న్యూజిలాండ్‌లో మాత్రమే నివసించే సజీవ శిలాజం ఏది?
సరీసృపాలు
సరీసృపాల అధ్యయనాన్ని హెర్పటాలజీ అంటారు.
పాకే జంతువులను సరీసృపాలు అంటారు.
ఇవి మొదటి సంపూర్ణ భూచర జీవులు.
ఇవి మొదటగా నఖాలు ఏర్పడిన జీవులు.
వీటి హృదయంలో మూడు గదులు ఉంటాయి (రెండు కర్ణికలు, ఒక జఠరిక).
శీతలరక్త జంతువులు (cold blooded).
వీటిని 4 క్రమాలుగా విభజించవచ్చు. అవి.. కీలోనియా, రింకోసెఫాలియా, క్రొకడీలియా, స్కామేట.
కీలోనియా
ఈ క్రమంలో తాబేళ్లను చేర్చారు.
సముద్ర తాబేళ్లను టర్టిల్స్ అని, మంచినీటి తాబేళ్లను టెర్రాఫిన్స్ అని, నేలపై నివసించే తాబేళ్లను టార్టాయిస్ అని అంటారు.
అత్యధిక కాలం జీవించే జంతువు – తాబేలు.
కీలోన్ – (సముద్ర తాబేలు) (టర్టిల్)
టెస్టుడో – (భౌమ తాబేలు) (టార్టాయిస్) ఇది అతిపెద్ద తాబేలు
ట్రయోనిక్స్ – (మంచినీటి తాబేలు) (టెర్రాఫిన్)
రింకోసెఫాలియా
దీనిలో స్పీనోడాన్ను (హట్టేరియా బల్లిని) చేర్చారు. ఇది న్యూజిలాండ్‌లో మాత్రమే నివసించే సజీవ శిలాజం (Living fossil).
క్రొకడీలియా
దీనిలో మొసళ్లను చేర్చారు. ఇవి బతికున్న సరీసృపాల్లో అతిపెద్దవి.
మొసలిలో 4 గదుల హృదయం ఉంటుంది.
క్రొకడైలస్ పాలుస్ట్రిస్ : భారతదేశ మొసలి/మగర్.
అలిగేటర్: ఇది అమెరికా, చైనాలో ఎక్కువగా కనబడుతుంది.
గేవియాలిస్ : గంగానది కాలుష్యం కారణంగా అంతరించిపోయే దశలో ఉన్న మొసలి.
స్కామేటా
దీన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి.. బల్లులు తొండలు, పాములు (సర్పాలు).
బల్లులు, తొండలు
వీటి అధ్యయనాన్ని సారాలజీ అంటారు.
హెమీడాైక్టెలస్
కెమిలియాన్ (ఊసరవెళ్లి): ఇది ఆత్మరక్షణ కోసం రంగులు మారుస్తుంది. ఒక కన్నుతో ముందుకు, మరొక కన్నుతో వెనుకకు చూస్తుంది.
డ్రాకో : ఎగిరే బల్లి
కెలోటిస్ : తొండ
కొమిడో డ్రాగన్ : అతిపెద్ద బల్లి
వెరానస్ (ఉడుము) : భారతదేశపు పెద్దబల్లి
ఇవి ఆధారాన్ని అంటిపెట్టుకుని పాకడానికి అంటుమెత్తలను కలిగి ఉంటాయి.
పాములు/సర్పాలు
వీటి అధ్యయనాన్ని ఒఫియాలజీ/సర్పెంటాలజీ అంటారు.
ఇవి పొలుసులు, పక్కటెముకల ద్వారా చలిస్తాయి.
పాముల పార్కు – చెన్నైలోని గిండి నేషనల్ పార్కు.
పాము కాటు వేసినప్పుడు ఒకటి లేదా రెండు మచ్చలు ఏర్పడితే విషసహితంగా, అనేక మచ్చలు/కాట్లు U ఆకారంలో వుంటే విషరహిత పాముగా గుర్తిస్తారు.
పాము విషాన్ని వీనమ్ అని దీనికి ఇచ్చే విరుగుడు మందును యాంటీ వీనమ్ అని అంటారు.
విష సర్పాలు
నాజానాజా (నాగుపాము): ఇది ఎలుకల సంఖ్యను నియంత్రిస్తుంది.
ఒఫియోఫాగస్ హన్న (రాచనాగు): విషసహిత సర్పాల్లో పెద్దది. ఇది పాములను తింటుంది. గూడు కట్టుకుంటుంది.
బంగారస్: దీన్నే కట్లపాము, క్రెయిట్ అంటారు.
డబోయ/వైపరాసెల్లి : దీన్ని గొలుసు రక్తపింజర అంటారు.
క్రొటాలస్ (రాటిల్ స్నేక్): దీని విషానికి విరుగుడు లేదు.
రస్సెల్స్ వైపర్: దీన్ని రక్తపింజర అంటారు.
హైడ్రోఫిస్ : దీన్ని సముద్ర పాము అంటారు.
విషరహిత సర్పాలు
ట్యాస్ (ర్యాట్ స్నేక్): దీన్ని జెర్రిగొడ్డు అంటారు.
ట్రిపిడోనోటస్: దీన్ని నీటిపాము లేదా నీరు కట్టె అని పిలుస్తారు.
అనకొండ: అతిపొడవైన పాము. అమెజాన్ అడవుల్లో ఉంటుంది.
డైనోసార్లు: వీటిని రాక్షస బల్లులు అంటారు. ఇవి అంతరించిన అతిపెద్ద సరీసృపాలు.
పాముల పేర్లు – వాటి విషాలు – అవి పనిచేసే భాగాలు
పాము పేరు – పాము విషం – పనిచేసే భాగం
నాగుపాము (నాజానాజా) – న్యూరోటాక్సిన్ – నాడీ వ్యవస్థ
రక్తపింజర (రస్సెల్స్ వైపర్) – హీమోటాక్సిన్ – రక్తప్రసరణ వ్యవస్థ
సముద్రపాము (హైడ్రోఫిష్) – మయోటాక్సిన్ – కండరాలు
పక్షులు
పక్షుల అధ్యయనాన్ని ఆర్నిథాలజీ అంటారు. పక్షుల వలసల అధ్యయనాన్ని ఫినాలజీ అని, పక్షుల గూళ్ల అధ్యయనాన్ని నిడాలజీ అని, పక్షి గుడ్ల అధ్యయనాన్ని ఉవాలజీ అని, పక్షి ఈకల అధ్యయనాన్ని టెరాలజీ అని అంటారు.
ఈకలు గల ద్విపాదులను పక్షులు అంటారు.
భారత పక్షి శాస్త్రవేత్త డాక్టర్ సలీం అలీ (పాల్గెట్టి బహుమతి గ్రహీత).
భారత్‌లో అతిపెద్ద పక్షి సంరక్షణ కేంద్రం – కియోలడియో ఘనా నేషనల్ పార్క్ (భరత్పూర్ బర్డ్ సాంక్చువరీ), రాజస్థాన్.
దక్షిణ అమెరికాను పక్షి ఖండం అంటారు.
పక్షుల్లో నాలుగు గదుల హృదయం ఉంటుంది.
ఇవి ఉష్ణరక్త జంతువులు.
పక్షుల్లో ధ్వని ఉత్పాదన జరిగే భాగం శబ్దిని (Syrinx).
ఎగిరే లక్షణం ఆధారంగా వీటిని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి..
1. ఎగరలేని పక్షులు (రాటిటే), 2. ఎగిరే పక్షులు.
ఎగరలేని పక్షులు
ఇవి పరిగెత్తే ఎగరలేని పక్షులు.
ఇవి విచ్ఛిన్న విస్తరణను ప్రదర్శిస్తాయి.
ఉదా: ఆస్ట్రిచ్ (నిప్పుకోడి), ఈము, పెంగ్విన్, కివి (ఎఫ్టెరిక్స్), డోడో, హంస, బాతు, కసోవరి, రియా (అమెరికా ఆస్ట్రిచ్).
ఎగిరే పక్షులు
ఇవి గాల్లో ఎగరగలిగే పక్షులు.
ఉదా: కొలంబా (పావురం), కార్వస్ (కాకి), సిట్టాక్యులా (రామచిలుక), పావోక్రిస్టేటస్ (నెమలి), యుడినామస్ (కోయిల), ఏసర్ పిచ్చుక, బ్యుబో (గుడ్ల గూబ), ఆల్ బట్రోస్, ఆర్కిటెక్ టెర్న్, గాడ్ విట్, ఉడ్‌కాక్, స్విఫ్ట్, బట్టమేకతల పిట్ట, జెర్డాన్ కోర్సర్ (కలివి కోడి), హుద్‌హుద్, హమ్మింగ్ బర్డ్, సైబీరియన్ కొంగ, కొరాషియస్ బెంగాలెన్సిస్ (పాలపిట్ట).
ఆర్కియోప్టెరిక్స్ లిథోగ్రాఫికా (బల్లిపక్షి) సరీసృపాలకు, పక్షులకు మధ్య సందాన సేతువు.
వర్షపు నీటిని మాత్రమే తాగే పక్షి చేతక్ పక్షి.
సూర్యుని కోసం ఎగిరే పక్షి – చకోర పక్షి (ఫీనిక్స్ పక్షి)
కోళ్ల పెంపకం (Poultry)
గుడ్ల కోసం/మాంసం కోసం/రెండింటి ఉత్పత్తి కోసం పెంపుడు రకపు కోళ్లు, నెమళ్లు, బాతులు, టర్కీ కోళ్లు, అడవి బాతులు, పావురాలు, ఈము పక్షుల పెంపకాన్ని పౌల్ట్రీ అంటారు.
డాక్టర్ బీవీ రావు భారతదేశ నవీన పౌల్ట్రీ పితామహుడు. ఈయన జాతీయ గుడ్ల సహకార సమాఖ్య (National Egg Coordination Committe-NECC) వ్యవస్థాపక అధ్యక్షుడు.
గుడ్ల కోసం పెంచే పక్షులను లేయర్లు అని, మాంసం కోసం పెంచే పక్షులను బ్రాయిలర్లు అని అంటారు.
కోడి పిల్లలని చిక్స్ అని, కోడి పిల్లలను ఉత్పత్తి చేసే యంత్రాన్ని బ్రూయరీ అని అంటారు.
కోళ్ల ముక్కును 1/3 వంతు కత్తిరించడాన్ని డీ బీకింగ్ అని, కోళ్ల తలపై ఉన్న మాంసయుత నిర్మాణాన్ని కత్తించే విధానాన్ని డుబ్బింగ్ అని, కోళ్లు గుడ్లను పొదగడాన్ని బ్రూడినెస్ అని అంటారు.
కోళ్లు గుడ్లు పొదగడానికి పట్టే కాలం 21 రోజులు.
గుడ్లు పొదగడానికి కావాల్సిన ఉష్ణోగ్రత 37 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 37.5 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు.
గుడ్లకు సంబంధించిన విప్లవం వెండి విప్లవం (సిల్వర్ రెవల్యూషన్).
క్షీరదాల అధ్యయనాన్ని మమ్మాలజీ అంటారు.
క్షీర గ్రంథులను కలిగివుండి పిల్లజీవులకు పాలిచ్చి పెంచే జంతువులను క్షీరదాలు అంటారు.
అతిచిన్న క్షీరదం కెట్టిస్ హాగ్నోస్డ్ బ్యాట్/బంబుల్ బీ బ్యాట్ (రెండు గ్రాముల బరువు ఉంటుంది). అతిపెద్ద క్షీరదం బెలనాప్టెరా మస్కులస్ (నీలి తిమింగలం).
క్షీరదాల దేహ ఉష్ణోగ్రత 98.4 డిగ్రీ ఫారెన్‌హీట్ లేదా 37 డిగ్రీ సెంటీగ్రేడ్ (36.9 డిగ్రీ సెంటీగ్రేడ్).
క్షీరదాల చర్మంపై వెంట్రుకలు/రోమాలు ఉంటాయి. వీటి గురించిన అధ్యయనాన్ని ట్రైకాలజీ అంటారు.
వీటిలో 4 గదుల హృదయం ఉంటుంది.
వీటిని ఉష్ణరక్త/స్థిరోష్ణ జంతువులు అంటారు.
వీటి చర్మం గ్రంథియుతంగా ఉంటుంది.
సెబేషియస్ గ్రంథులు సెబం అనే తైలాన్ని స్రవిస్తాయి. ఇది రోమాలు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది.
లాక్రిమల్ గ్రంథులు కన్నీటిని స్రవిస్తాయి. ఈ కన్నీళ్లలో లైసోజోమ్ ఎంజైమ్, సోడియం క్లోరైడ్ ఉంటాయి.
సెరుమినస్ గ్రంథులు చెవిలో మైనాన్ని స్రవిస్తాయి.
క్షీరదాలను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి..
1. ప్రొటోథీరియా/మోనోట్రిమ్లు
2. మెటాథీరియా/మార్సుపియేల్లు
3. యూథీరియా/నిజ జరాయుదారులు
ప్రొటోథీరియా/మోనోట్రిమేటా
ఇవి గుడ్లు పెట్టే క్షీరదాలు అయినప్పటికీ పిల్లలకు పాలిస్తాయి.
ఉదా: డక్‌బిల్డ్ ప్లాటిపస్ (ఆర్నిథోరింకస్), ఎకిడ్నా (స్పైనీయాంట్ ఈటర్), అనాటినస్
మెటాథీరియా/మార్సుపియేల్లు
ఇవి పూర్తిగా అభివృద్ధి చెందని పిల్లలకు జన్మనిస్తాయి. స్త్రీ జీవి ఉదరభాగంలో శిశుకోశం (మార్సుపియం) ఉంటుంది. దీనిలో అపరిపక్వ పిండాలు/పిల్లజీవులు పాలు తీసుకుంటాయి. దీన్నే మమరీఫీటస్ అంటారు.
ఉదా: కంగారు (మాక్రోపస్), అపోజం, టాస్మానియన్ తొడేలు, టాస్మేనియన్ పులి, బండికూట్.
యూథీరియా/నిజ జరాయుదారులు
యూథీరియా విభాగంలో పిల్ల జీవులు తల్లి గర్భంలోనే బాగా అభివృద్ధి చెందుతాయి. పిల్ల జీవులు గర్భంలో ఉండగానే జరాయువు ద్వారా తల్లి నుంచి పోషక పదార్థాలను సేకరించుకుంటాయి. అంటే యూథీరియా క్షీరదాలు బాగా అభివృద్ధి చెందిన పిల్ల జీవులకు జన్మనిస్తాయి.
ఉదా: గబ్బిలాలు, కోతులు, మానవులు, గొరిల్లాలు, చింపాంజీలు, ఎలుకలు, ఉడుతలు, కుందేళ్లు, తిమింగళాలు, ఏనుగులు, గుర్రాలు, గాడిదలు, జీబ్రాలు, ఖడ్గ మృగాలు, పశువులు, మేకలు, గొర్రెలు మొదలైనవి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు