ద్రవ్యం విధులు-పరిమితులు ( ఇండియన్ ఎకానమీ)
-ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యానికి అధిక ప్రాధాన్యత ఉంది.
– ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో శక్తిమంతమైన సాధనం ద్రవ్యం.
– ఆర్థికాభివృద్ధికి మూలం ద్రవ్యమనే చెప్పవచ్చు.
-ఆధునిక ఆర్థికవ్యవస్థను ద్రవ్య ఆర్థిక వ్యవస్థగా చెప్పవచ్చు.
ద్రవ్యం (Money)
– వస్తువులను కొన్నప్పుడు చెల్లించడానికి ఇతర రకాల బాకీలు తీర్చడానికి అందరు అంగీకరించే వస్తువే ద్రవ్యం -రాబర్ట్ సన్
– ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం ముఖ్యపాత్రను పోషిస్తుంది.
-ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం నిర్వహించే
విధులను క్లుప్తంగా సూచించవచ్చు.
– ద్రవ్యం నాలుగు విధుల వస్తువు అవి వినిమయ మాద్యం, విలువ కొలమానం, విలువ నిధి, విలువ ప్రమాణం.
– ద్రవ్యం విధులను స్థూలంగా మూడు విదాలుగా చెప్పవచ్చు.
ప్రాథమిక విధులు
ద్వితీయ విధులు
అగంతుక విధులు
ప్రాథమిక విధులు (Primary Functions)
– ద్రవ్యం అతిముఖ్యమైన విధులను ప్రాథమిక విధులు అంటారు.
-ప్రాథమిక విధులను తిరిగి రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.
వినిమయ మాద్యం
-ద్రవ్యం నిర్వహించే విధుల్లో వినిమయ ద్రవ్యం ముఖ్యమైనది.
– ఆర్థిక వ్యవస్థలో ఏ వస్తువునైనా, సేవనైనా ముందుగా ద్రవ్యంలోకి మార్చి ఆ ద్రవ్యంతో తమకు కావలసిన ఏ ఇతర వస్తువునైనా, సేవనైనా ఎప్పుడైనా ఎక్కడైనా కొనుగోలు చేయవచ్చు.
విలువ కొలమానం (Measure of Value)
– అన్ని వస్తుసేవల విలువలను కొలిచే సాధనం ద్రవ్యం
-వస్తుసేవల విలువను ద్రవ్యరూపంలో సూచిస్తే దానిని ధర అంటారు.
– ఈ ధరల మూలంగానే మార్కెట్లు విస్తరించి, వస్తువుల ఉత్పత్తి, అమ్మకం, కొనుగోలు మొదలైన వ్యాపార వ్యవహారాలుసులభమైనవి.
ద్వితీయ విధులు (Secondary Functions)
– ప్రాథమిక విధుల నుంచి ఉద్యమించి, ప్రాథమిక విధులకు అనుబంధంగా ఉండే విధులను ద్వితీయ విధులు అంటారు.
– ద్వితీయ విధులనే అనుబంధ విధులు అని, గౌణ విధులనీ కూడా అంటారు.
-ద్వితీయ విధులు తిరిగి మూడు విధాలుగా సూచించవచ్చు.
-విలువ నిధి(Store Value) ఈ విలువ నిధికి కీన్స్ అధిక ప్రాధాన్యత ఇచ్చాడు.
– సంపదను ప్రతీవ్యక్తి ప్రస్తుత అవసరాలకే కాకుండా భవిష్యత్తు అవసరాలకు కూడా నిల్వ చేసుకోవడానికి ద్రవ్యం ఉపయోగపడుతుంది.
-వస్తు మార్పిడి పద్ధతిలో కొన్ని వస్తువులు నశించిపోయే స్వభావం కలిగి ఉండటం వల్ల అధిక వ్యయం కావడం వల్ల నిల్వ చేయడం కష్టంగా ఉండేది. ఉదా: పండ్లు, పూలు కూరగాయలు మొదలైన నశ్వర వస్తువులు ద్రవ్యం వినిమయ మాద్యంగా రావడంతో ఇది సులభమైంది. ఈ నిధిని ‘Assets Function of Money’ గా పిలుస్తారు.
-ఈ ద్రవ్యాన్ని సులభంగా తీసుకుపోవచ్చు, దాచుకోవచ్చు. నిల్వ తక్కువ స్థలం అధిక నిల్వ, అన్ని కాలాల్లో నిల్వ చేయవచ్చు, ఉపయోగించవచ్చు.
వాయిదా చెల్లింపుల ప్రమాణం(Standard of beferred Payment)
-ద్రవ్యం వాయిదా చెల్లింపుల ప్రమాణంగా పనిచేస్తుంది. ఆధునిక కాలంలో వ్యాపార వ్యవహారాలన్నీ ద్రవ్యం ప్రాతిపదికగానే జరుగుతున్నాయి.
వ్యక్తులు, వస్తు, సేవలను కొనుగోలు చేయడం, ద్రవ్య సంస్థల నుంచి రుణాలు పొందడం.
బాండ్లు, షేర్లు కొనుగోలు, అమ్మకం మొదలైనవి ద్రవ్యం ద్వారా సులభమైనవి.
విలువ బదిలి (Transfer of Money)
– ద్రవ్యాన్ని ఎప్పుడైనా, ఎక్కడైనా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి బదిలీ చేయడం సులభం.
అగంతుక విధులు (Contigent Functions)
-ఈ అగంతుక విధులు తిరిగి ముఖ్యంగా నాలుగు విధులను నిర్వహిస్తుంది.
– జాతీయాదాయ మదింపు, పంపిణీ: అన్ని వస్తుసేవల విలువలను లెక్కించి జాతీయాదాయాన్ని తెలుసుకోవడం
– జాతీయాదాయాన్ని వివిధ ఉత్పత్తి కారకాల మధ్య పంపిణీ చేయడం ద్రవ్యరూపంలో సులభం, సాధ్యం.
– ఉపాంత ప్రయోజనాలు ఉపాంత ఉత్పాదకత సమానీకరణలో ద్రవ్యం ఉపయోగపడుతుంది.
-పరపతికి ప్రాతిపదికగా ద్రవ్యం ఉంటుంది.
-ద్రవ్యానికి అధిక ద్రవ్యత్వం ఉంటుంది.
-ద్రవ్యం సోషల్ ఎంపవర్మెంట్లో ఉపయోగపడుతుంది కూడా.
పాల్ ఎన్ జంగ్ – ద్రవ్యం విధుల వర్గీకరణ
-పాల్ ఎన్ జంగ్ – ద్రవ్యం విధులను నిశ్చల విధులు, చలన విధులని పేర్కొన్నాడు. వీటిని సాంకేతిక విధులని కూడా పేర్కొన్నాడు.
-ఉత్పత్తి, వినియోగం, పంపిణీ సాధారణ ధరల స్థాయిని ప్రభావితం చేసే విధులను చలన విధులని అంటే అగంతుక విధులని పేర్కొన్నాడు. కీన్లే ద్రవ్యం విధులను, ప్రాథమిక విధులు, ద్వితీయ విధులు అనుషంగిక విధులు అని మూడు రకాలుగా సూచించారు.
ద్రవ్యం పరిమితులు
-ద్రవ్యం వల్ల ద్రవ్యోల్బణం, ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడతాయి.
– ద్రవ్య భ్రమ (Money Illusion) ఏర్పడుతుంది.
– ముఖవిలువ (Facevalue) నిజ/ వాస్తవిక విలువ (Red Value మధ్య అంతరం ఉంటుంది)
– ధరల స్తబ్దత – ద్రవ్య భ్రమ వల్ల వస్తుంది.
-సామాజిక అలజడులు ద్రవ్యం వల్ల సృష్టించే అవకాశం ఉంటుంది.
అధిక మూలధన కల్పన ద్రవ్యం కల్పిస్తుంది.
-ద్రవ్యవిధానం (Money Policy)
(2022, జూన్ 8)
బ్యాంకు రేటు 4.25%
రెపోరేటు 4.00%
రివర్స్ రెపోరేటు 3.55%
సీఆర్ఆర్ 4.50%
ఎస్ఎల్ఆర్ 18.00%
ప్రాక్టీస్ బిట్స్
1. ఆర్థికాభివృద్ధికి మూలం, శక్తి వంతమైన సాధనం అధిక ప్రాధాన్యతగలది ఏది?
ఎ) వస్తువులు బి) సేవలు
సి) ద్రవ్యం డి) నెట్ వర్కింగ్
2. ద్రవ్యం ఎన్ని విధుల వస్తువుగా సాధారణంగా సూచిస్తారు?
ఎ) రెండు బి) మూడు
సి) నాలుగు డి) ఐదు
3. కిందివాటిలో ద్రవ్యం నిర్వహిచే విధుల్లో అతి ముఖ్యమైంది ఏది?
ఎ) వినిమయ మాద్యం
బి) విలువ కొలమానం
సి) విలువ నిది
డి) వాయిదా చెల్లింపుల ప్రమాణం
4. వస్తు, సేవల విలువలను ద్రవ్య రూపంలో సూచిస్తే దాన్ని ఏమంటారు?
ఎ) ప్రయోజనం బి) ధర
సి) ద్రవ్యం డి) ద్రవ్యోల్బణం
5. ప్రాథమిక విధుల నుండి ఉద్భవించిన విధులు ఏవి?
ఎ) ద్వితీయ విధులు
బి) అనుబంధ విధులు
సి) గౌణ విధులు డి) పైవన్నీ
6. గౌణ విధులని వేటిని అంటారు?
ఎ) ద్వితీయ విధులు
బి) ప్రాథమిక విధులు
సి) అగంతుక విధులు డి) పైవన్నీ
7. కిందివాటిలో కీన్స్ దేనికి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు?
ఎ) విలువ నిధి
బి) వాయిదా చెల్లింపుల ప్రమాణం
సి) విలువ బదిలీ
డి) వినిమయ మాద్యం
8. నశ్వర వస్తువులు (pershable goods) ఉదాహరణ
ఎ) పండ్లు బి) పాలు
సి) పూలు డి) పైవన్నీ
9. కింది వస్తువుల్లో వేటిని సులభంగా తీసుకోవచ్చు, దాచుకోవచ్చు, అన్ని కాలాల్లో నిల్వ చేయవచ్చు, ఉపయోగించవచ్చు.
ఎ) వస్తువులు బి) సేవలు
సి) ద్రవ్యం డి) పైవన్నీ
10. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ సమయంలోనైనా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి సులభంగా బదిలీ చేసేది ఏది?
ఎ) ద్రవ్యం బి) సేవలు
సి) వస్తువులు డి) పైవన్నీ
11. కింది వాటిలో వివిధ ఉత్పత్తి కారకాల మధ్య పంపిణీ చేయడం సులభం, సాధ్యం?
ఎ) వస్తువులు బి) సేవలు
సి) ద్రవ్యం డి) పైవన్నీ
12. ద్రవ్యానికి ఏ రకమైన ద్రవ్యత్వం ఉంటుంది?
ఎ) అధిక ద్రవ్యత్వం
బి) తక్కువ ద్రవ్యత్వం
సి) స్థిర ద్రవ్యత్వం డి) పైవన్నీ
13. పాల్ ఎన్ జంగ్ ద్రవ్యం విధులను ఎన్ని రకాలుగా పేర్కొన్నారు?
ఎ) రెండు బి) మూడు
సి) నాలుగు డి) ఐదు
14. నిశ్చల విధులకు మరొక పేరు?
ఎ) అధునిక విధులు
బి) సాంకేతిక విధులు
సి) అనుబంధ విధులు డి) పైవన్నీ
15. ఉత్పత్తి, వినియోగం, పంపిణీ, సాధారణ ధరల స్థాయిని ప్రభావితం చేసే విధులను ఏమంటారు?
ఎ) నిశ్చల విధులు బి) చలన విధులు
సి) అనుబంధ విధులు డి) బి, సి
16. ద్రవ్యం విధులను కీన్లే ఎన్ని రకాలుగా పేర్కొన్నాడు?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
17. ద్రవ్యం విధులను నిశ్చల విధులు, చలన విధులు అని వర్గీకరించినది ఎవరు?
ఎ) కీన్స్ బి) కీన్లే
సి) పాల్ ఎన్ జంగ్ డి) మార్షల్
18. ద్రవ్యం విధులను ప్రాథమిక, ద్వితీయ, అనుషంగిక విధులు అని వర్గీకరించినది ఎవరు?
ఎ) కీన్లే బి) కీన్స్
సి) పాల్ ఎన్ జంగ్ డి) రాబర్ట్సన్
19. ద్రవ్యం ప్రాథమిక, ద్వితీయ విధులను కలిపి నిశ్చల విధులని పేర్కొన్నది ఎవరు?
ఎ) కీన్స్ బి) కీన్లే
సి) పాల్ ఎన్ జంగ్ డి) ఫిషర్
20. పాల్ ఎన్ జంగ్ ఏ విధులను చలన విధులని పేర్కొన్నాడు?
ఎ) ప్రాథమిక విధులు
బి) గౌణ విధులు
సి) అగంతుక విధులు
డి) అనుబంధ విధులు
21. ద్రవ్యోల్బణం, ప్రతి ద్రవ్యోల్బణం ఏర్పడటానికి ప్రధాన కారణం ఏది?
ఎ) ద్రవ్యం బి) వస్తువులు
సి) మార్కెట్ వస్తువులు డి) పైవన్నీ
22. Asset Functions of Money గా పనిచేసేది ఏది?
ఎ) విలువ కొలమానం
బి) వినిమయ మాద్యం సి) విలువ నిధి
డి) వాయిదా చెల్లింపుల ప్రమాణం
23. వేటి మూలంగా మార్కెట్ల విస్తరణ, వస్తు సేవల ఉత్పత్తి, అమ్మకం కొనుగోలు సులభతరమయ్యాయి?
ఎ) ద్రవ్యం బి) ధరలు
సి) డిమాండ్ డి) సప్లయ్
24. ధరల స్తబ్దత దేనివల్ల ఏర్పడుతుంది?
ఎ) వస్తువులు బి) సేవలు
సి) ద్రవ్యం డి) పైవన్నీ
25. ఉపాంత ప్రయోజనం, ఉపాంత ఉత్పాదకతను సమానీకరణ చేయడంలో ఏది ప్రధాన పాత్ర పోషిస్తుంది?
ఎ) సేవలు బి) వస్తువులు
సి) ద్రవ్యం డి) పైవన్నీ
26. ప్రాథమిక విధులకు అనుబంధంగా ఉండే విధులు ఏవి?
ఎ) ద్వితీయ విధులు బి) గౌణ విధులు
సి) ఎ, బి డి) అగంతుక విధులు
27. కింది వాటిలో ఏది వినిమయ మాద్యంగా వచ్చిన తరువాత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి?
ఎ) వస్తువులు బి) ద్రవ్యం
సి) లోహం డి) బంగారం, వెండి
28. ‘ద్రవ్యం నాలుగు విధుల వస్తువు’ అంటారు. ఆ నాలుగు విధులు ఏవి?
ఎ) ఒక కొలమానం, ఒక మాద్యం, భవిష్యత్తు చెల్లింపుల ప్రమాణం, విలువనిధి
బి) ఒక కొలమానం ఒక మాద్యం, భవిష్యత్తు చెల్లింపుల ప్రమాణం, విలువ బదిలి
సి) ఒక మాద్యం, ఒక కొలమానం, చెల్లింపుల ప్రమాణం, పంపిణీ
డి) పైవన్నీ
సమాధానాలు
1-సి 2-సి 3-ఎ 4-బి 5-డి 6-ఎ 7-ఎ 8-డి 9-సి 10-ఎ 11-సి 12-ఎ 13-ఎ 14-బి 15-బి 16-బి
17-సి 18-ఎ 19-సి 20-సి 21-ఎ 22-సి 23-బి 24-సి 25-సి 26-సి 27-బి 28-ఎ
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు