నిషేధ ఆజ్ఞతో కలిపి జారీచేసే రిట్ ?

రాజ్యాంగ పరిహారపు హక్కు గురించి రాజ్యాంగంలో 32వ అధికరణంలో పొందుపర్చారు. ప్రాథమిక హక్కుల పరిరక్షణకు కంచెగా, వలయంగా, భద్రతా వలయం గా రాజ్యాంగ పరిహారపు హక్కును పేర్కొంటారు.
– రాజ్యాంగ పరిహారపు హక్కు ప్రాథమిక హక్కులకు ఆత్మగా, హృదయంగా, కవచంగా ఉపయోగపడుతుందని డా. బీఆర్ అంబేద్కర్ తెలిపారు.
-ప్రజల ప్రాథమిక హక్కులను ఎవరైనా ఉల్లంఘిస్తే లేదా హక్కులకు భంగం కలిగిస్తే సుప్రీంకోర్టు 32వ అధికరణం ద్వారా, రాష్ర్టాల్లో హైకోర్టులు 226వ అధికరణం ప్రకారం 5 రకాల రిట్లు జారీ చేసి ప్రజల ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తాయి.
-రిట్స్ అంటే న్యాయస్థానాలు జారీచేసే ఆజ్ఞలు లేదా ఆదేశాలు వీటిని తప్పని సరిగా పాటించాలి.
-రిట్స్ జారీ చేసే ప్రక్రియను బ్రిటన్ నుంచి స్వీకరించారు.
-32 (1) అధికరణం ప్రకారం ప్రజల హక్కులకు అవరోధం ఏర్పడితే ప్రజలు సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవచ్చు.
-32 (2) అధికరణం ప్రకారం న్యాయస్థానాలు 5 రకాల రిట్లు జారీ చేస్తాయి.
-అవసరమైతే రిట్లు జారీచేసే అధికారాన్ని భారత పార్లమెంటు జిల్లా స్థాయి న్యాయస్థానాలకు ఇవ్వవచ్చు (కానీ ఇప్పటివరకు ఆ అధికారం ఇవ్వలేదు) అని 32 (3)వ నిబంధన తెలుపుతోంది.
-రాజ్యాంగ పరిహారపు హక్కు ప్రజల పాలిట రక్షణ కవచం. భారత రాజ్యాంగం మొత్తంలో అత్యంత కీలకమైనది. ప్రభుత్వాలకు ఇబ్బంది కలిగించేదిగా దీనిని పరిగణిస్తారు.
-కనుభాయ్ బ్రహ్మభట్ వర్సెస్ గుజరాత్ కేసులో పౌరులు తమకు రాష్ట్ర హైకోర్టులో న్యాయం జరుగుతుందని భావిస్తే ముందుగా రాష్ట్ర అత్యున్నత కోర్టును ఆశ్రయించవచ్చు అని సుప్రీంకోర్టు పేర్కొంది.
రిట్లు ఐదు రకాలు. అవి..
1. హెబియస్ కార్పస్ – బందీ ప్రత్యక్ష అధిలేఖ
2. మాండమస్ – పరయాదేశ అధిలేఖ
3. ప్రొహిబిషన్- నిషేధ ఆజ్ఞ
4. సెర్షియోరరీ – ఉత్ప్రేషణ అధిలేఖ
5. కోవారెంటో – అధికార పృచ్ఛ
8 ఈ 5 రకాల రిట్లను సుప్రీంకోర్టు, హైకోర్టులు మాత్రమే జారీ చేసి ప్రజల ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తాయి.
ప్రొహిబిషన్
-దీనిని ప్రతిశేధ అధికార లేఖ (Prohibition) అని అంటారు.
-ప్రొహిబిషన్ అంటే నిషేధపూర్వక ఆదేశం.
-ఏదైనా ఒక అధీన న్యాయస్థానం లేదా ట్రిబ్యునల్ తన అధికార పరిధిని అతిక్రమిస్తే అటువంటి చర్యలను నిలిపివేయమని సుప్రీంకోర్టు, హైకోర్టులు జారీచేసే ఆజ్ఞ ప్రొహిబిషన్.
-కింది స్థాయి న్యాయస్థానాలను పై స్థాయి కోర్టులు నియంత్రణ చేసేది ప్రొహిబిషన్.
సెర్షియోరరీ
-సెర్షియోరరీ లేదా ఉత్ప్రేషణ అధిలేఖ అంటే ధృవీకరణ చేయడం (To be Certified) అని అర్థం.
-కింది స్థాయి న్యాయస్థానాల్లో విచారించబడిన కేసును నిలుపుదల (Prohibition) చేసి పై స్థాయి కోర్టుకు ఆ కేసును బదిలీ చేసి ధృవీకరణ చేసే ఆదేశం సెర్షియోరరీ.
-అధీన న్యాయస్థానంలో విచారించబడుతున్న కేసును నిలుపుదల చేసేది ప్రొహిబిషన్, కేసును పరిశీలించి తీర్పు ప్రకటించిన తరువాత ఈ రికార్డులను పై స్థాయి న్యాయస్థానాలకు పంపమని ఆదేశించేది సెర్షియోరరీ.
-కేసును నిలుపుదల చేసేది ప్రొహిబిషన్, కింది స్థాయి న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను సవరించేది సెర్షియోరరీ.
-మాండమస్ ఒక పని చేయాలని ఆదేశిస్తే, ప్రొహిబిషన్ ఒక పని చేయరాదని ఆజ్ఞాపిస్తుంది. సెర్షియోరరీ తీర్పులోని సవరణలను సరిచేస్తుంది.
-ప్రొహిబిషన్, సెర్షియోరరీ అనే రిట్లు ఉన్నత న్యాయస్థానాలు, అధీన న్యాయస్థానాలపై జారీ చేసే ఆజ్ఞలు (రిట్లు). వీటిని న్యాయసంబంధమైన ఆజ్ఞలు అని కూడా అంటారు.
-నిషేధ ఆజ్ఞతో కలిపి జారీ చేయబడేది సెర్షియోరరీ.
కోవారెంటో
-కోవారెంటో (అధికార పృచ్ఛ) అంటే ఏ అధికారంతో (To What Authority) అని అర్థం.
-ఒక ప్రభుత్వ అధికారి చట్టపరమైన అర్హతలు లేకుండా అధికారం నిర్వహిస్తుంటే, ఏ అధికారంతో అని ప్రశ్నిస్తూ ఆ అధికారాన్ని నియంత్రించడం కోసం న్యాయస్థానాలు కోవారెంటో అనే ఉత్వర్వును జారీ చేస్తాయి.
-కోవారెంటో అనే అప్పీలు జారీ చేయాలని న్యాయస్థానాలను కోరితే సరైన కారణం లేకపోతే ఈ రిట్ నిరాకరించబడుతుంది.
-కోవారెంటో రిట్ వల్ల అధికారులు తమ అధికార పరిధిని అతిక్రమించకుండా, అధికారం దుర్వినియోగం చేయకుండా, ప్రజల పదవులు దుర్వినియోగం కాకుం డా న్యాయస్థానాలు ఈ రిట్ జారీ చేస్తాయి.
-ప్రభుత్వ అధికారి తన అధికార పరిధిలోకి రాని విషయంలో జోక్యం చేసుకోకూడదని న్యాయస్థానాలు జారీ చేసే ఉత్తర్వు కోవారెంటో.
హెబియస్ కార్పస్
-రిట్లు జారీ చేయడానికి ఉపయోగించిన పదాలు లాటిన్ భాష పదాలు.
-హెబియస్ కార్పస్ అంటే To Have the Body అని అర్ధం. హెబియస్ అంటే Have, కార్పస్ అంటే Body అని అర్థం.
-హెబియస్ కార్పస్ అంటే వ్యక్తిని ప్రవేశపెట్టండి అని అర్థం లేదా ఆజ్ఞాపించడం.
-నిర్బంధించిన వ్యక్తిని 24 గంటల లోపు శారీరకంగా న్యాయస్థానంలో హాజరు పర్చాలని జారీ చేసే ఉత్తర్వే హెబియస్ కార్పస్.
-ఇది ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్య్రపు హక్కును పరిరక్షిస్తుంది.
-ఈ రిట్‌ను ప్రభుత్వాలపై, సంస్థలు, వ్యవస్థలు, ప్రయివేటు వ్యక్తులపై జారీ చేయవచ్చు.
-ఈ రిట్‌ను భారత రాష్ట్రపతిపై, రాష్ర్టాల గవర్నర్లపై, విదేశీయులకు వ్యతిరేకంగా న్యాయస్థానాలు జారీ చేయకూడదు.
-ఇంగ్లండ్‌లో హెబియస్ కార్పస్ చట్టం 1679లో అమల్లోకి వచ్చింది.
మాండమస్
-మాండమస్ అంటే మేము ఆజ్ఞాపిస్తున్నాం (We Command) అని అర్థం.
-ఒక ప్రభుత్వ అధికారి గానీ, ఒక చట్టబద్ధమైన సంస్థ గానీ క్వాజీ, పబ్లిక్ సంస్థ గానీ తమ విధులను నిర్వర్తించనప్పుడు విధులు నిర్వహించమని ఆదేశించడమే మాండమస్.
-ప్రయివేటు వ్యక్తులపై, సంస్థలపై ఈ రిట్‌ను జారీచేయరు.
-ప్రభుత్వ సంస్థలు, ఉద్యోగులు విధులు నిర్వర్తించేవిధంగా న్యాయస్థానాలు ఆదేశించడం వల్ల పాలనలో జాప్యం నివారించబడి ప్రజలకు న్యాయం జరుగుతుంది.
-భారతదేశంలో అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్న సమయంలో న్యాయస్థానాలు రిట్లు జారీ చేయవు.
-మార్షల్ లా (సైనిక శాసనం) అమల్లో ఉన్న సమయంలో కూడా రిట్లు జారీచేయవు.
-జైలుశిక్ష అనుభవించే ఖైదీలకు న్యాయస్థానాల హెబియస్ కార్పస్ రిట్ వర్తించదు.
-1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 32 (A) అధికరణం చేర్చి ప్రభుత్వ శాసనాల రాజ్యాంగ బద్ధతను 32వ అధికరణం పరిధిలో న్యాయస్థానాలు ప్రశ్నించకూడదని రాజ్యాంగ సవరణ చేశారు.
-1978లో 43వ రాజ్యాంగ సవరణగా 32 (A) అధికరణం తొలగించి పూర్వ అధికారాలను పునరుద్ధరించారు.
-భారత సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం దేశంలోని అన్ని ప్రాంతాలకు వర్తించే విధంగా రిట్లు జారీచేస్తుంది.
-రిట్లు జారీ చేయడం సుప్రీంకోర్టు విచక్షణ అధికార పరిధిపై ఆధారపడలేదు. వీటిని జారీ చేయకుండా సుప్రీంకోర్టు నిరాకరించే అవకాశం లేదు. అందుకే రిట్లను రెమెడియల్ రైట్స్ (Remedial Rights) అంటారు.
-న్యాయస్థానాలు ఇంజక్షన్, లోకస్ స్టండి, ప్రజాప్రయోజనాల వాజ్యం, సుమోటో అనే పదాలను ఉపయోగించి ప్రజా సమస్యలను నివారిస్తు న్యాయ రక్షణ కోసం కృషి చేస్తున్నాయి.
-ఇంజక్షన్ ఆర్డర్, లోకస్ స్టండి, ప్రజాప్రయోజనాల వాజ్యం, సుమోటో అనే పదాలు రాజ్యాంగంలో పొందుపర్చబడిలేవు.
-న్యాయస్థానం ఒక పనిని చేయమని మ్యాండేటరీ ఇంజక్షన్, ఒక పని చేయకుండా నిలుపుదల చేయమని రిస్ట్రిక్ట్రివ్ ఇంజక్షన్‌ను జారీ చేస్తుంది. సివిల్ చట్టాల ప్రకారం జారీ చేసేది ఇంజక్షన్. ఇది రిట్ కాదు. రాజ్యాంగంలో లేదు.
-ఇంజక్షన్ ఆర్డర్‌ను నష్టనివారణ కోసం ప్రయివేటు వ్యక్తులపై జారీ చేస్తారు.
-లోకస్ స్టండీ అంటే ఎవరి ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడినవో వారు న్యాయస్థానానికి సమస్యను విన్నవించుకునే హక్కు లేదా అధికారం కలిగి ఉండటం.
-ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం అనే భావన అమెరికాలో ఆవిర్భవించింది.
-ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడినప్పుడు సంబంధిత వ్యక్తులు అవగాహనలేక, నిరక్షరాస్యత కారణంగా న్యాయస్థానాలను ఆశ్రయించలేనప్పుడు వారి తరఫున ప్రజాసంఘాలు, లేదా న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థలు ప్రజాప్రయోజనాల వ్యాజ్యం(PIL) ద్వారా న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు.
-పత్రికారంగాన్ని ఫోర్ట్ ఎస్టేట్ అని ఎడ్మండ్ బర్క్ పేర్కొన్నాడు.
-పత్రికల్లో, ప్రసార సాధనాల్లో వచ్చిన అంశాలను సుప్రీంకోర్టు, హైకోర్టులు స్వయం ప్రేరిత (Sumoto) కేసులుగా విచారించవచ్చు.
ఉదా: ప్రభుత్వ వైద్యశాలల్లో పసిబాలుడ్ని ఎలుకలు కరవడం వల్ల మరణించగా కోర్టు తనకు తానుగా విచారణకు స్వీకరించడం.
-సుప్రీంకోర్టు ప్రాదేశిక పరిధి రిట్లు జారీ చేసే విషయంలో ఎక్కువ, హైకోర్టు ప్రాదేశిక పరిధి తక్కువ. అంటే సుప్రీంకోర్టు భారతదేశం మొత్తానికి వర్తించేలా రిట్లు జారీ చేస్తే హైకోర్టు మాత్రం ఆ రాష్ట్ర పరిధిలో జారీ చేస్తుంది.
ప్రాక్టీస్ బిట్స్
1. ప్రాథమిక హక్కుల పరిరక్షణ బాధ్యత ఎవరిది?
1) రాష్ట్రపతి 2) న్యాయవ్యవస్థ
3) పార్లమెంట్ 4) అటార్నీ జనరల్
2. ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లితే ప్రజలు ఏ అధికరణం ద్వారా హైకోర్టును ఆశ్రయించవచ్చు?
1) 32 2) 76 3) 226 4) 356
3. వ్యక్తి స్వేచ్ఛను పరిరక్షించడానికి న్యాయస్థానాలు జారీ చేసే ఆజ్ఞ ఏది?
1) హెబియస్ కార్పస్ 2) మాండమస్
3) ప్రొహిబిషన్ 4) సెర్షియోరరీ
4. ప్రాథమిక హక్కులకు రాజ్యాంగ పరిహారపు హక్కును హృదయంగా ఎవరు పేర్కొన్నారు?
1) బీఎన్ రావు 2) గ్రాన్విల్లే ఆస్టిన్
3) బీఆర్ అంబేద్కర్ 4) హ్యుగోగ్రోషియస్
5. ఒక రిట్‌ను జారీచేసే సందర్భంలో మరొక రిట్ అంతర్భాగంగా జారీ చేసే రిట్లు ఏవి?
1) హెబియస్ కార్పస్- మాండమస్
2) మాండమస్- ప్రొహిబిషన్
3) ప్రొహిబిషన్ – సెర్షియోరరీ
4) సెర్షియోరరీ – కోవారంటో
సమాధానాలు
1) 2 2) 3 3) 1 4) 3 5) 3
RELATED ARTICLES
-
Indian Polity | సభ ఆమోదిస్తేనే అత్యవసరం.. లేదంటే రద్దు
-
Geography | సౌర కుటుంబంలో అత్యంత సాంద్రత గల గ్రహం?
-
General Studies – Groups Special | ఇనుము తుప్పు పట్టినప్పుడు బరువు పెరగడానికి కారణం?
-
Biology | First Genetic Material.. Reactive Catalyst
-
Telangana Movement | ‘తెలంగాణ జాగో హైదరాబాద్‌కో బచావో’ సభ నిర్వహించిన పార్టీ?
-
Economy- Groups Special | భారతదేశంలో ప్రత్యేక ఆర్థిక మండళ్ల ప్రధాన విధి?
Latest Updates
Groups / DSC Special – Social Studies | స్వయం మట్టి మార్పిడి విధానాన్నిఅనుసరించే నేలలు?
Israel – Hamas war | రావణకాష్టం.. ఇజ్రాయోల్ – పాలస్తీనా వివాదం
Current Affairs | ఆది మహోత్సవ్ దేనికి సంబంధించింది?
UCEED & CEED 2024 | యూసీడ్ & సీడ్-2024 ఐఐటీలో ప్రవేశాలు !
Geography | ప్రపంచంలో తేయాకు ఉత్పత్తిలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది?
Economy | రామగిరి ఖిల్లాను ఏ శతాబ్దంలో నిర్మించారు?
DSC – Groups Special | తరిగిపోతే తిరిగిరావు.. పొదుపుగా వినియోగిద్దాం
SAT Preparation | SAT… Short and Digital
Group 2,3 Special | మహిళలు, బాలలు, ట్రాన్స్జెండర్ల చట్టాలు
General Essay – Groups Speical – AI | వస్తువుకు ప్రాణం.. కృత్రిమ మేధ మాయాజాలం