ECONOMY | ఆర్థిక లక్ష్యాలే ప్రాతిపదిక.. ప్రాంతాలకు ప్రాధాన్యం

ప్రణాళికలు రకాలు (మార్చి 19 తరువాయి)
స్థిర ప్రణాళిక (Fixed Plan)
- సరళత్వాన్ని బట్టి ప్రణాళికలను స్థిర ప్రణాళిక, నిరంతర ప్రణాళిక అనే రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.
- ఒకసారి ప్రవేశపెట్టిన ప్రణాళికను నిర్దేశించిన కాలవ్యవధి పూర్తి అయ్యేవరకు మారకుండా స్థిరంగా ఉండే ప్రణాళికను స్థిర ప్రణాళిక అంటారు.
- ముందుగా నిర్దేశించిన ప్రణాళికలో ఎటువంటి మార్పులు చేయకుండా అమలు చేయటం.
- భారతదేశంలో అమలు చేసిన ప్రణాళికలు ఈ రకానికి చెందినవే.
నిరంతర ప్రణాళిక (Rolling plan)
- గత సంవత్సరాన్ని వదిలేసి ప్రస్తుత, రాబోయే సంవత్సరాన్ని కలుపుతూ నిరంతరం కొనసాగే ప్రణాళికనే ‘నిరంతర ప్రణాళిక’ అంటారు.
- నిరంతర ప్రణాళిక భావనను మొదట స్వీడన్ దేశస్థుడైన గుర్నార్ మిర్థాల్ ‘Economic Planning in border Setting’ గ్రంథంలో చెప్పాడు.
- గుర్నార్ మిర్థాల్ రాసిన ‘ఏషియన్ డ్రామా’ గ్రంథం నుంచి తీసుకున్నాడు. నిరంతర ప్రణాళికలను మొదట అమలు చేసిన దేశం నెదర్లాండ్స్. ఫిలిప్స్ కంపెనీలో ప్రవేశ పెట్టారు.
- తరువాత అమెరికాలో స్టాండర్డ్ ఆటోమొబైల్స్ కంపెనీలో అమలు చేశారు.
- నిరంతర ప్రణాళికలు విజయవంతమైన దేశం జపాన్.
- నిరంతర ప్రణాళిక భావనను భారతదేశం జపాన్ నుంచి స్వీకరించింది.
- నిరంతర ప్రణాళికలను భారతదేశంలో 1962లో భారత్-చైనా యుద్ధ సమయంలో రక్షణ శాఖలో మొదట అమలు పరిచారు. తరువాత 1978లో జనతా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో 5వ పంచవర్ష ప్రణాళికను ఒక సంవత్సరం ముందుగా రద్దు చేసి జనతా ప్రభుత్వం మొరార్జీ దేశాయ్ ఆధ్వర్యంలో/అధ్యక్షతన అప్పటి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడైన ఆచార్య లక్డావాలా సలహా మేరకు 1978 ఏప్రిల్ 1 నుంచి 1980 మార్చి 31 వరకు అమలు చేశారు.
- నిరంతర ప్రణాళికల ముఖ్య లక్ష్యం చిన్న, కుటీర పరిశ్రమలకు ప్రాధాన్యం.
- నిరంతర ప్రణాళిక గాంధేయ సిద్ధాంతాలకు అనుగుణంగా రూపొందించారు.
- నిరంతర ప్రణాళికలను 1980లో కాంగ్రెస్/ ఇందిరాగాంధీ ప్రభుత్వం రద్దు చేసింది.
- వనరుల కేటాయింపును బట్టి ప్రణాళికలను భౌతిక ప్రణాళిక, ఆర్థిక ప్రణాళిక అని రెండు రకాలుగా వర్గీకరించారు.
భౌతిక ప్రణాళిక (physical plan)
- భౌతిక ఉత్పత్తి లక్ష్యాల ప్రాతిపదికగా రూపొందించిన ప్రణాళికను ‘భౌతిక ప్రణాళిక’అంటారు.
- వనరుల అంచనా, కేటాయింపు, భౌతిక ద్రవ్య రూపంలో ఉంటుంది. భౌతిక వనరులైన ముడి పదార్థాలు, మానవ వనరులు మొదలైన అంశాల ఆధారంగా రూపొందించింది.
- ఈ ప్రణాళికలో వస్తురాశి, ద్రవ్యరాశి కంటే ఎక్కువగా ఉంటుంది.
- ఈ ప్రణాళిక అమలుకు చైనాను ఉదాహరణగా చెప్పవచ్చు.
ఆర్థిక ప్రణాళిక (Economic plan)
- ఆర్థిక లక్ష్యాల ప్రాతిపదికగా వివిధ రంగాలకు ఆర్థిక వనరుల కేటాయింపుతో రూపొందించిన ప్రణాళికను ఆర్థిక ప్రణాళిక అంటారు.
- ఆర్థిక ప్రణాళికలో ద్రవ్యరాశి, వస్తురాశి కంటే ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక ప్రణాళికను విత్త ప్రణాళిక (Financial Plan) అని అంటారు. ఉదా: భారతదేశం
- ఆర్థిక ప్రణాళిక భావనను మొదట వివరించినది 1910లో రష్యాకు చెందిన ప్రొఫెసర్ క్రిస్టియన్ కొఫెడర్
- వర్తించే రంగాన్ని బట్టి ప్రణాళికలను సాధారణ ప్రణాళిక, పాక్షిక ప్రణాళిక అని రెండు రకాలుగా వర్గీకరించారు.
సాధారణ ప్రణాళిక (General Plan): - ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలకు వర్తించేటట్లు ప్రణాళికలను రూపొందిస్తే దాన్ని సాధారణ ప్రణాళిక అంటారు. దీన్ని సమగ్ర ప్రణాళిక అని కూడా పిలుస్తారు. ఉదా: వ్యవసాయరంగం, పారిశ్రామిక రంగం, సేవారంగం.
పాక్షిక ప్రణాళిక (Partial Plan)
- ఆర్థిక వ్యవస్థలోని కొన్ని రంగాలకు మాత్రమే ప్రణాళికలను రూపొందిస్తే దాన్ని పాక్షిక ప్రణాళిక అంటారు.
ఉదా: మొదటి ప్రణాళిక వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇవ్వడం - రెండో ప్రణాళిక పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యం ఇవ్వడం.
- అమలు పరిచే ప్రాంతాన్ని బట్టి ప్రాంతీయ ప్రణాళిక, జాతీయ ప్రణాళిక, అంతర్జాతీయ ప్రణాళిక అని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.
ప్రాంతీయ ప్రణాళిక (Regional planning)
- ఒక ప్రత్యేక ప్రాంతం అభివృద్ధికి / ఒక వెనుకబడిన ప్రాంత అభివృద్ధికి రూపొందించి, అమలు పరిచే ప్రణాళికను ప్రాంతీయ ప్రణాళిక అంటారు.
- సువిశాల దేశాల్లో, అధిక భౌగోళిక విస్తీర్ణంగల దేశాల్లో ప్రాంతీయ వ్యత్యాసాలను తొలగించడానికి ప్రాంతీయ ప్రణాళికలు అవసరం.
- ప్రాంతీయ ప్రణాళికల వల్ల సంతులిత వృద్ధి జరుగుతుంది.
- 1916లో అమెరికాలోని టెన్నిస్వ్యాలీ అథారిటీలో ఈ ప్రాంతీయ ప్రణాళికలను మొదట అమలు చేశారు.
- రష్యా, ఫ్రాన్స్ దేశాలు ప్రాంతీయ ప్రణాళికలకు అధిక ప్రాధాన్యం ఇచ్చాయి.
జాతీయ ప్రణాళిక (National Plan)
- ఒక దేశం / ఒక జాతి మొత్తం / ఒక భౌగోళిక సరిహద్దులకుప్రణాళికలను రూపొందించి అమలుచేసే ప్రణాళికను జాతీయ ప్రణాళిక అంటారు.
- జాతీయ ప్రణాళికల ముఖ్య లక్ష్యం దేశంలోని వనరులను సంపూర్ణంగా వినియోగించడం.
- ఇది విదేశీ వ్యాపారం కొద్దిగా ఉన్న దేశాల్లో అంటే Closed Economy / అటార్కీ పాటించే దేశాలకు సరిపోతుంది.
అంతర్జాతీయ ప్రణాళిక (International Planning)
- రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాలు కలిసి స్వచ్ఛందంగా ఒక అంతర్జాతీయ సంస్థ కిందకు వచ్చి రూపొందించే ప్రణాళికను అంతర్జాతీయ ప్రణాళిక అంటారు.
ఉదా: మార్షల్ప్లాన్, కొలంబోప్లాన్
ఇతర ప్రణాళికలు
శాశ్వత ప్రణాళిక (Permanent Plan/Continues Plan)
- దీర్ఘకాలిక అంశాలను / లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని నిరంతరం కొనసాగే ప్రణాళికను శాశ్వత ప్రణాళిక అంటారు. ఉదా: రష్యా
తాత్కాలిక ప్రణాళిక (Temparary Plan) - తాత్కాలిక / అత్యవసర/ ఆకస్మిక సమస్యల పరిష్కారం కోసం రూపొందించే ప్రణాళికను ‘తాత్కాలిక ప్రణాళిక’ అని అత్యవసర ప్రణాళిక అని, ఆకస్మిక ప్రణాళిక అని కూడా పిలుస్తారు.
ఉదా: వరదలు, భూకంపాలు, సునామీలు మొదలైనవి.
Anti Cyclical Planning : - వ్యాపార చక్రాలను నిరోధించేందుకు (ఆర్థిక మాంద్యం-పురోగమనం – సౌభాగ్యం- తిరోగమనం) రూపొందించే ప్రణాళికను Anti Cyclical Planning అంటారు. దీన్ని పెట్టుబడిదారీ దేశాల్లో ఎక్కువగా అవలంబిస్తారు.
అభివృద్ధి ప్రణాళిక (Development Plan) : - అభివృద్ధి సాధనకు (ఉత్పత్తి, ఉద్యోగిత, ఆదాయం, జాతీయాదాయం, తలసరి ఆదాయం పెంచడం) రూపొందించే ప్రణాళికను అభివృద్ధి ప్రణాళిక అంటారు. దీన్ని వెనుకబడిన / పేదదేశాల్లో/ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అవలంబిస్తారు.
మిశ్రమ ఆర్థిక ప్రణాళిక (Mixed Economy Planning) - ప్రభుత్వ ప్రైవేటు రంగాల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధన కోసం రూపొందించే ప్రణాళికను మిశ్రమ ఆర్థిక ప్రణాళిక అంటారు. ఉదా: భారతదేశం
ప్రాక్టీస్ బిట్స్
1. నిరంతర ప్రణాళికకు మరోపేరు?
ఎ) స్థిర ప్రణాళిక
బి) కేంద్రీకృత ప్రణాళిక
సి) రోలింగ్ ప్లాన్
డి) ప్రణాళిక విరామం
2. నిరంతర ప్రణాళికను మొదట నెదర్లాండ్స్ ఏ కంపెనీలో అమలు చేసింది?
ఎ) ఫిలిప్స్ కంపెనీ
బి) అమెజాన్ కంపెనీ
సి) ఆటోమొబైల్ కంపెనీ
డి) శాంసంగ్ కంపెనీ
3. నిరంతర ప్రణాళిక అనే భావనను భారత్ ఏ దేశం నుంచి స్వీకరించింది?
ఎ) అమెరికా బి) జపాన్
సి) నెదర్లాండ్స్ డి) రష్యా
4. ద్రవ్యరాశి కంటే వస్తురాశి ఎక్కువగా ఉండే ప్రణాళిక ఏది?
ఎ) నిరంతర ప్రణాళిక
బి) భౌతిక ప్రణాళిక
సి) ఆర్థిక ప్రణాళిక డి) చర ప్రణాళిక
5. ఆర్థిక ప్రణాళిక అనే భావనను మొదట వివరించినది ఎవరు?
ఎ) క్రిస్టియన్ కొఫెడర్
బి) క్రిస్టియన్ రామ్ఫెడర్
సి) క్రిస్టియన్ స్టిఫెడర్
డి) పై అందరు
6. ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలకు వర్తించే ప్రణాళిక ఏది?
ఎ) సాధారణ ప్రణాళిక
బి) పాక్షిక ప్రణాళిక
సి) సమగ్ర ప్రణాళిక డి) ఎ, సి
7. మొదటి ప్రణాళిక వ్యవసాయరంగానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చింది. ఇది ఏ రకమైన ప్రణాళికకు ఉదాహరణ?
ఎ) సమగ్ర ప్రణాళిక
బి) పాక్షిక ప్రణాళిక
సి) చర ప్రణాళిక డి) స్థిర ప్రణాళిక
8. సువిశాల భౌగోళిక విస్తీర్ణం గల దేశాల అభివృద్ధికి ఏ ప్రణాళికలు అవసరం?
ఎ) అంతర్జాతీయ ప్రణాళిక
బి) జాతీయ ప్రణాళిక
సి) ప్రాంతీయ ప్రణాళిక
డి) భౌతిక ప్రణాళిక
9. అంతర్జాతీయ ప్రణాళికకు ఉదాహరణ?
ఎ) మార్షల్ ప్లాన్ బి) కొలంబో ప్లాన్
సి) ఎ, బి సి) సూపర్ ప్లాన్
10. వరదలు, భూకంపాలు, సునామీలు సంభవించినపుడు అమలు చేసే ప్రణాళికలు ఏవి?
ఎ) తాత్కాలిక ప్రణాళికలు
బి) అత్యవసర ప్రణాళికలు
సి) ఆకస్మిక ప్రణాళికలు
డి) పైవన్నీ
11. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల భాగస్వామ్యంతో రూపొందించే ప్రణాళిక ఏది?
ఎ) సామ్యవాద ప్రణాళిక
బి) పెట్టుబడిదారీ ప్రణాళిక
సి) మిశ్రమ ఆర్థిక ప్రణాళిక
డి) పైవన్నీ
12. నిరంతర ప్రణాళికలు విజయవంతమైన దేశం?
ఎ) రష్యా బి) అమెరికా
సి) జపాన్ డి) నెదర్లాండ్స్
13. భారతదేశంలో నిరంతర ప్రణాళికలను ఎవరి సలహా మేరకు అమలు చేశారు?
ఎ) మొరార్జీ దేశాయ్
బి) లక్డావాలా
సి) జవహర్లాల్ నెహ్రూ
డి) వాజ్‌పేయి
14. నిరంతర ప్రణాళికలను రద్దు చేసినది?
ఎ) కాంగ్రెస్ ప్రభుత్వం
బి) బీజేపీ ప్రభుత్వం
సి) ఇందిరాగాంధీ డి) ఎ, సి
15. భౌతిక ప్రణాళిక అమలు చేసే దేశానికి ఉదాహరణ?
ఎ) అమెరికా బి) రష్యా
సి) చైనా డి) నెదర్లాండ్స్
16. భారతదేశంలో అమలు పరచిన ప్రణాళికలు ఏవి?
ఎ) భౌతిక ప్రణాళిక
బి) విత్త ప్రణాళిక
సి) ఆర్థిక ప్రణాళిక డి) బి, సి
17. ఆర్థిక వ్యవస్థలోని కొన్ని రంగాలకు వర్తించే ప్రణాళిక ఏది?
ఎ) సాధారణ ప్రణాళిక
బి) సమగ్ర ప్రణాళిక
సి) పాక్షిక ప్రణాళిక
డి) తాత్కాలిక ప్రణాళిక
18. అమెరికాలోని టెన్నిస్ వాలీ అథారిటీలో అమలు చేసిన ప్రణాళికలు ఏవి?
ఎ) జాతీయ ప్రణాళికలు
బి) ప్రాంతీయ ప్రణాళికలు
సి) కొలంబోప్లాన్ డి) పైవన్నీ
19. కొలంబోప్లాన్ అంటే?
ఎ) ఆసియా-పసిఫిక్‌లోని దేశాల ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం 1950లో రూపొందింది
బి) ఆసియా-పసిఫిక్‌లోని దేశాల ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం 1951 జూలై 1న ప్రారంభించారు
సి) ఎ, బి డి) ఏదీకాదు
సమాధానాలు
1-సి 2-ఎ 3-బి 4-బి
5-ఎ 6-డి 7-బి 8-సి
9-సి 10-డి 11-సి 12-సి
13-బి 14-డి 15-సి 16-డి
17-సి 18-బి 19-సి
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు