అతిపెద్ద పత్రంగల మొక్క ఏది?
పత్రం
పత్రం (Leaf) అనేది కాండం, శాఖలపై పార్శంగా ఏర్పడే బల్లపరుపుగా ఉండే నిర్మాణం.
నోట్: అతిపెద్ద పత్రం- విక్టోరియారిజాయా, విక్టోరియాఅమోజొనికా (15-18మీటర్లు)
పొడవైన పత్రం- రాఫియా వినిఫెరా (10-15 మీ.)
-అతిచిన్న పత్రం గల ఆవృత బీజం- ఉల్ఫియా(0.1 mm)
-అతిపెద్ద పొడవైన ఆవృత బీజం- యాకలిప్టస్ రెగ్నన్స్ (114 మీ.)
-ఒకే పత్రం గల మొక్క-మోనోఫిల్లియా
-రెండు పత్రాలు గల మొక్క-వెల్విట్చియా( వివృతబీజం).
-పత్రం కణుపు వద్ద అభివృద్ధి చెంది గ్రీవంలో మొగ్గను (axillary bud) కలిగి ఉంటుంది. ఈ గ్రీవపు మొగ్గ తరువాత శాఖగా అభివృద్ధి చెందుతుంది.
-సాధారణ పత్రంలో మూడు ప్రధాన భాగాలు ఉంటాయి. అవి.. పత్రపీఠం (leaf base), పత్రవృంతం (petiole), పత్రదళం (leaf lamina)
పత్రపీఠం-కాండానికి పత్రం పత్రపీఠం ద్వారా అతుక్కుని ఉంటుంది.
-పత్రపీఠం ఇరువైపులా చిన్న పత్రాలు లాంటి పత్రపుచ్చాలు( stipules) ఉంటాయి.
-ఏకదళబీజ మొక్కలలో పత్రపీఠం విస్తరించి కాండాన్ని పాక్షికంగా/పూర్తిగా ఒక ఒరలా చుట్టుకొని ఉంటుంది.
-కొన్ని లెగ్యుమినేసి కుటుంబానికి చెందిన మొక్కలలో పత్రపీఠం ఉబ్బిఉంటుంది. దీన్ని తల్పం లాంటి (pulvinus) పత్రపీఠం అంటారు.
పత్రవృంతం
-పత్రపీఠం నుంచి పత్రదళానికి మధ్యగల నిర్మాణాన్ని పత్రవృంతం అంటారు.
-ఇది పత్రదళానికి కాంతి సోకేలా, పత్రదళాన్ని గాలిలో ఊడే లా చేస్తుంది. దీనివల్ల పత్రం చల్లపరచబడి పత్ర ఉపరితలానికి స్వచ్చమైన గాలి చేరుతుంది.
పత్రదళం
-పత్రవృంతం చివరన ఈనెలు (venis), పిల్లఈనెలు ( veinlets) కలిగిన ఆకుపచ్చని భాగాన్ని పత్రదళం అంటారు.
-సాధారణంగా పత్రదళం మధ్య ఉండే ప్రధానమైన ఈనెను నడిమిఈనె (midrib) అంటారు.
-ఈనెలు పత్రదళానికి పటుత్వాన్ని కలుగజేస్తూ నీరు, ఖనిజాలు, పోషకపదార్థాల రవాణాకు మార్గాలుగా ఉంటాయి.
-పత్రదళంలో పత్రరంధ్రాలు ఉంటాయి. పై భాగంలో తక్కువ పత్రరంధ్రాలు, కింది భాగంలో ఎక్కువ పత్రరంధ్రాలు ఉంటాయి. వీటిని ఆవరించి మూత్రపిండ ఆకారంలోగల రక్షక కణాలు ఉంటాయి.
ఈనెల వ్యాపనం
-పత్రదళంలో ఈనెలు (పత్రంలో ఉండే గీతల వంటి నిర్మాణాలు) పిల్లఈనెలు అమరిఉండే విధానాన్ని వ్యాపనం (venation) అంటారు. ఇది రెండు రకాలుగా ఉంటుంది. అవి..
-జాలాకార ఈనెల వ్యాపనం (Reticulate venation)
-సమాంతర ఈనెల వ్యాపనం (Parallel venation)
జాలాకార ఈనెల వ్యాపనం
-పిల్ల ఈనెలు వలలాగా ఏర్పడితే దాన్ని జాలాకార ఈనెల వ్యాపనం అంటారు.
ఉదా: ద్విదళబీజ పత్రాలు జాలాకార ఈనెల వ్యాపనాన్ని కలిగి ఉంటాయి.
సమాంతర ఈనెల వ్యాపనం
-పత్రదళంలో ఈనెలు ఒకదానికొకటి సమాంతరంగా అమరిఉంటే దాన్ని సమాంతర ఈనెల వ్యాపనం అంటారు.
ఉదా: అనేక ఏకదళ బీజ పత్రాలు సమాంతర ఈనెల వ్యాపనాన్ని కలిగి ఉంటాయి.
ఈనెల విధి
-ఈనెలు పత్రదళానికి పటుత్వాన్ని కలుగజేస్తాయి.
-ఈనెలు నోరు, ఖనిజాలు, పోషకపదార్థాల రవాణాకు మార్గాలుగా ఉంటాయి.
పత్రవిన్యాసం
-కాండంపైన/ శాఖలపైన పత్రాలు అమరి ఉండే విధానాన్ని పత్రవిన్యాసం (phyllotaxy) అంటారు.
-ఈనెలు నీరు, ఖనిజాలు, పోషకపదార్థాల రవాణకు మార్గాలుగా ఉంటాయి.
పత్రవిన్యాసం -కాండంపైన/ శాఖలపైన పత్రాలు అమరి ఉండే విధానాన్ని పత్రవిన్యాసం (phyllotaxy) అంటారు.
-ఇది మూడు రకాలుగా ఉంటుంది. అవి
-ఏకాంతర పత్రవిన్యాసం (alternate phyllotaxy)
-అభిముఖ పత్రవిన్యాసం (opposite phyllotaxy)
-చక్రీయ పత్రవిన్యాసం (whorled hyllotaxy)
ఏకాంతర పత్రవిన్యాసం
-పత్రకణుపు వద్ద ఒకే పత్రం ఏకాంతరంగా ఏర్పడితే దానిని ఏకాంతర పత్రవిన్యాసం అంటారు.
ఉదా: మందార (హైబిస్కస్ రోజాసైనెన్సిస్)
ఆవ (mustard), సూర్యకాంతం (sunflower)
అభిముఖ పత్రవిన్యాసం
-ప్రతి కణుపు వద్ద రెండు పత్రాలు ఏర్పడి ఎదురెదురుగా అమరి ఉంటే దానిని అభిముఖ పత్రవిన్యాసం అంటారు.
ఉదా: జిల్లేడు (కెలోట్రాపిస్)
జామ (guava)
చక్రీయ పత్రవిన్యాసం
-ప్రతికణుపు వద్ద రెండు కంటే ఎక్కువ పత్రాలు ఏర్పడి వలయంగా అమరి ఉంటే దానిని చక్రీయ పత్రవిన్యాసం అంటారు.
ఉదా: గన్నేరు (నీరియం), ఆల్స్టోనియా (alastonia)
పత్ర రూపాంతరాలు (modifications of leaves)
-కిరణజన్య సంయోగక్రియ గాక వివిధ రకాలు విధులను నిర్వర్తించడానికి పత్రంలో కలిగే మార్పులను పత్రరూపాంతరాలు అంటారు.
-పత్రరూపాంతరాలు కింది రకాలుగా ఉంటాయి.
a. నులితీగలు (tenderils)
-మొక్క ఎగబాకడం కోసం పత్రాలు సన్నని పొడవైన నిర్మాణాలుగా రూపాంతరం చెందుతాయి.
ఉదా: బఠాని(pea)
b. కంటకాలు (spines)
-మొక్కలో బాష్పోత్సేకాన్ని( transpiration) తగ్గించడానికి, మొక్కకు రక్షణ కోసం పత్రాలు దృఢమైన కంటకాలు రూపాంతరం చెందుతాయి.
ఉదా: ఒపన్షియ
c. కండగల పత్రాలు (fleshy leaves)
-కొన్ని మొక్కలలో ఆహార పదార్ధాలను నిలువచేయడానికి పత్రాలు కండగల పత్రాలుగా రూపాంతరం చెందుతాయి.
ఉదా: నీరుల్లి (onian), వెల్లుల్లి (garlic)
d. ప్రభాసనాలు (phyllodes)
-కొన్ని మొక్కలలో పిచ్చాకార సంయుక్త పత్రంలో గల పత్రకాలు చిన్నవిగా ఉండి లేత దశలోనే రాలిపోతాయి. ఈ మొక్కలలో పత్రవృంతాలు విస్తరించి, ఆకుపచ్చగా మారి ఆహారపదార్థాలను తయారుచేస్తాయి. (కిరణజన్య సంయోగక్రియను జరుపుతాయి) వీటినే ప్రభాసనాలు అంటారు.
ఉదా: ఆస్ట్రేలియా తుమ్మ( ఆస్ట్రేలియా అకేసియా)
e. కీటకాహార ( బోను) మాంసాహార పత్రాలు
-కొన్ని మొక్కలలో పత్రాలు నత్రజని సంబంధ పదార్థాల కోసం రూపాంతరం చెంది కీటకాలను బంధిస్తాయి. వీటినే కీటకాహార మాంసాహార పత్రాలు (Insectivorous/ carnivorous/leaves) అంటారు.
ఉదా: డయోనియా-venusfly Trap
నెఫంథిస్- కూజా మొక్క (pitcher plant)
యుట్రిక్యులేరియా- Bladder wort
డ్రాసిరా- Sundew plant
f. ప్రత్యుత్పత్తి పత్రాలు (Reproduction leaves)
-కొన్ని మొక్కలు శాఖీయ వ్యాప్తిలో (vegetatine propagation) తోడ్పడటం కోసం వాటి పత్రపు అంచుల్లో గల గుంటల్లో ఏర్పడ్డ పత్రోపరిస్థిత మొగ్గలు (epiphyllousbuds) పత్రం నుంచి విడిపోయి అబ్బురపు వేర్లను ఏర్పరచుకొని స్వత్రంత్ర మొక్కలుగా వృద్ధిచెందుతాయి.
ఉదా: బ్రయోఫిల్లం (రణపాల)
పత్రం విధులు (Functions of Leaf)
-కిరణజన్యసంయోగ క్రియ జరుపడం.
-పత్రరంధ్రాల ద్వారా వాయువుల మార్పిడి జరుపడం.
-పత్రరంధ్రాల ద్వారా భాష్పోత్సేకం జరుపడం.
గమనిక: పత్రరంధ్రాల ద్వారా నీరు ఆవిరి రూపంలో కోల్పోవడాన్ని బాష్పోత్సేకమని, బిందువుల రూపంలో కోల్పోవడాన్ని బిందుస్రావమని (గట్టేషన్) అంటారు.
ప్రాక్టీస్ బిట్స్
1. రెండు పత్రాలుగల మొక్క ఏది?
1) మోనో ఫిల్లియా 2) వెల్ విట్చియా
3) ఉల్ఫియా 4) యూకలిప్టస్
2. అతిపెద్ద పత్రంగల మొక్క ఏది?
1) రాఫియా వినిఫెరా 2) యూకలిప్టస్
3) విక్టోరియా రిజియా 4) వెల్ విట్చియా
3. కింది వాటిలో పత్ర భాగం కానిది ఏది?
1) ప్రథమ మూలం 2) పత్రపీఠం
3) పత్రదళం 4) పత్రవృంతం
4. తల్పం లాంటి (Pelvinus) పత్రపీఠంగల మొక్కలు ఏవి?
1) ఫాబేసీ కుటుంబపు మొక్కలు
2) లెగ్యుమినేషి కుటుంబపు మొక్కలు
3) ఆర్కిడేసి కుటుంబపు మొక్కలు
4) సొలనేసి కుటుంబపు మొక్కలు
5. కింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది?
1) ద్విదళబీజ పత్రాలు జాలాకార ఈనెల వ్యాపనాన్ని కలిగి ఉంటాయి
2) ద్విదళబీజాలు జాలాకార ఈనెల వ్యాపనాన్ని కలిగి ఉండవు
3) ఏకదళబీజాలు సమాంతర ఈనెల వ్యాపనాన్ని కలిగి ఉండవు
4) ఏకదళబీజాలు జాలాకార ఈనెల వ్యాపనాన్ని కలిగి ఉంటాయి
6. మందార, ఆవ, సూర్యకాంతం మొక్కల పత్రాల్లో ఉండే పత్రవిన్యాస రకం ఏది?
1) చక్రీయ పత్రవిన్యాసం
2) అభిముఖ పత్రవిన్యాసం
3) ఏకాంతర పత్రవిన్యాసం
4) చక్రీయ, అభిముఖ పత్రవిన్యాసం
7. గన్నేరు, ఆల్స్టోనియాలోని పత్రవిన్యాసం ఏది?
1) చక్రీయ పత్రవిన్యాసం
2) అభిముఖ పత్రవిన్యాసం
3) ఏకాంతర పత్రవిన్యాసం
4) చక్రీయ, అభిముఖ పత్రవిన్యాసం
8. కింది వాటిలో తప్పుగా ఉన్న జత ఏది?
1) డ్రాసిరా – సన్ డ్యూ ప్లాంట్
2) నెపంథిస్ – కూజా మొక్క
3) యుట్రిక్యులేరియా – వీనస్ ైఫ్లె ట్రాప్
4) డయోనియా – వీనస్ ైఫ్లె ట్రాప్
9. కీటకాహార, మాంసాహార పత్రాలుగల మొక్క ఏది?
1) నెపంథిస్ 2) డయోనియా
3) యుట్రిక్యులేరియా 4) పైవన్నీ
10. ప్రత్యుత్పత్తి పత్రాలుగల మొక్క?
1) ఆస్ట్రేలియా తుమ్మ 2) బ్రయోఫిల్లం
3) బఠాని 4) నీరుల్లి
జవాబులు:
1-2, 2-3, 3-1, 4-2, 5-1,
6-3, 7-1, 8-3, 9-4, 10-2
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు