బుర్రకథకు ప్రాణంపోసిన కళాకారుడు ఎవరు?
1. జనవాణి పత్రికలో వ్యవహార భాషను మొదట ప్రవేశపెట్టింది?
1) గిడుగు రాంమూర్తి 2) తాపీ ధర్మరావు
3) పింగళి లక్ష్మీకాంతం 4) గురజాడ అప్పారావు
2. ఎన్ని తరాలీ సలామీ అనే కవిత రాసిందెవరు?
1) సికిందర్ 2) గఫార్
3) ఖాదర్ 4) స్కైబాబా
3. వరలక్ష్మీత్రిశతి పేరుతో 300 పద్యాలు రాసిందెవరు?
1) గురజాడ 2) కృష్ణశాస్త్రి
3) అడవి బాపిరాజు 4) రాయప్రోలు
4. నిరుద్ధ భారతం కావ్యం రచించిందెవరు?
1) సుద్దాల హన్మంతు
2) ప్రజాకవి కాళోజీ
3) గరిమెళ్ల సత్యనారాయణ
4) మంగిపూడి వెంకటేశ్వరశర్మ
5. కిందివాటిలో పర్షియన్ పదం ఏది?
1) మేజా 2) బాతు 3) గసగసాలు 4) గోబీ
6. తిక్కన వాడిన తాసు అనే పదం ఏ భాషా పదం?
1) టర్కీ 2) ఉర్దూ 3) ఒరియా 4) కన్నడ
7. బుర్రకథకు ప్రాణంపోసిన కళాకారుడు?
1) గద్దర్ 2) నజీర్
3) నాజర్ 4) నరసయ్య
8. నగ్నముని దిగంబర కవిత్వంలోకి రాకముందు ప్రచురించిన కవితా సంపుటి ఏది?
1) తొడవిరిగిన తరం 2) కాస్మిక్ జాతి కోసం
3) జైల్లో సముద్రం 4) ఉదయించని ఉదయాలు
9. కిందివారిలో అనుభూతివాద కవిత్వానికి చెందినవారు?
1) ఇస్మాయిల్ 2) మోహన్ ప్రసాద్
3) కొత్తపల్లి శ్రీమన్నారాయణ 4) పైవారందరూ
10. టమాటో అనే పదం ఏ భాష నుంచి దిగుమతి అయ్యింది?
1) పోర్చుగీస్ 2) డచ్చి
3) ఫ్రెంచి 4) ఇటలీ
11. డింగ్‌డాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిందెవరు?
1) అరిస్టాటిల్ 2) సర్ విలియంజోన్స్
3) జస్పర్సన్ 4) మాక్స్‌ముల్లర్
12. సుగాత్రి-శాలిచుల కథ గల ప్రబంధం ఏది?
1) వసు చరిత్ర 2) కళా పూర్ణోదయం
3) మనుచరిత్ర 4) పాండురంగ మహత్మ్యం
13. మన లిపి పుట్టు పుర్వోత్తరాలు గ్రంథకర్త?
1) బూదరాజు రాధాకృష్ణ 2) భద్రిరాజు కృష్ణమూర్తి
3) తిరుమల రామచంద్ర 4) చేకూరి రామారావు
14. జానపద గేయాలను మొదట సేకరించి ప్రచురించిన ఆంగ్లేయుడు?
1) రిచర్డ్ ఎం డార్సన్ 2) జేఏ బోయల్ 3) సీపీ బౌన్ 4) డబ్ల్యూజే థామ్స్
15. జానపద సాహిత్యంలో పరిశోధన చేసి పీహెచ్డీ పట్టాపొందిన తొలి తెలుగువాడు?
1) బిరుదరాజు రామరాజు
2) నేదునూరి గంగాధరం
3) నండూరి రామోహ్మనరావు
4) ఎల్లోరా
16. ధర్మాంగదుని కథ ఉన్న బతుకమ్మ పాట?
1) శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ
2) శ్రీలక్ష్మి దేవియు చందమామ సృష్టి బతుకమ్మయో చందమామ
3) శ్రీరాముని తల్లి ఉయ్యాలో ప్రేమతో శాంతనూ ఉయ్యాలో
4) శ్రీగౌరి నీపూజ ఉయ్యాలో చేయబూనితినమ్మ ఉయ్యాలో
17. పోరంకి దక్షిణామూర్తి తెలంగాణ మాండలికంలో రాసిన రచన?
1) రంగవల్లి 2) మూగజీవాలు
3) ముత్యాల పందిరి 4) జల్లికట్టు పాపయ్య
18. సంస్కృత, ప్రాకృత పదాలను ఏమాత్రం మార్పు లేకుండా తెచ్చుకొని ఆయా భాషా ప్రత్యయాలను చేర్చగా ఏర్పడే పదాలు?
1) తద్భవం 2) గ్రామ్యం
3) అన్యదేశం 4) తత్సమాలు
19. వర్ణమాలలోని అంతస్థాలలోని ర దేనికి చెందింది?
1) తాలవ్యం 2) తాడితం
3) కంపిత ధ్వని 4) దంత్యం
20. ద్రుతం అనే సంజ్ఞ గల అక్షరం ఏది?
1) క కారం 2) వ కారం
3) న కారం 4) చి కారం
21. మిసిమి అనే పదానికి అర్థం?
1) నల్లని 2) ముఖం 3) కాంతి 4) పైవన్నీ
22. నీరు అనేది?
1) తత్సవం 2) ఆచ్చికం
3) తద్భవం 4) అన్యదేశం
23. జానపద సాహిత్యంపై ఎల్లోరా రాసిన గ్రంథం?
1) సరాగాలు 2) రాగసుధ
3) జానపద సుధానిధి 4) జానపదం
24. కిందివాటిలో పొడుపు కథల లక్ష్యం కానిదేది?
1) సంక్షిప్తత 2) నిగూఢత
3) అర్థరహిత 4) కథాత్మకత
25. కేతిగాడు, బంగారక్క పాత్రలు గల కళారూపం?
1) హరికథ 2) బుర్రకథ
3) తోలు బొమ్మలాట 4) వీధి భాగవతం
26. సయ్యద్ గఫార్ రాసిన జన్యు వాంగ్మూలం కవిత ఏ సంకలనం లోనిది?
1) పదునెక్కుతున్న పాట 2) ఎరుపెక్కుతున్న పాట
3) జల్జలా 4) చిక్కనౌతున్న పాట
27. విన్నకోట రవీందర్ రాసిన జ్ఞాపకం కవిత దేనికి చెందింది?
1) భావకవిత్వం 2) మైనార్టీవాదం
3) స్మృతి కవిత్వం 4) అనుభూతివాద కవిత్వం
28. కిందివాటిలో సర్వభక్తిని పొందిన పదం?
1) కస్తూరి 2) ఉవిద 3) అరధం 4)గోధుమ
29. వ్యాకరణ విరుద్ధములైన పదాలను ఏమంటారు?
1) దేశ్యం 2) తత్సమం 3) తద్భవం 4) గ్రామ్యం
30. జానపద విజ్ఞానాన్ని మొదటిసారిగా స్థూలంగా నాలుగు శీర్షికల కింద విభజించినవారు?
1) అలెన్ డండెస్ 2) రిచర్డ్ యం డార్సన్
3) జేఏ బోయల్ 4) ఎమర్సన్
31. అయ్యో పాలింకిపోవడానికి మందులు ఉన్నట్లు మనసింకిపోవడానికి మందులు ఉంటే బాగుండు అన్నదెవరు?
1) పాటిబండ్ల రజని 2) జయప్రభ
3) ఓల్గా 4) విమల
32. కిందివాటిలో అర్ధ సంకోచం జరిగిన పదం?
1) నీక్షా 2) సుల్తాన్ 3) చీర 4) కైంకర్యం
33. రతుజనీన విధానం, జీవకారుణ్యం, త్యాగబుద్ధి గురించి కావ్యం రాసిన తెలంగాణ కవి?
1) దువ్వూరి రామిరెడ్డి
2) గంగుల శాయిరెడ్డి
3) కట్టమంచి రామలింగారెడ్డి
4) వేముగంటి నరసింహాచార్యులు
34. శ్రీనాథుడు కాశీఖండాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు?
1) బెండపూడి అన్నయామాత్యుడు
2) ముమ్మడి శాంతయ్య
3) వీరభద్రారెడ్డి
4) మామిడి సింగన
35. తెలుగులో మాండలిక భాష అని వ్యవహరించెందవరు?
1) వేదం వెంకటరాయ శాస్త్రి 2) పీఎస్ సుబ్రహ్మణ్యం
3) భద్రిరాజు సుబ్రహ్మణ్యం
4) భద్రిరాజు కృష్ణమూర్తి
36. మిన్నేరు, మున్నేరు, సెలయేరు అనేవి?
1) విప్లవ సంపుటాలు
2) అభ్యుదయ కవితా సంపుటాలు
3) స్త్రీవాద సంపుటాలు
4) జానపద సంపుటాలు
37. కిందివాటిలో ద్యంతాలు ఏవి?
1) క, ఖ, గ, ఘ 2) త, థ, ద, ధ
3) ప, ఫ, చ, ఛ 4) చ, ఛ, జ, ఝ
38. దిగంబర కవులు జంగాలచిట్టిచే ఆవిష్కరించిన కవితా సంపుటి ఎన్నోది?
1) ఒకటి 2) రెండు 3) మూడు 4) నాలుగు
39. భాష ప్రకృతి సిద్ధమైనదని భావించింది?
1) సోక్రటీస్ 2) రూసో 3) ప్లాటో 4) అరిస్టాటిల్
40. ఇంజక్షన్‌ను సూదిమందు అనడం ఏ ప్రతి దేయత్వం?
1) వ్యవహార భాషణం 2) మాండలిక భాషణం 3) బాలభాషణం 4) విచిత్ర ప్రతిదేయత్వం
41. మా ఊర్లో సముద్రమంత చెరువు ఉన్నది వాక్యంలో అలంకారం?
1) ఉత్ప్రేక్ష 2) రూపకం 3) ఉపమ 4) అతిశయోక్తి
42. గర్వోన్నతి ఏ సంధి?
1) యణాదేశ 2) విసర్ల 3) గుణ 4) అత్వ
43. బూగ అనే తెలంగాణ పదానికి అర్థం?
1) పెద్ద గిన్నె 2) పళ్లెం 3) తూనీగ 4) చెరువు
44. రాముడు వచ్చెనులో రాముడు?
1) కర్మ 2) కర్త 3) ఉద్దేశ్యం 4)విధేయం
45. తెలుగు జానపద గేయగాధలు రాసిందెవరు?
1) నేదునారి గంగాధరం
2) నాయిని కృష్ణ కుమారి
3) బి.రామరాజు
4) శ్రీహరి ఆదిశేషరావు
46. పాల్కుర్కి సోమన రాసిన అనుభవసారం ఈ ఛందస్సులో ఉంటుంది?
1) కందం, సీసం 2) ఆటవెలది, తేటగీతి
3) ద్విపద 4) మద్యారూఢ
47. సంస్కృతం, లాటిన్, గ్రీకు ఒకే మూలం నుంచి పుట్టాయని మొదట చెప్పిందెవరు?
1) సర్ విలియం జోన్స్ 2) రాబిన్సన్
3) అరిస్టాటిల్ 4) సోక్రటీస్
48. మద్యారూఢ పద్యాలు కనిపించే శాసనం?
1) యుద్ధమల్లుని బెజవాడ శాసనం
2) పోతలూరు శాసనం
3) కందుకూరు శాసనం
4) విరియాల కామసాని శాసనం
49. క్షేమము అనే పదానికి వికృత పదం ఏది?
1) క్షామము 2) సేమం 3) షేమం 4) శేమము
50. వీరు వీరుల్ పరార్దుల్ తెల్గుజోదుల్ భళా! అనే పాదంలో ఉన్న అలంకారం ఏది?
1) వృత్యానుప్రాసం 2) యమకానుప్రాసం
3) లాటానుప్రాసం 4) ఛేకానుప్రాసం
51. ఇతిహాసాన్ని పరిక్రయా పురాకల్పమని రెండు రకాలుగా విభజించిందెవరు?
1) జయదేవుడు 2) క్షేమేంద్రుడు
3) మహిమభట్టు 4) రాజశేఖరుడు
52. రెంజిమ్ ఎవరి కలం పేరు?
1) పాణిగ్రాహి 2) ఎండ్లూరి సుధాకర్
3) కేజీ సత్యమూర్తి 4) దామెర రాములు
53. భాష ఎలా పుట్టిందనే విషయంలో మొదట వచ్చిన సిద్ధాంతం ?
1) బౌబౌ సిద్ధాంతం 2) డింగ్‌డాంగ్ సిద్ధాంతం
3) పూపూ సిద్ధాంతం 4) యె-హె-హు సిద్ధాంతం
54. చంద్రుడు చందురుగా మారే ధ్వనిమార్పు?
1) లోప దీర్ఘత 2) వర్ణ సమీకరణం
3) ద్వితం 4) స్వరభక్తి
55. చేతులు కడుక్కో అనేది ఏ వాక్యం?
1) ఆశ్చర్యార్థక వాక్యం 2) విధ్వర్థక వాక్యం
3) ప్రశ్నార్థక వాక్యం 4) ప్రార్థనార్ధాక వాక్యం
56. జమిళిక వీరి ప్రధాన వాద్యం?
1) వీరముష్టివారు 2) శారదకాండ్రు
3) పిచ్చకుంట్లవారు 4) బవనీలు
57. తొలి తెలుగు ఛందోలక్షణ గ్రంథం కవిజనాశ్రయం ఎవరు రచించారు?
1) మల్లియ రేచన 2) అద్దంకి గంగాధరకవి 3) నన్నయ 4) తిక్కన
58. ప్రబంధ లక్షణాలు గల తొలి ప్రబంధం ఏది?
1) మనుచరిత్ర – అల్లసాని పెద్దన
2) విజయ విలాసం – చేమకూర వెంకటకవి
3) కుమార సంభవం – నన్నెచోళుడు
4) వసుచరిత్ర-రామరాజు భూషణుడు
59. మార్కండేయ పురాణంలో హరిశ్చంద్రుని భార్య పేరేమి?
1) చంద్రమతి 2) చంద్రముఖి
3) శైభ్య 4) శ్రియ
60. కనపర్తి వరలక్ష్మమ్మ రాసిన శారదలేఖలు పత్రికలో అచ్చయ్యాయి?
1) ప్రమదావనం 2) గృహలక్ష్మి
3) స్వర్గసీమ 4) భారతి
61. గ్రాంథికవాదాన్ని బలపరిచి గ్రామ్యవాద విమర్శనం రాసింది ?
1) మల్లాది సూర్యనారాయణ శాస్త్రి
2) పింగళి లక్ష్మీకాంతం
3) పురాణపండ మల్లయ్య శాస్త్రి
4) కొమర్రాజు లక్ష్మణరావు
62. బొమ్మల రూపంలో ఉండే ఈజిప్షియన్ లిపి ఏది?
1) హైరోగ్లిఫిక్ లిపి 2) క్రీటు లిపి
3) క్యూనిఫారం లిపి 4) సెమిటె లిపి
63. ఒక భాష తన నుంచి ఇతర భాషలకు పదాలను ఇచ్చినట్లయితే ఏమాంటారు?
1) ఆదానం 2) ప్రదానం
3) గ్రామ్యం 4) ఆగ్రామ్యం
64. స్కంధము అనే పదానికి నానార్థాలు ఏవి?
1) మేఘం, ఏనుగు, కఠినం, గొప్పది, గట్టి
2) బతుకు, నీళ్లు, గాలి, ప్రాణం
3) బంగారం, ఉమ్మెత్త, సంపెంగ
4) కొమ్మ, ప్రకరణం, సమూహం, శరీరం
65. తేజి అనే పదానికి పర్యాయపదాలు?
1) గుర్రం, అశ్వం, తురగం
2) ఏనుగు, గజము, కరి
3) కాకి, మౌకలి, ధ్వాంక్షం
4) బంగారం, హేమం, సువర్ణం
66. యోగ్యత, ఆకాంక్ష, ఆసత్తి గల పదసము దాయము?
1) పదబంధము 2) మహాకావ్యం
3) వాక్యం 4) లఘుకావ్యం
67. సుగ్రీవ విజయం యక్షగానంలో దుందుభి ఎవరు?
1) సుగ్రీవుని కుమారుడు 2) ఒక నది
3) మాయావి కుమారుడు 4) వాలి కుమారుడు
68. జైమినీ భారతంలో లేని ఇతివృత్తం ఏది?
1) ఉద్దాలక మహర్షి కథ
2) పంచక పురోహితుని కథ
3) ప్రమీలార్జునీయ కథ
4) చంద్రహాస చరిత్ర
69. గొంగడి ఏ భాషాపదం నుంచి తెలుగులోకి వచ్చింది?
1) మళయాలం 2) మరాఠీ
3) సంస్కృతం 4) ప్రాకృతం
70. పరివర్తనాత్మక వ్యాకరణ ప్రతిపాదకుడెవరు?
1) చామ్స్కీ 2) జేఆర్ ఫర్త్
3) వెస్తిన్ 4) ఫ్రాంజ్బోస్
71. పీఠిక అనే ప్రక్రియకు గల పేర్లు?
1) ప్రస్తావన 2) ఆముఖం
3) పై రెండూ 4) ఏదీకాదు
72. శాసనభాషపై విస్తృత పరిశోధన చెసిందెవరు?
1) భద్రిరాజు కృష్ణమూర్తి 2) బూదరాజు రాధాకృష్ణ
3) బుదాటి రాధాకృష్ణ 4) వేదం వెంకటరాయశాస్త్రి
73. రేడియో, టీవీ, సినిమా, వార్త పత్రికల్లో ఉపయోగించే భాష ?
1) వ్యవహారిక భాష 2) ప్రామాణిక భాష
3) గ్రాంథిక భాష 4) నిర్దేశిత భాష
74. ప్రాచీనకాలంలో పరిమితార్థం ఉండి తర్వాతి కాలంలో విస్తృతార్థం వస్తే దాన్నేమంటారు?
1) అర్ధ వ్యాకోచం 2) అర్ధాపకర్ష
3) అర్ధ సంకోచం 4) సభ్యోక్తి
75. కాకోదరం అంటే ఏమిటి?
1) లావుపొట్ట గలవాడు 2) కాకి
3) అన్నదమ్ములు 4) పాము
76. జానపద గేయాలను సేకరించడంలో తన జీవితకాలాన్ని పూర్తిగా వినియోగించినవాడు?
1) చింతాదీక్షితులు 2) నేదనూరి గంగాధరం
3) బిరుదురాజు రామరాజు 4) శ్రీహరి ఆదిశేషువు
77. బడి పిల్లలు, కాలేజీ పిల్లలపై ప్రభావం చూపిస్తున్న భాష?
1) ప్రామాణిక భాష 2) ప్రసార మాధ్యమాల భాష
3) వ్యవహరిక భాష 4) గ్రాంథిక భాష
78. ఆంధ్రప్రదేశ్ అధికారా భాషా సంఘానికి అధ్యక్షులుగా పనిచేసిన తొలి మహిళ ఎవరు?
1) దుర్గాబాయి దేశ్‌ముఖ్
2) నాయిని కృష్ణకుమారి
3) పాకాల యశోదారెడ్డి
4) యుద్ధనపూడి సులోచనారాణి
79. అర్ధపరిణామం అనే విషయంపై కృషిచేసిన భాషావేత్త ఎవరు?
1) జీఎన్.రెడ్డి 2) కొలుకలూరి ఇనాక్
3) భద్రిరాజు కృష్ణమూర్తి 4) నాయిని కృష్ణకుమారి
80. ఓలి అనే పదానికి ప్రకృతి పదం ఏది?
1) ఆహారం 2) హోళి 3) బరిమ 4) ఆళి
81. ఒకసారి సంధి జరిగి, మరోసారి సంధి జరగకపోవడాన్ని
వ్యాకరణ పరిభాషలో ఏమంటారు?
1) నిత్యం 2) వైకల్పికం 3) బహుళం 4) నిషేధం
82. సంస్కృతంలో పొడుపు కథను ఏమంటారు?
1) ప్రవేశిక 2) ప్రవళిక 3) ప్రహేళిక 4) పైవన్నీ
83. కిందివాటిలో ఆవుపులి కథ ఇతివృత్తం కలది?
1) కొఱవి గోపరాజు – సింహాసన ద్వాత్రింశిక
2) అనంతామాత్యుడు – భోజరాజీయం
3) జక్కన – విక్రమార్క చరిత్ర
4) గౌరన-నవనాథ చరిత్ర
84. యాదృచ్ఛిక భావ వినిమయానికి ఉపయోగపడే భాష ఏది?
1) పాఠశాల భాష 2) పరిసరాల్లో భాష
3) ప్రామాణిక భాష 4) వైయుక్తిక భాష
85. ఇంతితై వటుడింతై దానింతైనభో వీధిపై అనే పద్యం ఏ
సందర్భంలోనిది?
1) బలి చక్రవర్తి వామనుడికి దానం చేసే సందర్భం
2) బలిచక్రవర్తిని దానమడిగిన వామనుడు వినువీధులపైకి వ్యాపించిన సందర్భం
3) బలిచక్రవర్తిని దానమీయవద్దని శుక్రాచార్యుడు
వారించిన సందర్భం
4) ఏది ఏమైనా దానం చేసి తీరుతామని బలిచక్రవర్తి శుక్రాచార్యుడితో అన్న సందర్భం
86. పొడుస్తున్న పొద్దు మీద అనే తెలంగాణ ఉద్యమ పాట రాసింది?
1) విమలక్క 2) గద్దర్
3) దేశపతి శ్రీనివాస్ 4) గొరెటి వెంకన్న
87. తెలుగురాని ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా భాషా ప్రయోగశాలను నిర్వహిస్తున్నదెవరు?
1) తెలుగు అకాడమీ
2) అధికార భాషా సంఘం
3) అఖిల భారత తెలుగు సంఘం
4) తెలుగు భాషావాదుల సంఘం
88. కరణం అంటే ఏమిటి?
1) ముఖ యంత్రంలో కదలలేని భాగం
2) శ్వాసనాళం
3) ముఖ యంత్రంలో కదలే భాగం
4) నాదతంత్రులు
89. చెర్విరాల భాగయ్య రచించిన కిరాతార్జున చరిత్రం అనేది ఏ ప్రక్రియ?
1) కథాకావ్యం 2) ప్రబంధం
3) యక్షగానం 4) వచన కవిత
90. సామల సదాశివ ఏ రచనకు 2011లో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు లభించింది?
1) అమ్జద్ రుబాయిలు 2) యాది
3) సంగీత శిఖరాలు 4) స్వర లయలు
91. గారడి చేస్తుండ్రు పాట ఎవరు రాశారు?
1) సిధారెడ్డి 2) కేసీఆర్
3) అభినయ శ్రీనివాస్ 4) గిద్దె రామనర్సయ్య
92. కిందివారిలో దాశరథి శతకం రచించిదెవరు?
1) త్యాగయ్య 2) క్షేత్రయ్య
3) రామదాసు 4) శ్యామయ్య
93. కిందివాటిలో రేవతిదేవి రచన ఏది?
1) శిక్ష 2) పెద్దవనీ చెప్తా
3) అనురాగ దగ్ధ సమాధి 4) మూగవోయిన గొంతు
94. విజయరాఘవ నాయకుడిచే కనకాభిషేకం చేయించుకున్న విదుషీమణి?
1) రంగాజమ్మ 2) ముద్దు పళని
3) మధురవాణి 4) రామభద్రాంబ
95. చేమకూర వెంకటకవి బిరుదు ఏది?
1) వేదాంతచార్య 2) శ్లేషయమక చక్రవర్తి
3) కవికుల సార్వభౌమ 4) భవ్య భారత
96. మన వేమన అనే గ్రంథాన్ని ఎవరు రచించారు?
1) రాళ్లపెల్లి అనంతకృష్ణశర్మ
2) కట్టమంచి రామలింగారెడ్డి
3) ఎన్.గోపి 4) దువ్వూరి రామారెడ్డి
97. మతాల సరిహద్దులను చెరిపిన స్నేహం గురించి కేశవస్వామి కథ?
1) షరీఫా 2) కేవలం మనుషులం
3) అదృష్టం 4) రూహిఆసా
98. ముక్కంటి ఏ సమాసం?
1) బహువ్రీహి 2) ద్విగు
3) విశేషణ పూర్వపద 4) ఏదీకాదు
99. కిందివాటిలో అవధాన ప్రక్రియకు సంబంధించింది?
1) నిషిదాక్షరి 2) పుష్పగణనం
3) చక్రవాళం 4) సమస్యాపురాణం
100. రహస్యద్వారం హైకుల సంపుటిని రచించిన కవి?
1) ఇస్మాయిల్ 2) పెన్నా శివరామకృష్ణ
3) బీవీవీ ప్రసాద్ 4) గాలి సాసరరెడ్డి
దివిజకా్ష్మరుహ ధేనురత్న ఘనభూ! తిన్ ప్రస్ఫురద్రత్న సా
నువు నీవిల్లు, నిధీశ్వరుండు సఖు, ఁడ! ర్ణోరాశి కన్యావిభుం
డు విశేషార్చకుఁడింక నీకెన ఘనుం! డున్ గల్గునే నీవు చూ
చి విచారింపవు లేమి నెవ్వఁడుడుపున్! శ్రీకాళహస్తీశ్వరా!
101. ఈ పద్యంలో అర్ణోరాశి కన్యావిభుండు అని అన్నాడు. అంటే ?
1) బ్రహ్మ 2) శివుడు 3) విష్ణువు 4) కుబేరుడు
102. ఈ పద్యం ఏ ఛందస్సుకు సంబంధించింది?
1) శార్దూలం 2) ఉత్పలమాల
3) చంపకమాల 4) మత్తేభం
103. నెల్లూరి కేశవస్వామి ఉత్తమ కథలు సంపుటికి పీఠిక రాసిన వారెవరు?
1) ఆదిరాజు వీరభద్రరావు 2) గూడూరి సీతారం
3) ఇరువంటి కృష్ణమూర్తి 4) సలంద్ర లక్ష్మీనారాయణ
104. కీర్తింతురెద్దానీకీర్తి గంధర్వులు గాంధర్వమున యక్షగాన సరణి అని శ్రీనాథుడు ఏ రచనలో పేర్కొన్నాడు?
1) శివరాత్రి మహత్మ్యం 2) హరవిలాసం
3) భీమేశ్వర పురాణం 4) కాశీఖండం
105. సువ్వీసువ్వీ సువ్వాలమ్మ అనే కీర్తనను రాసిందెవరు?
1) సినారే 2) దేవులపల్లి కృష్ణశాస్త్రి
3) అన్నమయ్య 4) త్యాగయ్య
106. అద్దంకి గంగాధర కవి-తపతీ సంవరణోపాఖ్యానాన్ని ఎవరికి అంకితం చేశాడు?
1) ఇబ్రహీంకుతుబ్షా 2) కులికుతుబ్‌షా
3) అమీన్ ఖాన్ 4) కందుకూరి రుద్రకవి
107. అచ్చ తెలుగు కావ్యం యయాతి చరిత్ర రచించిదెవరు?
1) పొన్నగంటి తలగన 2) కూచిమంచి తిమ్మన
3) మరిగంటి సింగరాచార్యులు 4) కందుకూరి రుద్రకవి
108. మరిగంటి సింగనాచార్యులు రచించిన కావ్యం?
1) సీతాకల్యాణం 2) రామకృష్ణ విజయం
3) శ్రీరంగ శతకం 4) పైవన్నీ
109. కాలరేఖలు నవల రాసిందెవరు?
1) నిఖిలేశ్వర్ 2) అంపశయ్య నవీన్
3) కొలకలూరి ఇనాక్ 4) ఆరుద్ర
110. తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించడానికి కారణమైన తెలంగాణ శాసనం ఏది?
1) జీవవల్లభుని కందపడ్యాల శాసనం
2) విరియాక కామసాని గూడురు శాసనం
3) ఆత్మకూరు ఆటవెలది శాసనం 4) ఏదీకాదు
111. కిందివాటిలో 1910కి సంబంధించింది ఏది?
1) రాయప్రోలు తొలి కవిత -లలిత
2) వ్యవహరిక భాషోద్యమం-గిడుగు
3) దిద్దుబాటు ఆంధ్రభారతిలో అచ్చయింది
4) అన్నీ సరైనవే
112. తొలి తెలుగు రామాయణం ఏది?
1) మొల్ల రామాయణం 2) భాస్కర రామాయణం
3) రంగనాథ రామాయణం 4) నిర్యోష్ట రామాయణం
113. సైదం అనే తెలంగాణ పదానికి అర్థం ఏమిటి?
1) జాగ్రత్త 2) జలుబు 3) గోధుమ పిండి 4) నిజం
114. తెలంగాణ భీష్ముడిగా ప్రసిద్ధి చెందినవాడెవరు?
1) దాశరథి 2) ఆదిరాజు వీరభద్రరావు
3) నెల్లూరి కేశవస్వామి 4) వట్టికోల ఆళ్వారుస్వామి
115. మహాప్రస్థానానికి పీఠిక రాసిందెవరు?
1) గురజాడ 2) దువ్వూరి 3) చలం 4) సినారె
116. తొలి తెలుగు సాంఘిక పద్యనాటకం?
1) మంజరి మధుకరీయం 2) కన్యాశుల్కం
3) రామరాజు చర్రి 4) నందక రాజ్యం
117. నాటిక ప్రదర్శన కాలపరిమితి ఎంత?
1) 20 నిమిషాల నుంచి 1 గంట వరకు
2) 20 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు
3) 10 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు
4) 45 నిమిషాల నుంచి 1 గంట వరకు
118. కనపర్తి వరలక్ష్మమ్మ రాసిన శారద లేఖలు ఏ పత్రికలో అచ్చయ్యాయి?
1) ప్రమదావనం 2) గృహలక్ష్మి
3) స్వర్గసీమ 4) భారతి
119. పీఠిక అనే ప్రక్రియకు గల పేర్లు?
1) ప్రస్తావన 2) ఆముఖం 3) పైరెండూ 4) ఏదీకాదు
120. చెయ్యెతి జైకొట్టు తెలుగోడా గేయం రాసిందెవరు?
1) గద్దర్ 2) సుద్దాల హన్మంతు
3) వేమని శ్రీకృష్ణ 4) రాయప్రోలు
121. కింది వాటిలో జానపద సాహిత్యానికి చెందినవి?
1) బతుకమ్మ పాటలు 2) సామెతలు
3) పొడుపు కథలు 4) పైవన్నీ
122. మావూరి ముచ్చట్లు కథల సంపుటి ఎవరిది?
1) నాయిని కృష్ణకుమారి 2) మాచిరెడ్డి సులోచన
3) పాకాల యశోదారెడ్డి 4) మాలతీ చందూర్
123. అడవి బాపిరాజుగారి ఊహా ప్రేయసి?
1) ఊర్వశి 2) సౌధామిని
3) హృదయేశ్వరి 4) శశికళ
124. కింది వాటిలో పతంజలి రాసినది ఏది?
1) అష్టాధ్యాయి 2) మహాభాష్యం
3) కాతంత్ర వ్యాకరణం 4) రూపమాల
125. తెలుగులో తొలి రాజకవి ఎవరు?
1) నన్నె చోడుడు 2) పాల్కురికి సోమన
3) శ్రీపతి పండితుడు 4) శ్రీనాథుడు
126. మనుచరిత్ర ఎన్ని అశ్వాసాల కావ్యం?
1) 5 2) 4 3) 6 4) 8
127. వటుని కాళ్లు గడుగ వర హేమ ఘటమున జలముదెచ్చె భర్త సన్నయెఱిగి ఇది ఏ పద్యపాదం?
1) ఆటవెలది 2) తేటగీతి
3) కందము 4) ఉత్పలమాల
128. ఆంధ్రకవితా గురుడని మార్కండేయ పురాణంలో మారన ఎవరిని కొనియాడాడు?
1) పాల్కురికి సోమన 2) నన్నయ
3) పండితారాధ్యుడు 4) శ్రీనాథుడు
129. ముకురాల రామారెడ్డి రాసిన గేయ సంపుటి?
1) మేఘదూత 2) హృదయశైలి
3) విడిజోడు 4) వేడిగాలి
130. అన్నీ అధ్యయనం చెయ్ అనే విప్లవ కవిత రాసిందెవరు?
1) అనిశెట్టి ప్రభాకర్ 2) చెరబండరాజు
3) సతీష్‌చందర్ 4) నందిని సిధారెడ్డి
131. కాశీఖండం, శివరాత్రి మహత్యం ఈ రెండింటిలోనూ
ఉన్న పద్యం?
1) కమల నయన 2) కంటికి నిద్రవచ్చునే
3) అరుణగభస్తి బింబం 4) ఉన్న ఊరును కన్న తల్లియు
132. వ్యవహారిక భాష ప్రారంభమైన ఏడాది?
1) 1911 2) 1910 3) 1912 4) 1909
133. గాంధీజీ మరణవార్త విని ఉద్వేగపూరితంగా క్షమామూర్తి పేరుతో కవిత రాసిందెవరు?
1) వట్టికోట అళ్వారుస్వామి 2) శ్రీశ్రీ
3) దాశరథి కృష్ణమాచార్యులు 4) కాళోజీ
134. ఆంధ్రప్రదేశ్ చివరి ఆస్థానకవి ఎవరు?
1) యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ 2) దాశరథి కృష్ణమాచార్య
3) సి. నారాయణరెడ్డి 4) శ్రీశ్రీ
135. మద్యారూఢ పద్యాలు కనిపించే శాసనం ఏది?
1) విరియాన కామసాని శాసనం
2) పోతలూరు శాసనం 3) కందుకూరి శాసనం
4) యుద్ధమల్లుని బెజవాడ శాసనం
136. చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గేయం రాసిందెవరు?
1) గద్దర్ 2) సుద్దాల హన్మంతు
3) వేముల శ్రీకృష్ణ 4) రాయప్రోలు
137. కాసె సర్వప్ప రాసిన చారిత్రక గ్రంథం ఏది?
1) రామరాజీయం 2) సిద్దేశ్వర చరిత్ర
3) చిత్రభారతం 4) వరదరాజు స్తుతి
138. కింది వాటిలో దాశరథి రాసిన నవమి ఏ సంకలనం?
1) రేడియో నాటికల సంకలనం
2) లలిత గీతాల సంపుటి
3) విప్లవ గీతాల సంపుటి 4) కథల సంపుటి
139. అక్క మహాదేవి చరిత్ర యక్షగానం రాసినది ఎవరు?
1) ముద్దు పళని 2) రంగాజమ్మ
3) తరిగొండ వెంగమాంబ 4) బాల పాపాంబ
140. ఇతిహాసమైన రామాయణానికిగల పేరు?
1) సీతయాశ్చరితం మహత్ 2) పాలస్త్య వధ
3) సుగ్రీవ విజయం 4) 1, 2
141 . అతీతార్థ ప్రాధాననాధితిహాస: అని చెప్పినవాడు?
1) రాజశేఖరుడు 2) అభినవ సప్తుడు
3) భోజుడు 4) ఆనందవర్ధనుడు
142. దాశరథి రచించిన ఆ చల్లని సముద్ర గర్భం ఏ కవితా సంపుటిలోనిది?
1) రుద్రవీణ 2) అగ్నిధార
3) నేత్ర పర్వం 4) కవితాపుష్పకం
143. పురాణం పంచ లక్షణం అని చెప్పినది ఎవరు?
1) మమ్మూటుడు 2) అభినవగుప్తుడు
3) అమరసింహుడు 4) ఉద్భటుడు
144. ద్వ్యర్థి కావ్యమైన నైషద పారిజాతీయం ఎవరు రచించారు?
1) రామరాజ భూషణుడు 2) నంది తిమ్మన
3) కృపాధ్వరి 4) శ్రీనాథడు
145. కింది వాటిలో పద్య ప్రక్రియ కానిది?
1) కావ్యం 2) ఆశువు
3) పురాణం 4) యక్షగానం
146. కింది వాటిలో పంచ సంధులు కలిగివుండే ప్రక్రియ ఏది?
1) యక్షగానం 2) ప్రబంధం
3) నాటకం 4) బుర్రకథ
147. వ్యాస చంద్రిక అనే వ్యాస సంకలనం ఎవరిది?
1) కందుకూరి వీరేశలింగం 2) గురజాడ అప్పారావు
3) సామినేని నరసింహం 4) కుందుర్తి
148. ఏకాంశ వ్యగ్రమై స్వయం సమగ్రమైన కథాత్మక వచన ప్రక్రియ కథానిక అని అన్నది ఎవరు?
1) కొడాడ రామచంత్రశాస్త్రి 2) పోరంకి దక్షిణ మూర్తి
3) మాదిరాజు రంగారావు 4) జాషువా
149. జీవన యానం ఎవరి ఆత్మకథ?
1) దాశారథి కృష్ణమాచార్య 2) తిరువాల రామచంద్ర
3) దాశరథి రంగాచార్య 4) కాళోజీ
150. తొలి విషాదాంత నాటకం విషాద సారంగధర రచించిన వారు?
1) ధర్మవరం కృష్ణమాచార్యులు
2) కొరాడ రామచంద్ర శాస్త్రి
3) కొక్కొండ వెంకటరత్నం పంతులు
4) తాపీ ధర్మారావు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు