Counter-creation | సృష్టికి ప్రతిసృష్టే క్లోనింగ్
-క్లోనింగ్ ప్రక్రియలో అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం ద్వారా జనక జీవి రూపం కలిగిన కొత్త జీవిని సృష్టిస్తారు.
-ప్రతి జీవి.. జీవకణాలతో రూపొందుంతుంది. ఈ జీవ కణాలు ప్రధానంగా రెండు రకాలు.
1. జెర్మ్ జీవకణం – పునరుత్పత్తి కణం.
2. సోమాటిక్ జీవకణం- జెర్మ్ కణాలు మినహా మిగిలిన శరీరమంతా ఉండే కణాలు.
-క్లోనింగ్ పద్ధతిలో ఆడజీవి అండకణంలోని ఒంటరి క్రోమోజోముతో కూడిన కేంద్రకాన్ని తొలగించి, ఆ అండకణంలోనికి ఆడ లేదా మగ జీవిలో ఉండే సోమాటిక్ కణంలోని జంట క్రోమోజోములతో కూడిన కేంద్రకాన్ని ప్రవేశపెడతారు.
-క్లోనింగ్ ప్రక్రియ ద్వారా ఏర్పడిన శిశువు ఏ జీవి నుంచైతే సోమాటిక్ జీవకణాన్ని సేకరించామో ఆ జీవిని పోలి ఉంటుంది.
-ప్రపంచంలో మొదటిసారిగా క్లోనింగ్ ప్రక్రియ ద్వారా జీవిని సృష్టించిన దేశం స్కాట్లాండ్.
-1996లో స్కాట్లాండ్లోని రోజ్లిన్ ఇన్స్టిట్యూట్లో ఇయాన్ విల్మట్, కీత్ క్యాంప్‌బెల్ అనే శాస్త్రవేత్తలు గొర్రె పొదుగు కణాల ద్వారా డాలీ అనే గొర్రె పిల్లను సృష్టించారు. కానీ, ఆ గొర్రెపిల్ల 2003లో మరణించింది.
-అయితే, డాలీ 1998లో బోనీ అనే గొర్రె పిల్లకు జన్మనిచ్చింది.
ఫాదర్ ఆఫ్ క్లోనింగ్ – ఇయాన్ విల్మట్
-జాతీయ పాడి పరిశోధనా సంస్థ (-DRI)
-దేశంలో క్లోనింగ్ ద్వారా జీవిని సృష్టించిన మొదటి సంస్థ – -DRI
-ఈ సంస్థ హర్యానాలోని కర్నాల్ ప్రాంతంలో ఉంది.
-2009లో -DRI సంస్థ సంరూప అనే దూడను సృష్టించింది.
-ప్రపంచంలో క్లోనింగ్ ప్రక్రియ ద్వారా సృష్టించిన మొదటి దూడ సంరూప. ఈ దూడ ఐదు రోజులు మాత్రమే బతికింది.
-ప్రపంచంలో క్లోనింగ్ ప్రక్రియ ద్వారా సృష్టించిన రెండో దూడ -గరిమా-1
-క్లోనింగ్ గేదె నుంచి సృష్టించిన మరో క్లోనింగ్ దూడ- మహిమ (గరిమా-2 నుంచి సృష్టించారు)
-ప్రపంచంలో సృష్టించిన మొదటి పష్మీనా మేక- నూరి
-పష్మీనా మేక – శ్రేష్టమైన కశ్మీరీ ఉన్ని కలిగిన మేక.
-ప్రపంచంలో మొదటిసారి గేదె మూత్రంలోని సోమాటిక్ కణాలను ఉపయోగించి క్లోనింగ్ చేసిన దూడ – అపూర్వ.
-పిండమూల కణాలను ఉపయోగించి 2010లో గరిమా-2 అనే దూడను సృష్టించారు.
-2010లో ఎద్దు చెవుల సోమాటిక్ కణాల నుంచి శ్రేష్ట్ అనే దున్నపోతును సృష్టించారు.
-2012లో న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో నూరి (పష్మీనా మేక)ని సృష్టించారు.
-2014 మే 2న హ్యాండ్ గైడెడ్ టెక్నాలజీని ఉపయోగించి లాలిమా అనే దూడను సృష్టించారు.
-2014 జూలై 3న హ్యాండ్ గైడెడ్ టెక్నాలజీని ఉపయోగించి రజత్ అనే దున్నపోతును సృష్టించారు.
-2015 ఫిబ్రవరి 5న హ్యాండ్ గైడెడ్ టెక్నాలజీని ఉపయోగించి అపూర్వ అనే ముర్రా జాతి దూడను సృష్టించారు.
-కేంద్ర గేదెల పరిశోధనా సంస్థ (CIRB)
-దేశంలో క్లోనింగ్ ప్రక్రియ ద్వారా దూడను సృష్టించిన రెండో సంస్థ – CIRB
-ఈ సంస్థ హర్యానాలోని హిస్సార్‌లో ఉంది.
-CIRB సృష్టించిన క్లోనింగ్ దూడ – హిస్సార్ గౌరవ్.
కృత్రిమ గర్భధారణ
-శుక్రకణాలను, అండాలను పరీక్ష నాళికలో ఫలదీకరణం చెందించి పిండం ఏర్పడిన తర్వాత ఆ పిండాన్ని ఆడజీవి గర్భాశయంలో ప్రవేశపెట్టి పిల్ల జీవులను ఏర్పరిచే ప్రక్రియను కృత్రిమ గర్భధారణ అంటారు.
-ఈ విధంగా సృష్టించిన శిశువును టెస్ట్ ట్యూబ్ బేబి అంటారు.
-ప్రపంచంలో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబి – లూయిస్ బ్రౌన్ (1978 జూలై)
-దేశంలో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబి – హర్ష చావ్దా (1986)
-మన దేశంలో అధికంగా టెస్ట్ ట్యూబ్ బేబీలను సృష్టించింది- ఫిరోజ్ ఫారిక్.
-హైదరాబాద్‌లోని CCMB (Ce-tre for Cellular Molecular Biology) కృత్రిమ గర్భధారణ పద్ధతి ద్వారా రెండు జింకలను ఉత్పత్తి చేసింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు