరుపు 2. బేరియం
సి. ఆకుపచ్చ 3. మెగ్నీషియం
డి. సోడియం 4. పసుపు
1) ఎ-1, బి-3, సి-2, డి-4
2) ఎ-4, బి-3, సి-1, డి-2
3) ఎ-3, బి-1, సి-2, డి-4
4) ఎ-3, బి-1, సి-4, డి-2
35. మేఘ బీజనం (Cloud Seeding) ద్వారా కృత్రిమ వర్షాలను కురిపించడానికి వాడే రసాయనం?
ఎ. సిల్వర్ అయొడైడ్
బి. సోడియం క్లోరైడ్
సి. సిల్వర్ సల్ఫైడ్
డి. సోడియం కార్బోనేట్
1) ఎ, బి 2) బి, సి
3) సి, డి 4) ఎ, డి
36. టూత్ పేస్ట్ తయారీలో వాడే రసాయనం ఏది?
1) అమ్మోనియం కార్బోనేట్
2) క్లోరిన్ డైఆక్సైడ్
3) సూపర్ పాస్ఫేట్
4) పొటాషియం కార్బోనేట్
37. స్ట్రేంజర్ గ్యాస్?
1) ఆర్గాన్ 2) నియాన్
3) జీనాన్ 4) నైట్రస్ ఆక్సైడ్
38. ‘క్లోరోఫారమ్’ కి రసాయనిక పేరు?
1) ట్రైనైట్రోబెంజిన్ 2) ట్రైనైట్రోటోల్యునా
3) ట్రైఐడోమిథేన్ 4) ట్రైక్లోరోమిథేన్
39. అన్నింటికంటే తేలికైన లోహం?
1) హైడ్రోజన్ 2) లిథియం
3) యురేనియం 4) సోడియం
40. అత్యంత కఠినమైన లోహం?
1) లిథియం 2) యురేనియం
3) టంగ్స్టన్ 4) బంగారం
41. కింది వాటిలో డ్రైక్లీనింగ్‌కు వాడే పదార్థం ఏది?
1) బెంజిన్ 2) నైట్రోబెంజిన్
3) హైడ్రాక్సీబెంజిన్ 4) క్లోరోబెంజిన్
42. సరైన వాక్యం గుర్తించండి?
ఎ. అమ్మోనియాలో నైట్రోజన్, హైడ్రోజన్లు ఉంటాయి
బి. యూరియాలో ఎమైడ్ బంధం (-CO-NH)
సి. అమ్మోనియాను తేమ లేకుండా చేయడానికి స్లేక్డ్ లైమ్ (CaO) ను వాడుతారు
డి. పబ్లిక్ మరుగుదొడ్ల దగ్గర ఘాటైన వాసనకు కారణం అమ్మోనియా
ఇ. లెగ్యూమినస్ మొక్కల వేళ్లలో నైట్రోజన్ స్థిరీకరణ బ్యాక్టీరియాలు వాతావరణంలోని నైట్రోజన్‌ను గ్రహించి అమ్మోనియా లేదా నైట్రేట్లుగా స్థిరీకరిస్తాయి
1) ఎ, బి 2) ఎ, బి, ఇ
3) ఎ, బి, సి, డి 4) పైవన్నీ
43. ఇనుము తుప్పుపట్టడం దేనికి ఉదాహరణ?
1) ఆక్సిడేషన్ 2) రిడక్షన్
3) పాలిమరైజేషన్ 4) గాల్వనైజేషన్
44. నిశ్చితం(A): పెట్రోల్ మంటలను నీటితో ఆర్పడం కష్టం
కారణం (R): సాంద్రత తక్కువగా ఉండటం వల్ల పెట్రోల్ నీటిపై తేలుతుంది
1) (A), (R) రెండూ సరైనవి. (A) కు
(R) సరైన వివరణ
2) (A), (R) రెండూ సరైనవి కానీ (A) కు (R) సరైన వివరణ కాదు
3) (A) సరైనది కానీ (R) సరైనది కాదు
4) (A) సరైనది కాదు కానీ (R) సరైనది
45. జతపర్చండి?
ఎ. హిమోగ్లోబిన్ 1. ఐరన్
బి. క్లోరోఫిల్ 2. కోబాల్ట్ (పత్రహరితం)
సి. విటమిన్ బి12 3. కార్బన్
డి. వజ్రం 4. మెగ్నీషియం
1) ఎ-1, బి-3, సి-2, డి-4
2) ఎ-1, బి-4, సి-2, డి-3
3) ఎ-4, బి-1, సి-2, డి-3
4) ఎ-3, బి-1, సి-4, డి-2
46. అత్యంత మృదువైన లోహం?
1) లిథియం 2) సోడియం
3) సీసియం 4) బంగారం
సమాధానాలు
1-3, 2-2, 3-1, 4-2, 5-1, 6-4, 7-1, 8-2, 9-1, 10-2, 11-1, 12-4, 13-4, 14-2, 15-1, 16-4, 17-1, 18-2, 19-2, 20-2, 21-3, 22-4, 23-3, 24-4, 25-1, 26-4 , 27-3, 28-4, 29-3, 30-2, 31-4, 32-2, 33-4, 34-3, 35-1, 36-1, 37-3, 38-4, 39-2, 40-3, 41-1, 42-4, 43-1, 44-1, 45-2, 46-3,
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు