స్వయంచోదిత నాడీ వ్యవస్థ ఎందుకు తోడ్పడుతుంది? (బయాలజీ)
1. నాడీకణంలో నిస్సల్ కణాలు ఏ భాగంలో ఉంటాయి?
1) ఎక్సాన్ 2) సైటాన్
3) డెండ్రైట్లు 4) రన్వీర్ కణుపులు
2. జతపరచండి
1. మస్తిష్కం ఎ. మింగడం, దగ్గడం, వాంతులనియంత్రణ
2. అనుమస్తిష్కం బి. భావోద్వేగాలకు కేంద్రం
3. ద్వారగోర్థం సి. శరీర సమతాస్థితి
4. మజ్జాముఖం డి. మానసిక సామర్థ్యాలకు స్థావరం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
4) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
3. మెదడును కప్పుతూ ఉండే పొరలు వరుసగా
1) తాతికళ-మృద్యి-వరాశిక
2) వరాశిక-మృద్యి-తాతికళ
3) వరాశిక-తాతికళ-మృద్యి
4) మృద్యి-తాతికళ-వరాశిక
4. మెదడు ఉపరితల వైశాల్యం పెంచడానికి మస్తిష్కార్థ గోళంపై ఉండే నిర్మాణాలు
1) కార్పస్కెలోసం, క్రూరాసెరిబ్రై
2) గైరి, సల్సి
3) పాన్స్‌వెరోలి, మజ్జాముఖం
4) వరాశిక, మృద్యి
5. కపాల, కశేరునాడులు వరుసగా
1) 12 జతలు, 21 జతలు
2) 31 జతలు, 12 జతలు
3) 12 జతలు, 31 జతలు
4) 12 జతలు, 23 జతలు
6. ప్రతీకార చర్యాచాపపు సరైన మార్గం
1) గ్రాహకం-చాలకనాడి-మధ్యస్థ నాడీ కణం-జ్ఞాననాడి-నిర్వాహక అంగం
2) గ్రాహకం-మధ్యస్థ నాడీకణం-జ్ఞాననాడి- చాలకనాడి-నిర్వాహక అంగం
3) గ్రాహకం-జ్ఞాననాడి-మధ్యస్థ నాడీకణం- చాలకనాడి-నిర్వాహక అంగం
4) గ్రాహకం-మధ్యస్థ నాడీకణం-జ్ఞాననాడి- నిర్వాహక అంగం-చాలకనాడి
7. జతపరచండి
1. ఘ్రాణలంబికలు ఎ. రైనోసిల్
2. మస్తిష్క గోళార్థాలు బి. పారాసిల్
3. మజ్జాముఖం సి. మయోసిల్
4. మధ్యమెదడు డి. క్రూరాసెరిబ్రై
1) 1-బి, 2-సి, 3-ఎ, 4-బి
2) 1-బి, 2-ఎ, 3-సి, 4-బి
3) 1-సి, 2-బి, 3-ఎ, 4-సి
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
8. సరైన జవాబును గుర్తించండి
1. మెదడు బయటవైపు లేత బూడిదరంగు పదార్థం, లోపలి వైపు తెలుపు రంగు పదార్థం ఉంటాయి
2. ఒక నాడీ కణం నుంచి మరో నాడీ కణానికి సమాచారాన్ని చేరవేసే క్రియాత్మక భాగం తాంత్రికాక్షం
3. వెన్నుపాము బయటవైపు తెలుపురంగు పదార్థం, లోపలి వైపు బూడిదరంగు పదార్థం ఉంటాయి
4. పరిధీయ నాడీవ్యవస్థలో 42 జతల కపాలనాడులుంటాయి
1) 2, 4 2) 1, 3
3) 1, 4 4) అన్నీ సరైనవే
9. అతిపెద్ద, అతిచిన్న కపాలనాడులు
1) 1-ఘ్రాణనాడులు, 6-అబ్డుసెన్స్ నాడులు
2) 6- అబ్డుసెన్స్ నాడులు, 10-వాగస్ నాడి
3) 4-అనుభూతనాడులు, 6-అబ్డుసెన్స్ నాడులు
4) 10-వాగస్ నాడులు, 6-అబ్డుసెన్స్ నాడులు
10. కింది వాటిలో కేంద్రక నాడీ వ్యవస్థలోని భాగాలు
1) మెదడు-కపాల నాడులు
2) వెన్నుపాము-కశేరు నాడులు
3) మెదడు-వెన్నుపాము
4) కపాలనాడులు-కశేరునాడులు
11. సరికాని జతను గుర్తించండి
1) మధ్యమెదడు-మస్తిష్కం
2) ముందు మెదడు-ద్వారగోర్థం
3) వెనుకమెదడు-అనుమస్థిష్కం
4) వెనుకమెదడు-మజ్జాముఖం
12. మానవుని మొత్తం శరీర బరువులో మెదడు 2 శాతం ఉన్నప్పటికీ ఎంతశాతం ఆక్సిజన్‌ను గ్రహిస్తుంది?
1) 50% 2) 30%
3) 40% 4) 20%
13. రక్తపీడనం, శరీర ఉష్ణోగ్రత, నిద్ర, ఆకలి కేంద్రాలను నియంత్రించే మెదడులోని భాగం?
1) అనుమస్తిష్కం 2) ద్వారగోర్థం
3) మస్తిష్కం 4) మజ్జాముఖం
14. కంటిపాప వ్యాసాన్ని నియంత్రిస్తూ కాంతిని లోపలికి పోవడానికి తోడ్పడే నాడీ వ్యవస్థ?
1) సహానుభూతి నాడీ వ్యవస్థ
2) సహానుభూతి పరనాడీవ్యవస్థ
3) స్వయంచోదిత నాడీ వ్యవస్థ
4) పరిధీయనాడీ వ్యవస్థ
15. శ్వాసక్రియ, హృదయ స్పందన, నాడీ స్పందన వంటి అనియంత్రిత చర్యలను నియంత్రించే మెదడులోని భాగం?
1) ద్వారగోర్థం 2) మజ్జాముఖం
3) అనుమస్తిష్కం 4) ఘ్రాణలంబికలు
16. కర్వోరా క్వాడ్రిజెమినా అంటే?
1) కాలాంచిక వెనుక ఉన్న గుండ్రని ఉబ్బెత్తు నిర్మాణం
2) మస్తిష్కార్థగోళాలు రెండింటినీ కలిపే అడ్డుపట్టి
3) మధ్యమెదడులోని నాలుగు దృష్టి లంబిక లను ఏర్పరిచే పట్టి
4) అనుమస్తిష్కం కుడి, ఎడమ అర్ధ భాగా లను కలిపే అడ్డుపట్టి
17. స్టెరాయిడ్ హార్మోన్ల జతను గుర్తించండి
1) ఇన్సులిన్-గ్లూకాగాన్
2) ఆక్సిటోసిన్-వాసోప్రెసిన్
3) ఈస్ట్రోజన్-ప్రొజెస్టిరాన్
4) ఎఫినెఫ్రిన్-నార్ఎఫినెఫ్రిన్
18. ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం నుంచి ఉత్పన్నమయ్యే హార్మోన్?
1) మెలనోనిన్ 2) థైరాక్సిన్
3) ఇన్సులిన్ 4) గ్లూకాగాన్
19. కొవ్వుల్లో కరిగే హార్మోన్ల జతను గుర్తించండి
1) ప్రొటీన్, పెప్టెడ్ హార్మోన్లు
2) స్టెరాయిడ్, థైరాయిడ్ హార్మోన్లు
3) అమైనో, అవటు హార్మోన్లు
4) 1, 2
20. సరైన జవాబును గుర్తించండి
1. పీయూష గ్రంథి సెల్లాటార్సికా అనే గుంటలో ఇమిడి ఉంటుంది
2. ఈ గ్రంథిలో ఎడినోహైపోఫైసిస్, న్యూరోహైపోఫైసిస్ అనే భాగాలుంటాయి
3. ఈ గ్రంథిని ‘మాస్టర్గ్లాండ్’ అని కూడా అంటారు
4. ఈ గ్రంధిలో పార్స్ ఇంటర్ మీడియా ఉంటుంది
1) 1, 4 2) 2, 3
3) 3, 4 4) అన్నీ సరైనవే
21. స్త్రీ జీవుల్లో అండోత్సర్గాన్ని, కార్పస్లూటియం ఏర్పడటాన్ని ప్రేరేపించే హార్మోన్?
1) ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్
2) ప్రోలాక్టిన్ 3) ప్రొజెస్టిరాన్
4) లూటినైజింగ్ హార్మోన్
22. ఏ గ్రంథిని ప్రోటోకార్డేట్లోలలో ఎండోస్టెల్కు సమజాతం అయిన గ్రంథిగా పేర్కొంటారు?
1) పీనియల్ గ్రంథి
2) పార్శ అవటు గ్రంథి
3) అవటు గ్రంథి 4) అధివృక్క గ్రంథి
23. జతపరచండి
1. వాసోప్రెసిన్ ఎ. అవటుగ్రంథి
2. పారాథార్మోన్ బి. బాలగ్రంథి
3. థైరాక్సిన్ సి. యాంటీడయూరెటిక్ హార్మోన్
4. థైమోసిస్ డి. పార్శ అవటు గ్రంథి
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
4) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
24. ఏ గ్రంథిలోని పుటికా పార్శ కణాలు కాల్సిటో సిన్ అనే హైపోకాల్సీమిక్ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తాయి?
1) పీయూష గ్రంథి 2) అధివృక్క గ్రంథి
3) అవటు గ్రంథి 4) పీనియల్ గ్రంథి
25. శిషుజనన సమయంలో గర్భాశయ కుడ్యంలోని కండరాల సంకోచాన్ని పెంచి శిశుజననానికి తోడ్పడే హార్మోన్?
1) ఆల్టోస్టిరాన్ 2) వాసోప్రెసిన్
3) ఆక్సిటోసిన్ 4) ప్రొలాక్టిన్
26. ఉభయజీవులలో రూపవిక్రియకు అవసర మయ్యే హార్మోన్?
1) థైరాక్సిన్ 2) ఆల్టోస్టిరాన్
3) కార్టిసాల్ 4) మెలటోనిన్
27. రక్తంలో కాల్షియం, పాస్ఫేట్ల స్థాయిని నియంత్రించే హార్మోన్?
1) కాల్సిట్రయోల్ 2) కాల్సిటోసిన్
3) థైమోసిస్ 4) రిలాక్సిన్
28. అథివృక్క గ్రంథి వల్కలంలోని ఏ భాగం మినరలోకార్టికాయిడ్లని స్రవిస్తుంది?
1) జోనా ఫాసిక్యులేటా
2) జోనా రెటిక్యులారిస్
3) జోనా కార్టికోసా
4) జోనా గ్లోమరూలోసా
29. పోరాట లేదా పలాయన హార్మోన్ అని దేన్ని అంటారు?
1) ఎడ్రినలిన్ 2) సొమాటోస్టాటిన్
3) వాసోప్రెసిన్ 4) థైరాక్సిన్
30. అసత్య వాక్యాన్ని గుర్తించండి
1. పిట్యూటరీ గ్రంథి మెలటోనిన్ అనే హార్మోన్‌ను స్రవిస్తుంది
2. థైమస్ గ్రంథి మెడ జీవుల్లో క్షీణించి ఉంటుంది
3. గ్లూకోకార్టికాయిడ్స్ కార్బోహైడ్రేట్ల, ప్రోటీన్ల కొవ్వుల జీవక్రియలను క్రమబద్ధం చేస్తాయి
4. అధివృక్క గ్రంథులు మూత్రపిండంపై టోపీ ఆకారంలో ఉంటాయి
1) 3, 4 2) 1
3) 1, 2, 3 4) అన్నీ అసత్య వాక్యాలే
31. జతపరచండి
1. ఆల్ఫాకణాలు ఎ. గ్లూకాగాన్
2. బీటాకణాలు బి. ఇన్సులిన్
3. డెల్టా కణాలు సి. సొమాటోస్టాటిన్
4. ఎఫ్ కణాలు డి. పాంక్రియాటిక్ పాలిపెప్టెడ్
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
32. జతపరచండి
1. కార్టిసాల్ ఎ. కషింగ్ సిండ్రోం
2.ఆల్డోస్టిరాన్ బి. అడిసన్స్ వ్యాధి
3. వాసోప్రెసిన్ సి. డయాబెటిస్ ఇన్సిపిడిస్
4. ఇన్సులిన్ డి. డయాబెటిస్ మిల్లిటస్
1) 1-బి, 2-సి, 3-ఎ, 4-బి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
33. గర్భధారణ కోసం గర్భాశయాన్ని సిద్ధంచేసే హార్మోన్?
1) రిలాక్సిన్ 2) ఈస్ట్రోజన్
3) ప్రొజెస్టిరాన్
4) ఫోలికల్ స్టిములేటింగ్ హార్మోన్
34. పిత్తాశయ సంకోచాన్ని, అడ్డి సంవరిణి సడలికను, క్లోరోస్ స్రావాన్ని ప్రేరేపించే హార్మోన్?
1) సెక్రిటిన్ 2) యాంటిరోగాస్ట్రోన్
3) పెప్సిన్ 4) కోలిసిస్టోకైనిన్
35. ఏ గ్రంథిని అంతఃస్రావక, బహిస్రావక గ్రంథి అని పిలుస్తారు?
1) కాలేయం 2) అవటుగ్రంథి
3) క్లోమం 4) అధివృక్క గ్రంథి
36. ప్రౌఢ దశలో పెరుగుదల హార్మోన్ లోపించడం వల్ల కలిగే వ్యాధి?
1) అతిదీర్ఘకాయత్వం 2) మరుగుజ్జుతనం
3) ఎక్రోమెగాలి 4) గ్రేమ్స్
37. వాసోప్రెసిన్ లోపించడంవల్ల మూత్ర విసర్జన పరిమాణం పెరిగినప్పుడు కలిగే స్థితిని ఏమంటారు?
1) డయాబెటిస్ మిల్లిటస్
2) డయాబెటిస్ ఇన్సిపిడిస్
3) అల్కోప్టన్యూరియా
4) గ్లూకోసూరియా
38. ప్రౌఢ మానవునిలో హైపోథైరాయిడిజం ఏ స్థితికి దారితీస్తుంది?
1) క్రెటినిజం 2) మిక్సెడిమా
3) ఎడిమా 4) జైగాంటిజం
39. హైపోథైరాయిడిజపు అతిసాధారణ రూపం ఏ వ్యాధికి దారితీస్తుంది?
1) సామాన్య గాయిటర్
2) ఎక్సాఫ్తాల్మిక్ గాయిటర్
3) గ్రేమ్స్ వ్యాధి 4) మిక్సోడిమా
40. కార్టిసాల్ అధికంగా స్రవించడం వల్ల సంభవించే స్థితి?
1) అడిసన్స్ వ్యాధి 2) గ్రేవ్స్ వ్యాధి
3) క్రెటినిజం 4) కషింగ్సిండ్రోం
41. రక్తంలో గ్లూకోజ్ పరిమాణం ఎక్కువయితే మూత్రం ద్వారా బయటకు వచ్చే స్థితి?
1) పాలియూరియా 2) పాలిడిప్సియా
3) గ్లెకోసురియా 4) ఎమెనోరియా
42. క్లోమంలోని లాంగర్‌హాన్స్ పుటికలు ఇన్సులిన్ హార్మోన్‌ను విడుదల చేయకపోతే కలిగే స్థితి?
1) డయాబెటిస్ ఇన్సిపిడిస్
2) డయాబెటిస్ మిల్లిటస్
3) హైపర్ ఇన్సులిజం
4) జువినైల్ డయాబెటిస్
43. జతపరచండి
1. థైరాయిడ్ దినోత్సవం ఎ. అక్టోబర్ 20
2. డయాబెటిస్ దినోత్సవం
బి. మే-25
3. ఆస్టియోఫోరోసిస్ దినోత్సవం
సి. నవంబర్ 14
4. హైపర్‌టెన్షన్ డి. మే-17
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
4) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
44. మెదడు విడుదల చేసే హార్మోన్ల జతను గుర్తించండి
1) డోపమైన్-ఎండార్ఫిన్
2) ఆక్సిటోసిన్ వాసోప్రెస్సిన్
3) ఎఫినెఫ్రిన్-నార్ఎఫినెఫ్రిన్
4) సెరటోనిన్-ఆక్సిటోసిన్
45. జీర్ణాశయంలో ఉత్పత్తి అయి ఆకలి కోరికలను కలిగించే హార్మోన్?
1) లెఫ్టిన్ 2) సెక్రిటిన్
3) పెప్సిన్ 4) గ్రిలీన్(ghrelin)
46. ఎండోకైనాలజీ పితామహుడిగా ఎవరిని పరిగణిస్తారు?
1) పాల్ఎర్లిచ్ 2) థామస్ అడిసన్
3) స్టార్లింగ్ 4) కస్మిర్ ఫంక్
జవాబులు
1.2 2.2 3.2 4.2 5.3 6.3 7.4 8.2 9.4 10.3 11.1 12.4 13.2 14.3 15.2 16.3
17.3 18.1 19.2 20.4 21.4 22.3 23.4 24.3 25.3 26.1 27.2 28.4 29.1 30.2 31.3 32.3
33.3 34.4 35.3 36.3 37.2 38.2 39.3 40.2 41.3 42.2 43.3 44.1 45.4 46.2
ఏవీ సుధాకర్
స్కూల్ అసిస్టెంట్
జడ్పీహెచ్ఎస్
లింగంపల్లి
రంగారెడ్డి జిల్లా
9000674747
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు