భారత్‌లో మహిళల స్థితిగతులు చట్టాలు
భారతీయ సమాజం మహిళను ఆకాశంలో సగం అన్నట్లుగా పురుషునితో సమానంగా వర్ణించింది. కానీ ఆచరణలో మహిళపై అడుగడుగునా ఆంక్షలు విధించింది. మహిళను అనాదిగా ఇంటికే పరిమితం చేసి అబలగా చిత్రించింది. నేటి ఆధునిక కాలంలో కూడా ఆ వివక్ష కొనసాగుతూనే ఉంది. ఇంత సామాజిక నిర్భందంలోనూ ఎంతోమంది మహిళా మేధావులు తమ ఉనికిని గొప్పగా చాటారు. పురుషునితో పోల్చితే మహిళ ఎందులోనూ తక్కువ కాదని నిరూపించారు. కానీ పురుషాధిక్య సమాజంలో అంత త్వరగా మార్పు లేదు. గృహ హింస, దాడులు, అణచివేత కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితి నుంచి మహిళకు చట్టపరమైన రక్షణ కల్పించేందుకు ప్రభుత్వాలు అనేక చట్టాలు చేశాయి. ఈ నేపథ్యంలో దేశంలో మహిళల స్థితిగతులు, వారి రక్షణకు చేసిన చట్టాలు, వాటి ఫలితాల గురించి నిపుణ పాఠకుల కోసం ప్రత్యేకం..
లింగపరమైన స్తరీకరణ: మానవ సమాజం మొదటగా స్త్రీలు, పురుషులు అని స్తరీకరించబడింది. అందుకే ఇయాన్ రాబర్ట్సన్ కులాలు, వర్గాలు, వర్ణాల కంటే ముందు మగవారికి ఉన్నత స్థానాన్ని, స్త్రీలకు సమాజంలో రెండో స్థానం ఇచ్చారని గమనించవచ్చు.
-ఈ లింగపరమైన స్తరీకరణ ఒక తరం నుంచి మరొక తరానికి సంస్కృతిలో భాగంగా అందించబడుతుంది.
-ఇందులో ప్రధాన కారణాలు లింగపరమైన పాక్షిక అభిప్రాయాలు
NJ స్మెల్సర్ అభిప్రాయంలో
1.జైవికపరమైన తేడాలు
2. లింగపరమైన గుర్తింపు
3. లింగపరమైన ఆదర్శాలు
4.లింగపరమైన పాత్రలు పాటించడాన్ని బట్టి లింగపరమైన స్తరీకరణ చోటు చేసుకున్నదని అభిప్రాయపడ్డారు.
లింగపరమైన శ్రమ విభజన
సమాజంలో పురుషులు మాత్రమే చేయాల్సిన పనులని, స్త్రీలు మాత్రమే చేయాల్సిన పనులని, లింగం ఆధారంగా సామాజిక పాత్రలు, బాధ్యతలు విభజించడం.
తక్కువ శ్రమ, తక్కువ విలువ, గృహసంబధ శ్రమను స్త్రీలకు ఆపాదించి సమాజంలో రెండో స్థానం పొందటానికి కారణమైంది.
రిచర్డ్ ఫ్లెక్స్నర్ ప్రకారం లింగతత్వం అంటే (Sexism) ఒక లింగం వారికంటే మరొక లింగంవారు అధికమయ్యేటువంటి పాక్షిక భావనలు, గుడ్డి నమ్మకాలు, విచక్షణ పూరిత వైకరులు.
లైంగికత, లింగం (Sex and Gender) అనేవి వేర్వేరు అంశాలు, లైంగికత అనేది ఎటువంటి సామాజిక, చారిత్రక పరిస్థితుల్లోనైనా మార్పు చెందదు. దానికి సంబంధించి నిర్వహించే పాత్రలు మారవు. కానీ Gender అంటే Sex ఆధారంగా ఆయా స్త్రీ, పురుషులు అనుసరించాల్సిన సామాజిక, సాంస్కృతిక పాత్రలను తెలుపుతుంది.
Feminist – స్త్రీవాదులు
Gynofobia – స్త్రీలంటే భయం
మిసోగని అంటే స్త్రీల పట్ల తగని ద్వేషం
ఫిలోగని అంటే పురుషుల పట్ల తగని ద్వేషం
భారతీయ సమాజంలో స్త్రీల స్థానం
వేదకాలంలో స్త్రీ-పురుషుల మధ్య అసమానతలు లేవు
స్త్రీల పట్ల విభిన్న వైఖరిని ప్రదర్శించినవాడు మనువు
స్త్రీలకు విద్య అవకాశాలున్నాయి. బాల్య వివాహాలు లేవు, స్త్రీలకు కూడా బ్రహ్మచర్య ఆశ్రయం, ఉపనయన సంస్కారం కూడా ఉంది.
స్వయం వరాలు, గాంధర్వ వివాహాలున్నాయి.
బహుభార్యత్వం కేవలం ఉన్నతవర్గాల వారికే పరిమితం.
రుషులతో పాటు రుషీమణులు కూడా ఉన్నారు.
వితంతు వివాహాలను వియోగ అనే పద్ధతిలో పాటించేవారు.
వరకట్నాలు లేవు.
కుటుంబమే ఉత్పత్తి కేంద్రం కనుక స్త్రీలు పురుషులతో సమానంగా ఉత్పత్తిలో పాలు పంచుకొనేవారు.
స్త్రీలకు వారసత్వ హక్కులు లేవు. కానీ స్త్రీధనంపై పూర్తి హక్కులు కలవు.
వేదానంతర కాలంలో స్త్రీల స్థాయి
ఆదర్శ స్త్రీ లక్షణాలు చిత్రించబడినవి ఉదా.. రామాయణంలో సీత
పురాణాలు, ఇతిహాసాల ప్రాధాన్యంతో స్త్రీల స్థాయి, స్వేచ్ఛ హరించిపోయాయి.
తొలి, మధ్య యుగాల నుంచి విదేశీ సంస్కృతులతో సమ్మేళనం, భూస్వామ్య లక్షణాలు, వేదాలకు వక్రభాష్యం వంటి కారణాలవల్ల సతి ఆచారం, పరదాపద్ధతి, బహుభార్యత్వం లాంటివి ప్రారంభమయ్యాయి. ఇందుకు ఆర్యులకు, అనార్యులకు మధ్య జరిగిన వివాహాలు, ప్రతిలోమ వివాహాలు, బ్రాహ్మణ భావజాలం కూడా కారణాలుగా పనిచేశాయి.
మధ్యయుగంలో జైన, బౌద్దం బలహీనపడటంతో రాజపుత్రులు, ఇస్లాం రాజ్యాల విస్తరణ జరగడంతో స్త్రీల స్థాయి వారి వారి సాంస్కృతిక విధానాలకు అడుగడుగునా దిగజారుతూ వచ్చింది.
లింగ అసమానత సూచికలు – భారత్
Global Gender Gap Index – 2014
World Economic Forum రూపొందించిన ఈ సూచికలో భారత్ 114వ స్థానంలో నిలిచింది. ఈ సూచిక ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థలో లింగపరమైన దూరానికి సంబంధించి భారత్ స్కోర్ – 0.6455
యూఎన్డీపీ వారు రూపొందించిన Gender Related Development India (GDI) – 2013లో భారత్ స్థానం 132
స్టొవేనియా మొదటి స్థానంలో ఉంది.
UNDP వారు రూపొందించిన Gender Inquality India (GII) – 2013లో భారత్ స్థానం 127.
మధ్యతరగతులు
భారత జాతీయవాది అరవింద్‌ఘోష్ మొదటిసారిగా 1893లో భారతదేశంలో ఉద్భవించిన నూతన సామాజిక వర్గాన్ని మధ్యతరగతి వర్గం అని పిలిచారు.
ఈ సామాజిక వర్గం ఏర్పడటానికి కారణాలు..
1. పరిశ్రమల ఏర్పాటుతో కులవృత్తులతో, భూ సంపదతో సంబంధం లేకుండా సంపద, హోదాని పొందే అవకాశాలు రావడం.
2. బ్రిటిష్ వారు తమ పరిపాలనలో భాగంగా ఎంపిక చేసుకున్న భారతీయ అధికారగణం.
3. లార్డ్ మెకాలే విద్యావిధానంతో ఆధునిక విద్య, వృత్తి విద్య అభ్యసించి ఉద్భవించిన నూతన భారతీయ మేధావి వర్గం.
2 ఇలా పై కారణాలతో మొదటిసారి భారతీయ సమాజంలో సామాజిక సంబంధం లేని (వర్ణం, కులం) ఆర్థిక హోదా, నైపుణ్యాలు, వృత్తి వర్గాలు ఏర్పడ్డాయి.
గృహహింస నిరోధక చట్టం..
గృహంలో చిన్న పిల్లలకు సంబంధించిన హింసా చర్యలకు కూడా వర్తిస్తుంది.
దేశంలో మొదటిసారిగా ఈ చట్టం గృహ హింసను సమగ్రంగా నిర్వచించింది.
కింది అంశాలన్నీ గృహ హింస పరిధిలో వస్తాయి.
వరకట్నాన్ని డిమాండ్ చేయడం. (అదనపు కట్నం)
మానసిక, శారీరక, లైంగిక, మౌఖిక పరమైన ఇబ్బందులకు గురిచేసే చర్యలు.
భార్యను కొట్టడం, శారీరకంగా హింసించడం.
చట్టాన్ని అతిక్రమించినవారికి ఏడాది వరకు జైలుశిక్ష, రూ. 20 వేల వరకు జరిమానా.
ఈ చట్టం కింద జిల్లా స్థాయిలో ప్రొటెక్షన్ ఆఫీసర్ నియామకం జరుగుతుంది. వారు బాధితురాలికి అవసరమైన న్యాయ, పునరావాస, నివాసపరమైన అంశాల్లో మార్గదర్శకత్వాన్ని అందించాలి.
ఈ చట్టం కింద బాధిత మహిళలకు షెల్టర్ హోమ్స్, గృహహింస కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పనిచేసే చోట లైంగిక వేధింపుల చట్టం – 2013
(prevention of sexual Harrasment of Women at Work Place Act – 2013)
మహిళలు పనిచేసే చోట లైంగిక వేధింపులను నిరోధించడం, నియంత్రించడం, మహిళలపై వేధింపులకు సంబంధించిన సమస్యలను సత్వరమే పరిష్కరించడం కోసం 2013లో ఈ చట్టాన్ని రూపొందించారు.
2013 డిసెంబర్ 9 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది.
స్వేచ్ఛగా జీవించే హక్కు, Convention on The Elimination of all Forms of Descrimination Against Women (CEDW) – 1979 ని ప్రపంచవ్యాప్తంగా ఆమోదించారు. ఈ కన్వెన్షన్‌పై 1993 జూన్ 25న భారత్ సంతకం చేసింది. దీనికి కొనసాగింపుగానే పనిచేసే చోట లైంగిక వేధింపుల చట్టాన్ని తీసుకొనివచ్చింది.
ఈ చట్టం దేశీయంగా ఇళ్లలో పనులుచేసే మహిళలకు (Domestic Women Workers), ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే మహిళలకు, కాంట్రాక్టు మహిళా కార్మికులకు, ఒప్పంద మహిళా కార్మికులకు, మహిళా శిక్షకులకు (Trainies, Arenties, Probationers, Project workers) వర్తిస్తుంది.
సెక్షన్- 4 ప్రకారం 10 మంది కంటే ఎక్కువ మంది మహిళలు పనిచేస్తున్న చోట వారికి ఉద్యోగాన్ని ఇచ్చిన ఎంప్లాయర్ తప్పకుండా ఇంటర్నల్ కైంప్లెంట్ కమిటీ (ICC) ని ఏర్పాటు చేయాలి.
ఆ సంస్థకు చెందిన సీనియర్ మహిళని విచారణ అధికారిగా, ఇద్దరు ఇతర ఉద్యోగులను, స్వచ్ఛంద సంస్థలకు చెందిన ఒక ప్రతినిధిని కలిపి internal complaint committee (ICC) ని ఏర్పాటు చేయాలి.
వచ్చిన కైంప్లెంట్స్‌పై 90 రోజుల్లో విచారణ పూర్తయ్యేలా కమిటీ చర్యలు చేపట్టాలి.
నమోదైన కేసులకు సంబంధించి సంస్థలోని ఏ ఉద్యోగికి అయినా నోటీసులు ఇచ్చి విచారణకు హాజరుకావాల్సిందిగా ఆజ్ఞ జారీచేయవచ్చు.
కేసుకు సంబంధించి ఏవిధమైన డాక్యుమెంట్‌ను అయినా సంస్థ నుంచి కోరవచ్చు.
సెక్షన్ – 6 ప్రకారం లోకల్ కైంప్లెంట్ కమిటీని ఏర్పాటు చేయాలి. వీరు 10 మంది కంటే తక్కువ మహిళలు పనిచేస్తున్న సంస్థలకు సంబంధించిన కేసులను విచారిస్తారు.
డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ లేదా కలెక్టర్ Local Complaint Committee (LCC)ని నియమిస్తారు.
లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం – 1994
1996 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది.
ఈ చట్టం ప్రకారం లింగ నిర్ధారణ చేయడం నిషేధం.
చట్టాన్ని అతిక్రమించిన వారికి మూడేండ్ల జైలుశిక్ష, రూ. 10 వేల జరిమానా.
రెండో సారి నేరానికి పాల్పడితే ఐదేండ్ల జైలుశిక్ష, రూ. 50 వేల జరిమానా.
దేశంలో లింగ నిష్పత్తి తగ్గడానికి లింగనిర్ధారణ పరీక్షలు ప్రధాన కారణం.
లింగ నిర్ధారణ పరీక్షా యంత్రాలను క్రమబద్ధం చేసింది.
నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ (NCW)
జాతీయ మహిళా కమిషన్ చట్టం – 1990 కింద 1992 జనవరి 31న ఏర్పడింది.
ఐదుగురు సభ్యులు, ఒక చైర్మన్, ఒక కార్యదర్శి (ఆరుగురు సభ్యులు + ఒక కార్యదర్శి) ఉంటారు.
మొదటి చైర్మన్ – జయంతీ పట్నాయక్.
7వ చైర్మన్ – మమతా శర్మ.
ప్రస్తుత, 8వ చైర్మన్ – లలితా కుమార మంగళం.
గిరిజా వ్యాస్ రెండుసార్లు చైర్మన్‌గా వ్యవహరించారు.
NCW చైర్మన్ పదవీకాలం మూడేండ్లు.
నిర్భయ చట్టం – 2013
2012 డిసెంబర్ 16న ఢిల్లీలో మెడికల్ విద్యార్థినిపై అత్యాచారం, హత్య నేపథ్యంలో ఈ చట్టం ఏర్పాటైంది.
ఈ చట్టం అసలు పేరు సవరించిన నేర న్యాయ చట్టం – 2013.
2013 ఏప్రిల్ 3 నుంచి అమల్లోకి వచ్చింది.
ఈ చట్టం ద్వారా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ – 1973, భారతీయ సాక్ష్యాధారాల చట్టం – 1872, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ – 2012, భారతీయ శిక్షాస్మృతి చట్టం – 1860లో అవసరమైన మార్పులు చేశారు.
జేజే వర్మ చైర్మన్‌గా, లీలాసేథ్, గోపాలస్వామి సభ్యులుగా ఏర్పాటు చేసిన కమిషన్ సూచనల మేరకు ఈ చట్టాన్ని రూపొందించారు.
రూ. 1000 కోట్లతో నిర్భయ నిధిని ఏర్పాటు చేశారు.
యాసిడ్ దాడి చేసిన వారికి పదేండ్ల జైలుశిక్ష, జరిమానా.
యాసిడ్ దాడివల్ల మరణిస్తే దోషికి జీవిత ఖైదు.
లైంగిక వేధింపులకు పాల్పడితే ఐదేండ్ల జైలుశిక్ష.
స్త్రీల అక్రమ రవాణాకు పాల్పడితే యావజ్జీవ కారాగారం.
18 ఏండ్లు నిండని బాలికతో అంగీకారంతో కూడిన లైంగిక చర్య కూడా నేరమే.
అత్యాచారంతోపాటు బాధితురాలి అంగవైకల్యానికి కారణమైతే 20 ఏండ్ల నుంచి చనిపోయే వరకు జైలుశిక్ష.
నిర్భయ చట్టం కింద తొలి తీర్పు వరంగల్ జిల్లాలో వెలువడింది.
నికిల్ దోవల్ అనే వ్యక్తి యాసిడ్ దాడులపై 2013లో లాస్ట్ వర్డ్ అనే గ్రంథం రాశారు.
యాసిడ్ దాడులపై మార్గదర్శకాలను విడుదల చేయాలని జస్టిస్ లోథా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు.
అలోక్ దీక్షిత్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో స్టాప్ యాసిడ్ ఎటాక్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
నిర్భయ ఘటన 2012 డిసెంబర్ 16న జరిగింది.
25 నవంబర్‌ను ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వయొలెన్స్ అగెనెస్ట్ ఉమెన్‌గా జరుపుకుంటారు.
తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ను 2014 నవంబర్ 25న ఏర్పాటు చేసింది.
షీ ట్యాక్సీ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
మహిళలపై హింసను నిరోధించడానికి ఉమెన్ హెల్ప్ లైన్ ప్రవేశపెట్టారు.
మహిళలపై హింసనేరాల తీవ్రత (2014)
దేశవ్యాప్తంగా మహిళలపై జరిగిన నేరాల సంఖ్య- 3,37,922 (2013లో 3,09,546)- 9.2 శాతం పెరుగుదల
మొత్తం కేసుల్లో 11.4 శాతంతో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో పశ్చిమబెంగాల్ ఉంది.
నేరాల రేటు విషయంలో 169.1తో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. రాష్ర్టాల పరంగా 123.4తో అసోం మొదటి స్థానంలో ఉంది. తెలంగాణలో నేరాల రేటు 79 (1 లక్షకు) దేశ వ్యాప్తంగా ఆరో స్థానంలో ఉంది.
జాతీయ స్థాయిలో మహిళల పట్ల నేరాల రేటు 56.3గా ఉంది.
1,22,877 (1,18,866) కేసులు భర్త, వారి బంధువుల హింసల వల్ల ఏర్పడ్డాయి.
13 మంది బాలికల దిగుమతి కేసులు నమోదయ్యాయి.
8,455 (8083) వరకట్న చావులు నమోదయ్యాయి.
57,311 (51,881) అపహరణ, బలవంతపు అపహరణ కేసులు నమోదయ్యాయి.
3,734 ఆత్మహత్య ప్రేరేపిత కేసులు నమోదయ్యాయి.
సతీసహగమన నిరోధక చట్టం కింద ఒక్క కేసు కూడా నమోదుకాలేదు.
426 గృహహింస కేసులు నమోదయ్యాయి.
స్త్రీల అక్రమ రవాణాకు సంబంధించి 2070 కేసులు నమోదయ్యాయి.
మహిళల అసభ్య చిత్రీకరణ కేసులు 47 (362), అత్యధిక శాతం తరుగుదల నమోదైన కేసులు (-87 శాతం), అత్యధిక శాతం పెరుగుదల నమోదైన కేసులు దౌర్జన్యంగా స్త్రీలను అవమానపరిచే సంఘటనలకు సంబంధించినవి. ఈ కేసుల్లో 16.3 శాతం పెరుగుదల నమోదయింది.
2010-14 వరకు 58 శాతం నేరాలు పెరిగాయి.
మానభంగాలు
మొత్తం సంఘటనలు 36,735 (33,707)
2013-14 నాటికి 9 శాతం పెరిగాయి.
మధ్యప్రదేశ్ 14 శాతంతో మొదటి స్థానంలో ఉండగా, ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో ఉంది.
మానభంగాల రేటులో మిజోరం 23.7తో మొదటి స్థానంలో ఉంది, 23.2తో ఢిల్లీ రెండో స్థానంలో నిలిచింది.
86 శాతం సంఘటనలు తెలిసిన వ్యక్తుల వల్లే జరుగుతున్నాయి.
దేశవ్యాప్తంగా 197 కస్టోడియల్ రేప్స్ నమోదయ్యాయి.
కస్టోడియల్ కేసుల్లో ఉత్తరప్రదేశ్ (189) మొదటి స్థానంలో ఉండగా, అరుణాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
దేశవ్యాప్తంగా నమోదైన గ్యాంగ్‌రేప్‌లు 2,346. మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది.
కిడ్నాప్‌లలో మొదటి స్థానం ఉత్తరప్రదేశ్ (కిడ్నాప్‌లకు ప్రధాన కారణం వివాహం చేసుకోవడానికి)
వరకట్న చావుల్లో మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్, రెండో స్థానంలో బీహార్ ఉంది.
లైంగిక వేదింపుల కేసుల్లో ప్రథమ స్థానంలో ఉత్తర ప్రదేశ్ ఉంది.
మహిళలను అల్లరిపెట్టే కేసుల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది.
బాలికల దిగుమతిలో బీహార్ మొదటి స్థానం
ఆత్మహత్యలని ప్రేరేపించడంలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది.
వరకట్నపు కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రం బీహార్
స్త్రీల అక్రమ రవాణా కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రం తమిళనాడు, తెలంగాణ (ఐదో స్థానంలో ఉంది)
గృహహింస చట్టం కింద కేరళలో అధికంగా కేసులు నమోదవుతున్నాయి.
Child Abuse (బాలల పట్ల హింస)
2014కుగాను దేశవ్యాప్తంగా 89,423 కేసులు నమోదయ్యాయి.
క్రితం ఏడాదితో పోలిస్తే వీటి పెరుగుదుల 53.6 శాతం
బాలలపై హింసలో మొదటిస్థానం- మధ్యప్రదేశ్, రెండోస్థానం- ఉత్తరప్రదేశ్
కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఢిల్లీ మొదటిస్థానం
బాలల నేర రేటు ఢిల్లీలో అధికంగా ఉంది. రాష్ర్టాల పరంగా మధ్యప్రదేశ్‌లో అధికంగా ఉంది.
బాలల హత్య కేసుల్లో ఉత్తరప్రదేశ్ మొదటిస్థానం
శిశుహత్యల్లో మొదటిస్థానం- రాజస్థాన్
చైల్డ్ రేప్లో మొదటిస్థానం- మధ్యప్రదేశ్ (దేశవ్యాప్తంగా 13,766 సంఘటనలు జరిగాయి)
బాలికలపై లైంగిక వేధింపుల్లో మొదటిస్థానం- ఉత్తరప్రదేశ్
గర్భస్థ శిశుహత్యల్లో మొదటిస్థానం- మధ్యప్రదేశ్
బాలబాలికల కిడ్నాప్‌లో మొదటిస్థానం- ఢిల్లీ
బాల్య వివాహ కేసుల్లో మొదటిస్థానం- తమిళనాడు
బాలికల అక్రమ రవాణా కేసుల్లో మొదటిస్థానం- పశ్చిమబెంగాల్
మహిళలు- కీలకాంశాలు
జనవరి 24 – జాతీయ మహిళా దినోత్సవం.
మార్చి 8 – అంతర్జాతీయ మహిళా దినోత్సవం.
మే 15 – అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం.
2001 – మహిళా సాధికారత సంవత్సరం.
1976-1985 అంతర్జాతీయ మహిళా దశాబ్దం.
1990 – సార్క్ ఇయర్ ఆఫ్ గర్ల్ చైల్డ్.
1995 – అంతర్జాతీయ మహిళా సంవత్సరం.
అక్టోబర్ 11 – అంతర్జాతీయ బాలికా దినోత్సవం
ఫిబ్రవరి రెండో ఆదివారం – ప్రపంచ వివాహ దినోత్సవం (World Marriage Day).
1990-2000 – సార్క్ బాలికా దశాబ్దం.
2001-2010 – సార్క్ బాలికా దశాబ్దం.
ప్రస్తుతం రాజ్యసభలో ఉన్న మహిళల సంఖ్య – 31.
16వ లోక్‌సభలో ఉన్న మహిళల సంఖ్య – 66 (12.4 శాతం)
దేశంలో మహిళా ఓటర్లు – 39.5 కోట్లు.
దేశ జనాభాలో మహిళల శాతం – 49 శాతం.
మహిళలు – ముఖ్యమైన జనాభా గణాంకాలు
2011 ప్రకారం లింగ నిష్పత్తి – 943
గ్రామీణ ప్రాంతాల్లో లింగ నిష్పత్తి – 949
పట్టణ ప్రాంతాల్లో లింగ నిష్పత్తి – 929
0-6 ఏండ్ల లోపు పిల్లల్లో లింగ నిష్పత్తి – 919 (గ్రామీణ ప్రాంతాల్లో 923)
దేశంలో మహిళా అక్షరాస్యత – 64.64 శాతం.
గ్రామీణ ప్రాంతాల్లో మహిళా అక్షరాస్యత- 57.93 శాతం.
పట్టణ ప్రాంతాల్లో మహిళా అక్షరాస్యత – 79.11 శాతం.
ప్రపంచంలో లింగ నిష్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశం- రష్యా.
దేశంలో లింగ నిష్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం- కేరళ.
దేశంలో లింగ నిష్పత్తిలో చివరి స్థానంలో ఉన్న రాష్ట్రం- హర్యానా.
లింగ నిష్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతం – పుదుచ్చేరి.
లింగ నిష్పత్తిలో చివరి స్థానంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతం- డామన్ డయ్యూ.
తెలంగాణలో మహిళల స్థితి
స్త్రీలలో అక్షరాస్యత – 57.92 శాతం
లింగ నిష్పత్తిలో మొదటి జిల్లా – ఆదిలాబాద్, నిజామాబాద్, చివరిది – హైదరాబాద్
లింగ నిష్పత్తి – 988. ( గ్రామీణ ప్రాంతాల్లో – 999)
0-6 ఏండ్ల లోపు పిల్లల్లో లింగ నిష్పత్తి – 933.
ఆరోగ్యం
భారతదేశంలో మాతృ మరణాలు – 178 (1 లక్షకు)
సంతాన సాఫల్యత రేటు – 2.4
శిశు మరణాల రేటు – 42 (ప్రతి 1000 మంది శిశువులకి)
ఐదేండ్లలోపు బాల్య మరణాలు : 59
శిశు మరణాల రేటు – 43
అత్యధికంగా బాల్య వివాహాలు-నల్లగొండ జిల్లా
2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 18.92 లక్షల మంది బాలికలు ఉన్నారు.
బాలికల లింగ నిష్పత్తి : 1000కి 933
ఎస్టీల్లో లింగ నిష్పత్తి : 906/1000
తెలంగాణలో శిశు మరణాల రేటు : 39/1000
తెలంగాణలో మాతృ మరణాల రేటు లక్షకు 92
Total Fertility Rate (TFR) – 1.8
Child Sex Ratio అధికంగా ఉన్న జిల్లా – ఖమ్మం (958)
CSR అత్యల్పంగా ఉన్న జిల్లా – హైదరాబాద్ (914)
తెలంగాణలో 0-6 వయస్సు మధ్య ఉన్న వారి సంఖ్య – 39,20,418. వీరిలో 20,28,497 మంది బాలురు, 18,91,931 మంది బాలికలు
0-6 ఏండ్ల వయస్సు జనాభా అధికంగా ఉన్న జిల్లా : రంగారెడ్డి
20.78 శాతం బాలురు, 20.96 శాతం బాలికలు 1-5వ తరగతి మధ్య బడి మానేస్తున్నారు.
30.58 శాతం బాలికలు 1-7వ తరగతి మధ్య బడి మానేస్తున్నారు.
38.85 శాతం బాలికలు 1-10 తరగతుల మధ్య బడి మానేస్తున్నారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు