కానిస్టేబుల్ ప్రిలిమ్స్ మోడల్ టెస్ట్ -2022
125. కింది వాటిలో ప్రాథమిక విధుల గురించి సరైనవి ఏవి?
ఎ. ఇవి అమలు చేయబడవు
బి. ఇవి ఎటువంటి చట్టపరమైన హక్కులు కావు
సి. ఇవి ప్రాథమికంగా నైతిక విధులు
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, సి 4) ఎ, బి, సి
126. ఆదేశిక సూత్రాలకు సంబంధించి అధికరణాలను వాటిని పార్ట్-4లో చేర్చిన రాజ్యాంగ సవరణలను జతపరిచి సరైన జవాబును గుర్తించండి
ఎ. అధికరణం 39-ఎ 1. 44వ సవరణ
బి. నూతన అధికరణం 2. 42వ సవరణ
సి. అధికరణం 43-బి 3. 86వ సవరణ
డి. అధికరణం 48-ఎ 4. 97వ సవరణ
5. 95వ సవరణ
1) ఎ-1, బి-2, సి-4, డి-5
2) ఎ-2, బి-3, సి-4, డి-2
3) ఎ-3, బి-2, సి-4, డి-1
4) ఎ-1, బి-2, సి-4, డి-3
127. రాజ్యాంగ సవరణలను సంబంధిత ప్రాథమిక హక్కులతో జతపరిచి సరైన జవాబును ఇవ్వండి
ఎ. మెదటి సవరణ 1. విద్యాహక్కు
బి. 86వ సవరణ 2. సంఘాలు
ఏర్పాటు చేసే స్వేచ్ఛ
సి. 97వ సవరణ 3. ఎస్సీ, ఎస్టీ
ఉద్యోగులకు ప్రమోష న్లలో రిజర్వేషన్
డి. 77వ సవరణ 4. వాక్ స్వేచ్ఛ
5. సమానత్వపు హక్కు
1) ఎ-1, బి-3, సి-2, డి-5
2) ఎ-4, బి-1, సి-2, డి-3
3) ఎ-5, బి-1, సి-2, డి-3
4) ఎ-2, బి-1, సి-5, డి-3
128. భారత పౌరసత్వ చట్టం-1986 ప్రకారం ఏ పద్ధతి ద్వారా ఒక వ్యక్తి భారతదేశ పౌరసత్వం పొందుతాడు?
1. పుట్టుకతో 2. వారసత్వం ద్వారా
3. నమోదుతో 4. జాతీయతతో
5. భూభాగంతో సంబంధం లేకుండా
1) 1, 2, 3, 4, 5 2) 1, 2
3) 1, 2, 3, 5 4) 3, 4, 5
129. రాజ్యాంగంలోని నిబంధనల్లో ఏది నవంబరు 26, 1949 నుంచి అమలులోకి వచ్చింది?
ఎ. పౌరసత్వానికి సంబంధించిన నిబంధనలు
బి. ఎన్నికలకు సంబంధించిన నిబంధనలు
సి. తాత్కాలిక పార్లమెంటుకు సంబంధించిన నిబంధనలు
డి. ప్రాథమిక హక్కులు
1) ఎ, సి 2) ఎ, సి, డి
3) ఎ, బి, సి 4) బి, డి
130. ప్రభుత్వ పాలనకు సంబంధించి కింది వాటిని పరిశీలించండి
ఎ. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహించడం
బి. ఉన్నత విద్యా సంస్థలను ప్రైవేటీకరించడం
సి. బ్యూరోక్రసీ సంఖ్యను తగ్గించడం, ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను విక్రయించడం
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) సి 4) ఎ, బి, డి
131. జతపరచండి
ఎ. అలాన్ ట్యూరింగ్ 1. భౌతిక శాస్త్రం
బి. అంటోయిన్ లెవోయిజర్ 2. జెనెటిక్స్
సి. ఐసాక్ న్యూటన్ 3. రసాయన శాస్త్రం
డి. గ్రెగర్ మెండల్ 4. కంప్యూటర్
1) ఎ-4, బి-2, సి-3, డి-1
2) ఎ-4, బి-1, సి-3, డి-2
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-3, బి-4, సి-1, డి-2
132. ప్రాథమిక రాశులు, వాటికి సరైన SI ప్రమాణాల జతలను గుర్తించండి
ఎ. విద్యుత్ ప్రవాహం : ఆంపియర్
బి. శక్తి : W (watt)
సి. పీడనం : N/m2
డి. ద్రవ్యరాశి : కిలోగ్రాం
1) ఎ, బి 2) బి, సి
3) సి, డి 4) డి, ఎ
133. కింది వాటిలో సరిగా జతపరిచినవి గుర్తించండి?
ఎ. చంద్రగుప్త – ప్రియదర్శి
బి. కనిష్కుడు – దేవపుత్ర
సి. కుజల కడ్ఫ్సిసెస్ – రాజాధిరాజ
డి. కల్పసూత్ర – బౌద్ధమత గ్రంథం
1) ఎ, డి 2) బి, సి
3) ఎ, బి 4) ఎ, సి
134. జతలను పరిశీలించి సరికాని జతలను గుర్తించండి
ఎ. రామ్‌డియో మిశ్రా 1. భారతదేశంలో జీవచరణ శాస్త్ర పితామహుడు
బి. రాబర్ట్ బ్రౌన్ 2. సూక్ష్మజీవ శాస్త్ర పితామహుడు
సి. ఆంటోన్ వాన్ 3. కేంద్రకాన్ని ఆవిష్కరించిన వ్యక్తి
డి. న్యూటన్ 4. సార్వత్రిక గురు త్వాకర్షణ సూత్రం
1) ఎ, బి, డి 2) బి, సి, డి
3) బి, సి 4) ఎ, డి
135. సరైన వాక్యాలను గుర్తించండి
1. ధ్వని తీవ్రత ‘కంపన పరిమితి’పై ఆధారపడి ఉంటుంది
2. ధ్వని స్థాయిత్వం ‘పౌనఃపున్యం’పై ఆధారపడి ఉంటుంది
3. ధ్వని వేగం ‘యానక స్వభావం’పై ఆధారపడి ఉంటుంది
4. కంపన కణాల్లో మాత్రమే ధ్వని జనిస్తుంది
1) 1, 2, 3 2) 2, 3, 4
3) 1, 3, 4 4) 1, 2, 3, 4
136. సరైనది గుర్తించండి
1. కాంతి పౌనఃపున్యం తగ్గితే ఫోటాన్లోని శక్తి పెరుగుతుంది
2. తరంగదైర్ఘ్యం పెరిగితే ఫోటాన్ శక్తి తగ్గుతుంది
1) 1 సరైనది, 2 తప్పు
2) 1 తప్పు, 2 సరైనది
3) రెండూ సరైనవే
4) రెండూ తప్పు
137. సరైనది గుర్తించండి
1. విద్యుచ్ఛాలక బలం అందించే సాధనం ఎలక్టికల్ జనరేటర్
2. పాదరసాన్ని -269 డిగ్రీల వద్ద చల్లార్చిన అది అతివాహకత్వ ధర్మాన్ని ప్రదర్శించును
1) 1 2) 2 3) 1, 2 4) పైవేవీకావు
138. భౌమ్య అయస్కాంత తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాలు ఏవి?
1. ఉత్తర కెనడా 2. సైబీరియా
3. దక్షిణ ఆస్ట్రేలియా
4. అంటార్కిటికా తీరం
1) 1 2) 3 3) 1, 3 4) 1, 2, 3, 4
139. ప్రెషర్‌కుక్కర్ వంట చేసే సమయాన్ని బాగా తగ్గిస్తుంది. ఎలా?
1) వేడి చాలా సమంగా విభజించడం వల్ల
2) అత్యధిక ఉష్ణోగ్రత ఆహారాన్ని మెత్తబడేలా చేస్తుంది
3) కుక్కర్ లోపల మరిగే స్థితి అధికమవటం వల్ల
4) స్టవ్ మంట పెద్దదిగా చేయడం వల్ల
140. సరైనది గుర్తించండి.
1. ఒక వస్తువు యాంత్రిక శక్తి అనేది స్థితి, గతిశక్తులపై ఆధారపడుతుంది
2. శక్తి ఒక రూపం నుంచి మరో రూపంలోకి మారడాన్ని ‘శక్తినిత్యత్వ నియమం’ అంటారు
1) 1 2) 2 3) 1, 2 4) పైవేవీకావు
141. సరైనది గుర్తించండి
1. భారమితిలో వాతావరణ పీడనం
పాదరస మట్టం 760 మి.మీ.
2. ద్రవ సాంద్రత తగ్గితే భారమితి ఎత్తు తగ్గుతుంది
3. భారమితిని టారిసెల్లి కనుగొన్నాడు
1) 1, 2, 3 2) 2, 3
3) 1, 3 4) 1, 2
142. సౌర కుటుంబంలో సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్న గ్రహాలకు కావాల్సిన అభికేంద్రక బలాన్ని అందించేవి?
1) విద్యుత్ బలాలు
2) విశ్వగురుత్వాకర్షణ బలాలు
3) అయస్కాంత బలాలు
4) పైవన్నీ
143. భూమధ్య రేఖ కంటే ధృవాల వద్ద గురుత్వ త్వరణం విలువ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. దీనికి సరైన కారణం ఏది?
1) ధృవాల వద్ద భూవ్యాసార్థం తక్కువగా ఉంటుంది
2) ధృవాల వద్ద భూవ్యాసార్థం ఎక్కువగా ఉంటుంది
3) ధృవాలు మంచుతో కప్పి ఉంటాయి
4) 2, 3
144. సరైన సమాధానం గుర్తించండి
1. రూథర్‌ఫర్డ్ విలువ 106 విఘటనం/సెకను
2. C14 అర్ధజీవిత కాలం 5770 సంవత్సరాలు
3. C.T. స్కాన్‌లో కఠిన X-కిరణాలు ఉపయోగిస్తారు
1) 1, 2 2) 2, 3
3) 1, 2, 3 4) 1, 3
145. కింది వాటిలో సరైనది గుర్తించండి
1. ఒక అయస్కాంత ధృవసత్వపు ప్రమాణాలు ఆంపియర్ – మీటర్
2. అయస్కాంత భ్రామకం ప్రమాణాలు ఆంపీయర్-మీటర్^2
1) 1 2) 2 3) 1, 2 4) ఏదీకాదు
146. కింది వాటిలో సరికాని జతలను గుర్తించండి
ఎ. హీమోగ్లోబిన్ – చర్మం
బి. విటమిన్-సి – నీటి కాసులు
సి. పిండి పదార్థం – బంగాళదుంపలు
డి. కొవ్వు – వెన్న
1) ఎ, బి 2) బి, సి, డి
3) ఎ, డి 4) ఎ, బి ,డి
147. సరిగా వర్గీకరణ జరిగిన వ్యాధులను గుర్తించండి
ఎ. బ్యాక్టీరియా కారణంగా వచ్చే వ్యాధులు – కలరా, ధనుర్వాతం, కుష్టు, ఆంత్రాక్స్
బి. ప్రోటోజోవన్ల కారణంగా వచ్చే వ్యాధులు – మలేరియా, అమీబియాసిస్, కోరింత దగ్గు, ఎయిడ్స్
సి. ఫంగస్ కారణంగా వచ్చే వ్యాధులు – టీనియాసిస్, బ్లాస్టో మైకోసిస్, సిఫిలిస్, రేబిస్
డి. వైరస్ కారణంగా వచ్చే వ్యాధులు పొంగు, డెంగ్యూ, రుబెల్లా, ఇన్ఫ్లుయంజ
1) డి, సి, బి, ఎ 2) డి, బి, ఎ
3) డి, ఎ 4) సి, బి
148. సరిగా జతపరచిన క్రమాన్ని గుర్తించండి
1. లాలాజలం ఎ. pH 8.4
2. జఠర రసం బి. pH 7.8
3. పైత్యరసం సి. pH 7.5-8.0
4. క్లోమరసం డి. pH 0.9-1.8
5. సక్కస్ ఎంటరికస్ ఇ. pH 6.8
1) 1-ఇ, 2-డి, 3-బి, 4-ఎ, 5-ఇ(డౌట్)
2) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి, 5-సి(డౌట్)
3) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి, 5-బి(డౌట్)
4) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ, 5-బి(డౌట్)
149. నిశ్చితం (ఎ) – మింగేటప్పుడు ఆహారం వాయునాళంలోకి ప్రవేశించదు కారణం (ఆర్) – కంఠబిలానికి ఉపజిహ్వక రక్షణగా ఉంటుంది
1) (ఎ), (ఆర్) నిజం, (ఎ)కి (ఆర్) సరైన వివరణ
2) (ఎ), (ఆర్) నిజం, (ఎ)కి (ఆర్) సరైన వివరణ కాదు
3) (ఎ) నిజం, కానీ (ఆర్) నిజం కాదు
4) (ఎ) నిజం కాదు, కానీ (ఆర్) నిజం
150. సరైన వాక్యాలను గుర్తించండి
1. ప్రసేకం, మూత్రాశయం నుంచి మూత్రాన్ని బయటికి విసర్జించే నాళం
2. మూత్రాశయం చివర ప్రసేకంలోకి తెరుచుకొనే చోట వర్తుల సంవరణి కండరాలు మూత్ర కదలికల నియంత్రణకు ఉపయోగ-పడతాయి
3. ప్రసేకం స్త్రీలలో 4 సెం.మీ. పొడవు ఉండి ఆళిందంగా పిలుస్తారు
4. పురుషుల్లో 20 సెం.మీ. పొడవు ఉండి మూత్ర జననేంద్రియ నాళంగా పిలుస్తారు
1) 1, 2 2) 1, 2, 3, 4
3) 2, 3 4) 1, 4
151. కింది వాటిలో సరైనది గుర్తించండి
ఎ. ఆంజియాలజీ- రక్తనాళాల గురించి చేసే అధ్యయనం
బి. మహాధమని అతిపెద్ద ధమని. ఇది కుడి జఠరిక నుంచి బయలుదేరి ఆక్సిజన్ సహిత రక్తాన్ని శరీర భాగాలకు సరఫరా చేస్తుంది
సి. కరోనరీ ఆర్టరీలో ఏర్పడే అడ్డంకుల వల్ల గుండెపోటు వస్తుంది
1) ఎ 2) ఎ, సి 3) ఎ, బి 4) బి
152. జతపరచండి
ఎ. గాయిటర్ 1. విటమిన్-ఎ
బి. హీమోఫీలియా 2. కళ్లు పచ్చబడటం
సి. జాండీస్ 3. విటమిన్-కె
డి. రే చీకటి 4. అయోడిన్ లోపం
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-1, డి-2
3) ఎ-3, బి-4, సి-2, బి-1
4) ఎ-4, బి-3, సి-2, డి-1
153. శ్వాస కండరాల కదలికను నియంత్రించి తద్వారా ఉచ్ఛాస క్రియలో ఒక వ్యక్తి పీల్చే వాయువుల ఘనపరిమాణాన్ని నియంత్రించే కేంద్రంగా, ఆ కేంద్రాన్ని కలిగి ఉన్న అవయవం వరుసగా
1) పాన్స్వరోలి, న్యూమోటాక్సిక్ కేంద్రం
2) న్యూమోటాక్సిక్ కేంద్రం పాన్స్వరోలి
3) కార్పోరా క్వాడ్రిజెమైనా, మధ్యమెదడు
4) వర్మిస్, అనుమస్తిష్కం
154. పునర్నివిష్ట నియంత్రణకు సరైన ఉదాహరణలు గుర్తించండి
1. రక్త ప్లాస్మాలోని అధికాల్షియం స్థాయి థైరాయడ్ గ్రంథిని కాల్సిటోనిన్ స్రవించడానికి ప్రేరేపిస్తుంది
2. రక్త ప్లాస్మాలోని అల్ప కాల్షియం స్థాయి థైరాయిడ్ గ్రంథిని కాల్సిటోనిన్ స్రవించడానికి ప్రేరేపిస్తుంది
3. రక్తంలో గ్లూకోజ్ స్థాయి అధికమైనప్పుడు లాంగర్ హాన్స్ పుటికలు ఇన్సులిన్‌ను స్రవిస్తుంది
1) 1, 3 2) 2 3) 2, 3 4) 1, 2
155. రాజు అనే విద్యార్థి ఉరః పంజరం ఎముకల గురించి ఈ కింది వ్యాఖ్యానాలు చేశాడు. వీటిలో సరైనవి గుర్తించండి
1. మోదటి ఏడు జతల పర్శుకలను నిజ పర్శుకలు లేదా కశేరు – ఉరోస్థిపర్శుకలు అని అంటారు
2. 5 జతల పర్శుకలను మిధ్య పర్శుకలు అంటారు
3. చివర రెండు జతల పర్శుకలను ప్లవక పర్శుకలు అంటారు
4. నిజ పర్శుకలు ఉరఃకశేరుకలకు, ఉరోస్థితోను, మిధ్యాపర్శుకలు 7వ జతకు చెందిన కచాభమృదులాస్థి ద్వారా ఉరోస్థితో, ప్లవక పర్శుకలు ఉదర తలంలో స్వేచ్ఛగా ఉంటాయి
1) 1, 2 2) 3, 4
3) 1, 2, 3, 4 4) 2, 3
సమాధానాలు
126.2 127.3 128.3 129.3 130.3 131.3 132.4 133.2 134.3 135.4 136.2 137.3 138.4 139.3 140.3 141.3 142.2 143.1 144.1 145.3 146.1 147.3 148.1 149.1 150.2 151.2 152.4 153.2 154.1 155.3
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?