Carbohydrates | పిండి పదార్థాలు
-పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ లేదా కీటోన్స్నే కార్బొహైడ్రేట్స్ (CARBOHYDRATES) అంటారు
-ఒకరోజుకు కావాల్సిన పరిమాణం-500 గ్రా.
-వీటిలోని మూలకాలు, C, H, O.
-వీటిలోని C, H, O ల సాధారణ నిష్పత్తి-1:2:1
-వీటి ముఖ్య విధి శక్తిని అందించడం, కావున వీటిని శక్తిజనకాలు/శక్తి ఉత్పాదకాలు అంటారు.
-1గ్రామ్ కార్బోహైడ్రేట్ నుంచి 4 కిలో కేలరీల శక్తి లభిస్తుంది.
-వీటిని గుర్తించడానికి చేసే పరీక్ష – అయోడిన్ టెస్ట్. ఈ పరీక్షలో పిండిపదార్థాలు నీలిరంగులోకి మారుతాయి.
-బియ్యంలో పిండిపదార్థాల శాతాన్ని గుర్తించే సూచిక-ైగ్లెసిమిక్స్ సూచిక(GI)
ముఖ్యమైన పిండి పదార్థాలు
1. మోనోశాకరైడ్లు 2. డైశాకరైడ్లు 3. పాలీశాకరైడ్లు
-మోనోశాకరైడ్లు: ఇది జలవిశ్లేషణ చెంది ఇతర పదార్థాలను ఏర్పరుస్తుంది.
-ఇవి సులభంగా నీటిలో కరిగి శక్తిని అందిస్తాయి.
-ఉదాహరణ: గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గాలక్టోజ్, రైబోజ్, డీఆక్సీరైబోజ్
గ్లూకోజ్
-దీనిని గ్రేప్ షుగర్ లేదా బ్లడ్ షుగర్ అంటారు.
-రక్తంలో ఉండాల్సిన గ్లూకోజ్ స్థాయి 80-120mg/100ml లేదా 80-120mg/dl
-దీన్ని కొలిచే మీటర్/పరికరం- గ్లూకోమీటర్
-ఇది క్రీడాకారులకు తక్షణమే శక్తిని అందిస్తుంది.
-మొక్కల్లో ఇది కిరణ్యజన్య సంయోగ క్రియ అనే క్షయకరణ ప్రక్రియ ద్వారా ఏర్పడుతుంది. కావునా దీన్ని రెడ్యూస్డ్ షుగర్ (క్షయకరణ శక్తి) అంటారు.
ఫ్రక్టోజ్
-ఇది ప్రపంచంలో అతి తియ్యని చక్కెర.
-దీన్ని ఫ్రూట్ షుగర్, హనీ షుగర్ అంటారు.
గాలక్టోజ్
-ఇది పాలలో కరిగిన స్థితిలో ఉంటుంది.
రైబోజ్
-ఇది RNAలో ఉంటుంది.
డీ ఆక్సీరైబోజ్
-ఇది DNAలో ఉంటుంది.
-డై శాకరైడ్లు: వీటిలో రెండు మోనో శాకరైడ్లు ైగ్లెకోసిడిక్ బంధాలతో కలుస్తాయి. కావునా వీటిని నీటిలో కరిగించడానికి కొంత సమయం పడుతుంది.
-ఉదాహరణ: సుక్రోజ్ (గ్లూకోజ్ + ఫ్రక్టోజ్), మాల్టోజ్ (గ్లూకోజ్ + గ్లూకోజ్), లాక్టోజ్ (గ్లూకోజ్ + గాలక్టోజ్)
సుక్రోజ్
-చెరుకు నుంచి లభించడంవల్ల కేన్ షుగర్ అని, నిత్యజీవితంలో వాడటంవల్ల టేబుల్ షుగర్ అంటారు.
గమనిక: ధృవ ప్రాంతాల్లోని దేశాలు చక్కెరను బీట్రూట్, పొటాటో నుంచి తయారుచేస్తున్నాయి.
మాల్టోజ్
-ఇది బార్లీ గింజల్లో ఉండటంవల్ల మాల్ట్ షుగర్ అని అంటారు. దీన్ని ఆల్కహాల్ తయారీలో ఉపయోగిస్తారు.
లాక్టోజ్
-ఇది పాలకు తెలుపు రంగునిస్తుంది. కావున దీన్ని మిల్క్ షుగర్ అంటారు.
-పాలీశాకరైడ్లు: వీటిలో అనేక గ్లూకోజ్ అణువులు ఒకదానితో మరొకటి బంధించబడి ఉంటాయి. వీటి మధ్య బంధం ైగ్లెకోసిడిక్ బంధం. ఇవి నీటిలో సులభంగా కరగవు.
ఉదాహరణ: సెల్యులోజ్, స్టార్చ్, ైగ్లెకోజన్, ఖైటిన్
-ఇవి ఒకరకమైన పాలీమర్స్ అంటే నిర్మాణాత్మక ప్రమాణం పదేపదే పునరావృత్తమవడం.
-సహజ పాలీమర్స్: పట్టు, ఉన్ని, నూలు, రబ్బరు, కేంద్రక ఆమ్లాలు.
-కృత్రిమ పాలీమర్స్: పాలీవినైల్ క్లోరైడ్ (PVC), నైలాన్, టెరిలీన్, ప్లాస్టిక్.
-సెల్యులోజ్: ఇది ప్రపంచంలో అతి ఎక్కువగా ఉండే సహజ పాలీమర్.
-మొక్కల్లోని కణకవచంలో ఉండి, జంతువుల్లో లోపిస్తుంది.
-ఇది మానవుడిలాంటి మాంసాహారుల్లో జీర్ణం కాదు. కారణం సెల్యులోజ్ అనే ఎంజైమ్ లోపం. కానీ శాకాహారులలో ఈ ఎంజైమ్ ఉండటంవల్ల సెల్యులోజ్ జీర్ణమవుతుంది.
-స్టార్చ్: ఇది కూడా మొక్కల్లో మాత్రమే ఉండి, జంతువులలో లోపిస్తుంది.
ఉధాహరణ: వరి, గోధుమ, మొక్కజొన్న, పొటాటో
-ైైగ్లెకోజన్: ఇది జంతువులలో మాత్రమే ఉండి మొక్కల్లో లోపిస్తుంది. కావున దీన్ని యానిమల్ స్టార్చ్ అంటారు.
-ఇది కాలేయం, మెదడు, కండరాలలో నిల్వ ఉంటుంది.
-ఖైటిన్: ఇది కీటకాల (బొద్ధింక) బాహ్య అస్థిపంజరంలో, శిలీంధ్రాల (ఫంగస్) కణకవచంలో ఉంటుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు