ఫలదీకరణం అనంతరం మొక్కల్లో విత్తనాలుగా వృద్ధి చెందేవి? ( జనరల్ సైన్స్)
94. కింది వాటిని సరిగా జతపర్చండి.
ఎ. ఏకలింగక పుష్పాలు 1. రఫ్లీషియా ఆర్నాల్డె
బి. ద్విలింగక పుష్పాలు 2. దోస, సొర, కాకర
సి. అతిపెద్ద పుష్పం 3. ఉల్ఫియా అంగుస్టా
డి. అతిచిన్న పుష్పం 4. మందార, ఉమ్మెత్త
1) ఎ-2, బి-4, సి-1, డి-3
2) ఎ-3, బి-1, సి-4, డి-2
3) ఎ-1, బి-3, సి-2, డి-4
4) ఎ-1, బి-2, సి-3, డి-4
95. కింది పుష్ప విన్యాసాలు, సంబంధిత మొక్కలను జతపర్చండి.
ఎ. సామాన్య అనిశ్చితం 1. వరి, మొక్కజొన్న
బి. కంకి 2. మల్బరి
సి. కాట్కిన్ 3. ఆవాలు, ముల్లంగి
డి. హైపన్థోడియం 4. ఫైకస్ (మరి)
1) ఎ-3, బి-1, సి-2, డి-4
2) ఎ-4, బి-2, సి-1, డి-3
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-4, బి-3, సి-2, డి-1
96. కింది పుష్ప విన్యాసాలు, సంబంధిత మొక్కలను జతపర్చండి.
ఎ. సయాథియమ్ 1. లామియేసి కుటుంబం మొక్కలు
బి. వర్టిసెల్లాస్టర్ 2. యుఫర్బియేసి కుటుంబం మొక్కలు
సి. సైమ్యూల్ 3. బోగన్విల్లియా, జాస్మిన్
డి. ఏకాంత నిశ్చితం 4. మందార, ఉమ్మెత్త
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-2, బి-1, సి-3, డి-4
4) ఎ-4, బి-3, సి-1, డి-2
97. కింది పుష్ప విన్యాసాలు, సంబంధిత మొక్కలను జతపర్చండి.
ఎ. శీర్షావత్ 1. గడ్డిచామంతి
బి. స్పాడిక్స్ 2. అరటి, కొబ్బరి, చేమ
సి. గుచ్ఛం 3. నీరుల్లి, క్యారెట్, కొత్తిమీర
డి. సమశిఖి 4. తంగేడు, కాలిఫ్లవర్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-3, బి-4, సి-1, డి-2
4) ఎ-2, బి-1, సి-4, డి-3
98. కింది పత్రరూపాంతరాలు, సంబంధిత మొక్కలను జతపర్చండి.
ఎ. ప్రబాసనం 1. నీరుల్లి, వెల్లుల్లి
బి. కండగల పత్రం 2. ఒపన్షియా
సి. కంటకాలు 3. బఠానీ
డి. నులితీగలు 4. ఆస్ట్రేలియా తుమ్మ
1) ఎ-4, బి-1, సి-2, డి-3
2) ఎ-4, బి-2, సి-1, డి-4
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-2, బి-1, సి-4, డి-3
99. కింది కీటకాహార మొక్కలు, వాటి సాధారణ నామాలను జతపర్చండి.
ఎ. డయోనియా 1. కూజా మొక్క
బి. నెపంథిస్ 2. బ్లాడర్ వర్ట్
సి. యుట్రిక్యులేరియా 3. Venus fly trap
డి. డ్రాసిరా 4. సన్డ్యూ ప్లాంట్
1) ఎ-4, బి-2, సి-1, డి-3
2) ఎ-3, బి-1, సి-2, డి-4
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-4, బి-3, సి-2, డి-1
100. కింది పత్రవిన్యాసాలు, సంబంధిత మొక్కలను జతపర్చండి.
ఎ. చక్రీయ పత్రవిన్యాసం 1. మందార, ఆవ, పొద్దు తిరుగుడు
బి. అభిముఖ పత్ర విన్యాసం 2. గన్నేరు, ఆల్స్టోనియా
సి. ఏకాంతర పత్రవిన్యాసం 3. జిల్లేడు, జామ
1) ఎ-2, బి-3, సి-1
2) ఎ-1, బి-3, సి-2
3) ఎ-3, బి-2, సి-1
4) ఎ-2, బి-1, సి-3
101. కింది మొక్కలు, వాటి ప్రత్యేకతలను జతపర్చండి.
ఎ. వెల్విట్చియా 1. ఒకే పత్రంగల మొక్క
బి. మోనోఫిల్లియా 2. రెండు పత్రాలుగల మొక్క
సి. రాఫియా వినిఫెరా 3. అతిపెద్ద పత్రంగల మొక్క
డి. విక్టోరియా రిజియా4. పొడవైన పత్రంగల మొక్క
1) ఎ-2, బి-1, సి-4, డి-3
2) ఎ-3, బి-4, సి-1, డి-2
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-4, బి-3, సి-2, డి-1
102. కింది కాండ రూపాంతరాలు, వాటి ఉదాహరణలను జతపర్చండి.
ఎ. పిలక మొక్క 1. ఫిస్టియా, ఐకార్నియా
బి. ఆఫ్సెట్లు 2. నీరియం, జాస్మిన్
సి. స్టోలన్లు 3. ఆక్సాలిస్, స్ట్రాబెరి, కొన్ని గడ్డి మొక్కలు
డి. రన్నర్లు 4. అరటి, చామంతి, అనాస
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-4, బి-1, సి-2, డి-3
4) ఎ-3, బి-2, సి-1, డి-4
103. కింది కాండ రూపాంతరాలు, వాటి ఉదాహరణలను జతపర్చండి.
ఎ. పత్రాభ కాండాలు 1. దోస, గుమ్మడి, పుచ్చ, ద్రాక్ష
బి. క్లాడోఫిల్లు 2. ఆస్పరాగస్ (పిల్లి తీగలు)
సి. కాండ నులితీగలు 3. బ్రహ్మజెముడు, నాగబాలు, సరుగుడు
డి. లఘులశునాలు 4. డయాస్కోరియా, అగేవ్ (కిత్తనార)
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-4, బి-1, సి-2, డి-3
4) ఎ-3, బి-2, సి-1, డి-4
104. కింది కాండ రూపాంతరాలు, వాటి ఉదాహరణలను జతపర్చండి.
ఎ. దుంపకాండం 1. కంద, చామగడ్డ
బి. కొమ్ము 2. బంగాళదుంప
సి. కందం 3. అల్లం, పసుపు
డి. లశునం 4. నీరుల్లి
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-2, బి-3, సి-1, డి-4
3) ఎ-4, బి-1, సి-2, డి-3
4) ఎ-3, బి-4, సి-2, డి-1
105. కింది వేరు రూపాంతరాలు, వాటి ఉదాహరణలను జతపర్చండి.
ఎ. సంతులనం జరిపే వేర్లు 1. టీనియోఫిల్లం
బి. స్వాంగీకరణ/కిరణజన్య సంయోగక్రియ వేర్లు 2. ఫిస్టియా
సి. బుడిపెవేర్లు 3. కంది, పెసర, బఠానీ, చిక్కుడు, వేరుశనగ
డి. హాస్టోరియల్/పరాన్నజీవ వేర్లు 4. విస్కమ్, స్ట్రెయిగ, కస్క్యుట
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-3, సి-4, డి-1
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-2, బి-1, సి-3, డి-4
106. కింది వేరు రూపాంతరాలు, వాటి ఉదాహరణలను జతపర్చండి.
ఎ. వెలామిన్ వేర్లు 1. వాండా, వానిళ్ల
బి. శ్వాసించే వేర్లు (శ్వాస మూలాలు)
2. చెరుకు, మొక్కజొన్న, జొన్న, వెదురు, మొగలి
సి. నిల్వచేసే వేర్లు/దుంపవేర్లు
3. రైజోపొరా, అవిసీనియా
డి. ఊతవేర్లు 4. క్యారెట్, ముల్లంగి, టర్నిప్
1) ఎ-2, బి-4, సి-3, డి-1
2) ఎ-1, బి-3, సి-4, డి-2
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-4, బి-3, సి-2, డి-1
107. విత్తన అంకురణకు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి.
ఎ. విత్తనాలు మొలకెత్తినప్పుడు బీజదళాలు భూమిలోపల ఉండిపోవడాన్ని వివిపారి అంకురణ అంటారు.
బి. ఫలాలు మొక్కలపై ఉన్నప్పుడు విత్తనాలు మొలకెత్తడాన్ని అధోభూమిజ అంకురణ అంటారు.
సి. విత్తనాలు మొలకెత్తినప్పుడు బీజదళాలు భూమిపైకి వస్తే ఊర్ధ భూమిజ అంకురణ అంటారు.
పై వాటిలో సరైనదాన్ని గుర్తించండి.
1) ఎ, బి 2) బి, సి 3) బి 4) సి
108. కింది వ్యాఖ్యలను పరిశీలించండి.
ఎ. విత్తనాలు మొలకెత్తడానికి నేల, నీరు, ఉష్ణోగ్రత, కాంతి అవసరం
బి. విత్తనం వెలుపలి పొర టెస్టా, లోపలి పొర టెగ్మినా
సి. విత్తనం.. విత్తనకవచం, పిండాన్ని కలిగి ఉంటుంది
డి. ఫలదీకరణ అనంతరం మొక్కల్లో అండాలు విత్తనాలుగా వృద్ధి చెందుతాయి
పై వాటిలో సరైనదాన్ని గుర్తించండి.
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, సి, డి
109. కింది వ్యాఖ్యలను చదవండి.
ఎ. పైనస్, మరి చెట్ల జీవితకాలం 300 ఏండ్లకు పైగా
బి. ఉల్ఫియా మొక్క జీవితకాలం రెండు వారాలు
సి. కాటర్ జీవితకాలం ఏడాది, అరటి జీవిత కాలం సమారుగా రెండేండ్లు, వరి జీవిత కాలం 3-7 నెలలు
డి. గులాబి జీవితకాలం ఐదేండ్లు, రాయల్ ఫెర్న్ జీవితకాలం 100 ఏండ్లకు పైగా
ఇ. మాస్ మొక్కల జీవితకాలం కొన్ని వారాలు
ఎఫ్. ఒక మామిడి చెట్టు జీవితకాలం, రావి చెట్టు జీవితకాలం కంటే తక్కువ
పై వాటిలో సరైన వ్యాఖ్యను గుర్తించండి.
1) ఎ, బి, సి, డి, ఇ 2) డి, ఇ, ఎఫ్
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్
110. కింది వ్యాఖ్యలను పరిశీలించండి.
ఎ. ఫలదీకరణం చెందకుండా ఫలం ఏర్పడితే దాన్ని అనిషేక ఫలం
బి. ఫలదీకరణ అనంతరం అండాశయం కాకుండా ఇతర భాగం ఫలంగా ఏర్పడితే నిజ ఫలం
సి. ఫలదీకరణ అనంతరం అండాశయం ఫలంగా ఏర్పడితే అనృత ఫలం
పై వాటిలో సరైనదాన్ని గుర్తించండి.
1) ఎ, సి 2) ఎ, బి 3) బి, సి 4) ఎ
111. కింది వ్యాఖ్యలను పరిశీలించండి.
ఎ. మొక్కల్లో ద్విఫలదీకరణం, ద్విసంయోగం జరుగుతుంది
బి. మొక్కల్లో త్రిఫలదీకరణం, త్రిసంయోగం జరుగుతుంది
సి. మొక్కల్లో ద్విఫలదీకరణం, త్రిసంయోగం జరుగుతుంది
డి. మొక్కల్లో త్రిఫలదీకరణం, ద్విసంయోగం జరుగుతుంది
పై వాటిలో సరైనదాన్ని గుర్తించండి.
1) ఎ, బి, సి 2) డి 3) సి 4) బి
112. కింది వ్యాఖ్యలను పరిశీలించండి.
ఎ. అండకోశం.. పుష్పంలో స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం
బి. కేసరం.. పుష్పంలో పురుష ప్రత్యుత్పత్తి భాగం
సి. పుష్పం మొగ్గ దశలో ఉన్నప్పుడు రక్షక, ఆకర్షక పత్రావళి అమరి ఉండే విధానాన్ని పుష్పరచన అంటారు
డి. పుష్పం అనేది మార్పు చెందిన ప్రకాండం
పై వాటిలో సరైనదాన్ని గుర్తించండి.
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి, డి
113. కింది వ్యాఖ్యలను పరిశీలించండి.
ఎ. పుష్పవిన్యాసాక్షం మీద పుష్పాలు అమరి ఉండటాన్ని పుష్పరచన అంటారు
బి. కాండం మొగ్గలను అగ్రస్థంగా లేదా గ్రీవస్థంగా కలిగి ఉంటుంది
సి. కాండం సాధారణంగా ప్రథమ అక్షం లేదా ప్రథమ కాండం నుంచి ఏర్పడుతుంది
డి. కాండంపై పత్రాలు ఏర్పడే ప్రాంతాలను కణుపు మధ్యమాలు అంటారు
పై వాటిలో సరైనదాన్ని గుర్తించండి.
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) సి, డి, ఎ 4) సి, డి
114. కింది వ్యాఖ్యలను పరిశీలించండి.
ఎ. వేరుపై కణుపులు, కణుపు మధ్యమాలు ఉంటాయి
బి. వేరు కొనభాగం వేరుతొడుగుచే రక్షించబడి ఉంటుంది
సి. నీటిపై తేలే మొక్కలకు వేరు తొడుగుకు బదులుగా రూట్ పాకెట్స్ ఉంటాయి
పై వాటిలో సరైనదాన్ని గుర్తించండి.
1) ఎ, బి 2) బి, సి 3) ఎ, సి 4) ఎ
115. కింది మొక్కలను, వాటి జీవిత కాలాలను బట్టి ఆరోహణ క్రమంలో అమర్చండి.
ఎ. పైనస్ బి. ఉల్ఫియా
సి. ఆస్ముండా డి. వరి
1) ఎ, బి, సి, డి 2) బి, డి, సి, ఎ
3) బి, సి, ఎ, డి 4) డి, సి, బి, ఎ
116. కింది మొక్కలను, వాటి జీవిత కాలాలను బట్టి అవరోహణ క్రమంలో అమర్చండి.
ఎ. క్యారెట్ బి. మరి సి. అరటి
డి. మాస్ మొక్క ఇ. గులాబి
1) ఇ, సి, డి, బి, ఎ 2) ఎ, బి, సి, డి, ఇ
3) ఇ, డి, సి, ఎ, బి 4) బి, ఇ, సి, ఎ, డి
117. కింది వాటిని పరిశీలించండి.
నిశ్చితం (A): మాంగ్రూవ్ మొక్కల్లో విత్తనాల అంకురణ అనేది అవి తల్లి మొక్కకు అంటిపెట్టుకుని ఉండగానే జరుగుతుంది
కారణం (R): పరిసరాల ఒత్తిడిని తగ్గించుకోవడానికి, పిల్ల మొక్కల స్థాపనకు శిశూత్పాదన ఒక వ్యూహంగా చెప్పవచ్చు.
1) A, R సరైనవి, A కు R సరైన వివరణ
2) A, R రెండూ సరైనవి, A కు R సరైన వివరణ కాదు
3) A సరైనది, కానీ R సరైనది కాదు
4) A సరైనది కాదు, కానీ R సరైనది
118. కింది వాటిని పరిశీలించండి.
నిశ్చితం (A): అనాసలోనూ, పనసలోనూ ఫలాలు సంయుక్త ఫలాలు
కారణం (R): అవి పుష్పవిన్యాసం నుంచి ఏర్పడ్డాయి
1) A, R రెండూ సరైనవి, A కు R సరైన వివరణ
2) A, R రెండూ సరైనవి, A కు R సరైన వివరణ కాదు
3) A సరైనది, కానీ R సరైనది కాదు
4) A సరైనది కాదు, కానీ R సరైనది
119. కింది వాటిని పరిశీలించండి.
నిశ్చితం (A): యాపిల్లో తినదగిన భాగం పుష్పాసనం
కారణం (R): అనాసలో తినదగిన భాగాలు విన్యాసాక్షం, పుష్ప పుచ్చాలు
1) A, R రెండూ సరైనవి, A కు R సరైన వివరణ
2) A, R రెండూ సరైనవి, A కు R సరైన వివరణ కాదు
3) A సరైనది, కానీ R సరైనది కాదు
4) A సరైనది కాదు, కానీ R సరైనది
120. కింది వాటిని పరిశీలించండి.
నిశ్చితం (A): సీతాఫలం సంకలిత ఫలానికి ఉదాహరణ
కారణం (R): ఒకే పుష్పానికి చెందిన బఫలదళ అసంయుక్త అండాశయం నుంచి సీతాఫలం ఏర్పడుతుంది
1) A, R రెండూ సరైనవి, A కు R సరైన వివరణ
2) A, R రెండూ సరైనవి, A కు R సరైన వివరణ కాదు
3) A సరైనది, కానీ R సరైనది కాదు
4) A సరైనది కాదు, కానీ R సరైనది
జవాబులు
94. 1 95.1 96.3 97.1 98.1 99.2 100.1 101.1 102.3 103.4 104.2 105.4 106.2 107.4 108.3 109.4
110.4 111.3 112.3 113.2 114.2 115.2 116.4 117.2 118.1 119.2 120.1
డాక్టర్ మోదాల మల్లేష్
విషయ నిపుణులు
పాలెం, నకిరేకల్, నల్లగొండ
9989535675
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు