శుద్ధి యంత్రం.. జ్ఞప్తి కేంద్రం
నాడీ వ్యవస్థ
- నాడీ మండలం, నాడుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని న్యూరాలజీ అంటారు.
- నాడీ మండలం నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణాన్ని నాడీ కణం(న్యూరాన్) అంటారు.
- ప్రతి నాడీకణంలో మూడు భాగాలుంటాయి. 1. కణదేహం (సైటాన్) 2. తంత్రికాక్షం (ఏక్సాన్) 3. డెండ్రైట్లు.
- ఒక నాడీకణంలోని డెండ్రైట్లు వేరొక కణంలోని డెండ్రైట్లతో గానీ, ఏక్సాన్తో గానీ, కలిసే ప్రదేశాన్ని నాడీకణ సంధి (సినాప్స్) అంటారు.
- జ్ఞానేంద్రియాల నుంచి ప్రచోదనాలను కేంద్రక నాడీ వ్యవస్థకు (మెదడు, వెన్నుపాము) తీసుకెళ్లే నాడులను జ్ఞాననాడులు (అభివాహి నాడులు) అంటారు.
- కేంద్ర నాడీవ్యవస్థ నుంచి ప్రచోదనాలను వివిధ శరీర భాగాలకు ప్రధానంగా ప్రభావక కండరానికి తీసుకెళ్లే నాడులను చాలక నాడులు (అపవాహి నాడులు) అంటారు.
- సమాచారాన్ని మెదడు విశ్లేషించకుండా వెన్నుపాము ఆధీనంలో సమాచారం విశ్లేషించబడే చర్యలను అసంకల్పిత ప్రతీకార చర్యలు అంటారు. ప్రచోదనాలు ప్రయాణించే మార్గాన్ని ప్రతీకార చర్యా చాపం అంటారు.
- నాడీ ప్రచోదనం ఉద్దీపనం నుంచి ప్రతిస్పందనకు 100 మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
- నాడీ వ్యవస్థలో రెండు విభాగాలు ఉంటాయి. 1. కేంద్ర నాడీ వ్యవస్థ 2. పరదీయ నాడీ వ్యవస్థ.
- మెదడు, వెన్నుపాము కలిసి కేంద్ర నాడీ వ్యవస్థను ఏర్పరుస్తాయి.
- మెదడును ఆవరించి అస్థి నిర్మితమైన గట్టి పెట్టె వంటి నిర్మాణాన్ని కపాలం అంటారు.
- మెదడును ఆవరించి 3 పొరలుంటాయి. వాటిని మెనింజస్ అంటారు. 1. వరాశిక 2. మృద్వి 3. లౌతికళ.
- మెదడును ఆవరించే పొరల మధ్య మస్తిష్క మేరుద్రవం ఉంటుంది. ఇది మెదడును అఘాతాల నుంచి రక్షిస్తుంది.
- మెదడులో మూడు భాగాలుంటాయి. 1. ముందు మెదడు 2. మధ్య మెదడు 3. వెనుక మెదడు.
- మానవుడి మెదడు సుమారు 1400 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. దీనిలో మస్తిష్కం బరువు సుమారు 995 గ్రాములు.
- ముందు మెదడులో మస్తిష్కం, ద్వారాగోర్థం, వెనుక మెదడులో అనుమస్తిష్కం, మజ్జాముఖం అనే భాగాలుంటాయి.
- పొడవుగా దాదాపు స్థూపాకారంలో వెనుక మెదడు నుంచి మొండెం పృష్ఠ తలం పొడవునా వ్యాపించి ఉంటుంది.
- మెదడు నుంచి బయలుదేరే నాడులను కపాలనాడులు అని, వెన్నుపాము నుంచి బయలుదేరే నాడులను వెన్నునాడులు అంటారు.
- మానవ దేహంలో 12 జతల కపాలనాడులు, 31 జతల వెన్నునాడులు ఉంటాయి.
- శరీరంలో అనేక అవయవాలు తమ విధులను నిర్వర్తించడంలో సహకరించే నాడీ వ్యవస్థను స్వయం చోదిత నాడీ వ్యవస్థ
విసర్జక వ్యవస్థ
- శరీరంలో ఉత్పన్నమయ్యే నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలను బయటకు పంపించే ప్రక్రియను విసర్జన క్రియ అంటారు.
- లాటిన్ భాషలో Ex అంటే బయటకు అని Crenere అంటే పంపడం అని అర్థం. మానవుడిలో విసర్జన ఒక జత మూత్రపిండాల ద్వారా జరుగుతుంది. మూత్రపిండాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని నెఫ్రాలజీ అంటారు.
- ఏటా మార్చి రెండో గురువారం ప్రపంచ మూత్రపిండాల దినోత్సవం జరుపుకొంటారు.
- మూత్రాశయం, మూత్రనాళాలు, మూత్ర సంబంధ వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని యూరాలజీ అంటారు.
- మానవుడిలో మూత్రపిండాలు చిక్కుడు గింజ ఆకారంలో ముదురు ఎరుపు రంగులో ఉంటాయి.
- మూత్రపిండం లోపల రెండు భాగాలుగా కనిపిస్తుంది. ముదురు గోధుమ వర్ణంలో ఉన్న వెలుపలి భాగాన్ని వల్కలం అని, లేత వర్ణంలో ఉన్న లోపలి భాగాన్ని దవ్వ అని అంటారు.
- మూత్రపిండం నిర్మాణాత్మక, ప్రమాణాత్మక ప్రమాణాన్ని వృక్క ప్రమాణాలు లేదా నెఫ్రాన్లు అంటారు.
- మూత్రం ఏర్పడే విధానంలో నాలుగు దశలుంటాయి. 1. గుచ్ఛగాలనం 2. వరణాత్మక పునఃశోషణం 3. నాళికాస్రావం 4. అధిక గాఢత గల మూత్రం ఏర్పడటం.
- మూత్రాశయంలో గరిష్ఠంగా 700-800 మి.లీ మూత్రం నిల్వ ఉంటుంది.
- మానవుడు రోజుకు దాదాపు 1.6-1.8 లీటర్ల మూత్రం విసర్జిస్తాడు.
- వాసోప్రెసిన్ అనే హార్మోన్ లోపం వల్ల అల్ప గాఢత గల మూత్రం అధిక పరిమాణంలో విసర్జితమవుతుంది. ఈ అపస్థితిని అతిమూత్ర వ్యాధి లేదా డయాబెటిస్ ఇన్సిపిడస్ అంటారు.
- మూత్రం లేత పసుపు రంగులో ఉండటానికి కారణం యూరోక్రోం అనే వర్ణకం.
- మూత్రంలో 96 శాతం నీరు, 2.5 శాతం కర్బన పదార్థాలు, 1.5 శాతం అకర్బన పదార్థాలు ఉంటాయి.
- మూత్రం మొదట ఆమ్లయుతంగా (PH 6.0) ఉన్నప్పటికీ క్రమంగా క్షారయుతంగా మారుతుంది. ఎందుకంటే యూరియా విచ్ఛిన్నం జరిగి అమ్మోనియాగా మారుతుంది.
- మూత్రపిండాలు పనిచేయకపోవడాన్ని ESRD (End Stage Renal Disease) అంటారు.
- శరీరంలో నీరు, వ్యర్థ పదార్థాలు నిండిపోతే ఈ దశను యూరేమియా అంటారు.
- పనిచేయని వారిలో డయాలసిస్ యంత్రం రక్తాన్ని వడకడతారు. కృత్రిమంగా రక్తాన్ని వడకట్టే ప్రక్రియను హీమో డయాలసిస్ అంటారు.
- మూత్రపిండాలు పనిచేయని వారికి దీర్ఘకాలిక పరిష్కారం చూపే ప్రక్రియనే మూత్రపిండ మార్పిడి అంటారు.
- ఊపిరితిత్తులు, చర్మం, కాలేయం, పెద్ద పేగులు అనుబంధ విసర్జక అవయవాలుగా పనిచేస్తాయి.
- వేర్వేరు జంతువుల్లో విసర్జకావయవాలు వేర్వేరుగా ఉంటాయి.
- అమీబా- సంకోచరిక్తిక, ప్లాటిహెల్మింథిస్- జ్వాలా కణాలు, అనెలిడా-వృక్కాలు, ఆర్థ్రోపొడా- మాల్ఫీజియన్ నాళికలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు- వృక్కాలు.
- మొక్కల్లో ప్రత్యేక విసర్జకావయవాలు లేవు. మొక్కలు, ఆకులు, బెరడులు, పండ్లు, విత్తనాల్లో వ్యర్థాలను నిల్వ చేసుకుని పక్వానికి వచ్చాక మొక్కల నుంచి రాలిపోతాయి.
- మొక్కల్లో జీవక్రియా ఉత్పన్నాలు రెండు రకాలు
1. ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు
2. ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు.
అంతస్రావక వ్యవస్థ
- అంతస్రావక వ్యవస్థ, గ్రంథులు, హార్మోన్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎండోక్రైనాలజీ అంటారు.
- థామస్ ఎడిసన్ను ఎండోక్రైనాలజీ పితామహుడిగా పిలుస్తారు.
- 1905లో స్టార్లింగ్ అనే ఆంగ్ల శరీరధర్మ శాస్త్రవేత్త రక్తంలోకి స్రవించే పదార్థాలకు హార్మోన్లు అని పేరుపెట్టారు.
- హార్మోన్లను స్రవించే గ్రంథులను వినాళ గ్రంథులు అంటారు.
- పీయూష గ్రంథిని అతి ప్రధాన గ్రంథిగా పిలుస్తారు.
- పీయూష గ్రంథి నుంచి సొమాటోట్రోఫిన్, థైరోట్రోఫిన్, గొనాడోట్రోఫిన్, అడ్రినో కార్టికో ట్రోఫికా హార్మోన్, లూటినైజింగ్ హార్మోన్, ఫొలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ తదితర హార్మోన్లు విడుదలవుతాయి.
- మెడలో వాయునాళానికి దగ్గరగా థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. ఇది థైరాక్సిన్ హార్మోన్ను విడుదల చేస్తుంది. ఏటా మే 25ను థైరాయిడ్ దినోత్సవంగా నిర్వహిస్తారు.
- ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజన్ హార్మోన్లను స్త్రీ లైంగిక హార్మోన్లు అంటారు.
- టెస్టోస్టిరాన్ను లైంగిక హార్మోన్ అంటారు.
- మూత్రపిండంపై టోపీ ఆకారంలో ఉండే గ్రంథులను అధివృక్క గ్రంథులు అంటారు. వీటి నుంచి అడ్రినలిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది మానసిక ఉద్రేకాలను కలిగిస్తుంది. కాబట్టి దీన్ని మానసిక ఉద్రేకాలు కలిగించే హార్మోన్ అంటారు.
- క్లోమంను మిశ్రమ గ్రంథి అంటారు. ఇది కొంతభాగం నాళయుతంగా మరికొంత భాగం వినాళయుతంగా ఉంటుంది. దీని నుంచి ఇన్సులిన్, గ్లూకగాన్ అనే హార్మోన్లు స్రవించబడుతాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. ఇన్సులిన్ లోపం వల్ల డయాబెటిస్ మిల్లిటస్ అనే వ్యాధి వస్తుంది. దీన్నే సాధారణ పరిభాషలో చక్కెర వ్యాధి లేదా మధుమేహ వ్యాధి అంటారు. నవంబర్ 14న మధుమేహ దినోత్సవం నిర్వహిస్తారు.
అస్థిపంజర వ్యవస్థ
- ఎముకలతో నిర్మితమైన చట్రాన్ని అస్థిపంజరం అంటారు. దేహ భాగాలకు నిర్దిష్టమైన ఆకృతి, దృఢత్వాన్ని, మెదడు, గుండె, ఊపిరితిత్తులకు రక్షణనిస్తూ శరీర కదలికల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
- ఎముకల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆస్టియాలజీ అంటారు.
- ఎముకల్లో ఉండే ప్రొటీన్ ఆస్టిన్.
- మానవుడి దేహంలో 206 ఎముకలుంటాయి.
- ఎముకలను ఏర్పరిచే కణాలను ఆస్టియో సైట్స్ అంటారు. వీటిలో కాల్షియం అనే మూలకం ఉంటుంది. కాల్షియం పాస్ఫేట్ ఎక్కువగా, కాల్షియం కార్బోనేట్ తక్కువగా ఉంటుంది.
- మెత్తగా ఉండే ఎముకలను మృదులాస్థి ఎముకలంటారు.
- మృదులాస్థి అధ్యయనాన్ని కాండ్రాలజీ అంటారు.
- చిన్నపిల్లల్లో 300 కు పైగా ఎముకలుంటాయి.
- కపాలం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని క్రేనియాలజీ అంటారు.
- మానవుడి దేహంలో గల కండరాల సంఖ్య 639.
- కండరాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మయాలజీ అంటారు.
- రాస్తున్నప్పుడు పెన్నుకు ఆధారాన్నిచ్చే వేళ్ల ఎముకలను ఫాలింజస్ అంటారు.
- మానవుడి దేహంలో గల కీళ్ల సంఖ్య 230.
- కీళ్లు రెండు రకాలు 1. కదలని కీళ్లు- పుర్రెలో పై దవడ, కపాలానికి మధ్య ఉండేవి కదలని కీళ్లు.
- 2. కదిలే కీళ్లు- ఇవి 4 రకాలు
1. బొంగరపు కీలు 2. బంతిగిన్నె కీలు
3. మడత బందు కీలు 4. జారెడు కీలు. - ఒక ఎముకను మరో ఎముకతో కలిపే నిర్మాణాన్ని లిగమెంట్ అంటారు.
- ఎముకను కండరంతో కలిపే నిర్మాణాన్ని టెండాన్ అంటారు.
Previous article
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 193 ఉద్యోగాలు
Next article
తెలంగాణ బడ్జెట్లో రైతు రుణమాఫీకి కేటాయించిన మొత్తం?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు