కణంలో అస్థిపంజరం వలె వ్యవహరించేది?
- కణశాస్త్రం
1. కణ సిద్ధాంతం కింది వేటికి వర్తించదు?
ఎ) వైరస్‌లకు బి) మొక్కల కణాలకు
సి) జంతువుల కణాలకు
డి) చర్మ కణాలకు
2. మొక్కల కణాల ముఖ్య లక్షణం?
ఎ) కేంద్రకం ఉండటం
బి) రైబోజోములుండటం
సి) కణకవచం ఉండటం
డి) మైటోకాండ్రియా ఉండటం
3. మొక్కల కణాలకు ఉండే కణకవచం
ఏ పదార్థంతో నిర్మించబడి ఉంటుంది?
ఎ) సెల్యులోజ్ బి) ప్రొటీన్
సి) గ్లూకోజ్ డి) లిపిడ్
4. డీఎన్ఏ కేంద్రకంలో కాకుండా కింది
ఏ కణాంగంలో కూడా ఉంటుంది?
ఎ) రైబోజోమ్ బి) మైటోకాండ్రియా
సి) లైసోజోమ్ డి) రిక్తిక
5. డీఎన్ఏ ఉండటం వల్ల మైటోకాండ్రియాను కింది ఏ విధంగా పిలుస్తారు?
ఎ) ఆహారపదార్థాల ఉత్పాదక కేంద్రం
బి) కణశక్తి భాండాగారం
సి) కణకొలిమిలు
డి) స్వయంప్రతిపత్తి కలిగిన కణాంగం
6. మొక్కల్లో కిరణజన్యసంయోగక్రియ చర్యలు జరిగే ప్రదేశం?
ఎ) పత్రాలు బి) ఆకుపచ్చని భాగాలు
సి) హరితరేణువు డి) మైటోకాండ్రియా
7. కణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త?
ఎ) లూయీపాశ్చర్ బి) ల్యూవెన్‌హుక్
సి) రాబర్ట్‌బ్రౌన్ డి) రాబర్ట్‌హుక్
8. కింది వాటిలో కేంద్రక పూర్వ కణానికి ఉదాహరణ?
ఎ) అమీబా బి) యూగ్లినా
సి) నీలి ఆకుపచ్చశైవలం డి) ఈస్ట్
9. కింది వాటిలో వేరుగా ఉన్న జీవి?
ఎ) బ్యాక్టీరియా బి) మైకోప్లాస్మా
సి) నీలిఆకుపచ్చశైవలం
డి) పారామీషియం
10. మానవుల్లో క్రోమోజోముల సంఖ్య?
ఎ) 46 బి) 23 సి) 46 జతలు
డి) 22 జతలు
11. కణంలో ప్రొటీన్ సంశ్లేషణ జరిగే ప్రదేశం?
ఎ) కేంద్రకం బి) రిక్తిక
సి) రైబోజోమ్ డి) హరిత రేణువు
12. మైటోకాండ్రియాలో శ్వాసక్రియ సంబంధ చర్యలు జరిగి ఏర్పడిన ‘ఏటీపీ’లను కింది ఏ పేరుతో పిలుస్తారు?
ఎ) ఎలక్ట్రాన్ వాహకాలు
బి) శక్తినాణాలు
సి) ప్రొటీన్ వాహకాలు
డి) శక్తి పాకెట్లు
13. మానవుని సంయోగబీజాలైన శుక్రకణం, అండాల్లో ఉండే క్రోమోజోములు?
ఎ) 46 జతలు బి) 46
సి) 23 డి) 22 జతలు
14. స్వేచ్ఛాకణాలను, సజీవ కణాలను కనుగొన్న శాస్త్రవేత్త?
ఎ) రాబర్ట్ హుక్ బి) ష్లీడన్
సి) ష్వాన్ డి) ల్యూవెన్ హుక్
15. ముదిరిన వృక్షకణంలో ఎక్కువభాగం ఆక్రమించి ఉండేది?
ఎ) రిక్తిక బి) కేంద్రకం
సి) రైబోజోమ్ డి) లైసోజోమ్
16. ఒకజీవి దేహకణంలో ఉన్న క్రోమోజోములు 50 అయిన ఆ జీవి సంయుక్త బీజంలో ఎన్ని క్రోమోజోములుంటాయి?
ఎ) 50 బి) 100
సి) 25 డి) 75
17. అతిచిన్న కణానికి ఉదాహరణ?
ఎ) బ్యాక్టీరియా బి) వైరస్
సి) మైకోప్లాస్మా డి) అసిటాబ్యులేరియా
18. జంతుకణాల్లో మాత్రమే ఉండే కింది ఏ కణంలో భాగం కణవిభజనకు ఉపయోగపడుతుంది?
ఎ) హరితరేణువు బి) సెంట్రియోల్
సి) పెరాక్సిసోమ్ డి) ైగ్లెక్సిసోమ్
19. DNA ద్విసర్పిలాకార నమూనా (Double Helix Model)ను ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు?
ఎ) ష్లెడన్, ష్వాన్ బి) వాట్సన్, క్రిక్
సి) రాబర్ట్‌హుక్, ల్యువెన్ హుక్
డి) బ్రౌన్, మెండల్
20. కేంద్రకామ్లాల్లో ఉండే చక్కెర?
ఎ) సుక్రోజ్ బి) మాల్టోజ్
సి) లాక్టోజ్ డి) రైబోజ్
21. కేంద్రకామ్లాలు కింది ఏ ఆమ్లాన్ని కలిగి ఉంటాయి?
ఎ) హైడ్రోక్లోరిక్ ఆమ్లం బి) లాక్టిక్ ఆమ్లం
సి) పాస్ఫొరిక్ ఆమ్లం డి) ఎసిటిక్ ఆమ్లం
22. ప్రోటీన్ సంశ్లేషణలో భాగంగా DNA నుంచి mRNA తయారుకావడాన్ని ఏమంటారు?
ఎ) అనులేఖనం బి) అనువాదం
సి) సంయుగ్మం డి) సంపాతం
23. కింది ఏ కణాంగం మొక్కల్లో మాత్రమే ఉంటుంది?
ఎ) మైటోకాండ్రియా బి) హరితరేణువు
సి) కేంద్రకం డి) రైబోజోమ్
24. కేంద్రకాన్ని ఏ విధమైన మారుపేరుతో పిలుస్తారు?
ఎ) కణపు ప్రోటీన్ ఫ్యాక్టరీలు
బి) కణ ఆత్మహత్యకోశాలు
సి) కణపుమెదడు
డి) కణ ఆటంబాంబులు
25. శరీరం పెరుగుదలకు, గాయాలు మానడానికి ఉపయోగపడే కణ విభజన?
ఎ) అసమవిభజన
బి) క్షయకరణ విభజన
సి) నియంత్రిత విభజన
డి) సమవిభజన
26. ఒక కణం సమవిభజన జరిగిన ఫలితంగా ఎన్ని కణాలు ఏర్పడతాయి?
ఎ) 4 బి) 2 సి) 6 డి) 8
27. కింది ఏ ప్రక్రియ క్షయకరణ విభజనలో మాత్రమే జరుగుతుంది?
ఎ) కేంద్రక విభజన
బి) కణద్రవ్య విభజన
సి) వినిమయం
డి) కేంద్రకాలు ఏర్పడటం
28. క్షయకరణ విభజన ఫలితంగా ఏర్పడే కణాలు?
ఎ) సంయుక్త బీజాలు
బి) దేహకణాలు
సి) శారీరక కణాలు
డి) సంయోగ బీజాలు
29. కణం చనిపోయిన తరువాత వాటిని విచ్ఛిన్నం చేసేవి?
ఎ) లైసోజోమ్‌లు
బి) అంతర్జీవద్రవ్యజాలం
సి) గాల్జీసంక్లిష్టం
డి) కేంద్రకం
30. కింది ఏ కేంద్రక పూర్వ జీవి జీవ ఎరువుగా ఉపయోగపడుతుంది?
ఎ) వైరస్ బి) అమీబా
సి) నాస్టాక్ డి) క్లామిడోమోనాస్
31. ఒక కణం క్షయకరణ విభజన జరిగిన ఫలితంగా ఎన్ని కణాలు ఏర్పడతాయి?
ఎ) 6 బి) 2 సి) 8 డి) 4
32. మానవునిలో కింది ఏ కణాలు కేంద్రకరహితంగా ఉంటాయి?
ఎ) నాడీ కణం బి) ఎర్ర రక్తకణం
సి) తెల్ల రక్తకణం డి) కాలేయకణం
33. వరి మొక్కలో ఉండే క్రోమోజోముల సంఖ్య?
ఎ) 20 బి) 24
సి) 46 డి) 32
34. కణంలో అస్థిపంజరం మాదిరి వ్యవహరించేది?
ఎ) కణకవచం బి) కణత్వచం
సి) మైటోకాండ్రియా
డి) అంతర్జీవద్రవ్యజాలం
35. కింది వాటిలో DNAలో ఉండని రసాయనం?
ఎ) రైబోజ్ చక్కెర
బి) నత్రజని క్షారం
సి) పాస్ఫారిక్ ఆమ్లం
డి) ఎసిటిక్ ఆమ్లం
36. నిజకేంద్రక కణం, కేంద్రక పూర్వ కణం రెండింటిలో ఉండేవి?
ఎ) కేంద్రకం బి) మైటోకాండ్రియా
సి) రైబోజోమ్‌లు డి) రిక్తికలు
37. మానవునిలో అతిపొడవైన కణం?
ఎ) కండర కణం బి) నాడీ కణం
సి) రెటీనా కణం డి) శుక్రకణం
38. కింది వాటిలో అతిపెద్ద కణానికి ఉదాహరణ?
ఎ) ఆస్ట్రిచ్ అండం బి) బ్యాక్టీరియా
సి) శిలీంధ్ర కణం
డి) నీలి ఆకుపచ్చ శైవలం
39. పోగులు(Spindle) ఏ దశలో ఏర్పడతాయి?
ఎ) G1 దశ బి) G2 దశ
సి) M దశ డి) S దశ
40. సమవిభజనలో ఏ దశలో క్రోమోజోమ్‌లు కణం మధ్యలో అమర్చబడి సెంట్రోమియర్ల్ల విభజన జరుగుతుంది?
ఎ) అనాఫేజ్ బి) ఇంటర్ఫేజ్
సి) మెటాఫేజ్ డి) ప్రోఫేజ్
41. అంతర్దశలో జరగనివి?
ఎ) క్రొమాటిన్ సంకోచించడం
బి) ప్రొటీను తయారుకావడం
సి) కణాంగాల ప్రతికృతి
డి) DNA ప్రతికృతి
42. ప్రోకారియేట్లలో కణవిభజనకు ముందు రెండు పిల్ల జీనోములు ఎక్కడ అతుక్కొని ఉంటాయి?
ఎ) కణత్వచానికి
బి) ప్రతికృతి ఉత్పత్తి స్థానానికి
సి) సెంట్రోమియర్లకు
డి) ఈక్విటోరియల్ ప్లేట్‌కు
43. కణచక్రంలో జీనోమ్ ప్రతికృతి ఏ దశలో జరుగుతుంది?
ఎ) G1 దశ బి) G2 దశ
సి) M దశ డి) S దశ
44. ఏ చెక్‌పాయింట్ వద్ద సమ విభజన నియంత్రించబడుతుంది?
ఎ) G1 బి) G2
సి) M డి) S
45. సమవిభజనలో ఏ దశలో క్రొమాటిడ్లు వేరు చేయబడుతాయి?
ఎ) ప్రోఫేజ్ బి) మెటాఫేజ్
సి) అనాఫేజ్ డి) టీలోఫేజ్
46. కణచక్రంలోని సరైన దశలు?
ఎ) ->G1->G2-> సమవిభజన -> సైటోకైనిసిన్
బి) S->G2-> సమవిభజన->సైటోకైనిసిస్->G1
సి) ->G1->S->G2->సైటోకైనిసిస్->
సమవిభజన
డి) ->సైటోకైనిసిస్->సమవిభజన->G1-> S->G2
47. ఏ దశలోనూ మానవ క్రోమోజోములో భాగం కానిది?
ఎ) సెంట్రియోల్ బి) హిస్టోన్
సి) న్యూక్లియోసోమ్ డి) సెంట్రోమియర్
48. ప్రతి క్రోమోజోమ్ ప్రతికృతి చెంది రెండు సోదర క్రొమాటిడ్లుగా ఏ దశలో విడిపోతుంది?
ఎ) అనాఫేజ్ బి) ఇంటర్ ఫేజ్
సి) మెటాఫేజ్ డి) ప్రోఫేజ్
49. కణంలోని కణచక్రం దేనివల్ల అదుపులో ఉంటుంది?
ఎ) సమయం (కొంత సమయం తర్వాత, కణం విభజన చెందుతుంది)
బి) క్రమానుసారంగా చెక్పాయింట్లు ఉండటం
సి) కణ పరిమాణం (ఒక పరిమాణం చేరుకున్న తరువాత కణ విభజన జరుగుతుంది)
డి) వివిధ రకాల కణాలు వివిధ రకాల నియంత్రణ పద్ధతులను అనుకరించడం
50. కణ విభజన ముందు ఒక డిప్లాయిడ్ కణంలో ఎన్ని క్రొమాటిడ్లు ఉంటాయి?
ఎ) 23 బి) 46
సి) 69 డి) 92
51. DNA ప్రతికృతి ఏ చెక్‌పాయింట్ వద్ద అదుపులో ఉంటుంది?
ఎ) G1 బి) G2
సి) M డి) S
52. మానవ కణచక్రంలో ఏ దశ అంతంలో ప్రతి క్రోమోజోమ్‌లలో రెండు క్రోమాటిడ్లు ఉంటాయి?
ఎ) G1 బి) G2
సి) M డి) S
53. కణపు ప్రథమ పెరుగుదల దశ ఏది?
ఎ) G1 బి) G2
సి) M డి) S
54. G0 దశ అంటే?
ఎ) అన్ని కణాల ప్రతికృతి జరగని దశ
బి) జీవ కణాల్లో చాలా కణాల దశ
సి) ఇంటర్ ఫేజ్‌కు మరో దశ
డి) ప్రతికృతి జరిగే దశ
55. కణప్లేటు ఏ కణాల్లో తయారు కావడం చూడవచ్చు?
ఎ) బ్యాక్టీరియా కణాల్లో
బి) వైరస్ కణాల్లో
సి) జంతుకణాల్లో
డి) మొక్కల కణాల్లో
56. ఒక కణం విభజనకు ఒక నిముషం పడుతుంది. ఇదే ప్రాతిపదికన 100 మి.లీ. బీకర్ నిండటానికి ఒక గంట సమయం పడితే 50 మి.లీ. బీకర్ నిండటానికి ఎంత సమయం పడుతుంది?
ఎ) 29 ని. బి) 30 ని.
సి) 59 ని. డి) 60 ని.
57. శరీర కణాల్లో ఏ దశలో DNA తయారీ
జరుగుతుంది?
ఎ) G1 బి) G2
సి) S డి) ఫ్రోఫేజ్
58. సమవిభజన పోగులలో ఉండే ప్రొటీన్?
ఎ) యాక్టిన్ బి) మయోసిన్
సి) మయోగ్లోబిన్ డి) యాక్టోమయోసిన్
59. యుకారియోట్లలో ఏ దశలో హిస్టోన్ ప్రొటీన్లు తయారవుతాయి?
ఎ) టీలోఫేజ్ బి) S
సి) G2 డి) G0
60. ల్యాబ్‌లో సమవిభజనను పరీక్షించడానికి ఏది సరైనది?
ఎ) పురుషశుద్ధ బీజం బి) వేరు అంచు
సి) ఆకు అంచు డి) అండం
61. ఒక జీవికి సంబంధించిన పూర్తి జన్యు- సామర్థ్యం కలిగిన కణాన్ని ఏమంటారు?
ఎ) టోటిపొటెంట్ కణం
బి) ఫ్లూరీపొటెంట్ కణం
సి) పరిపూర్ణ కణం
డి) స్టర్జిడ్ కణం
62. ఏ ప్రక్రియ వల్ల క్యాలస్ నుంచి పూర్తి మొక్కను తయారుచేయవచ్చు?
ఎ) క్లోనింగ్
బి) కణజాల వర్ధనం
సి) జన్యు సాంకేతికత
డి) ట్రాన్స్ఫ్యూషన్
63. మొక్కల కణం నుంచి కణ కవచం తొలగిస్తే ఏది ఏర్పడుతుంది?
ఎ) ప్రోటోప్లాస్ట్ బి) క్లోరోప్లాస్ట్
సి) ట్రాన్స్జెనిక్ కణం
డి) మృతకణం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు