రాష్ట్రంలో విద్యుత్ విస్తరణ-అభివృద్ధి చర్యలు
వేగంగా వృద్ధి చెందాల్సిన ఆర్థిక వ్యవస్థకు మౌలిక సదుపాయాలు అత్యవసరం. ఐటీ ఎగుమతుల్లో దేశంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి. అలాగే దేశంలోని బల్క్ ఔషధాల్లో మూడోవంతు ఈ రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతున్నాయి. వీటితో పాటుగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ రంగం మీద కూడా ఆధారపడి ఉంది. అందువల్ల దేశంలో అత్యధికంగా విద్యుత్‌ను ఉపయోగించే రాష్ర్టాల్లో తెలంగాణ చేరబోతున్నది.
రాష్ట్రంలో విద్యుత్ వినియోగం
దేశ తలసరి విద్యుత్ వినియోగం (2012-13 ఆర్థిక ఏడాది)లో సగటు 917 యూనిట్లు కాగా… తెలంగాణలో అది 985 యూనిట్లుగా ఉంది. రాజధాని నగరంలో ఇతర పట్టణ కేంద్రాల్లో చలనశీలన వృద్ధి గృహావసరాలకూ, వ్యవసాయానికీ అత్యధిక వినియోగం, హైదరాబాద్ మెట్రో రైలు, హైదరాబాద్- నాగపూర్ పారిశ్రామిక కారిడార్, వ్యవసాయ వినియోగదారులకు 7 గంటల విద్యుత్ సరఫరాకు ఇచ్చిన హామీ, పట్టణాభివృద్ధి పనులతో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్), ఎత్తిపోతల పథకాలు లాంటి రాబోయే భారీ ప్రాజెక్టులతో పాటుగా నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ ఇతర కేంద్రాల్లో కూడా పట్టణీకరణకు ప్రణాళికలు వేస్తున్న నేపథ్యంలో అదనపు విద్యుత్ అవసరమవుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వనరుల నుంచి విద్యుత్ లభ్యతను పెంచడంతో డిమాండ్‌ను తట్టుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది. విద్యుత్ అవసరాలను తీర్చడం కోసం ఇంధనం-ఉత్పత్తి-ట్రాన్స్మిషన్- పంపిణీతో కూడిన విద్యుత్ కార్యకలాపాల్లో లోపాలను, సవాళ్లను అధిగమించాల్సి ఉంది.
ప్రస్తుత పరిస్థితి
తెలంగాణకు ప్రస్తుతం వివిధ వనరుల నుంచి విద్యుత్ లభ్యత (2014-15 ఆర్థిక ఏడాది) ప్రకారం 45,795 మిలియన్ యూనిట్స్. తెలంగాణ జెన్కో, ఏపీ జెన్కో కేంద్రాల నుంచి తెలంగాణకు 53.89 శాతం కేటాయింపు జరుగుతున్నది. పీపీఏల కాలవ్యవధి ముగిసిన తర్వాత ఏపీ జెన్కో స్టేషన్ల నుంచి విద్యుత్ సామర్థ్యమేదీ అందుబాటులో ఉండదు. అప్పుడు టీఎస్ జెన్కో ప్లాంట్ల నుంచి 100 శాతం సామర్థ్యం లభిస్తున్నది.
-2013-14 ఆర్థిక ఏడాదిలో ప్రసార మార్గంలో జరిగే విద్యుత్ నష్టాలు 3.59 శాతం కాగా, ట్రాన్స్మిషన్ వ్యవస్థ లభ్యత 99.94 శాతం. టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎస్పీడీసీఎల్ అనే రెండు పంపిణీ సంస్థలు తెలంగాణలోని వినియోగదారులకు విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాయి. ఈ పంపిణీ సంస్థలు 1.22 కోట్ల మంది వినియోగదారులకు సేవలు అందిస్తున్నాయి. వినియోగదారుల విభజన ఈ కింద పేర్కొన్న విధంగా ఉంది.
వినియోగదారుల విభాగాలు
విభాగం వినిమయ విభాగం
గృహ అవసరాలు 73 శాతం
వ్యవసాయ అవసరాలు 17 శాతం
పారిశ్రామిక అవసరాలు
(ఎల్.టి అండ్ హెచ్.టి) 1 శాతం
వాణిజ్య అవసరాలు
(ఎల్.టి అండ్ హెచ్.టి) 8 శాతం
ఇతరాలు 1 శాతం
కీలకమైన సవాళ్లు
-డిమాండ్- సరఫరా అంతరం: తెలంగాణకు దాదాపు 5 శాతం విద్యుత్ లోటు వారసత్వంగా సంక్రమించింది. 2013-14 ఆర్థిక ఏడాదిలో విద్యుత్ అవసరాలు 47,428 ఎం.యు.లు కాగా వివిధ వనరుల ద్వారా సమకూర్చిన విద్యుత్ కేవలం 44,946 ఎం.యులు మాత్రమే.
-సంప్రదాయేతర విద్యుత్ సమీకరణ: సంప్రదాయేతర ఇంధనాల నుంచి విద్యుత్ ఉత్పత్తిని పెంచే విషయంలో తెలంగాణ గట్టి ఆసక్తితో ఉంది. చుట్టూ భూభాగాలు ఆవరించుకుని ఉన్న రాష్ట్రం తెలంగాణలో పవన విద్యుత్తును ఉత్పత్తి చేసే అవకాశాలు పరిమితం. అందువల్ల వివిధ రకాల విద్యుదుత్పత్తి వనరుల సమ్మేళనాన్ని మెరుగుపర్చే అవకాశాలను రాష్ట్రం అన్వేషిస్తుంది.
-ట్రాన్స్మిషన్ కారిడార్ అభివృద్ధి: ఉత్పత్తి చేసిన విద్యుచ్ఛక్తికి ప్రసార సదుపాయాలు చాలా ముఖ్యం. కొత్తగా వస్తున్న విద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి విద్యుత్తును ఎప్పటికప్పుడు తరలించేలా సకల చర్యలూ తీసుకోవడంలో అతి ముఖ్యమైన భాగం ప్రసార కారిడార్ విస్తరణే. అందువల్ల ట్రాన్స్మిషన్ కారిడార్ విస్తరణను క్రియాశీలంగా పర్యవేక్షించడంతో భవిష్యత్ విద్యుదుత్పత్తికి రంగాన్ని సిద్ధం చేస్తున్నారు.
-డిస్కం సవాళ్లు: విద్యుత్ పంపిణీలో సాంకేతిక, వాణిజ్య నష్టాలను తగ్గించడం, వ్యవస్థాగత మౌలిక సదుపాయాల్లో అంతరాయాలను, బ్రేక్డౌన్లను తగ్గించడం, కొత్త కనెక్షన్ల విడుదల, ఫిర్యాదుల పరిష్కారాల్లో వినియోగదారుల అంచనాలను అందుకోవడం కీలకమైన సవాళ్లు. మీటరింగ్ మినహాయింపులు, వసూళ్లలో, బిల్లింగ్ సామర్థ్యం తక్కువగా ఉండటం, ప్రభుత్వ విభాగాలు చెల్లించని బకాయిలు, వ్యవసాయ సబ్సిడీ మీద ఆధారపడటం ఫలితంగా నగదు రూపాంతరీకరణ వృత్తం సుదీర్ఘంగా ఉండటంతో డిస్కంలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. వ్యవసాయ ఫీడర్‌ను వేరు చేయాల్సిన అవసరం ఉంది.
అదనపు సామర్థ్యానికి ఉద్దేశించిన చర్యలు
-రానున్న ఐదేండ్లలో 4, 240 మెగావాట్ల (సంచిత) గణనీయ సామర్థ్యాన్ని అదనంగా పెంచేందుకు టీఎస్జెన్కో ప్రణాళిక రూపొందించింది. అయితే విద్యుత్ లోటును తీర్చేందుకు టీఎస్జెన్కో అదనంగా జతచేసే ఈ సామర్థ్యాలు మాత్రమే సరిపోవు. అందువల్ల విద్యుత్ లభ్యతను పెంచడానికి ఇతర వనరుల నుంచి విద్యుత్ సేకరించాల్సిన అవసరం ఉంది. విద్యుత్ సరఫరా పరిస్థితిని మెరుగుపర్చడానికి ట్యూటీకోరన్, నైవేలీ, కల్పాక్కం, శ్రీకాళీలతో సహా కొన్ని విద్యుత్ కేంద్రాల ద్వారా రానున్న ఐదేండ్లలో 7000 ఎం.యు.ల విద్యుత్ సమకూరుతున్నది. అలాగే త్వరలో ఏర్పాటు కానున్న ఏపీజెన్కో ప్లాంట్లు, థర్మల్ పవర్‌టెక్ లాంటి ప్రైవేటు విద్యుత్ ప్లాంట్లను మరో 10,000 ఎం.యు.లకు పైగా అందిస్తాయి. దీర్ఘకాల ప్రతిపాదికన 2 వేల మెగావాట్ల విద్యుత్ సేకరించడం కోసం పోటీ బిడ్డింగ్‌ను తెలంగాణ డిస్కంలు చేపట్టాయి. ట్రాన్స్‌మిషన్‌లో ఎలాంటి అవరోధాలు లేకుండా ఎస్ఆర్ జనరేటర్ల ద్వారా 6వేల మెగావాట్ల అదనపు విడి సామర్థ్యం సమకూరుతుంది. విద్యుత్ మిశ్రమాన్ని మెరుగుపర్చడం కోసం, తెలంగాణ డిస్కంలు ఇప్పటికే బిడ్ ప్రక్రియను పూర్తి చేశాయి. 505 మెగావాట్ల సౌర విద్యుత్‌కు ఒప్పందం చేసుకున్నాయి. మరో 500 మెగావాట్ల కొనుగోలు కోసం ఏర్పాట్లు చేపట్టారు. ట్రాన్స్మిషన్ వ్యవస్థను పెంచి పటిష్టపర్చడం కోసం తెలంగాణ ట్రాన్స్‌కో సూర్యాపేట నుంచి నందివనపర్తి, శంకర్పల్లి (825 మెగావాట్లు/ సికెటి) చేపట్టిన లైన్ పనులు జరుగుతున్నాయి. అంతేకాకుండా 765 కేవీ-వార్దా- నిజామాబాద్-మహేశ్వరం లైన్‌కోసం, 400 కేవీ ఎస్ఎస్ ఏర్పాటుతో దిగువ ప్రాంతాన్ని బలోపేతం చేయడానికి, మహేశ్వరం వద్ద అసోసియేటెడ్ లైన్‌కు పనులు చేపట్టారు. 765కేవీ- వరోరా- వరంగల్- హైదరాబాద్- కర్నూల్ లైన్‌కోసం వరంగల్, హైదరాబాద్ మధ్య నెట్‌వర్క్‌ను పటిష్టపర్చాలని ప్రతిపాదించారు. అలాగే వేమగిరి నుంచి ముందుకు ట్రాన్స్మిషన్ చేయడం కోసం కలపాక నుంచి ఖమ్మం లైన్‌ను పటిష్టపర్చే ప్రతిపాదన ఉంది.
భవిష్యత్ పథం
-రాష్ట్రంలో వినియోగదారులందరికీ సమృద్ధిగా విద్యుత్ అందించడం కోసం ఉత్పత్తి-ట్రాన్స్మిషన్- పంపిణీ వాల్యూచైన్ పొడవునా తీసుకోవాల్సిన చర్యల పరంపరను తెలంగాణ విద్యుత్ కంపెనీలు గుర్తించాయి. గుర్తించిన కీలక ప్రయత్నాల్లో కొన్ని..
విద్యుదుత్పత్తి
-రానున్న కొన్నేండ్లలో టీఎస్ జెన్కో భారీగా అదనపు సామర్థ్యాన్ని చేకూర్చనుంది. అందువల్ల సాధ్యాసాధ్యాలపై అధ్యయనాలు, భూసేకరణ, అవసరమైన అనుమతులను పొందే ప్రక్రియను వేగవంతం చేయడం తెలంగాణ జెన్కోకు తప్పనిసరి. డి6 బేసిన్ నుంచి గ్యాస్ లభ్యతను బట్టి శంకర్పల్లి గ్యాస్ విద్యుత్ ప్లాంట్‌ను పునరుద్ధరించే విషయం పరిగణనలో ఉంది. ఈ ప్రాజెక్టుకు 4.62 ఎంఎస్ఎస్సీఎండీ సహజ వాయువును కేటాయించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు. బొగ్గు ఆడిటింగ్, తెలంగాణ జెన్కో ప్లాంట్ల దగ్గర మూడో పార్టీ ద్వారా మూడు స్థాయిల్లో -లోడింగ్, రవాణా, అన్లోడింగ్, విద్యుత్ ప్లాంట్లలో బొగ్గు జీవీసీని పెంచడం కోసం మిశ్రమ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం లాంటి చర్యల్ని చేపట్టడం, బొగ్గు నిల్వల లభ్యత, బొగ్గు కొరత, బొగ్గు లింకేజీ అమలు తదితరాల పర్యవేక్షణ కోసం ఐటీ సహాయ కోల్ ట్రాకింగ్ యంత్రాంగాన్ని ప్రవేశపెట్టడం కూడా కార్యాచరణ అంశాల్లో ఉన్నాయి.
ప్రసరణ
-సీజీఎస్, విద్యుత్ ప్లాంట్ల నుంచి విద్యుత్ తరలింపు కోసం అవసరమైన ట్రాన్స్మిషన్ మౌలిక సదుపాయాలను తెలంగాణ ట్రాన్స్‌కో సమకూర్చుకోవాల్సి ఉంది. అంచనా వేసిన విద్యుత్ అవసరాలను అందుకోవడం కోసం ప్రస్తుత 400 కేవీ లైన్లను పెంచడం, కొత్త 400 కేవీ/ 765 కేవీ నెట్వర్క్ ఏర్పాటు భారత ప్రభుత్వ నిధుల ఆధారంగా టారిఫ్ ఆధారిత పోటీ బిడ్డింగ్, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్(వీజీఎఫ్) ద్వారా నిర్మించబోయే ట్రాన్స్మిషన్ లైన్లు/ ప్రాజెక్టులను గుర్తించడం, అలాగే ఎక్కువ నష్టాలకు కారణమవుతున్న లైన్లను గుర్తించడం, ఆ తర్వాత అభివృద్ధి పనుల్ని చేపట్టడం లాంటివి కీలకమైన కార్యాచరణ అంశాలు.
పంపిణీ
-డిస్కంలు 4 ప్రధాన కార్యాచరణ అంశాలపై దృష్టిని కేంద్రీకరిస్తాయి. అవి: నష్టాలు తగ్గించడం, ఆధారపడే యోగ్యతను పెంచుకోవడం, పునరుత్పాదకాల వ్యాప్తిని పెంచుకోవడం, వినియోగదారుల్లో మరింత సంతృప్తిని చూడటం. నష్టాలను తగ్గించడంలో వాణిజ్యపరమైన కార్యాచరణ ప్రణాళిక, సాంకేతికపరమైన కార్యాచరణ ప్రణాళిక రెండు ఇమిడి ఉంటాయి. లోతైన తనిఖీల మీద, మీటరింగ్, బిల్లింగ్, వసూళ్ల సామర్థ్యాలను పెంచేందుకు సమాచార విశ్లేషకుల మద్దతుతో ఎంబీసీ మినహాయింపులను తగ్గించడంతో వాణిజ్యపరమైన కార్యాచరణ ప్రణాళిక దృష్టి కేంద్రీకరిస్తున్నది. సాంకేతిక కార్యాచరణ ప్రణాళికలో రూ.1, 458 కోట్ల అంచనా పెట్టుబడితో వ్యవసాయ ఫీడర్లను వేరుచేసే కార్యక్రమం.
పంపుసెట్‌కు రూ.43,780 అంచనా పెట్టుబడితో 19.1 లక్షల వ్యవసాయ వినియోగదారులకు వర్తించేలా హెచ్‌వీడీఎస్‌ను దశలవారీగా అమలు చేయడం. డీటీఆర్లు, ఫీడర్ల మీటరింగ్ని మెరుగుపర్చడం, వినియోగదారుల వద్ద ఉన్న పాత మెకానికల్ మీటర్లను దశలవారీగా తొలగించడం ఉంటాయి. ఆధారపడే యోగ్యతను పెంచుకోవడంలో కీలకమైన , వాణిజ్య, భద్రతా, అత్యవసర సేవా సంస్థల కోసం అనువైన పరిహార పథకాలను అందించడం, ఎస్సీఏడీఏని 11 కేవీ ఫీడర్ల స్థాయిలో అన్ని జిల్లా కేంద్రాల దగ్గరా రూ.300 కోట్ల అంచనా పెట్టుబడితో అమలు చేయడం, ప్రస్తుతం ఉనికిలో ఉన్న 16 లక్షల త్రీఫేజ్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లను రూ.1100 కోట్ల అంచనా వ్యయంతో అమర్చడం లాంటివి ఉంటాయి. ప్రభుత్వ విధానం ప్రకారం సమర్థవంతమైన మీటరింగ్, సమాచార సేకరణతో వ్యవసాయ విద్యుత్ సరఫరా పర్యవేక్షణ కూడా దీంట్లో భాగమవుతాయి. సోలార్ రూఫ్-టాప్ విద్యుత్ ప్లాంట్లకు నెట్ మీటరింగ్‌ను అమలు చేయడంతో సాధ్యపడిన చోట్ల సగటు నీటి మట్టానికిపైన సోలార్‌పంపు సెట్లను అమర్చడంతో పునరుత్పాదక వ్యాప్తిని మెరుగుపర్చుకోనున్నారు. జిల్లాలోని వినియోగదారులందరినీ గుర్తించడం కోసం ప్రతి జిల్లాలో వినియోగదారుల సేవా కేంద్రాలను ఏర్పాటు చేయడంతో వినియోగదారుల సంతృప్తిపై డిస్కంలు ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తాయి.
తెలంగాణ సామాజిక ఆర్ధిక చిత్రణ -2015 పుస్తకం నుంచి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు