మహిళల సంక్షేమ యంత్రాంగం, రక్షణలు
ప్రపంచంలో మహిళల హక్కుల కోసం పోరాడిన ప్రథమ మహిళ – క్లారా జుడ్కిన్
– మహిళలు మొదట రాజకీయహక్కుల కోసం, తర్వాత విద్య, వైద్య సదుపాయాల కోసం, అనంతరం లింగ వివక్ష నిర్మూలన కోసం, సమానహక్కులు, సమాన అవకాశాల కోసం మహిళలు ప్రయత్నం చేస్తున్నారు.
రాజ్యాంగం – మహిళల రక్షణలు
-రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు మహిళలకు పురుషులతో పాటు సమానంగా వర్తిస్తాయి.
– 15 (3) నిబంధన ప్రకారం మహిళా శిశు రక్షణ కోసం రాజ్యం కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి.
– 39 (d) నిబంధన ప్రకారం స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం అందించాలి.
– 39 (e) నిబంధన ప్రకారం స్త్రీలు, పిల్లలు, కార్మికుల ఆరోగ్యం కాపాడుతూ, వారి శక్తికి మించిన పని చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి.
– 39(f) బాల, బాలికలు వారి యవ్వనం దోపిడీ కాకుండా దుర్వ్యసనాలకు గురికాకుండా చూడాలి.
– ఆదేశిక సూత్రాల్లో మహిళలకు రక్షణలు కల్పించారు.
– 42వ నిబంధన ప్రకారం స్త్రీలకు ప్రసూతి సదుపాయం కల్పించడానికి వైద్యశాలలు ఏర్పాటుచేయాలి.
– 44వ నిబంధన ప్రకారం యూనిఫాం సివిల్‌కోడ్ (ఉమ్మడి పౌర శిక్షాస్మృతి) అమలుపర్చాలి.
– 243(D) నిబంధన ప్రకారం పంచాయతీరాజ్ వ్యవస్థలో మహిళలకు అన్ని స్థాయిల్లో 33శాతం రిజర్వేషన్లు కల్పించుట.
– 243(T) నిబంధన ప్రకారం పట్టణ ప్రభుత్వాల్లో మహిళలకు అన్ని స్థాయిల్లో రిజర్వేషన్లు కల్పించడం.
జాతీయ మహిళా కమిషన్
– కేంద్ర ప్రభుత్వం 1990లో స్వచ్ఛంద సంస్థలతో, మేధావులతో చర్చలు జరిపి మహిళల కోసం ఒక సంఘం ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.
– జాతీయ మహిళా కమిషన్ బిల్లును 1990 మేలో లోక్‌సభ ఆమోదించగానే రాజ్యసభ ఆమోదించిన తర్వాత 1990 ఆగస్టు 30న రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.
– జాతీయ మహిళా కమిషన్‌ను 1990లో రూపొందించిన చట్టం ద్వారా 1992 జనవరి 31న ఏర్పాటుచేశారు.
– జాతీయ మహిళా కమిషన్ రాజ్యాంగబద్దమైన సంస్థ కాదు. చట్టబద్దమైన సంస్థ మాత్రమే.
– జాతీయ మహిళా కమిషన్ కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
జాతీయ మహిళా కమిషన్ నిర్మాణం
– ఈ కమిషన్ బహుళ సభ్య సంఘంగా ఏర్పాటుచేశారు.
– ఇందులో ఒక చైర్పర్సన్, ఐదుగురు సభ్యులు, ఒక కార్యదర్శి ఉంటారు.
– మహిళా కమిషన్‌లోని సభ్యుల్లో ఒకరు ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి నియమించాలి.
– చైర్‌పర్సన్‌గా నియమింపబడేవారు మహిళా సమస్యలపై, న్యాయశాస్త్రంలోగాని, కార్మిక సామర్థ్య నిర్వహణలోగాని, మహిళా సాధికారితపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి.
– మహిళా కమిషన్ చైర్మన్, సభ్యులను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. వీరి పదవీకాలం మూడేండ్లు.
కమిషన్ విధులు, అధికారాలు
– రాజ్యాంగపరంగా మహిళలకు కల్పించిన రక్షణల అమలును పర్యవేక్షిస్తుంది.
– భారత ప్రభుత్వానికి, మహిళా సంక్షేమానికి చేయాల్సిన శాసనాలను సూచిస్తుంది.
– ఈ కమిషన్ సివిల్ కోర్టులాగా విధులను నిర్వహిస్తుంది.
– మహిళల సాంఘిక, ఆర్థికాభివృద్ధికి చేయాల్సిన ప్రణాళికలకు సంబంధించిన సలహాలని చేస్తుంది.
– పరివారిక్ మహిళా లోక్ అదాలత్ ద్వారా బాల్య వివాహాల నిరోధానికి కృషి చేస్తుంది.
– వరకట్న నిషేధ చట్టం 1961 సమీక్షించి, వివాహ ఆస్తి తగాదాల కేసులను పరిష్కరిస్తుంది.
– మహిళలు ఎదుర్కొనే సమస్యలపై, వారి అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సెమినార్లు, వర్క్‌షాపులు నిర్వహిస్తుంది.
చట్టాలు
– 1829లో లార్డ్ విలియం బెంటింగ్ గవర్నరల్ జనరల్‌గా ఉన్న సమయంలో సతీసహగమన నిషేధ చట్టాన్ని చేశారు. 1929లో శారద చట్టం రూపొందించారు.
– హిందూ వివాహ చట్టం 1955లో చేశారు. దీని ప్రకారం హిందు పురుషుడు ఒక భార్యను మాత్రమే కలిగి ఉండాలని తెలియజేస్తుంది.
– హిందూ వారసత్వ చట్టం 1956 ప్రకారం తల్లిదండ్రుల ఆస్తిలో పురుషుడితో సమానంగా కూతురుకు కూడా వాటా లభిస్తుంది.
– హిందూ దత్తత పోషణ చట్టం 1956లో ప్రకటించారు.
– మహిళల అశ్లీల, అసభ్య నిరోధక చట్టం – 1956
– 1961లో ప్రసూతి సౌకర్యాల చట్టాన్ని రూపొందించారు.
– 1961లో వరకట్న నిషేధ చట్టాన్ని రూపొందించగా 1984, 1986లో సవరణలు చేశారు. దీని ప్రకారం వరకట్నం ఇచ్చిన, తీసుకొన్నా నేరమే. ఈ చట్టం అనుసరించి రూ. 15000 జరిమానా, ఐదేండ్ల జైలు శిక్ష విధిస్తారు.
– గృహహింస నిరోధక చట్టం – 2005లో రూపొందించగా 2006 అక్టోబర్ 26 నుంచి అమల్లోకి వచ్చింది.
– పనిచేసే ప్రదేశాల్లో మహిళల లైంగిక వేధింపుల నిరోధక చట్టం – 2013లో అమల్లోకి వచ్చింది.
– విశాఖ వర్సెస్ రాజస్థాన్ కేసులో సుప్రీంకోర్టు పనిచేసే ప్రదేశాల్లో మహిళలను లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని 1997లో కోర్టు తెలిపింది.
క్రిమినల్ న్యాయ సవరణ చట్టం – 2013
– యాసిడ్ దాడికి పాల్పడిన నేరస్థులకు పదేండ్ల జైలు శిక్ష విధించాలి. నేరస్థాయి ఆధారంగా దీన్ని యావజ్జీవ కారాగార శిక్షగా విధిస్తూ జరిమానా విధించవచ్చు.
– మహిళలను లైంగికంగా వేధిస్తే కనీసం మూడేండ్ల జైలుశిక్ష జరిమానా విధించవచ్చును.
-యాసిడ్ దాడికి ప్రయత్నిస్తే, ప్రేరేపిస్తే నేరస్థుడికి ఐదేండ్ల జైలు శిక్ష విధించాలి. దీన్ని ఏడేండ్లకు పెంచుతూ జరిమానా కూడా విధించవచ్చును.
– మహిళలను రహస్యంగా వీడియోలు తీయడం నేరం. దీని ప్రకారం ఏడాది జైలు శిక్ష విధిస్తారు.
– మహిళలను వెంటపడి వేధించినప్పుడు ఒక ఏడాది జైలుశిక్ష. అవసరమైతే మూడేండ్లకు పెంచుతూ జరిమాన విధించవచ్చు.
– మహిళలపై అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలకు పాల్పడితే కనీసం 20 ఏండ్ల శిక్ష విధిస్తారు.
– మహిళా సాధికారిత ఏడాదిగా 2001ని ప్రకటించారు.
– సాంఘిక దురాచారాలైన లింగ వివక్ష, బాల్య వివాహాలు, వరకట్నం, సతీసహగమనం రూపుమాపి వారి అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేయాలి.
– మహిళలకు రాజకీయ హక్కులు, అవకాశాలు, ప్రాతినిధ్యం రిజర్వేషన్లు అన్ని స్థాయిల్లో కల్పించాలి.
నిర్భయ చట్టం – 2013
– ఢిల్లీలో వైద్య విద్యార్థి (నిర్భయ)పై 2012 డిసెంబర్ 16న గ్యాంగ్ రేప్ జరగ్గా ఆమె మరణించడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి.
– నిర్భయ సంఘటనను విచారించడానికి జస్టిస్ ఉషామెహ్రా కమిషన్ ఏర్పాటు చేశారు. (ఏకసభ్య కమిషన్)
– మహిళలపై హింస పెరగడంతో చట్టాలను సమీక్షించి అవసరమైన మార్పులు చేయడానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీశ్ శరణ్వర్మ అధ్యక్షతన హిమాచల్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీలాసేథ్, న్యాయకోవిదుడు గోపాల సుబ్రమణ్యం సభ్యులుగా కమిటీని 2012 డిసెంబర్ 23న ఏర్పాటుచేశారు.
– జేఎస్ వర్మ కమిటీ 630 పేజీలతో నివేదికను 2013 జనవరి 23న కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.
– జేఎస్ వర్మ కమిటీ సిఫారసు ప్రకారం 2013 ఏప్రిల్ 3న నేరన్యాయ సవరణ బిల్లుగా అమల్లోకి వచ్చింది.
మహిళా రిజర్వేషన్ బిల్లు
– స్థానిక ప్రభుత్వాల్లో 243 డీ, టీ నిబంధన ప్రకారం 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా 33 శాతం రిజర్వేషన్లు కల్పించి అమలు చేస్తున్నారు.
స్థానిక ప్రభుత్వాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలుపర్చిన మొదటి రాష్ట్రం – బీహార్
– కేంద్ర ప్రభుత్వం మహిళలకు స్థానిక ప్రభుత్వాల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టగా 15వ లోక్‌సభ రద్దుకావడంతో ఆ బిల్లు కూడా రద్దయ్యింది.
– ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం 16వ లోక్‌సభలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు స్థానిక ప్రభుత్వాల్లో అమలుపర్చడానికి బిల్లు ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తుంది.
– లోక్‌సభ, రాష్ట్ర విధాన సభల్లో (చట్టసభలు) మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే 81వ రాజ్యాంగ సవరణ బిల్లును 1996లో ప్రవేశపెట్టగా ఆమోదం పొందలేదు.
1996లో మహిళా బిల్లు రూపొందించిన కమిటీకి చైర్మన్ – గీతా ముఖర్జీ
– గీతా ముఖర్జీ రూపొందించిన మహిళా బిల్లును 84వ రాజ్యాంగ సవరణగా ప్రవేశపెట్టగా ఆమోదం పొందలేదు.
– చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును 95వ రాజ్యాంగ సవరణగా అటల్ బిహారీ వాజ్‌పేయ్ ప్రభుత్వం ప్రవేశపెట్టగా ఆమోదం పొందలేదు.
– 2010లో 108వ రాజ్యాంగ సవరణ బిల్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లును రాజ్యసభ 2010 మార్చి 9న ఆమోదించింది. ఈ బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ జరగ్గా అనుకూలంగా 191 ఓట్లు, వ్యతిరేకంగా ఒక్క ఓటుతో ఆమోదం పొందింది.
రాజ్యసభలో మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసినది – శరత్‌జోషి
– 108వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టలేదు. 15వ లోక్‌సభ రద్దు కావడంతో ఈ బిల్లు కూడా రద్దు చేయడం జరిగినది.
– ప్రపంచంలో చిన్న దేశమైన రువాండాలో మహిళలకు 63.8 రిజర్వేషన్లతో ప్రథమస్థానంలో ఉండగా, భారతదేశం 103వ స్థానంలో ఉంది. ఇప్పటివరకు 12 శాతానికి మించి వారికి ప్రాతినిథ్యం పెరగలేదు.
– అన్ని రాజకీయ పార్టీల మ్యానిఫెస్టోల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఉంది. కాని ఆచరణలో మాత్రం సమిష్టి ప్రయత్నం జరగడం లేదు.
– మహిళల రక్షణ కోసం చట్టాలు రూపొందించాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు