1. భారతీయ సమాజ ముఖ్య లక్షణం?
1) ఏకత్వం 2) భిన్నత్వం
3) సంస్కృతి 4) జీవన విధానం
2. భారతదేశంలో వ్యక్తి సామాజిక అంతస్తును గుర్తించడానికి ఆధారం?
1) మతం 2) సంస్కృతి 3) ఆర్థికస్థాయి 4) కులం
3. భారతదేశంలోనే ఆవిర్భవించి హిందూ మతాన్ని సంస్కరించడానికి ప్రయత్నించిన మతం?
1) బౌద్ధమతం 2) జైనమతం
3) సిక్కుమతం 4) పైవన్నీ
4. దేశ పౌరులకు మత స్వాతంత్య్రాన్ని కల్పించింది?
1) చట్టం 2) సమాజం
3) రాజ్యాంగం 4) ప్రభుత్వ విధానం
5. ప్రస్తుతం భారతీయ సమాజానికి ఆధారం కానిది?
1) వివిధ సమూహాల మధ్య ఏర్పడిన సంస్కృతి
2) సాంస్కృతిక వ్యాప్తి, సంఘర్షణ
3) సాంస్కృతిక విలీనీకరణం
4) ఆర్థిక సాంస్కృతిక పరిణామక్రమం
6. భారతీయ సామాజిక పరిణామక్రమంలోని అంశంకానిది?
1) కులం
2) స్వయం సమృద్ధ గ్రామీణ సముదాయాలు
3) స్వయంసమృద్ధ పట్టణ సముదాయాలు
4) ఉమ్మడి కుటుంబం
7. భారతీయ సమాజానికి సంబంధించిన లిఖితపూర్వక ఆధారాలు ఎప్పటి నుంచి అందుబాటులో ఉన్నాయి?
1) క్రీ.పూ ఒకటో శతాబ్దం
2) క్రీ.పూ రెండో శతాబ్దం
3) క్రీ.పూ మూడో శతాబ్దం
4) క్రీ.పూ నాలుగో శతాబ్దం
8. భారతీయ సమాజాన్ని మెగస్తనీస్ ఎన్ని వర్గాలుగా విభజించాడు?
1) 5 2) 6 3) 7 4) 8
9. మెగస్తనీస్ వర్గీకరణలో భాగంకానివారు?
1) యుద్ధం చేసేవారు 2) పశు పాలకులు
3) తత్వవేత్తలు 4) వ్యవసాయదారులు
10. మెగస్తనీస్ భారతీయ సమాజంలో గమనించిన వర్గాలు?
1) ఏక వివాహ సమూహాలు
2) బహు వివాహ సమూహాలు
3) అంతర్వివాహ సమూహాలు
4) బహిర్వివాహ సమూహాలు
11. మొగలుల కాలం నాటి హిందూ సామాజిక వ్యవస్థను వివరించిన చరిత్రకారుడు?
1) మెగస్థనీస్ 2) పాహీయాన్
3) అబుల్ ఫజల్ 4) హుయాన్‌త్సాంగ్
12. ఆధునిక కాలంలో భారతీయ సాంస్కృతిక లక్షణాలను వివరించిన తొలి పోర్చుగీసు యాత్రికుడు?
1) హామిల్టన్ 2) కల్నల్ జైనాన్
3) డ్యూర్టె బార్బోసా 4) నికోలస్ ఆండ్రిస్
13. దేశంలో ఏ జనాభా లెక్కల ప్రకారం మొదటిసారిగా విభిన్న రకాల భాషా సమూహాలను గుర్తించారు?
1) 1961 2) 1971 3) 1981 4) 1991
14. భారతదేశంలో ఉన్న ప్రధాన భాషా ప్రాంతాలు ఎన్ని?
1) 9 2) 10 3) 11 4) 12
15. దేశంలో భాషాపరమైన సమైక్యత పెంపొందించిన భాష?
1) సంస్కృతం 2) పర్షియన్
3) ఇంగ్లిష్ 4) పైవన్నీ
16. సామాజిక వ్యవస్థాపనలో అంతర్భాగంగా ఉన్న అంశం?
1) సంస్కృతి 2) సంప్రదాయాలు
3) ఆర్థిక సంపద 4) మానవ జీవితం
17. సంప్రదాయక భారతీయ సామాజిక వ్యవస్థాపన ప్రకారం మానవుడు ఎన్నేండ్లు బతుకుతాడని నమ్మకం?
1) 65 2) 75 3) 95 4) 100
18. హిందూ సామాజిక వ్యవస్థకు బలమైన పునాది?
1) వర్ణ వ్యవస్థ 2) విశిష్ట సంస్కృతి
3) కాలచక్రం 4) కట్టుబాట్లు
19. భారతీయ జీవనానికి నిలువెత్తు నిదర్శనం, భారతీయ ఆలోచనా స్రవంతిని కలిపి ఉంచే జీవన సూత్రం?
1) ధర్మం 2) అర్థం 3) కామం 4) మోక్షం
20. ప్రముఖ గ్రీకు తత్వవేత్త మానవుడిని ఏమని పిలిచాడు?
1) తెలివైన జంతువు 2) సంఘజీవి
3) సామాజిక ప్రతినిధి 4) జంతువుల్లో ఉన్నత జీవి
21. భారతీయ సమాజాన్ని రిస్లే ఎన్ని జాతులుగా వర్గీకరించాడు?
1) 7 2) 8 3) 9 4) 10
22. సర్ హెర్బర్ట్ రిస్లే వర్గీకరణలో భాగంకానిది?
1) ద్రవిడియన్ 2) మంగోలాయిడ్ ద్రవిడియన్
3) మంగోలాయిడ్ 4) మెడిటేరియన్
23. నీగ్రిటో జాతి ప్రజలు భారత్‌లో ఉన్నారని పేర్కొన్న సామాజిక శాస్త్రవేత్త?
1) రిస్లే 2) గుహా 3) హెడెన్ 4) రుగ్గిరి
24. సమాజాన్ని సాలెగూడుతో పోల్చిన సామాజిక శాస్త్రవేత్త?
1) అగస్ట్కామ్టే 2) వెరియర్ ఎల్విన్
3) మెకైవర్ 4) రాడ్‌క్లిఫ్ బ్రౌన్
25. సమాజానికి తప్పనిసరిగా అవసరమైన అంశం?
1) సభ్యులు 2) సామాజిక సంబంధాలు
3) పరస్పర ఆశ్రయత 4) పైవన్నీ
26. ప్రపంచంలోని చాలా సమాజాల మధ్య పోలికలు కలిగి ఉండటానికి కారణం?
1) ఆర్థిక సారుప్యత
2) మానవ జాతి మానసిక ఏకత్వం
3) సాంస్కృతిక విలంబన్
4) కుటుంబ సారుప్యత
27. సమాజం సొంత అస్థిత్వాన్ని ఏమంటారు?
1) సామాజిక విశిష్టత 2) సమాజ నిర్మితి
3) సాంస్కృతిక ఆలంబన 4) మానవ జాతి నిర్మాణం
28. సమాజశాస్త్రం ఒక ప్రత్యేకమైన శాస్త్రంగా రూపుదిద్దుకున్న కాలం?
1) 17వ శతాబ్దం మధ్యకాలం
2) 18వ శతాబ్దం మధ్యకాలం
3) 19వ శతాబ్దం మధ్యకాలం
4) 20వ శతాబ్దం మధ్యకాలం
29. 1513లో నికోలో మాకియవెల్లి రచించిన ఏ గ్రంథంలో రాజ్యం, రాజ్య నిర్వహణ గురించి వివరణ ఉంది?
1) ది స్టేట్ 2) ది ప్రిన్స్
3) ది కింగ్ 4) యుటోపియా
30. ఆదర్శవంతమైన సామాజిక క్రమాన్ని అదేవిధంగా నిత్యజీవితపు సామాజిక సమస్యలపై అవగాహన కల్పించిన గ్రంథం?
1) యుటోపియా 2) ది ప్రిన్స్
3) ధి ఎథిక్స్ 4) రాజ్యపాలన
31. సమాజశాస్త్రం అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన సమాజ శాస్త్రవేత్త?
1) విలియం హాకిన్స్ 2) దుర్క్‌హైమ్
3) అగస్ట్కామ్టే 4) మాకియవెల్లి
32. అగస్ట్కామ్టే?
1) సమాజ నిర్మితికి ఆధ్యుడు
2) సామాజిక నియమాల సృష్టికర్త
3) సమాజశాస్త్ర పితామహుడు
4) సామాజిక జీవనాన్ని శాస్త్రీయంగా వివరించిన మొదటి శాస్త్రవేత్త
33. సోషియస్, లోగస్ అనే పదాలు ఏ భాషకు చెందినవి?
1) లాటిన్, రోమన్ 2) లాటిన్, గ్రీకు
3) గ్రీకు, లాటిన్ 4) రోమన్ లాటిన్
34. సోషియస్ అంటే?
1) సహచరుడు 2) కామ్రేడ్ 3) సమాజం 4) పైవన్నీ
35. ఆక్స్ఫర్డ్ నింఘటువు ప్రకారం సమాజశాస్త్రం దేన్ని అధ్యయనం చేస్తుంది?
1) సమాజం 2) సామాజిక ప్రవర్తనల స్వభావం
3) సామాజిక అభివృద్ధి 4) పైవన్నీ
36. సమాజ శాస్త్ర వికాసానికి దోహదపడిన అంశం?
1) పారిశ్రామిక విప్లవం 2) ఫ్రెంచి విప్లవం
3) శాస్త్ర విజ్ఞానానికి ప్రాముఖ్యం పెరగడం, మతం క్షీణించడం 4) పైవన్నీ
37. పారిశ్రామిక విప్లవం ఎప్పుడు ఎక్కడ ప్రారంభమైంది?
1) 1760 ఫ్రాన్స్ 2) 1760 ఇంగ్లండ్
3) 1870 ఇంగ్లండ్ 4) 1850 ఇంగ్లండ్
38. చరిత్రలోనే మొదటిసారిగా వేగవంతమైన సామాజిక పరివర్తన అసాధారణమైనది కాకుండా సాధారణమైనదిగా పరిగణించడానికి కారణమైంది?
1) పారిశ్రామిక విప్లవం 2) ఫ్రెంచ్ విప్లవం
3) రష్యా విప్లవం 4) చైనా విప్లవం
39. యూరోపియన్ సమాజంలో వేగంగా ఏర్పడుతున్న సామాజిక మార్పులను అవగాహన చేసుకొనే ప్రయత్నంలో భాగంగా ఆవిర్భవించిన శాస్త్రం?
1) రాజనీతి శాస్త్రం 2) ప్రభుత్వ పాలనా శాస్త్రం
3) సమాజ శాస్త్రం 4) తత్వశాస్త్రం
40. ఫ్రెంచి విప్లవం ఎప్పుడు జరిగింది?
1) 1787 2) 1788 3) 1789 4) 1790
41. ఫ్రెంచి విప్లవం ప్రభావం?
1) స్వేచ్ఛ 2) సమానత్వం
3) భూస్వామ్య వ్యవస్థ ముగింపు 4) పైవన్నీ
42. ఫ్యూడల్ ఫ్రెంచి సమాజంలో ఉన్న ఎస్టేట్ వర్గం?
1) మతాధికారులు 2) ప్రభువులు
3) రైతులు, వ్యాపారులు 4) పైవారందరూ
43. శాస్త్ర విజ్ఞానంలో అభివృద్ధి ప్రభావం?
1) హేతబద్ధత 2) విశ్వాసాలు పెరగడం
3) నమ్మకాలు పెరగడం
4) పైవేమీ కావు
44. ప్రతి దేశానికి చెందిన ప్రజలు వారి సార్వభౌమాధికారిని ఎంపిక చేసుకొనే హక్కును కలిగి ఉంటారని పేర్కొన్న ది సోషల్ కాంట్రాక్ట్ అనే గ్రంథాన్ని రచించిన తత్వవేత్త?
1) అరిస్టాటిల్ 2) ప్లేటో 3) రూసో 4) సోక్రటీస్
45. అగస్ట్కామ్టే తర్వాత తొలి సమాజ శాస్త్రవేత్త, సమాజ పితామహుడిగా పరిగణించబడినవారు?
1) హెర్బర్ట్ స్పెన్సర్, ఎమిలి దుర్క్‌హైమ్
2) మాక్స్ వెబర్ 3) కార్ల్‌మార్క్స్
4) పైవారందరూ
46. సమాజశాస్త్రం ఒక బోధనా శాస్త్రంగా ప్రవేశపెట్టిన అంశానికి సంబంధించి జతపర్చండి.
దేశం సంవత్సరం
అమెరికా 1947
ఫ్రాన్స్ 1917
భారతదేశం 1876
స్వీడన్ 1889
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
4) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
47. సమాజశాస్త్రం అధ్యయనం చేసే అంశం?
1) వ్యక్తుల ప్రవర్తన 2) సామాజిక సంబంధాలు
3) సామాజిక జీవితం 4) పైవన్నీ
48. మానవ సమాజంతో సంబంధం లేనిది?
1) శాశ్వతం 2) అశాశ్వతం
3) గతిశీలమైనది 4) సామాజిక సంబంధాలు
49. మానవ సమాజంలో ప్రతి శిశువు సంస్కృతిని?
1) జన్మత పొందుతాడు
2) యాదృశ్చికంగా పొందుతాడు
3) నేర్చుకోవచ్చు, నేర్చుకోకపోవచ్చు
4) తప్పనిసరిగా నేర్చుకోవాలి
50. మానవ సమాజం వేటిపై ఆధారపడి ఉంటుంది?
1) హేతువు 2) వివేకపూరిత ప్రవర్తన
3) సామాజిక సంబంధాలు 4) పైవన్నీ
51. సమాజంలోని వ్యక్తుల, సంస్థలు ఒకరిపై మరొకరు ఆధారపడటం?
1) వైమనస్యత 2) పరస్పరాశ్రయత
3) పరస్పర సహకారం 4) సహోదరత్వం
52. సమాజం సహజ లక్షణం కానిది?
1) నిర్దిష్టమైన భౌగోళిక సరిహద్దు
2) నిర్దిష్టమైన జనాభా
3) విస్తృత సామాజిక ఆర్థిక సంపద
4) విశిష్టమైన సంస్కృతి