కుటుంబాన్ని సమగ్రంగా నిర్వచించిందెవరు?
1. సామాజిక నిర్మితి అనే భావనను ఎవరు ప్రవేశపెట్టారు?
1) మెకైవర్ 2) హరలంబాస్
3) డర్ఫ్హైమ్ 4) స్పెన్సర్
2. ఏకత్వం అంటే? (భారతీయ సమాజానికి సంబంధించి)
ఎ) సామాజిక భావన బి) మానసిక భావన
సి) భౌగోళిక భావన సి) భాషాపరమైన భావన
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) పైవన్నీ
3. భారతీయ సమాజంలో సభ్యుల మధ్య ఏకత్వానికి దోహదం చేస్తున్న అంశాలేవి?
ఎ) పీఠికలోని సౌభ్రాతృత్వం
బి) జాతీయతా భావం సి) భాషాతత్వం
డి) సార్వజనీన ఓటు హక్కు
1) ఎ,సి 2) ఎ, బి 3) సి, డి 4) ఎ, బి, డి
4. దేశ జనాభాను శాస్త్రీయ పద్ధతిలో మొదటిసారి 7 జాతులుగా వర్గీకరించింది ఎవరు?
1) రుగ్గరి 2) ఇక్‌స్టెడ్
3) సర్హెర్బర్ప్ 4) బీఎస్ గుహ
5. దేశంలో సుమారు ఎంతశాతం మంది ఇండో-ఆర్యన్ భాషలను మాట్లాడుతారు?
1) 75 2) 70 3) 65 4) 60
6. ఎన్సైక్లోపీడియా ఆఫ్ సోషల్ సైన్సెస్ ప్రకారం దేశంలో ఎన్ని భాషా కుటుంబాలున్నాయి?
1) 4 2) 3 3) 6 4) 5
7. సామాజిక గతిశీలతకు అధికంగా అవకాశంగల సముదాయం?
1) గిరిజన సముదాయం 2) గ్రామీణ సముదాయం
3) నగర సముదాయం 4) పైవన్నీ
8. రాజు అనే వ్యక్తి గుమస్తా ఉద్యోగం నుంచి మేనేజర్‌గా పదోన్నతి పొందాడు. అయిన కింది వాటిలో సరైనదాన్ని గుర్తించండి?
ఎ) అతడు ఊర్ధ గతిశీలతను పొందాడు
బి) అతడు సమస్తరీయ గతిశీలతను పొందాడు
సి) అతని సామాజికస్థాయి, సామాజిక పాత్ర మారాయి
డి) అతని సామాజిక స్థాయిలో మార్పులేదు, కానీ అతడు నిర్వహిస్తున్న పాత్రలో మార్పు వచ్చింది
1) పైవన్నీ 2) ఎ, బి, సి
3) ఎ, సి 4) ఎ మాత్రమే
9. భారతీయ సమాజంలో స్తరీకరణకు ప్రధాన కారణం ఏది?
1) కుల వ్యవస్థ 2) మత వ్యవస్థ
3) తరగతులు 4) జాతి
10. జాజ్మాని వ్యవస్థకు సంబంధించి సరైనదాన్ని గుర్తించండి.
ఎ) యజ్మాన్ అనే సంస్కృత పదం నుంచి ఉద్భవించింది
బి) సేవలు అందించేవారిని ప్రజా లేదా కామిన్ అంటారు
సి) హరాల్డ్ దీన్ని ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ ఫ్యామిలీ సంబంధంగా తెలిపాడు
డి) జాజ్మాని వ్యవస్థ కుల వ్యవస్థను, వృత్తుల వ్యవస్థను బలహీనపర్చింది
1) పైవన్నీ సరైనవి 2) ఎ, బి, సి
3) సి, డి 4) ఎ మాత్రమే
11. భారతీయ సమాజంలో జాజ్‌మానీ వ్యవస్థ పతనానికి కారణం కాని అంశమేది?
1) భూ సంస్కరణలు 2) వృత్తి విద్యలు
3) పారిశ్రామికీకరణ 4) నిరక్షరాస్యత
12. దేశంలో అత్యల్ప సంఖ్య జనాభా వినియోగిస్తున్న భాషా కుటుంబం?
1) అండమాన్ భాషా కుటుంబం
2) ఇండో-ఆర్యన్ భాషా కుటుంబం
3) ద్రవిడియన్ భాషా కుటుంబం
4) సైనో – టిబెటన్ భాషా కుటుంబం
13. భారతీయ సమాజంలో ఒక వ్యక్తి అంతస్థుకు సంబంధించి కింది వాటిలో సరైనదేది?
1) అంతస్థు కులం ఆధారంగా ఆపాదించబడుతుంది
2) సంస్కృతీకరణ ప్రక్రియ ద్వారా అంతస్థును సాంస్కృతికంగా పెంపొందించుకుంటున్నారు
3) నగర సమాజంలో వ్యక్తి అంతస్థును విద్య, ఆదాయం లాంటి అంశాలు ప్రభావితం చేస్తున్నాయి
4) పైవన్నీ
14. కింది వాటిలో ప్రాథమిక సమూహాన్ని గుర్తించండి.
ఎ) కుటుంబం బి) విద్యార్థుల సమూహం
సి) ప్రేక్షకులు డి) ట్రేడ్ యూనియన్ సమూహాలు
1) ఎ, బి 2) బి, సి
3) పైవన్నీ 4) ఎ, డి సరైనవి
15. భారతీయ సమాజం విశిష్ట లక్షణం కానిదేది?
1) జాతిరూప సామాజిక స్తరీకరణ
2) మత, భాషా వైవిద్యం
3) భౌగోళిక వైవిద్యం 4) భిన్నత్వంలో ఏకత్వం
16. భారతదేశ సమాజంలో వ్యక్తులకు కులం ద్వారా పుట్టుకతోనే అపాదించబడిన అంతస్థును ఏమంటారు?
1) ఆపాదిత అంతస్థు 2) సాధించిన అంతస్థు
3) సాధారణ అంతస్థు 4) సమగ్రమైన అంతస్థు
17. దేశంలో సామాజిక స్తరీకరణకు ప్రధాన కారణం?
1) మత వ్యవస్థ 2) ఆదాయాల్లో అసమానతలు
3) కుల వ్యవస్థ 4) కుటుంబ వ్యవస్థ
18. మానవ సమాజంలో స్తరీకరణకు కారణంకాని అంశం?
1) కులం 2) మతం
3) సామాజిక వర్గాలు 4) సంస్థానాలు
19. కులం అనే పదం ఆవిర్భావానికి సంబంధించి మొదట వివరణ ఇచ్చిందెవరు?
1) మజుందార్ 2) ఐరావతి కార్వే
3) కేట్కర్ 4) మదన్
20. సమాజంలోని సమూహాలను వివిధ అసమాన హోదాలుగల సమూహాలుగా విభజించే ప్రక్రియ?
1) సామాజిక స్తరీకరణ 2) సామాజిక విభేదీకరణ
3) సామాజిక అసమానత 4) సామాజిక గతిశీలత
21. కుల వ్యవస్థకు సంబంధించి సరైనదాన్ని గుర్తించండి.
ఎ) పుట్టుకతోనే వారసత్వంగా వస్తుంది
బి) సామాజిక గతిశీలతకు అవకాశం లేకుండా చేస్తుంది
సి) అంతర్వివాహ నియమాన్ని పాటిస్తుంది
డి) శుచి, అశుచి అనే భావనలను కలిగి ఉంటుంది
1) ఎ, సి 2) ఎ, సి, డి
3) పైవన్నీ సరైనవి 4) ఎ, డి
22. క్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా అనే గ్రంథంలో కులానికి సంబంధించి 6 సంప్రదాయ లక్షణాలను తెలిపిందెవరు?
1) డీఎస్ గార్వే 2) క్రోబర్
3) ప్రభు 4) ఏఆర్ దేశాయ్
23. కులం అనేది తీసివేయలేనిది, మార్చలేనిది, పంపిణీ చేయలేనిది ఎందుకు?
ఎ) వారసత్వ లక్షణం వల్ల
బి) ప్రతి కులం తనకంటూ కుల ప్రతిష్టను, కులాచారాలను కలిగి ఉండటం వల్ల
సి) అంతర్వివాహం పాటించడం వల్ల
డి) పవిత్రత – అపవిత్రత అనే భావనల వల్ల
1) ఎ, బి 2) సి, డి
3) బి, డి 4) పైవన్నీ సరైనవి
24. ఖాప్ అంటే?
1) కుల పంచాయితీ 2) కుల సంఘం
3) కుల సమూహం 4) కుల వ్యవస్థ
25. కింది వాటిలో కులానికి సంబంధించిన వికార్యం ఏది?
1) వృత్తి నిర్ణయం 2) సాంఘిక భద్రత
3) సంస్కృతి ప్రసరణం 4) స్తరీకరణ
26. భారతీయ సామాజిక నిర్మాణంలోని ఏ భాగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వస్తుమార్పిడికి కారణమైంది?
1) వ్యవసాయ సముదాయం 2) కుల సముదాయం
3) నగర సముదాయం 4) వర్గ సముదాయం
27. ఎవరి పాలనా కాలంలో ముస్లింలలో హిందువుల కులాలను పోలిన అష్రాఫ్స్, అజ్రాఫాస్ అనే స్తరీకరణ ప్రారంభమైంది?
1) ఢిల్లీ సుల్తాన్లు 2) నిజాం షాహీలు
3) ఆదిల్ షాహీలు 4) మొఘలులు
28. హిందూ సామాజిక వ్యవస్థలోగల వర్ణ వ్యవస్థను పోలిన స్తరీకరణ ఇస్లాంలో కూడా ఉందని ఉదహరించిందెవరు?
1) నజ్మల్ కరీమ్ 2) ముల్లా ఒమర్
3) షేక్ లతీఫ్ 4) సాజిద్‌ఖాన్
29. ఇస్లాంలోని ఏ వర్గం వారిని బ్రాహ్మణులతో పోలుస్తారు?
1) మొఘల్లు 2) పఠాన్లు
3) సయ్యద్‌లు 4) ఎవరూ కాదు
30. దేశంలో అంటరానితనాన్ని మొదట ఎప్పుడు నిషేధించారు?
1) 1950 2) 1851 3) 1955 4) 1954
31. కింది వాటిని సరిగా జతపర్చండి. (3)
ఎ) దైవ సిద్ధాంతం 1) రిస్లే
బి) జాతి సిద్ధాంతం 2) పురుష సూక్తం
సి) భౌగోళిక సిద్ధాంతం 3) డేంజిల్, ఇబ్బెస్టన్
డి) పరిణామ సిద్ధాంతం 4) గిల్బర్ట్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-2, బి-1, సి-4, డి-3
4) ఎ-2, బి-3, సి-1, డి-4
32. కులం ఆవిర్భావానికి సంబంధించి సాంస్కృతిక, సమీకృత సిద్ధాంతాన్ని తెలిపిందెవరు?
1) డేంజిల్ 2) శరత్చంద్రరాయ్
3) హట్టన్ 4) నెస్‌ఫీల్డ్
33. సోషల్ చేంజ్ ఇన్ మోడ్రన్ ఇండియా గ్రంథ రచయిత?
1) కుప్పు స్వామి 2) ఎంఎన్ శ్రీనివాస్
3) మజుందార్ 4) యోగీందర్సింగ్
34. నిమ్న కులాలుగా భావించబడుతున్నవారు ఉమ్మడి ఉన్నత కులాలకు చెందిన సంస్కారాలను పాటించడాన్ని MN శ్రీనివాస్ ఏమని పిలిచారు?
1) ఆధునీకరణ 2) సంస్కృతీకరణ
3) పాశ్చాత్యీకరణ
4) కులీనీకరణ
35. కింది వాటిని సరిగా జతపర్చండి.
1) యాంటిలేషన్ ఆఫ్ క్యాస్ట్ ఎ) రజనీ కొఠారీ
2) హిందూ సోషల్ ఆర్గనైజేషన్ బి) ప్రభు
3) హిస్టరీ ఆఫ్ క్యాస్ట్ ఇన్ ఇండియా సి) కేట్కర్
4) క్యాస్ట్ ఇన్ ఇండియన్ పాలసీస్ డి) అంబేద్కర్
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
4) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
36. ఫెమిలియా అంటే?
1) కుటుంబం 2) సేవకులు
3) కుటుంబం + బంధువులు
4) కుటుంబం + సేవకులు
37. వ్యక్తుల సామూహీకరణలోముఖ్యపాత్ర పోషించేది?
1) కుటుంబం 2) వివాహం 3) బంధుత్వం 4) మతం
38. కుటుంబాన్ని రేఖాచిత్రం ద్వారా వివరించినవారు?
1) మోర్గాన్ 2) రేమండ్ పెర్త్
3) బర్జెస్ 4) మెకైమర్
39. సరైన క్రమంలో ఉన్న వాటిని గుర్తించండి.
1) బృంద వివాహం – స్వైరత్వం – బహు వివాహం – ఏక వివాహం
2) స్వైరత్వం – బహు వివాహం – బృంద వివాహం – ఏక వివాహం
3) బహు వివాహం – స్వైరత్వం – ఏక వివాహం – బృంద వివాహం
4) స్వైరత్వం – బృంద వివాహం – బహు వివాహం – ఏక వివాహం
40. కుటుంబాన్ని సమగ్రంగా నిర్వచించినది ఎవరు?
1) లీచ్ 2) మెండిల్ 3) బర్జెస్ 4) కార్వే
41. కుటుంబానికి సంబంధించి సరికాని వ్యాఖ్య?
ఎ) మెకైవర్, ఫెడ్‌లు కుటుంబానికి గల 8 లక్షణాలను తెలిపారు
బి) స్టీవెన్సన్.. కుటుంబానికి సంబంధించి 4 ప్రమాణాలను తెలిపారు
సి) 1955 తర్వాత వచ్చిన కుటుంబ నిర్వచనాలను సమగ్ర నిర్వచనాలంటారు
డి) కుటుంబం ఫెములస్ అనే రోమన్ పదం నుంచి వచ్చింది
1) ఎ, బి 2) ఎ, బి, సి 3) పైవన్నీ 4) ఎ, డి
42. మకైవర్ ప్రకారం కింది వాటిలో దేన్ని కుటుంబ ప్రాథమిక విధిగా పరిగణించవచ్చు?
1) వాత్సల్య కార్యక్రమాలు 2) విద్యా కార్యక్రమాలు
3) వినోద కార్యక్రమాలు 4) పైవన్నీ
43. కింది వాటిలో సరైనదాన్ని గుర్తించండి.
ఎ) కింగ్స్లే డేవిస్ 4 కుటుంబ విధులను తెలిపారు
బి) అగ్బర్న్, నియ్ఖాఫ్ 6 విధులను తెలిపారు
సి) మకైవర్ కుటుంబ ప్రకార్యాలను రెండు రకాలుగా తెలిపారు
డి) టాల్కాట్ పర్సన్ 2 మానసిక విధులను తెలిపారు
1) ఎ, డి 2) సి, డి 3) పైవన్నీ 4) ఎ, సి, డి
44. నియోలోకల్ కుటుంబాలు ఏర్పడటానికి కారణం?
ఎ) వలసలు బి) వైయుక్తిత పెరగడం
సి) ఉన్నత విద్య డి) సంస్కృతీకరణం
1) ఎ, బి 2) బి, సి 3) ఎ, డి 4) పైవన్నీ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు