బాలల హక్కులు ఇవీ..!
1948 డిసెంబర్ 10న యూఎన్ఓ జనరల్ అసెంబ్లీ విశ్వమానవ హక్కుల ప్రకటన చేసిన తర్వాత 1959లో బాలలకు ప్రాధాన్యమిస్తూ యూఎన్ఓ బాలల హక్కుల ప్రకటన చేసింది. ప్రకటనలో 10 అంశాలు పొందుపర్చా యి. ఇవి సరిగా అమలుకాకపోవడంతో 20-11-1989 న యూఎన్ఓ బాలల హక్కుల ఒడంబడికను ఆమోదిస్తూ 180 దేశాలు తీర్మానం చేశాయి. అందుకే నవంబర్ 20ని అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవంగా జరుపుకొంటారు.
-భారత రాజ్యాంగంలో బాలలకు సంబంధించిన కొన్ని నిబంధనలు కిందివిధంగా ఉన్నాయి.
1. Art 15 (3) : రాజ్యం స్త్రీలు, పిల్లల సంక్షేమానికి సంబంధించి ప్రత్యేకమైన నిబంధనలు రూపొందించవచ్చు.
2. Art 21(A) : 6 నుంచి 14 సంవత్సరాలు కలిగిన బాలబాలికలకు ప్రభుత్వం నిర్బంధ ప్రాథమిక ఉచిత విద్యను అందించాలి. భారత రాజ్యాంగంలో Art 45లో బాలలకు నిర్బంధ ఉచిత విద్యను అందించాలని పేర్కొంది. దీనిని అమలు చేయడానికి 2002లో 86వ రాజ్యాంగ సవరణలో 6-14 సంవత్సరాలలోపు బాలబాలికలకు నిర్బంధ ఉచిత విద్యను అందించాలని నిర్ణయించారు. ఈ అంశాన్ని Art 21-A గా పేర్కొన్నారు. అంటే నిర్బంధ ప్రాథమిక విద్య ప్రస్తుతం ప్రాథమిక హక్కు
3. Art 24 : ఫ్యాక్టరీలు, గనుల్లోనూ 14 సంవత్సరాల వయసులోపు పిల్లలతో పని చేయించరాదు
4. Art 23 (1) : శ్రమశక్తిని దోచుకోవడం, మనుషులతో క్రయవిక్రయాలు జరపడం, పనిచేయించుకొని ప్రతిఫలం ఇవ్వకపోతే శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు.
5. Art 39(E) : బాలలు గత్యంతర లేని పరిస్థితుల్లో వారు తమ శక్తికి మించి పనిచేస్తుంటారు. ఇలాంటివి ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రోత్సహించరాదు.
6. Art 39-(F) : బాల్యం, యవ్వనం దోపిడీకి గురికాకుండా ఉండాలి. బాలల కోసం గౌరవప్రదమైన స్వేచ్ఛాయుత పరిస్థితుల్ని, వివిధ సౌకర్యాల్ని కల్పించి వారి అభివృద్ధికి కృషి చేయాలి.
7. Art 45 : 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలకు ప్రభుత్వం నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యనందించాలి.
8. Art 51A(K): 6 నుంచి 14 ఏండ్లలోపు బాలబాలికలకు విద్యావకాశాలు కల్పించడం తల్లిదండ్రుల బాధ్యత. (ఈ అంశాన్ని 86వ రాజ్యాంగ సవరణ 2002లో ప్రాథమిక విధుల్లో చేర్చారు)
9. Art 350-A : భాషా పరమైన మైనార్టీల బాలలకు ప్రాథమిక విద్యను మాతృభాషలోకి అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన సౌకర్యాలు కల్పించాలి.
బాలల సంక్షేమానికి పార్లమెంట్ చట్టాలు
1. 6 నుంచి 14 ఏండ్లలోపు బాలబాలికలకు నిర్బంధ ప్రాథమిక ఉచిత విద్యను అందించడానికి 2009లో భారత పార్లమెంట్ చట్టం చేసింది. 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా Art 21 (A) గుర్తించింది.
2. జువైనల్ జస్టిస్ చట్టం – 2000: బాల నేరస్తుల రక్షణ, బాగోగులు చూడటం ఈ చట్టం ప్రధాన లక్ష్యం.
3. బాలకార్మికులు నిషేధ చట్టం – 1986 : 14 ఏండ్లలోపు బాలబాలికల్ని ప్రమాదకరమైన ఫ్యాక్టరీలో పనిచేయించడం ఈ చట్టం నిషేధిస్తుంది.
4. న్యాయసేవల చట్టం – 1987 (Legal services authority Act – 1987) : ఈ చట్టం బాలలకు కావల్సిన న్యాయపరమైన సేవల్ని అందిస్తుంది
5. శిశు పౌష్టికాహార ఉత్పత్తి, సప్లయ్ చట్టం 1992 : శిశువులకు కావల్సిన తల్లిపాలకు ప్రత్యామ్నాయ పౌష్టికాహారం అందజేయడానికి ఉద్దేశించినది.
6. గార్డియన్స్ అండ్ వార్డ్స్ చట్టం – 1890 : బాలలకు గార్డియన్స్ కల్పిస్తున్నప్పుడు బాలల సంక్షేమం గార్డియన్స్ బాధ్యత అని ఈ చట్టం నిర్దేశిస్తుంది.
7. బాలల చట్టం – 1960 : కేంద్ర పాలిత ప్రాంతాల్లో, అనాథ బాలలు తప్పుదోవ పట్టిన బాలలు, తల్లిదండ్రులు విస్మరించిన, దుష్పప్రవర్తన ఉన్నటువంటి పిల్లల్ని సరైనమార్గంలో పెట్టడం, వారి సంక్షేమానికి, ఉన్నతికి సరైన విద్య, శిక్షణ కల్పించడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం.
8. బాలల అక్రమ రవాణా నిషేధ చట్టం – 1956: బాలికల్ని అక్రమంగా తరలించి వారితో బలవంతంగా లైంగిక కార్యకలాపాల్ని చేయించడం, బాలికల్ని అమ్మడం ఈ చట్టం ప్రకారం నేరం.
9. శిశు నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం – 1994 : గర్భస్త దశలో ఉన్న శిశువు ఆడ, మగా నిర్ధారించే స్కానింగ్ పరీక్షలు ఈ చట్టం నిషేధిస్తుంది
10. బాల్య వివాహాల నిరోధక చట్టం – 2006 : 1929లో బాల్యవివాహ నిరోధక చట్టాన్ని 2006లో రద్దు చేసి దాని స్థానంలో నూతన బాల్యవివాహ నిరోధక చట్టం – 2006 రూపొందించారు.
11. కింద పేర్కొన్న చట్టాలు బాలల్ని, ఫ్యాక్టరీలలో పనిచేయడం నిషేధిస్తున్నాయి.
-ఫ్యాక్టరీస్ చట్టం – 1948
-ప్లాంటేషన్ లేబర్ చట్టం – 1951
-మర్చంట్ షిప్పింగ్ చట్టం – 1951
-మైనింగ్ చట్టం – 1952
-మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కింగ్ చట్టం – 1961
-అప్రెంటీస్ చట్టం – 1961
-బీడీ, సిగార్స్ వర్కర్స్ చట్టం – 1966
12. కింద పేర్కొన్న మరికొన్ని చట్టాలు బాలల హక్కుల్ని సంరక్షిస్తున్నాయి. అవి
-code of criminal procedure – 1973
-Indian penal code – 1860
-Indian Divorce Act – 1869
-Family court – 1984
-Hindu Adoption@Maintanance Act- 1956
-Hindu marriage Act – 1955
-Indian succession Act – 1925
-Muslim women (protection of Rights on divorce) Act 1956
-Parsi marriage and diverce Act – 1936
-probation of offenders Act – 1958
-protection of women from domestic violence Act – 2005
-Special marriage Act – 1954
-Employees state insurance act 1948
-Bonded Labour system abolition Act – 1976
-Orphonages and others charitable homes Act – 1960
13. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ – 2005 : రాజ్యాంగం పార్లమెంట్ బాలలకు కల్పించిన ప్రత్యేక హక్కులు సక్రమంగా అమలు జరుగుతున్నాయో లేదో సమీక్షించే సంస్థ ఇది. బాలలపై జరిగే నేరాలను సత్వరం విచారించి న్యాయం అందించడానికి ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు ఈ కమిషన్ అవకాశం కల్పిస్తుంది.
14. లైంగిక నేరాల నుంచి బాలల సంరక్షణ చట్టం – 2012 (Protection of children from sexual ofference 2012 : బాలలతో లైంగిక కార్యకలాపాలకు పాల్పడేవారిని ఈ చట్టం శిక్షిస్తుంది. ఇలాంటి కేసులను సత్వర విచారణకు ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తుంది.
15. 19-2-2014న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బాలల హక్కుల పరిరక్షణ సంఘం (Childrights protection commission) ఏర్పాటుచేసింది. ఈ సంఘానికి కె.సుజాతరావు అధ్యక్షురాలు. 6 మంది సభ్యులను నియమించారు. వీరి పదవీకాలం మూడేండ్ల. సభ్యులకు గరిష్ట వయోపరిమితి 60 ఏండ్లు. చైర్పర్సన్కి 65 ఏండ్లు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు