పదో తరగతిలో కొలువులు
మొత్తం ఖాళీలు: 24,369
కేవలం పదోతరగతి ఉత్తీర్ణతతో అవకాశం. మంచి జీతభత్యాలు, దేశసేవలో పాల్గొనే అవకాశం. భరోసానిచ్చే కొలువు. వీటన్నింటి సమాహారమే బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్ వంటి సాయుధ బలగాల్లో కొలువులు. వివిధ సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్ష నోటిఫికేషన్ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసిన నేపథ్యంలో ఆ పోస్టుల అర్హతలు, ఖాళీల సంఖ్య,పరీక్ష విధానంపై సంక్షిప్తంగా నిపుణ పాఠకుల కోసం…
సాయుధ బలగాలు (సీఏపీఎఫ్)
- బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్ఎస్ఎఫ్), అస్సాం రైఫిల్స్ (ఏఆర్), నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ)లను సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్)గా పిలుస్తారు.
నోట్: వీటిలో పురుషులకు (ఎస్సీ-3377, ఎస్టీ-1930, ఓబీసీ-4815, ఈడబ్ల్యూఎస్-2115, జనరల్-9342)-21,579 పోస్టులు. మహిళలకు (ఎస్సీ-429, ఎస్టీ-246, ఓబీసీ-580, ఈడబ్ల్యూఎస్-221, జనరల్-1150)-2626 పోస్టులు కేటాయించారు.
అర్హతలు: 2023, జనవరి 1 నాటికి పదోతరగతి లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. వీటితోపాటు పురుషులు 170 సెం.మీ, మహిళలు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
వయస్సు: 2023, జనవరి 1 నాటికి 18-23 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే 2000, జనవరి 2 నుంచి 2005, జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, ఎక్స్సర్వీస్మెన్లకు మూడేండ్లు వయోపరిమితి సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం
- కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (సీబీఈ), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
బలగాల వారీగా ఖాళీలు:
బలగం ఖాళీల సంఖ్య
బీఎస్ఎఫ్ 10497
సీఐఎస్ఎఫ్ 100
సీఆర్పీఎఫ్ 8911
ఎస్ఎస్బీ 1284
ఐటీబీపీ 1613
ఏఆర్ 1697
ఎస్ఎస్ఎఫ్ 103
ఎన్సీబీ 164
మొత్తం ఖాళీలు 24369
పీఈటీ/పీఎస్టీ
- కంప్యూటర్ బేస్ట్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ)/ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్టీ)లకు ఎంపిక చేస్తారు.
- పీఈటీలో పురుషులు 5 కి.మీ. దూరాన్ని 24 నిమిషాలలో, 1.6 కి.మీ.దూరాన్ని ఆరున్నర నిమిషాలలో పరుగెత్తాలి.
- మహిళలు 1.6 కి.మీ. దూరాన్ని ఎనిమిదిన్నర నిమిషాలలో, 800 మీటర్ల దూరాన్ని నాలుగు నిమిషాలలో పరుగెత్తాలి.
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ముఖ్యతేదీలు
- 160 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 80 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు.
- పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథ్స్, ఇంగ్లిష్/హిందీ నుంచి ప్రశ్నలు ఇస్తారు.
- ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీలో ఉంటుంది.
- పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.50 మార్కులు కోత విధిస్తారు.
- పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్
నోట్: సీబీఈని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది. మిగిలిన పరీక్షలను సీఏపీఎఫ్ నిర్వహిస్తుంది.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: నవంబర్ 30
సీబీఈ: 2023, జనవరిలో ఉంటుంది
వెబ్సైట్: https://ssc.nic.in
-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు