-వాల్మీకి అంబేద్కర్ అవాస్ యోజన (వాంబే)
-ఈ పథకాన్ని 2001, ఆగస్టు 15న ప్రారంభించారు. పట్టణాల్లోని మురికివాడల్లో బీపీఎల్ కుటుంబాల కోసం, నివాసాలు లేని పేదల కోసం దీన్ని ప్రారంభించారు. ఈ పథకం అర్బన్ డెవపల్‌మెంట్ శాఖ పరిధిలోనిది.
-మురికివాడల్లో నివసించే ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణ పరిస్థితుల్లో నివాసాల ఏర్పాటు ఈ పథక ప్రధాన లక్ష్యం.
-ఈ పథకం కింద కేంద్రం 50 శాతం సబ్సిడీని, మిగిలిన 50 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తాయి.
-అందరికి ఇండ్లు (షెల్టర్ ఫర్ ఆల్) అనే నినాదంతో ఈ పథకాన్ని ప్రారంభించారు.
-దీనిలో భాగంగా మురికివాడల్లో నిర్మల్ భారత్ అభియాన్ పథకం కింద టాయిలెట్లను ఏర్పాటు కూడా చేస్తారు.
-ఈ పథకంలో లబ్ధిదారులుగా ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం, వెనుకబడిన తరగతులకు 30 శాతం, ఇతర వెనుకబడినవర్గాలకు 15 శాతం, పీహెచ్‌సీలకు 15 శాతం కేటాయిస్తారు.
-వాంబే కింద గరిష్టంగా రూ. 40 వేలతో నిర్మాణాన్ని చేపట్టాలి. దీనిలోనే శానిటరీ టాయిలెట్ కూడా రావాలి. పది లక్షల జనాభా దాటిన పట్టణాల్లో దీనికోసం రూ. 50 వేలు కేటాయిస్తారు.
-ఈ పథకానికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను తయారుచేయడానికి కేంద్రం స్టేట్ అర్బన్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎస్‌యూడీఏ)ని భాగస్వామ్యం చేసింది.
Did you know ..! ఇది తెలుసా..!
Previous article
Sociology | హిందూ సామాజిక వ్యవస్థకు బలమైన పునాది?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు