General Science Chemistry | వృక్ష, జంతు కళేబరాలను అమ్మోనియం లవణంగా మార్చేది?
రసాయన శాస్త్రం
నైట్రోజన్ – దాని సమ్మేళనాలు
1. N2 వాయువు ద్రవంగా మారే గది ఉష్ణోగ్రత?
1) -183oC 2) -196oC
3) – 188oC 4) పైవన్నీ
2. నైట్రోజన్ ధర్మాలు కానివి?
1) పుల్లనైన వాయువు
2) నీటిలో కరగదు
3) దహనశీల వాయువు
4) పైవన్నీ
3. గాలి నుంచి నైట్రోజన్ తయారీలో ముఖ్యమైన ప్రక్రియ?
1) విద్యుత్ విశ్లేషణ
2) జలవిశ్లేషణ
3) జౌల్ థామ్సన్ ప్రభావం
4) పైవేవీ కావు
4. ప్రకృతిలో నైట్రోజన్ సమ్మేళనం కానిది ఏది?
1) NaNO3
2) NaCl
3) NH4NO3
4) KNO3
5. N2+O2 చర్యలో కావాల్సిన ఉష్ణోగ్రత?
1) 300oC 2) 3300oC
3) 3000oC 4) 400oC
6. హేబర్ విధానంలో సరైనది?
1) NH3 తయారుచేస్తారు
2) మాలిబ్డినం ఉత్ప్రేరకం
3) Fe ఉత్తేజితం
4) పైవన్నీ
7. శీతలీకరణిగా ఉపయోగించే వాయువు?
1) CO2 2) NO2
3) ద్రవ N2 4) ద్రవ O2
8. N2 + 3H2 A= ఉష్ణోగ్రత, B= పీడనం అయితే అవి వరుసగా?
1) 500oC, 200 atms
2) 450oC, 150 atms
3) 200oC, 500 atms
4) 150oC, 450 atms
9. జతపరచండి.
1. HCl ఎ. దగ్గు
2. NH3 బి. కళ్లు, కాలేయం
3. Cl2 సి. తలనొప్పి
4. P4 డి. దవడ ఎముకల నాశనం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
3) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
4) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
10. HNO3 ధర్మాల్లో సరికానిది?
1) వాస్తవానికి రంగు లేకున్నా నైట్రోజన్ డై ఆక్సైడ్ వల్ల పసుపు పచ్చరంగులో కనబడుతుంది
2) సాంద్రత 1.54 గ్రా/మీ.లీ
3) దుస్తులను నశింపజేస్తుంది
4) పైవన్నీ సరైనవే
11. బలమైన ఆమ్లం కానిది?
1) HCl 2) HNO3
3) H2SO4
4) CH3COOH
12. వేడి గాఢ HNO3, జింక్ లోహంతో చర్య జరిపితే ఏర్పడే ఉత్పన్నాలో లేనిది?
1) లోహనైట్రేట్
2) NO
3) NO2 4) 2, 3
13. చురుకైన లోహంపై సజల ఆమ్లంతో చర్య జరిపితే సాధారణంగా ఉత్పన్నం అయ్యే వాయువు?
1) H2 2) CO2
3) N2 4) O2
14. బలమైన ఆక్సీకరణి?
1) NH3 2) HNO3
3) HCL 4) H2
15. కృత్రిమ సిల్క్ రసాయన నామం?
1) సెల్యూలోజ్ ఎసిటేట్
2) సెల్యూలోజ్ నైట్రేట్
3) సెల్యూలోజ్ క్లోరైడ్
4) సెల్యూలోజ్ బ్రోమైడ్
16. HNO3లో ఏ లోహం చర్యజరిపి H2ని ఇస్తుంది?
1) Au 2) Cu
3) Mg 4) Ag
17. ద్రవరాజం అని దేన్ని అంటారు?
1) 1:3 నిష్పత్తిలో ఉన్న HNO3, HCl
2) 1:3 నిష్పత్తిలో ఉన్న గాఢ HNO3, గాఢ HCl
3) 1:3 నిష్పత్తిలో ఉన్న గాఢ HNO3, గాఢ H2SO4
4) 3:1 నిష్పత్తిలో ఉన్న గాఢ HNO3, గాఢ HCl
18. వెండి లోహం శుద్ధికోసం ఉపయోగించే లోహం?
1) HNO3 2) H2SO4
3) HCl 4) HNO2
19. డైనమైట్ తయారీకి ఉపయోగించేది?
1) HNO3 2) H2SO4
3) HCl 4) HNO2
20. మెరుపు వల్ల ఉత్పత్తి అయ్యే వాయువు?
1) NO2 2) H2
3) Cl2 4) NO
21. నేలను సారవంతం చేసే బ్యాక్టీరియా?
1) నైట్రిఫైంగ్ బ్యాక్టీరియా
2) డీ నైట్రిఫైంగ్ బ్యాక్టీరియా
3) నైట్రసోబ్యాక్టీరియా
4) రైజోబియం బ్యాక్టీరియా
22. నత్రజని స్థాపన అంటే?
1) నత్రజని వాయువును నైట్రేట్ లవణాలుగా మార్చడం
2) నైట్రేట్ లవణాలను నత్రజని వాయువుగా మార్చడం
3) గాలిలో నైట్రోజన్‌ను స్థిరపరచడం
4) పైవన్నీ
23. వృక్ష, జంతు కళేబరాలను అమ్మోనియం లవణంగా మార్చేది?
1) అమ్మోనిఫైంగ్ బ్యాక్టీరియా
2) అమ్మోనియాసో బ్యాక్టీరియా
3) నైట్రసో బ్యాక్టీరియా
4) నైట్రోఫైంగ్ బ్యాక్టీరియా
24. అమ్మోనియా లవణాలను నత్రజనిగా మార్చే బ్యాక్టీరియా?
1) అమ్మోనిఫైంగ్ బ్యాక్టీరియా
2) అమ్మోనియాసోబ్యాక్టీరియా
3) డీ నైట్రిఫైంగ్ బ్యాక్టీరియా
4) పైవేవీకావు
25. బ్రౌన్ వలయ పరీక్షలో ఊదా రంగుకు కారణం?
1) FeSO4NO2
2) FeSO3.NO
3) FeSO4NO
4) Fe3SO4(NO2)2
26. నత్రికామ్లం భూమిపైన ఏ ఆక్సైడ్లతో చర్యనొంది నైట్రేట్లను ఇస్తుంది?
1) క్షార ఆక్సైడ్ 2) ఆమ్ల ఆక్సైడ్
3) ద్విస్వభావ ఆక్సైడ్
4) తటస్థ ఆక్సైడ్
27. బ్రౌన్ వలయ పరీక్ష వేటి ఉనికి గుర్తించడానికి ఉపయోగిస్తారు?
1) సల్ఫేట్లు 2) నైట్రేట్లు
3) పాస్ఫేట్లు 4) క్లోరైట్లు
28. నైట్రోజన్‌ను గాలి నుంచి తయారుచేసే పద్ధతి?
1) హేబరు 2) అంశికస్వేదనం
3) ద్రవీభవనం 4) బాష్పీభవనం
29. ఒక వాయువును పీడనానికి గురిచేసి వ్యాకోచింప చేసి తిరిగి చల్లబరిచే విధానాన్ని ఏమంటారు?
1) అంశికస్వేదనం 2) ద్రవీభవనం
3) జౌల్ థామ్సన్
4) న్యూటన్ శీతలీకరణం
30. మెగ్నీషియం నైట్రేట్ రంగు?
1) బూడిద రంగు 2) ఎరుపు
3) తెలుపు 4) నలుపు
31. హేబర్ పద్ధతిలో ఉపయోగించే ఉత్తేజకం?
1) ఇనుము 2) MNO2
3) మాలిబ్డినం 4) పైవేవీకావు
32. ఆక్సిజన్, నైట్రోజన్లు చర్యనొంది నైట్రిక్ ఆక్సైడ్‌ను ఏ ఉష్ణోగ్రత వద్ద ఏర్పరుస్తుంది?
1) 5000oC 2) 3000oC
3) -210.5oC 4) -196oC
33. అమ్మోనియంను ఆక్సీకరణం చేస్తే ఏర్పడే పదార్థం?
1) NO 2) N2O5
3) NO2 4) N2O3
34. అధిక పరిమాణం ఉన్న క్లోరిన్‌తో అమ్మోనియా చర్యజరిపితే ఏర్పడే పదార్థం?
1) N2 2) NH4Cl
3) NCl3 4) NCl3 + HCl
35. అధిక ఆక్సిజన్ సమక్షంలో అమ్మోనియా ఆక్సీకరణం చెందితే ఏర్పడే పదార్థం?
1) N2 2) NO2
3) N2O 4) N2O3
36. అమ్మోనియా జాడి మూత దగ్గర హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో ముంచిన గాజు కడ్డీని ఉంచితే ఏర్పడే దట్టమైన తెల్లని పొగలు?
1) HCl 2) NaOH
3) NH4Cl 4) H2O
37. సోల్డరింగ్‌లో ఉపయోగించేది?
1) NH4NO3 2) NH4Cl
3) NH4OH 4) Na2SO4
38. కాల్షియం లవణాలతో మిశ్రమ ఎరువుగా ఉపయోగించేది?
1) NH4Cl 2) NH4OH
3) NH4NO3
4) (NH4)2SO4
39. అమ్మోనియం పాస్ఫేట్ ఉపయోగం?
1) పేలుడు పదార్థం
2) పొడి బ్యాటరీలలో
3) ఎరువులు
4) సోల్డరింగ్
40. అద్దం పరిశ్రమలో ఉపయోగించేది?
1) అమ్మోనియం క్లోరైడ్
2) అమ్మోనియం నైట్రేట్
3) అమ్మోనియం సల్ఫేట్
4) కాల్షియం అమ్మోనియం నైట్రేట్
41. అమ్మోనియం సల్ఫేట్‌ను ఎక్కడ తయారుచేస్తారు?
1) నంగల్ వద్ద, ట్రావెంకోర్ దగ్గర
2) ట్రావెంకోర్, సింధ్రి దగ్గర
3) సింధ్రి, నంగల్ దగ్గర
4) పైవన్నీ
42. జింక్ గాఢ నత్రికామ్లాల చర్య వల్ల ఏర్పడే నైట్రోజన్ ఆక్సైడ్?
1) NO2 2) N2O
3) N2O3 4) NO
43. కాపర్‌పై సజల నత్రికామ్లాల చర్య వల్ల ఏర్పడే నైట్రోజన్ ఆక్సైడ్?
1) NO2 2) N2O
3) N2O3 4) NO
44. I2 + 10 HNO3 + 10NO2+4H2O ఈ చర్యలో అయోడిన్ ఏమవుతుంది?
1) క్షయించిపోతుంది
2) రంగు పోగొట్టుకుంటుంది
3) ఆక్సీకరించబడుతుంది
4) తటస్థీకరించబడుతుంది
45. HNO3తో ఏ లోహం చర్య పొందితే హైడ్రోజన్ ఉత్పన్నమవుతుంది?
1) Au 2) Cu
3) Mg 4) Ag
46. వేరు బుడిపెలు కలిగి నత్రజని స్థాపన చేయగలిగే మొక్క?
1) మొక్కజొన్న 2) చిక్కుడు
3) వరి 4) గోధుమ
47. నత్రజని స్థాపించ గలిగే మొక్క?
1) అమ్మోనిఫైంగ్
2) నైట్రోసోఫైంగ్
3) సహజీవన (రైజోబియం)
4) నైట్రిఫైంగ్
48. వర్షపు నీటిలో గల నైట్రికామ్లంతో చర్యజరిపి నైట్రేట్లను ఇచ్చే భూమిలో ఉన్న ఆక్సైడ్లు?
1) ఆమ్ల 2) క్షార
3) తటస్థ ఆక్సైడ్లు
4) ద్విస్వభావ ఆక్సైడ్లు
49. పొటాషియం నైట్రేట్‌ను వేడి చేస్తే వెలువడే వాయువు?
1) ఆక్సిజన్
2) నైట్రోజన్ డై ఆక్సైడ్
3) నైట్రోజన్ 4) నైట్రిక్ ఆక్సైడ్
50. నైట్రోజన్ డై ఆక్సైడ్ స్వభావం?
1) క్షారం 2) ఆమ్లం
3) తటస్థం 4) ద్విస్వభావం
51. పాస్ఫరస్ పరమాణుకత?
1) 4 2) 6
3) 10 4) 2
ఎస్వీఆర్ కోచింగ్ సెంటర్ సౌజన్యంతో
జవాబులు
1.3 2.4 3.3 4.2
5.3 6.1 7.3 8.1
9.1 10.4 11.4 12.2
13.1 14.2 15.2 16.3
17.2 18.1 19.1 20.4
21.4 22.1 23.1 24.3
25.3 26.1 27.2 28.2
29.3 30.1 31.3 32.2
33.1 34.4 35.2 36.3
37.2 38.3 39.4 40.1
41.2 42.1 43.4 44.3
45.3 46.2 47.3 48.2
49.1 50.2 51.1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు