జీఎస్టీ బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రం ఏది?
1. స్విట్జర్లాండ్‌లోని దావోస్ లో జరిగిన 47వ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా విడుదల చేసిన నివేదికల్లో భారత్‌కు సంబంధించిన అంశాల్లో సరైనవి ఏవి?
1. సమ్మిళిత వృద్ధి, అభివృద్ధి నివేదిక -2017 ప్రకారం.. సమ్మిళిత వృద్ధి సూచీలో భారత్ స్థానం 60. ఈ సూచీలో లిథువేనియా మొదటి స్థానంలో ఉంది
2. ప్రతిభా పాటవాల సూచీలో భారత్ స్థానం 92. ఈ విభాగంలో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో ఉంది
3. ప్రతిభ, అభివృద్ధి కొలమానాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ నగరాల జాబితాలో మొదటిస్థానం కొపెన్హెగెన్కు దక్కింది. అయితే ఈ విభాగంలో భారత్ నుంచి కేవలం ముంబైకి మాత్రమే చోటు దక్కింది.
ఎ. 1, 2 మాత్రమే సరైనవి
బి. 2, 3 మాత్రమే సరైనవి
సి. 1, 3 మాత్రమే సరైనవి డి. పైవన్నీ సరైనవే
2. వస్తు, సేవల బిల్లు ( గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్) ను దేశంలో 2017 జులై 1 నుంచి అమలు చేయనున్నారు. అయితే జీఎస్టీకి సంబంధించి సరైనవి గుర్తించండి?
1. 122వ రాజ్యాంగ సవరణ బిల్లుగా పార్లమెంట్లో ప్రవేశపెట్టిన జీఎస్టీ బిల్లు 2016 ఆగస్టు 3న రాజ్యసభలో, ఆగస్టు 8న లోక్‌సభలో ఆమోదం పొందింది. సెప్టెంబర్ 8న రాష్ట్రపతి ఆమోదం పొంది 101వ రాజ్యాంగ సవరణ చట్టంగా ఏర్పడింది
2. జీఎస్టీ కౌన్సిల్ చైర్మన్‌గా కేంద్ర ఆర్ధిక మంత్రి, సభ్యులుగా రాష్ర్టాలకు చెందిన ఆర్థిక మంత్రులు ఉంటారు
3. జీఎస్టీ బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రంగా అసోం నిలిచింది
4. ఒకే దేశం-ఒకే పన్ను విధానంగా పేరొందిన జీఎస్టీ బిల్లు సమర్థవంతంగా అమలైతే దేశ వృద్ధిరేటు 2శాతం పెరిగే అవకాశం ఉందని ఆర్థిక వేత్తల అంచనా
ఎ. 2, 3, 4 మాత్రమే సరైనవి
బి. 1, 2, 3 మాత్రమే సరైనవి
సి. 1, 3, 4 మాత్రమే సరైనవి
డి. పైవన్నీ సరైనవే
3. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీలో ఏర్పడ్డ చీలిక కారణంగా సైకిల్ గుర్తును అఖిలేష్ యాదవ్ వర్గానికి కేటాయిస్తూ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. అయితే దేశంలో ఏయే పార్టీలకు సైకిల్ గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది?
ఎ. సమాజ్‌వాదీ పార్టీ, తెలుగుదేశం, జమ్ము కశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ, మణిపూర్ పీపుల్స్ పార్టీ
బి. తెలుగుదేశం, సమాజ్‌వాదీ పార్టీ, అసోం గణపరిషత్, తృణమూల్ కాంగ్రెస్
సి. సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్, జమ్ముకశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ, తెలుగుదేశం, సమాజ్‌వాదీ పార్టీ
డి. కేరళ కాంగ్రెస్, అసోం గణపరిషత్, మణిపూర్ పీపుల్స్ పార్టీ, తెలుగుదేశం, సమాజ్‌వాదీ పార్టీ
4. తమిళనాడు ప్రాచీన సంప్రదాయక్రీడ జల్లికట్టును సుప్రీంకోర్టు నిషేధించడంతో తమిళులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే జల్లికట్టులాగానే దేశంలో ఇతర ప్రాంతాల్లో సంప్రదాయ క్రీడల్లో జంతువులు, పక్షులను ఉపయోగించే క్రీడలను, ఆయా రాష్ర్టాలను గుర్తించండి?
1. కంబళ (దున్నల పరుగుపందెం)
ఎ. నికోబార్ దీవులు
2. కెనాంగ్ హ్యూయాన్ (పందులను లొంగదీసుకొనే పోటీ) బి. కర్ణాటక
3. కోడి పందేలు సి. ఆంధ్రప్రదేశ్
డి. అసోం
ఎ. 1-ఎ , 2-బి, 3-సి
బి. 1-బి, 2-డి, 3- సి
సి. 1-డి, 2-ఎ, 3- సి
డి. 1-బి, 2-ఎ, 3- సి
5. నోట్ల రద్దుకు సంబంధించిన విషయాలపై అర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ను ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ప్రశ్నించింది. పీఏసీకి సంబంధించి సరైనవి గుర్తించండి.?
1. 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా 1921లో పీఏసీని ఏర్పాటు చేశారు
2. పీఏసీలో మొత్తం 22 మంది సభ్యులు ఉంటారు. వారిలో 15 మంది లోక్‌సభ నుంచి, 7గురు రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు.
3. పీఏసీ చైర్మన్‌గా ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతను లోక్‌సభ స్పీకర్ నియమించడం సంప్రదాయంగా వస్తున్నది. ప్రస్తుతం చైర్మన్‌గా కేవీ థామస్ వ్యవహరిస్తున్నారు
4. పీఏసీలో మంత్రులకు చోటు లేదు. ఇది ప్రభుత్వ ఆదాయ-వ్యయాలను, కాగ్ నివేదికను పరిశీలిస్తుంది
ఎ. 2, 3, 4 మాత్రమే సరైనవి
బి. 1, 2, 3 మాత్రమే సరైనవి
సి. 1, 3, 4 మాత్రమే సరైనవి
డి. పైవన్నీ సరైనవే
6. రైసినా డైలాగ్ పేరిట జనవరి 17-19 తేదీల్లో ఢిల్లీలో భౌగోళిక-రాజకీయ సదస్సు జరిగింది. అయితే రైసినా డైలాగ్ సదస్సును ఎవరెవరు నిర్వహించారు?
ఎ. భారత విదేశీ వ్యవహారాల శాఖ, ఫోర్డ్ ఫౌండేషన్
బి. భారత హోంశాఖ, ఫోర్డ్ ఫౌండేషన్
సి. భారత విదేశీ వ్యవహారాల శాఖ, అబ్జర్వర్ రిసెర్చ్ ఫౌండేషన్
డి. భారత రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ
7. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు ఎంతగా నమోదు కానుంది?
ఎ. 7.7 బి. 7.8 సి. 7.6 డి. 6.9
8. 19 జనవరి 1941లో బ్రిటిష్‌వారి గృహనిర్బంధం నుంచి తప్పించుకొనేందుకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉపయోగించిన కారును ఇటీవలే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి కోల్‌కతాలో ఆవిష్కరించారు. అయితే నేతాజీకి సంబంధించి కింది విషయాల్లో సరైనవి గుర్తించండి?
1. మీ రక్తాన్ని ధారపోయండి.. నేను మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను, జైహింద్ అనేవి బోస్ నినాదాలు
2. నేతాజీ 1938,1939 సంవత్సరాల్లో భాతర జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా వ్యవహరించారు
3. జపాన్ ప్రభుత్వం అందించిన సహకారంతో ఆజాద్ హింద్ ఫౌజ్‌ను సింగపూర్‌లో ఏర్పాటు చేశారు
4. బోస్ మరణం గురించి పరిశోధించేందుకు షానవాజ్ కమిటీ, ముఖర్జీ కమిషన్లను కేంద్రం ఏర్పాటు చేసింది
ఎ. 2, 3, 4 మాత్రమే సరైనవి
బి. 1, 2, 3 మాత్రమే సరైనవి
సి. 1, 3, 4 మాత్రమే సరైనవి
డి. పైవన్నీ సరైనవే
9. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో మన దేశానికి 78వ ర్యాంకు లభించింది. అయితే ఈ జాబితాలో మొదటి స్థానం ఏ దేశానిది.?
ఎ. అమెరికా బి. జర్మనీ
సి. ఫ్రాన్స్ డి. రష్యా
జవాబులు
1-డి, 2-డి, 3-ఎ, 4-డి, 5-డి, 6-సి, 7-ఎ, 8-డి, 9-బి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు