చిట్టా పద్దు ముఖ్య ఉద్దేశం?
ఖాతాల వర్గీకరణ
-వ్యవహారాలను మూడు రకాలుగా వర్గీకరిస్తారు.
1. వ్యక్తులకు, సంస్థలకు సంబంధించినవి
2. ఆస్తులకు, నగదుకు సంబంధించినవి
3. ఖర్చులు, నష్టాలు, ఆదాయాలు, లాభాలకు సంబంధించినవి.
ఖాతాలను మూడు రకాలుగా విభజించవచ్చు.
1.వ్యక్తిగత ఖాతాలు
2.వాస్తవిక ఖాతాలు
3.నామమాత్రపు ఖాతాలు
వ్యక్తిగత ఖాతాలు
-వ్యాపార సంస్థ ఏయే వ్యక్తులతో లేదా సంస్థలతో వ్యవహారాలను జరుపుతుందో ఆ ఖాతాలనే వ్యక్తిగత ఖాతాలు అంటారు. అవి:
-సహజ ఖాతాలు & కల్పిత ఖాతాలు
సహజ వ్యక్తిగత ఖాతాలు
-వ్యక్తులకు సంబంధించిన ఖాతాలు
-ఉదా: పవన్ ఖాతా, శ్రీను ఖాతా, రాహుల్ ఖాతా మొదలగునవి.
కల్పిత వ్యక్తిగత ఖాతాలు
-ఇవి వ్యక్తుల సమూహం. ఉదా: సంస్థలు , కంపెనీలు
-ఇన్ఫోసిస్ లిమిటెడ్, ఎస్బీఐ, ఎల్ఐసీ మొదలగునవి.
-నోట్: యజమానిని వ్యక్తిగా భావించి అతని మూలధనం, సొంతవాడకాల మొత్తాలను వ్యక్తిగత ఖాతాగా పరిగణించాలి.
వ్యక్తిగతం కాని ఖాతాలు
-వ్యక్తిగతం కానీ ఖాతాలను రెండు రకాలుగా విభజన చేశారు.
1) వాస్తవిక ఖాతాలు
2) నామమాత్రపు ఖాతాలు
వాస్తవిక ఖాతాలు
-సంస్థకు చెందిన ఆస్తుల ఖాతాలు వాస్తవిక ఖాతాలు. ఈ ఖాతాలు కనిపించే, కనిపించని ఆస్తులకు సంబంధించినవి.
ఉదా: భూములు, భవనాలు, యంత్రాలు, గుడ్విల్స్ మొదలగునవి.
నామమాత్రపు ఖాతాలు
-వీటికి రూపం, చలనం ఉండదు. ఈ ఖాతాలు ఆదాయం, ఖర్చులు, లాభాలు, నష్టాలకు సంబంధించినవి.ఉదా: జీతం ఖాతా, కమీషన్, అద్దె, డిస్కౌంట్ ఖాతా మొదలగునవి.
-అకౌంటింగ్ సూత్రాలు : డెబిట్, క్రెడిట్
1.వ్యక్తిగత ఖాతాలు (Personal A/C)
-ప్రయోజనం పొందిన వ్యక్తిని డీఆర్(డెబిట్ రిసీవర్) చేయాలి.
-ప్రయోజనం ఇచ్చిన వ్యక్తిని సీఆర్ (క్రెడిట్ ది గివర్)
2.వాస్తవిక ఖాతాలు (Real A/C)
-వచ్చిన ఆస్తిని డీఆర్ చేయాలి
-పోయిన ఆస్తిని సీఆర్ చేయాలి
3.నామమాత్రపు ఖాతాలు
-ఖర్చులు, నష్టాలు డీఆర్ చేయాలి
-లాభాలు, ఆదాయాలు సీఆర్ చేయాలి.
ఉదా: 1. గుడ్‌విల్‌ను ఏ ఖాతాగా వర్గీకరిస్తారు ?
1) వాస్తవిక ఖాతా 2) నామమాత్రపు ఖాతా
3) వ్యక్తిగత ఖాతా 4) అనామక ఖాతా
జావాబు: 1
2. వేతనాలను ఏ ఖాతాగా వర్గీకరిస్తారు ?
1) వ్యక్తిగత ఖాతా 2) నామమాత్రపు ఖాతా
3) వాస్తవిక ఖాతా 4) ఆగంతుక ఖాతా
జవాబు: 3
4. నగదు కొనుగోళ్ల ఫలితం ?
1) అప్పును పెంచుతుంది 2) ఆస్తులు తగ్గుతాయి
3) మొత్తం ఆస్తుల్లో ఎటువంటి మార్పు ఉండదు 4) ఆస్తులు పెరుగుతాయి
జవాబు: 3
5. కార్యాలయ ఫర్నీచర్ అమ్మగా వచ్చిన మొత్తం ఏ ఖాతాకు క్రెడిట్ చేయాలి ?
1) ఫర్నీచర్ ఖాతా 2) అమ్మకాల ఖాతా
3) నగదు ఖాతా 4) కొనుగోళ్ల ఖాతా
జవాబు: 1
వ్యాపారంలోకి తెచ్చిన నగదు 50,000 రెండు అంశాలు
నగదు మూలధనం
వాస్తవిక ఖాతా వ్యక్తిగత ఖాతా
డీఆర్ సీఆర్
మోహన్‌రావు నుంచి అరువుపై సరుకు కొనుగోళ్లు
సరుకు మోహన్‌రావు
వాస్తవిక ఖాతా వ్యక్తిగత ఖాతా
డీఆర్ సీఆర్
చెల్లించిన అద్దె 3000
అద్దె నగదు
నామమాత్రపు వాస్తవిక
డీఆర్ సీఆర్
వచ్చిన కమీషన్ 2000 ఏ ఖాతాకు డెబిట్ చేయాలి ?
కమీషన్ నగదు
నామమాత్రపు వాస్తవిక
సీఆర్ డీఆర్
వ్యాపార సంస్థ నుంచి వ్యక్తిగత అవసరాల కోసం యజమాని తీసుకొన్న నగదు రూ. 8000 ఏ ఖాతాకు జమచేయాలి ?
సొంత వాడకాలు నగదు
వ్యక్తిగత వాస్తవిక
డీఆర్ సీఆర్
బ్యాంకులో జమచేసిన నగదు రూ. 5000 ఏ ఖాతాకు క్రెడిట్ చేయాలి ?
బ్యాంకు నగదు
వ్యక్తిగత వాస్తవిక
బ్యాంకు నుంచి తీసిన నగదు రూ. 2000 ఏ ఖాతాకు డెబిట్ చేయాలి ?
బ్యాంకు నగదు
వ్యక్తిగత వాస్తవిక
సీఆర్ డీఆర్
చిట్టా (Journal)
-అకౌంటింగ్ సూత్రాలను అనుసరించి వ్యాపార వ్యవహారాలను నమోదు చేయడానికి ఏర్పాటు చేసే పుస్తకాన్నే చిట్టా అంటారు.
-వ్యాపార సంస్థలకు సంబంధించిన వ్యవహారాలను మొదటగా ఈ పుస్తకంలోనే రాస్తారు కావున చిట్టాను అసలైన పద్దు పుస్తకం- Book of original entry లేదా తొలి పద్దు పుస్తకం-Book of Prime entry అని వ్యవహరిస్తారు.
-పద్దు : తేదీలవారీగా చిట్టాలో రాసే ప్రక్రియను పద్దు అంటారు.
-చిట్టాలో రాసే వ్యవహారాలు పద్దురూపంలో ఉంటాయి కావున చిట్టా పద్దు అంటారు.
-తేదీ: వ్యాపార వ్యవహారం జరిగిన తర్వాత వరుసక్రమంలో రాయాలి.
-వివరాలు: ఆ వరుస మొదటి పంక్తిలో డెబిట్ చేయవలసిన అంశాన్ని, రెండో వరుసలో క్రెడిట్ చేయవలసిన అంశాన్ని రాయాలి. డెబిట్ అంశానికి చివరన Dr అనే ఆంగ్లపదం, క్రెడిట్ అంశానికి చివర To అనే ఆంగ్లపదం ఉండాలి.
-మూడో పంక్తిలో వ్యవహారాలను క్లుప్తంగా రాయడాన్ని క్లుప్త వివరణ అంటారు.
-ఆ.పు. సం: ఆ వరుసలో చిట్టాపద్దుల ఖాతాల పుట సంఖ్యను రాస్తారు.
-డెబిట్ మొత్తం: డెబిట్ చేయవలసిన మొత్తాలను డెబిట్ పంక్తులకు సమాంతరంగా నమోదు చేయాలి.
-క్రెడిట్ మొత్తం: ఈ వరుసలో క్రెడిట్ చేయవలసిన మొత్తాన్ని క్రెడిట్ పంక్తికి సమాంతరంగా చూపాలి.
కింది వ్యవహారాలకు చిట్టాపద్దులు రాయండి.
-2014, జనవరి 1- నాగ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి తెచ్చిన నగదు రూ, 45,000
-జనవరి 2-ఫర్నీచర్ కొనుగోళ్లు రూ. 10,000
-జనవరి 3-వ్యక్తిగత అవసరాలకు తీసుకున్న నగదు రూ. 3000
-జనవరి 20-చెల్లించిన జీతాలు రూ. 300
కింది వ్యవహారాలకు చిట్టా పద్దులు రాయాలి.
2-4-నగదు సరుకు కొనుగోలు రూ. 25,000
4-4-రఘుకు అరువు మీద సరుకు అమ్మకం రూ. 35,000
21-4- శ్రీనివాస్ చెల్లించిన నగదు రూ. 5000
26-4-బ్యాంకులో జమచేసిన నగదు 10,000
30-4- చెల్లించిన అద్దె రూ. 2000
చిట్టాపద్దు ముఖ్య ఉద్దేశం ఏమిటి ?
1) సంస్థ ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవడం
2) నగదు వ్యవహారాలు నమోదు చేయడం
3) వ్యాపార వ్యవహారాలన్నీ మొదటిసారిగా నయోదు చేయడం
4) పైవన్నీ
జవాబు: 3
2.వ్యక్తిగత ఖాతా దేనికి సంబంధించింది ?
1) ఆస్తులు, అప్పులు
2) ఖర్చులు, నష్టాలు, ఆదాయాలు
3) రుణదాతలు, రుణగ్రస్తులు
4) పైవన్నీ జవాబు:
3. కిందివాటిలో ఏది నిజం
1) భవనాల నామమాత్రపు ఖాతా
2) చెల్లించిన అద్దె వాస్తవిక ఖాతా
3) ప్రతి డెబిట్‌కు సరిపడే క్రెడిట్ మొత్తం
4) ఆదాయాలు డెబిట్ వైపు చూపుతారు
జవాబు: 3
4. రుణగ్రస్తుల నుంచి నగదు వసూలైన్నప్పుడు ?
1) మొత్తం ఆస్తులు తగ్గుతాయి
2) మొత్తం ఆస్తులు పెరుగుతాయి
3) మొత్త ఆస్తుల్లో ఏ మార్పు ఉండదు
4) మొత్తం అప్పులు పెరుగుతాయి
జవాబు: 3
5. చెల్లించిన జీతాలను ఏ విధంగా నమోదు చేస్తారు ?
1) జీతాలను డీఆర్ నగదును సీఆర్ చేయడం
2) నగదును డీఆర్ చేసి, జీతాలను సీఆర్ చేయడం
3) ఉద్యోగిని డీఆర్ చేసి నగదును సీఆర్ చేయడం
4) నగదును డీఆర్ చేసి, ఉద్యోగిని సీఆర్ చేయడం
జవాబు: 1
6. ఆస్తుల కొనుగోళ్లు సంస్థకు ?
1) ఖర్చు 2) లాభం 3) ఆస్తులు 4) ఏదీకాదు
జవాబు: 3
7. బ్యాంక్ ఓవర్డ్రాప్ట్ను ఏ ఖాతాగా వ్యవహరిస్తారు ?
1) వ్యక్తిగత ఖాతా 2) వాస్తవిక ఖాతా
3) నామమాత్రపు ఖాతా 4) పైవన్నీ
జవాబు: 1
8.సంస్థకు జీతాలు ?
1) రాబడి 2) ఖర్చు
3) ఆస్తి 4) అప్పు
జవాబు: 2
9. అకౌంటింగ్ సమీకరణాన్ని ఏ ఆర్థిక నివేదికలో పొందు పరుస్తారు?
1) లాభనస్టాల ఖాతా
2) నగదు ప్రవాహ నివేదిక
3) ఆస్తి అప్పుల పట్టి
4) ఏదీకాదు
జవాబు: 3
10. కిందివాటిలో స్థిరాస్తి కానిది ?
1) ఆఫీస్ పర్నీచర్ 2) భూమి, భవనాలు
3) యంత్రాలు 4) ముడి పదార్థ సరుకు
జవాబు: 4
11 X నుంచి సరుకు వాపసు ఏ విధంగా నమోదు చేస్తారు ?
1)X ఖాతా డీఆర్ చేసి కొనుగోలు ఖాతా సీఆర్ చేయడం
2) X ఖాతా డీర్ చేసి నగదు ఖాతా సీఆర్ చేయడం
3) అమ్మకాల వాపసు ఖాతా డీఆర్ చేసి X ఖాతా సీఆర్ చేయడం
4) X ఖాతా డీఆర్ అమ్మకాల ఖాతా సీఆర్
జవాబు: 3
12. రాముకు అరువుపై సరుకు అమ్మకాలు ఏ ఖాతాకు డెబిట్ చేయాలి ?
1) అమ్మకాల ఖాతా
2) సరుకు ఖాతా
3) రాము ఖాతా
4) కొనుగోళ్ల ఖాతా
జబాబు: 3
13. సంస్థ నుంచి యజమాని తన వ్యక్తిగత అవసరాలకోసం నగదును వాడుకున్నప్పుడు ఏ ఖాతాకు డెబిట్ చేయాలి ?
1) సొంతవాడకాల ఖాతా
2) మూలధనం ఖాతం
3) నగదు ఖాతా
4) కొనుగోళ్ల ఖాతా
జవాబు: 1
14. నగదుకై ఫర్నీచర్ కొనుగోళ్ల ఫలితం ?
1) స్థిరాస్తులు పెరుగుతాయి, ప్రస్తుత ఆస్తులు తగ్గుతాయి
2) స్థిరాస్తులు తగ్గుతాయి, ప్రస్తుత ఆస్తులు పెరుగుతాయి
3) అప్పులు
4) 1,2
జవాబు: 1
15. నిర్ధారించిన రాని బాకీలు కాలక్రమేన వసూలైనప్పుడు ?
1) వసూలైన రాని బాకీల ఖాతాకు సీఆర్ చేయడం
2) రుణగ్రస్తుల ఖాతాకు సీఆర్ చేయడం
3) లాభనష్టాల ఖాతాకు డీఆర్ చేయడం
4) ఏదీకాదు
జవాబు: 1
16. వ్యవహారాలను తేదీల క్రమంగా చిట్టాలో రాసే ప్రక్రియను ఏమంటారు ?
1) నిల్వ తేల్చడం
2) పద్దు
3) సమానం చేయడం
4) ఏదీకాదు
జవాబు: 2
ఆవర్జా
-ఒక నియమితకాలంలో జరగిన వ్యవహారాలన్నింటినీ వాటి నికర ఫలితాన్ని తెలుసుకొనే విధంగా ఖాతాలకు నెలవైన పుస్తకం ఆవర్జా
-వ్యాపార సంస్థ నిర్వహించే పుస్తకాల్లో ముఖ్యమైనది ఆవర్జా
-అసలైన పుస్తకంలో ఉన్న వ్యాపార వ్యవహారాలను ఖాతాలకు బదిలీ చేస్తారు.
-వ్యాపార వ్యవహారాలను చివరగా ఆవర్జాలో నమోదు చేయడం వల్ల దీన్ని మలిపద్దు పుస్తకం అని కూడా వ్యవహరిస్తారు.
-సాధారణంగా వివిధ ఖాతాల సముదాయమే ఆవర్జా
-వ్యక్తిగత, వాస్తవిక, నామమాత్రపు ఖాతాలకు సంబంధించిన అన్ని వ్యవహారాలను విడివిడిగా సంబంధిత ఖాతాలో నమోదు చేయడానికి చేసిన పుస్తకమే ఆవర్జా అంటారు.
ఖాతా – డీఆర్, సీఆర్
-ప్రతి ఖాతాను రెండు విభాగాలుగా విభజించాలి. ఎడమవైపు భాగాన్ని డెబిట్ అని, కుడివైపు భాగాన్ని క్రెడిట్ అని అంటారు.
-డెబిట్, క్రెడిట్లను సూచించడానికి డీఆర్, సీఆర్ పదాలను ఉపయోగించాలి.
-తేదీ వరుసలో తేదీ నమోదు చేయాలి. వివరాల వరుసలో రాసేటప్పుడు డీఆర్ వైపు టు అనే పదంతో ప్రారంభించాలి. అదే విధంగా సీఆర్ వైపు బై అనే పదం ఉపయోగించాలి.
-ఖాతా అంశం చిట్టా పద్దులో డెబిట్ పంక్తిలో ఉన్నట్లయితే ఖాతా డీర్ వైపు, క్రెడిట్ పంక్తిలో ఉన్నట్టయితే సీఆర్ వైపు నమోదు చేయాలి.
-ఖాతాకు రెండు వైపులా నమోదైన అంశాల మొత్తాలను పరిశీలించి ఎక్కువగా ఉన్న వైపు కూడి అదే మొత్తాన్ని సమాంతరంగా రెండో వైపు కూడా చేయాలి.
-ఎక్కువగా ఉన్న మొత్తం నుంచి తక్కువగా ఉన్న మొత్తాన్ని తీసివేసి, తేల్చిన నిల్వగా చూపాలి. డీఆర్ వైపు ఎక్కువగా ఉన్నట్లయితే సీఆర్ వైపు బై తేల్చిన నిల్వగా, సీఆర్ వైపు ఎక్కువగా ఉన్నట్లయితే డీఆర్ వైపు టు తేల్చిన నిల్వగా రాయాలి. తేల్చిన నిల్వను ఖాతాలో మరుసటి రోజున తెచ్చిన నిల్వగా చూపాలి.
-డెబిట్ నిల్వ: క్రెడిట్ మొత్తం కంటే డెబిట్ మొత్తం ఎక్కువగా ఉన్నట్లయితే డెబిట్ నిల్వ ఏర్పడుతుంది.
TD-క్రెడిట్ నిల్వ: డెబిట్ మొత్తం కంటే క్రెడిట్ మొత్తం ఎక్కువగా ఉన్నట్లయితే క్రెడిట్ నిల్వ ఉంటుంది.
TC>TD=Cr
1.భారత దేశ మొదటి ఆర్థిక శాస్త్రవేత్త ఎవరు? (d)
a) దాదాభాయి నౌరోజీ b) ఆర్.పి.దత్తా
c) ఎం.జి.రణడే d) ఆర్.సి.దత్తా
2. ఒక దేశంలో ఆదాయ పునర్విభజన దేని ద్వారా సఫలంగా జరగవచ్చు? (a)
a) పురోగామి ఖర్చుతో కూడిన పురోగామి పన్నుల విధానం
b) తిరోగామి ఖర్చుతో కూడిన పురోగామి పన్నుల విధానం
c) తిరోగామి ఖర్చుతో కూడిన తిరోగామి పన్నుల విధానం
d) పురోగామి ఖర్చుతో కూడిన తిరోగామి పన్నుల విధానం
3.1996లో డబ్ల్యూటీవో మంత్రుల సదస్సులో ముఖ్యమైన ఒప్పందం దీనితో సంబంధం కలిగి ఉన్నది.b)
a) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వాణిజ్యం
b) పెట్టుబడులపై బహుముఖీయ అంగీకారం
c) బహుముఖీయ అంగీకారం
d) సాంకేతిక సిబ్బంది బదిలీ
4.మానవ అభివృద్ధి సూచికలో అక్షరాస్యతా రేటు, జీవన పరిమాణంతో కలిసి ఉండేది.. (d)
a) తలసరి స్థూల జాతీయోత్పత్తి అమెరికన్ డాలర్లలో
b) తలసరి స్థూల దేశీయోత్పత్తి వాస్తవ కొనుగోలు శక్తితో
c) స్థూల జాతీయోత్పత్తి అమెరికన్ డాలర్లలో
d) తలసరి జాతీయ ఆదాయం అమెరికన్ డాలర్లలో
5. 6వ, 8వ పంచవర్ష ప్రణాళికల కాలం వరుసగా 1980-1985, 1992-1997లలో ఉన్నది. 7వ పంచవర్ష ప్రణాళిక కాలం? (c)
a) 1987-1992 b) 1986-1991
c) 1985-1990 d) 1986-1994
6. జాతీయ ఆదాయం అనగా? (b)
a) మార్కెట్ ధరల్లో నికర జాతీయ ఉత్పత్తి
b) ఫాక్టర్ కాస్ట్లో నికర జాతీయ ఉత్పత్తి
c) మార్కెట్ ధరల్లో నికర దేశీయ ఉత్పత్తి
d) ఫాక్టర్ కాస్ట్లో నికర దేశీయ ఉత్పత్తి
7.ఏ సంవత్సరం కోసం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో కనిష్ఠ ప్రత్యామ్నాయ పన్ను (ఎంఏటీ)ను ప్రవేశపెట్టారు? (d)
a) 1991-1992 b) 1992-1993
c) 1995-1995 d) 1996-1997
8. భారత్‌లో ప్రతి సంవత్సరం ఆర్థిక సర్వేను ప్రచురించేది? (d)
a) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
b) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
c) భారత ప్రణాళికా సంఘం
d) భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ
9. భారత్‌లోని… టన్నుల (కార్గో) భాగాన్ని నిర్వహిస్తుంది? (c)
a) కోల్‌కతా b) కాండ్ల
c) ముంబై d) విశాఖపట్నం
10.మానవ పేదరిక సూచీని మానవ అభివృద్ధి నివేదికలో ఎప్పటినుంచి ప్రవేశపెట్టారు? (d)
a) 1994 b) 1995 c) 1996 d) 1997
11. జాతీయ పునరుద్ధరణ నిధి లక్ష్యాల్లో కింది వాటిలో ఏది? (d)
a) సాంకేతిక స్థాయి పెంపుదల ప్రభావానికి గురైన కార్మికుల ప్రయోజనాలను రక్షించడం
b) ఆర్థిక వ్యవస్థ ప్రధాన రంగాన్ని అభివృద్ధి చేయడం
c) విద్యుత్, రవాణా, కమ్యూనికేషన్, నీటిపారుదలతో కూడిన అవస్థాపన అభివృద్ధి
d) సంపూర్ణ అక్షరాస్యత, ఉద్యోగం, జనాభా నియంత్రణ, గృహనిర్మాణం, తాగునీరు వంటి వాటితో కూడిన మానవ వనరుల అభివృద్ధి
12. కంపెనీ ఆస్తి అప్పుల పట్టీ నుంచి సాధ్యమయ్యేది? (d)
a) కంపెనీ లాభ పరిధిని నిర్ణయించడం
b) కంపెనీ లాభ పరిధిని, పరిమాణాన్ని మదింపు చేయడం
c) కంపెనీ ఆస్తుల, అప్పుల పరిమాణాన్ని, స్వరూపాన్ని నిర్ణయించడం
d) కంపెనీ మార్కెట్ షేరు, అప్పు, సంపదను నిర్ణయించడం
13.రాష్ట్ర ఆర్థిక మంత్రుల స్థాయీ సంఘం 2000లో దేని మధ్య సమరూప రేట్లు ఉండాలని సూచించింది? (a)
a) వ్యాల్యూ-యాడెడ్ ట్యాక్స్
b) సేల్స్ ట్యాక్స్
c) స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు
d) అగ్రికల్చర్ ఇన్‌కం ట్యాక్స్
14. భారత్‌లో ఆర్థిక సరళీకరణ దేనితో ప్రారంభమైనది? (a)
a) పారిశ్రామిక లైసెన్సింగ్ విధానంలో పెద్ద మార్పులు
b) ఇండియా రూపాయిలో పరివర్తనీయత
c) ప్రత్యక్ష విదేశీ పెట్టుబడి ప్రక్రియల్లో వ్యవహార మార్పులను తోసివేయడం
d) పన్ను రేట్లలో తగ్గుదల
15. గిల్డ్-ఎడ్జిడ్ విపణి (b)
a) బులియన్ మార్కెట్
b) గవర్నమెంట్ సెక్యూరిటీస్ మార్కెట్
c) గన్స్ మార్కెట్
d) ప్యూర్ మెటల్స్ మార్కెట్
16. కింది వాటిలో ఆర్థిక రంగంలో సంస్కరణలను పరిశీలించి ఫైనాన్స్ సెక్టార్లో మార్పులు సూచించిన కమిటీ? (d)
a) అబిద్ హుస్సేన్ కమిటీ b) భగవతి కమిటీ
c) చెల్లయ్య కమిటీ d) నరసింహం కమిటీ
17. జాతీయ ఆదాయం అనే మాట సూచించేది? (c)
a) స్థూల జాతీయోత్పత్తి (మార్కెట్ ధరల్లో)-తరుగుదల
b) స్థూల జాతీయోత్పత్తి (మార్కెట్ ధరల్లో)+విదేశాల నుంచి వచ్చే నికర ఆదాయం
c) స్థూల జాతీయోత్పత్తి (మార్కెట్ ధరల్లో)-తరుగుదల, పరోక్ష పన్నులు+సహాయకాలు
d) స్థూల జాతీయోత్పత్తి (మార్కెట్ ధరల్లో)-విదేశాల నుంచి వచ్చే నికర ఆదాయం
18.ప్రపంచ అభివృద్ధి నివేదిక దేని వార్షిక ప్రచురణ? (a)
a) యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్
b) ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్
c) వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్
d) ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్
19. పరిశ్రమలో చిన్నతరహా రంగానికి ఉన్న రిజర్వేషన్‌ను రద్దు చేయాలని సూచించిన కమిటీ (a)
a) అబిద్ హుస్సేన్ కమిటీ b) నరసింహం కమిటీ
c) నాయక్ కమిటీ d) రాకేశ్ మోహన్ కమిటీ
20.భారత్‌లో కింది వాటిలో ప్రభుత్వ లిమిటెడ్ కంపెనీ సొంతం చేసుకున్న మొదటి విమానాశ్రయం? (b)
a) గోవాలోని డబోలిమ్ విమానాశ్రయం
b) కొచ్చిన్ విమానాశ్రయం
c) హైదరాబాద్ విమానాశ్రయం
d) బెంగళూరు విమానాశ్రయం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు