పేదరిక ప్రణాళిక అని ఏ ప్రణాళికనంటారు?
ఐదో పంచవర్ష ప్రణాళిక (1974 -79)
-ఐదో పంచవర్ష ప్రణాళిక పేదరిక నిర్మూలన, స్వయం పోషకత్వం అనే ప్రధాన లక్ష్యాలతో ప్రారంభమైంది. ఈ ప్రణాళిక కాలాన్ని అత్యధికంగా పారిశ్రామిక రంగానికి కేటాయించారు. పేదరిక నిర్మూలనకు అనేక పథకాలను చేపట్టడంతో దీన్ని పేదరికపు ప్రణాళిక అంటారు .ఈ ప్రణాళిక కాలంలో ఎమర్జెన్సీ విధించడం, ఆ తర్వాత కేంద్రంలో జనతా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏడాది ముందే ప్రణాళిక ముగిసింది.
ప్రధానమంత్రి – ఇందిరాగాంధీ
ఉపాధ్యక్షుడు హెక్సార్
ప్రణాళిక నమూనా – డీపీధార్
లక్ష్యం – పేదరిక నిర్మూలన,
స్వయం పోషకత్వం
మొత్తం పెట్టుబడి – రూ. 39,426 కోట్లు
ప్రభుత్వ పెట్టుబడి – 70 శాతం
ప్రైవేట్ పెట్టుబడి – 30 శాతం
నిర్ణయించిన వృద్ధిరేటు – 4.4 శాతం
సాధించిన వృద్ధిరేటు, – 4.8 శాతం
తలసరి ఆదాయ వృద్ధిరేటు – 2.7 శాతం
ఐదో పంచవర్ష ప్రణాళిక కేటాయింపులు
రంగం -శాతాల్లో – రూ.కోట్లలో
పరిశ్రమలు – 24.3 – 9,581
వ్యవసాయం, నీటిపారుదల -22.2 -8,742
విద్యుత్ -18.-7,400
రవాణా సమాచారం -17.-6,870
సామాజిక సేవలు -17.3 -6,833
మొత్తం -100 -39,426
సాధించిన విజయాలు
-కేంద్రంలో కాంగ్రెస్ అధికారం కోల్పోవడం, జనతా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఐదో పంచవర్ష ప్రణాళిక ఏడాది ముందే ముగిసింది.
-1974లో కనీస అవసరాల కార్యక్రమాన్ని (Minimum Needs Programme) ప్రారంభించారు. గ్రామాల కనీస అవసరాలైన తాగునీరు, విద్య, వైద్యం, రహదారులు, పారిశుద్ధ్యం మొదలైన సౌకర్యాలను కల్పించడం.
-1974లో ఉపాంత రైతులు, వ్యవసాయ కార్మికుల అభివృద్ధి ఏజెన్సీ (MAFAL) చిన్న రైతుల అభివృద్ధి ఏజెన్సీని ప్రారంభించారు.
-1975లో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఏర్పాటు.
-1975, జూలై 1న 20 సూత్రాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. 1975-76లో సమగ్ర శిశు అభివృద్ధి పథకాన్ని (Integrated Child Development Scheme -ICDS) ప్రారంభించారు.
-1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాలోకి మార్చారు.
-1977-78లో పనికి ఆహార పథకాన్ని (Food for Work Programme) ప్రారంభించారు.
-1977-78లో ఎడారి ప్రాంతాల అభివృద్ధి పథకాన్ని (Desert Development Programme -DDP) 7 రాష్ర్టాల్లోని 36 జిల్లాల్లో ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిలా ్ల DDPకి ఎంపికైంది.
-1977లో గ్రామీణ ప్రాంతాల్లోని అతి పేదవారికి అంత్యోదయ కార్యక్రమాన్ని రాజస్థాన్లో ప్రారంభించారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని దేశమంతటా విస్తరించారు.
నిరంతర ప్రణాళికలు (1978-80)
-గతించిన ఏడాదిని వదిలేసి వర్తమాన ఏడాదిని కలుపుతూ ఏయేటికాయేడు విజయాలను సమీక్షిస్తూ లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడమే ఈ ప్రణాళికల లక్ష్యం. వీటి రూపకర్త గున్నార్ మిర్దాల్. 1978లో కేంద్రంలో జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు అప్పటి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు లక్డావాలా ఆధ్వర్యంలో అమలు చేశారు. 1978-79, 1979-80ల మధ్య నిరంతర ప్రణాళికలను అమలు పర్చారు.
ఆరో పంచవర్ష ప్రణాళిక (1980-85)
-జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన రోలింగ్ ప్రణాళికను తొలగించి, దాని స్థానంలో ఆరో పంచవర్ష ప్రణాళికను 1980-85 మధ్య ప్రవేశపెట్టారు. నిరుద్యోగ నిర్మూలన, ఉపాధికల్పనే ధ్యేయంగా ఆరో పంచవర్ష ప్రణాళికను ప్రవేశపెట్టారు. ఈ ప్రణాళిక కాలంలో ప్రధాని ఇందిరాగాంధీ నిరుద్యోగ నిర్మూలన కోసం బేకారి హఠావో నినాదాన్ని ఇచ్చింది.
ప్రధానమంత్రి – ఇందిరాగాంధీ
ఉపాధ్యక్షుడు – ఎన్డీ తివారీ, చవాన్
ప్రణాళిక నమూనా – లక్డావాలా
లక్ష్యం – నిరుద్యోగత నిర్మూలించడం,ఉద్యోగత పెంపొందించడం
నిర్ణయించిన వృద్ధిరేటు – 5.2 శాతం
సాధించిన వృద్ధిరేటు, – 5.7 శాతం
తలసరి ఆదాయ వృద్ధిరేటు -0.2 శాతం
మొత్తం పెట్టుబడి – 1,09,292 కోట్లు
ప్రభుత్వ పెట్టుబడి – 61 శాతం
ప్రైవేట్ పెట్టుబడి – 39 శాతం
ఆరో పంచవర్ష ప్రణాళిక కేటాయింపులు
రంగం శాతాల్లో రూ.కోట్లలో
శక్తి రంగం 28.1 30,751
వ్యవసాయం, నీటిపారుదల 16.1 17,754
పరిశ్రమలు 15.5 16,948
సామాజిక సేవలు 14.6 15,917
రవాణా 13.0 14,208
గ్రామీణాభివృద్ధి 6.-6,997
సమాచారం 3.2 3,469
ప్రత్యేక ప్రాంత పథకం 1.-1,580
శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం 0.9 1,020
ఇతర రంగాలు 0.-848
మొత్తం 100 1,09,292
ఆరో ప్రణాళిక సాధించిన విజయాలు
-ఈ ప్రణాళికలో అత్యధిక నిధులు శక్తి రంగానికి కేటాయించి మొదటిసారిగా పర్యావరణం గురించి ప్రస్తావించారు.
-ఆహార ధాన్యాల్లో స్వయం సమృద్ధి సాధించి ఆహార ధాన్యాల ఉత్పత్తి 146 మిలియన్ టన్నులకు చేరుకుంది.
-దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ప్రజల సంఖ్యను 48.5 శాతం నుంచి 30 శాతానికి తగ్గించారు.
-76 మిలియన్ల గ్రామీణ ప్రజలకు, 34 మిలియన్ల పట్టణ ప్రజలకు ఆర్థిక సహాయం అందించారు.
-జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమం ద్వారా 400 మిలియన్ల పనిదినాలు కల్పించి 12 మిలియన్ల కుటుంబాలకు ప్రయోజనం కలిగించారు.
-పారిశ్రామికోత్పత్తి లక్ష్యం 6.9 శాతం కాగా 3.9 శాతం మాత్రమే సాధించింది.
-1980లో (Integrated Rural Development Programme – IRDP) 1978లో ప్రవేశపెట్టిన సమీకృత గ్రామీణాభివృద్ధ్ధి కార్యక్రమాన్ని పేదరికం దిగువన ఉన్న కుటుంబాల ఆదాయాలను పెంచే ఆలోచనతో ప్రారంభించారు. చిన్నకారు రైతులకు 25 శాతం సబ్సిడీ, ఉపాంత రైతులు, వ్యవసాయ కూలీలు, చేతివృత్తుల వారికి 33.5 శాతం ఎస్సీ, ఎస్టీలకు, వికలాంగులకు 50 శాతం సబ్సిడీతో రుణాలు మంజూరు చేసి వారిని పేదరికం నుంచి విముక్తం చేయడం.
-జాతీయ గ్రామీణ ఉద్యోగిత పథకానికిపనికి ఆహార పథకంగా పేరు మార్చి జాతీయ గ్రామీణ ఉద్యోగిత పథకంగా (National Rural Employment Programme-NREP) మార్చారు. దీన్ని 1980, అక్టోబర్ 2న ప్రారంభించారు. రుతుసంబంధ ఉద్యోగం, అల్ప ఉద్యోగిత గలవారికి ఉపాధి అవకాశాలు కల్పించడం.
-1982-83లో డ్వాక్రా పథకాన్ని (Development of Women And Children in Rural Areas -DWACRA) 50 జిల్లాల్లో ప్రవేశపెట్టిన తర్వాత దేశం మొత్తం విస్తరించారు.
-గ్రామీణ ప్రాంతంలో భూములు లేని వారికి ఉద్యోగిత హామీ పథకాన్ని (Rural Landless Employment Guarantee Programme -RLEGP) 1983, ఆగస్ట్ 15న ప్రారంభించారు. భూమి లేని శ్రామికుల కుటుంబాల్లో కనీసం ఒక్కరికి చొప్పున ఏడాదిలో 100 రోజులు ఉపాధి కల్పించటంతో పాటు ఉత్పాదక ఆస్తులు సృష్టించి గ్రామీణ వ్యవస్థను పటిష్టం చేయడం.
ఏడో పంచవర్ష ప్రణాళిక (1985-90)
-రాజీవ్గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రణాళికను దారిద్య్ర నిర్మూలన, నిరుద్యోగ నివారణ ధ్యేయంతో పాటు ప్రాంతీయ సమానాభివృద్ధి, వాతావరణ కాలుష్యాన్ని నివారించాలనే ఉద్దేశంతో ప్రారంభించారు. ఈ ప్రణాళిక 21వ శతాబ్దంలో భారతదేశం అనే నినాదంతో ప్రారంభమైంది. ఈ ప్రణాళిక 1985, ఏప్రిల్ 1న ప్రారంభమై 1985, మార్చి 31న ముగిసింది.
ప్రధానమంత్రి రాజీవ్గాంధీ
ఉపాధ్యక్షుడు మన్మోహన్ సింగ్
ప్రణాళిక నమూనా షకీలాబ్రహ్మానందం
లక్ష్యం పేదరికం, నిరుద్యోగం నిర్మూలన,
నిర్ణయించిన వృద్ధిరేటు 5 శాతం
సాధించిన వృద్ధిరేటు, 6 శాతం
తలసరి ఆదాయ వృద్ధిరేటు 0.2 శాతం
మొత్తం పెట్టుబడి రూ.2,18,730
ప్రభుత్వ పెట్టుబడి 52 శాతం
ప్రైవేట్ పెట్టుబడి 48 శాతం
ఏడో పంచవర్ష ప్రణాళిక కేటాయింపులు
రంగం శాతాల్లో రూ.కోట్లలో
శక్తి రంగం 28.1 61,789
సామాజిక సేవలు 46.0 34,960
రవాణా 13.5 29,548
పరిశ్రమలు 13.-29,220
నీటిపారుదల 7.6 16,590
గ్రామీణాభివృద్ధి 7.0 15,246
వ్యవసాయం 5.-12,793
సమాచారం 3.9 8, 426
ప్రత్యేక ప్రాంత పధకం 1.6 3, 470
శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం 1.-3, 024
ఆర్థికసేవలు 1.0 2, 250
సాధారణ సేవలు 0.7 1, 514
మొత్తం 100 2,18,730
నాలుగో పంచవర్ష ప్రణాళిక విజయాలు
-1969లో 14 బ్యాంకుల జాతీయం
-1970లో పాల ఉత్పత్తి పెంచడానికి శ్వేత విప్లవం ప్రారంభం
-ఈ ప్రణాళిక కాలంలో ఎగుమతుల ప్రోత్సాహం, దిగుమతుల ప్రత్యామ్నాయ విధానాన్ని అనుసరించారు .
-PL- 480 కింద దిగుమతి చేసుకొంటున్న ఆహార ధాన్యాల దిగుమతిని తగ్గించటం, విదేశీ సహాయాన్ని తగ్గించాడానికి ఎగుమతులు పెంచడంతో పాటు ప్రాంతీయ అసమానతలు తగ్గించడానికి ప్రాధాన్య మిచ్చారు.
-1972-73లో ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారు. 1993లో ఉపాధి హామీ పథకాన్ని Employment Assurance Scheme -EAS. దీన్నే 2005 – National Rural Employment Guarantee Programme – NREGPగా మార్చి అమలుపరుస్తున్నారు. NREGPను 2009, అక్టోబర్ 2 నుంచి MahatmaGandhi National Rural Employment Guarantee Schemeగా మార్చారు.
-గ్రామాల్లో మంచినీటి వసతి కల్పించడానికి 1972-73లో Accelerated Rural Water Supply Programme – ARWSPను ప్రారంభించారు.
-1973లో Foreign Exchange Regulation Act-FERA చట్టాన్ని ప్రారంభించారు.
-కరువు పీడిత ప్రాంతాల్లో భూగర్భజలాల అభివృద్ధి కోసం Drought Prone Area Programme – DPAPను ప్రారంభించారు. DPAP పథకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 : 50 నిష్పత్తుల్లో నిధులను సమకూర్చుతాయి.
-1973-74లో సన్నకారు రైతులకు విత్తనాలు, సాంకేతిక, విత్తపర సహాయం అందచేయడానికి (Marginal Farmers and Agricultural Labours Agency-MFALA)ను ప్రారంభించారు.
-1974-75లో చిన్నకారు రైతులకు సాంకేతిక, విత్తపర సహాయం చేయడానికి Small Farmers Develo-pment Agency (SFDA)ను ప్రారంభించారు.
-1974లో పేదరికం కోసం ప్రధానమంత్రి ఇందిరా గాంధీ గరీబీ హఠావో నినాదాన్ని ఇచ్చారు.
-1975లో మెట్ట ప్రాంతాల అభివృద్ధి, నీటిపారుదల వినియోగం కోసం (Command Area Development Programme – CADP)ను ప్రారంభించారు.
వైఫల్యాలు
-1971లో ఇండియా, పాకిస్థాన్ యుద్ధ్దం, శరణార్థులు, కాందిశీకుల సమస్యలు, 1973 నుంచి చమురు ధరలు విపరీతంగా పెరగటం, రుతుపవనాలు అనుకూలించకపోవటం తదితర సమస్యలను నాలుగో పంచవర్ష ప్రణాళిక ప్రధానంగా ఎదుర్కొంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు