Change in the community through co operative | సహకారంతోనే సంఘంలో మార్పు
బహుళ సంఘాలు-నిబంధనలు
-సహకార సంఘాలకు వర్తించే ప్రొవిజన్లే బహుళ సహకార సంఘాలకు కూడా కొద్ది మార్పులతో వర్తిస్తాయి. ఈ నిబంధనల్లో రాష్ట్ర శాసనసభ, రాష్ట్ర చట్టం, రాష్ట్రప్రభుత్వం అనే పదాల చోట పార్లమెంటు, కేంద్ర చట్టం లేదా కేంద్రప్రభుత్వం అని చేరుతాయి.
-కేంద్రపాలిత ప్రాంతాలకు: ఈ భాగంలోని నిబంధనలు కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తిస్తాయి. కానీ రాష్ట్రపతి ఈ భాగంలోని నిబంధనలు తన ఆదేశంలో కేంద్రపాలిత ప్రాంతానికి లేదా అందులోని కొంతప్రాంతానికి వర్తించదని నిర్దేశిస్తే ఆ ప్రాంతానికి వర్తించదు.
-ప్రస్తుత చట్టాల కొనసాగింపు: 97వ రాజ్యాంగ సవరణ చట్టం-2011 అమల్లోకి రాకముందు సహకార సంఘాలకు సంబంధించి అమల్లో ఉన్న చట్టాల్లోని ప్రొవిజన్లు, సవరణచట్టంలోని ప్రొవిజన్లతో సరిపోలకపోతే వాటిని సవరించే వరకు లేదా రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చిన ఏడాది వరకు (ఏది తక్కువ కాలం అయితే) అమల్లో ఉంటాయి.
97వ సవరణకు కారణాలు
1.సహకార రంగం ఎన్నో ఏండ్లుగా దేశ ఆర్థికవ్యవస్థ వృద్ధికి కృషి చేసి గణనీయ ఫలితాలను సాధించింది. సంఘాలు తమ సభ్యుల ప్రయోజనాలను కాపాడుకోవడంలో, అసలు లక్ష్యాలను నెరవేర్చుకోవడంలో బలహీనంగా ఉన్నాయి. సహకార సంఘాలకు ఎన్నికలు నిరవధికంగా వాయిదా పడటం, సంఘం నామినేటెడ్ కార్యవర్గం లేదా అడ్మినిస్ట్రేటర్లే దీర్ఘకాలం నడిపించడం వంటి ఘటనలు తరచు జరుగుతున్నాయి. దీంతో సంఘాల యాజమాన్యాలు సభ్యులకు జవాబుదారీతనాన్ని కోల్పోతున్నాయి. ఇక అనేక సహకార సంఘాల్లో వృత్తినైపుణ్యాలు అంతంతమాత్రంగా ఉండటం వల్ల ఉత్పాదకత లోపించి సేవలు నాణ్యతలు పడిపోయాయి. ఈ పరిస్థితుల్లో సహకార సంఘాలకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు సరైన సమయానికి, స్వేచ్ఛగా, సక్రమంగా జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంఘాలను దేశ ఆర్థికవృద్ధికి వెన్నుదన్నుగా, సహకార లక్ష్యాలను సాధించేలా వృత్తినైపుణ్యాలతో తమ సభ్యులకు, తద్వారా ప్రజలకు సంతృప్తికరమైన సేవలందించే సంస్థలుగా తీర్చిదిద్దడానికి మౌలిక సంస్కరణలు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది.
3.దేశంలోని సహకార సంఘాలు ప్రజాస్వామ్యబద్ధంగా, వృత్తినైపుణ్యాలతో, స్వతంత్రంగా, ఆర్థికపరిపుష్టితో పనిచేసేవిధంగా చర్యలు చేపట్టేందుకు కేంద్రప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇందుకు అవసరమైన సంస్కరణలు చేయడానికి రాజ్యాంగానికి కొత్త భాగాన్ని కలపాలని ప్రతిపాదించారు. ఈ భాగంలో సహకారసంఘాలు ప్రజాస్వామ్యయుతంగా, స్వతంత్రంగా, వృత్తినైపుణ్యాలతో పనిచేసేందుకు వీలుకల్పించే ప్రొవిజన్లను చేరుస్తారు. ఇవి సహకార సంఘాల పనితీరును మెరుగుపర్చడమే కాకుండా వాటిని సభ్యులు, ఇతర భాగస్వాములకు జవాబుదారీగా ఉండేట్లు చేస్తాయని, ప్రొవిజన్ల ఉల్లంఘనలకు తగిన నివారణలు సూచిస్తాయని భావిస్తున్నారు.
సంఘాలకు సంబంధించిన రాజ్యాంగ ప్రకరణలు
ప్రకరణలు విషయం
243 ZH నిర్వచనాలు
243 ZI సహకార సంఘాల నమోదు
243 ZJ బోర్డు, కార్యవర్గ సభ్యుల సంఖ్య,పదవీకాలం
243 ZK బోర్డు సభ్యుల ఎన్నిక
243 ZL బోర్డు తాత్కాలిక యాజమాన్య అచేతనం, తాత్కాలిక రద్దు
243 ZM సహకార సంఘాల ఖాతాల ఆడిట్
243 ZN సర్వసభ్య సమావేశం ఏర్పాటు
243 ZO సభ్యుడి సమాచారం తెలుసుకునే హక్కు
243 ZP రిటర్నులు
243 ZQ నేరాలు, జరిమానాలు
243 ZR బహుళ రాష్ట్ర సహకార సంఘాలకు అనువర్తింపు
243 ZS కేంద్రపాలిత ప్రాంతాలకు అనువర్తింపు
243 ZT ప్రస్తుత చట్టాల కొనసాగింపు
వివరణలు, ఆధారాలు
1.సహకార సంఘాలు అనే పదాన్ని రాజ్యాంగంలోని భాగం 3, ప్రకరణ 19, క్లాజు (1), సబ్ క్లాజు (సి)లో పొందుపర్చారు.
2.రాజ్యాంగం భాగం-4లో కొత్త ప్రకరణ 43-బి చేర్చారు. ఇది సహకార సంఘాల స్వచ్ఛంద ఏర్పాటు, విధుల్లో స్వయంప్రతిపత్తి, ప్రజాస్వామ్య నియంత్రణ, వృత్తిపరమైన నిర్వహణ పెంపొందించడానికి రాష్ట్రం కృషిచేయాలి అని చెబుతుంది.
3.సహకార సంఘం అంటే డైరెక్టర్ల బోర్డు లేదా బోర్డు యాజమాన్య సంస్థ అని అర్థం. పేరు ఏదైనా సంఘాల దర్శకత్వం, నియంత్రణ, వాటి వ్యవహారాల నిర్వహణ బాధ్యత బోర్డుదే.
4.ఆఫీస్ బేరర్ అంటే సహకార సంఘం ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, చైర్మన్, వైస్ చైర్మన్, సెక్రటరీ లేదా ట్రెజరర్, బోర్డు ఎంపిక చేసిన ఏ ఇతర వ్యక్తి అయినా కావచ్చు.
5.సహకార బ్యాంకుల (బహుళ రాష్ట్ర సహకార బ్యాంకులు మినహాయించి) విషయంలో ఈ కాలం ఏడాదికి మించరాదు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు