బంజరు భూములు ఏర్పడే విధానం?
మొక్కల అనుక్రమం
-అనుక్రమం అనే పదాన్ని మొదటిసారిగా హాల్ట్ అనే శాస్త్రవేత్త ఉపయోగించాడు.
-మొక్కల అనుక్రమం గురించి పుస్తకాన్ని ప్రచురించింది- ఫ్రెడరిక్ క్లెమెంట్స్
-ఓడమ్ అభిప్రాయం ప్రకారం అనుక్రమం అనేది ఒక ప్రమాణ ప్రదేశంలో క్రమపద్ధతిలో సంఘంలో జరిగే మార్పు
-క్లెమెంట్స్ ప్రకారం అనుక్రమం అనేది ఒక ప్రదేశాన్ని క్రమానుసారంగా వేరువేరు సంఘాల సమూహాలు ఆక్రమించుకోవడం
అనుక్రమానికి కారణాలు అనుక్రమంలో వచ్చే మార్పులకు మూడు రకాల కారణాలను పేర్కొన్నారు. అవి…
1. శీతోష్ణస్థితికి సంబంధించినవి
2. స్థలాకృతికి సంబంధించినవి
3. జీవ సంబంధమైనవి.
మొక్కల అనుక్రమం జరిగే విధానం
-మొక్కల అనుక్రమంలో వృక్ష సంపదలో క్రమబద్ధమైన మార్పు వస్తుంది. దీనిలో ఒకటి మొక్కల సంఘాన్ని, ఇంకోటి క్రమానుసారంగా, నెమ్మదిగా ప్రతిస్థాపన చేస్తుంది. మొక్కల అనుక్రమంలో కన్పించే వివిధ దశలు
-న్యూడేషన్, అనుక్రమణ, ప్రవాసం, ఎకేసిస్, సంకలనం, పోరాటం, ప్రతిచర్య, చరమదశ న్యూడేషన్
-శీతోష్ణస్థితి, స్థలాకృతి, జీవులకు సంబంధించిన అనేక కారణాల వల్ల వృక్ష సంపద లేని బంజరు భూములు ఏర్పడటాన్ని న్యూడేషన్ అంటారు.
పయనీర్ ప్లాంట్స్/మార్గదర్శక మొక్కలు
-బంజరు భూమిలో మొదట ఆవాసం ఏర్పరచుకొనే మొక్కలను మార్గదర్శక మొక్కలు/ప్రారంభపు మొక్కలు అంటారు.
ఎకేసిస్
-మార్గదర్శక మొక్కలు తమ నూతన ఆవాసంలో స్థిరపడటాన్ని ఎకేసిస్ అంటారు.
క్రమకీయం/Sere
-ఒక ప్రదేశంలో మొక్కల సంఘాలు ఒకదాని తర్వాత ఒకటి క్రమంగా తొలగిపోతూ ఉండటాన్ని క్రమకీయం అంటారు. ఒక క్రమకీయంలో ఏర్పడే మాధ్యమిక మొక్కల సంఘాలను క్రమకీయ సంఘాలు అంటారు.
-అనుక్రమం ఒక సంక్లిష్ట ప్రక్రియ. వివిధ క్రమకీయ సంఘాలు ఏర్పడిన తర్వాత చివరికి చరమదశతో అంతమవుతుంది.
అనుక్రమం-రకాలు
అనుక్రమంలో రెండు రకాలు ఉంటాయి. అవి…
-1) ప్రాథమిక అనుక్రమం 2) ద్వితీయ అనుక్రమం ప్రాథమిక అనుక్రమం
అంతకుమందు ఎలాంటి జీవజాతి లేనిచోట ప్రారంభమయ్యే ప్రక్రియ
-లావా చల్లబడిన తర్వాత ఏర్పడిన ప్రదేశాలు, రాతి నేలలు, కొత్తగా ఏర్పడిన సరస్సులు, రిజర్వాయర్లలో, బంజరు భూముల్లో ప్రారంభమయ్యే అనుక్రమం.
ద్వితీయ అనుక్రమం
-ఒక ప్రదేశంలో మొదట ఉన్న జీవ సముదాయాన్ని నాశనం చేసిన తర్వాత మొదలవుతుంది.
ఉదా: పాడుబడిన వ్యవసాయ భూములు నిప్పువల్ల, చెట్లు నరకడం వల్ల నాశనమైన అరణ్యాలు, వరదలకు గురైన నేలలు వంటి ప్రదేశాల్లో కొంత మృత్తిక ఉండటం వల్ల ప్రారంభమయ్యే అనుక్రమం.
-ద్వితీయ అనుక్రమం జరిగే ప్రదేశాల్లో కొంత మృత్తిక ఉండటం వల్ల ఇది ప్రాథమిక అనుక్రమం కంటే వేగవంతంగా జరుగుతుంది.
ప్రాథమిక, ద్వితీయ అనుక్రమాల్లో రకాలు
-జలక్రమకం/Hydrosere: నీటి పరిసరాల్లో ప్రారంభమయ్యే మొక్కల అనుక్రమాన్ని హైడ్రార్క్ అనికూడా అంటారు. హైడ్రార్క్లోని వృక్ష సంపదలో వరుసగా జరిగే మార్పులను జలక్రమకం అంటారు.
ఉదా: కొలను, సరస్సు మొదలగునవి.
-జలాభావక్రమం/Xerosere : జలాభావ లేదా శుష్క ఆవాసాల్లో ప్రారంభమయ్యే మొక్కల అనుక్రమాన్ని జలాభావక్రమం అంటారు
ఉదా: ఇసుక, రాతి ప్రదేశం మొదలగునవి.
స్టాండింగ్ క్రాప్
ఒక నిర్ణీత కాలంలో ప్రతి పోషకస్థాయిలో ఉండే నిర్ణీత జీవ పదార్థ ద్రవ్యరాశిని, స్టాండింగ్ క్రాప్ అంటారు. ఇది ఆ పోషక స్థాయిలోని శక్తిగా పరిగణించబడుతుంది.
-స్టాండింగ్ క్రాప్‌ను లెక్కించడానికి పొడి బరువును పరిగణలోకి తీసుకుంటారు.
లిండేమన్ పోషక సామర్థ్యతా సూత్రం
-దీన్నే 10 శాతం సూత్రం అనికూడా అంటారు.
-ఒక పోషకస్థాయి నుంచి మరొక పోషకస్థాయికి శక్తి బదిలీ చెందేటప్పుడు 10 శాతం శక్తి మాత్రమే శరీర ద్రవ్యరాశిగా నిల్వ ఉంటుంది. మిగిలిన శక్తి బదిలీ చెందే సమయంలో కోల్పోతుంది. దీన్నే లిండేమన్ పోషకసామర్థ్యతా సూత్రం అంటారు.
జీవావరణ వ్యవస్థ
సరస్సు జీవావరణ వ్యవస్థ లెంటిక్ ఆవరణ వ్యవస్థకు ఉదాహరణ
-సరస్సులు, సముద్ర తీరప్రాంతానికి దూరంగా ఉన్నా చుట్టూ భూమితో ఉండి, పెద్ద స్థిర జలప్రాంతాలుగా నిశ్చలమైన నీటిని కలిగి ఉంటాయి.
-ఇది ఒక ఉన్నతస్థాయి జీవావరణ వ్యవస్థ.
-కాంతి తీవ్రత, ఉష్ణోగ్రత, పీడనాలను ఆధారంగా చేసుకొని నిలువుగా స్తరీకరించారు లోతైన నీటి సరస్సుల్లో మూడు నిర్ధిష్ట ప్రాంతాలుంటాయి. అవి….
-వేలాంచల మండలం/లిట్టోరల్ మండలం
-ఉప వేలాంచల మండలం/లిమ్నోటిక్ మండలం
-ప్రొఫండల్ మండలం వేలాంచల మండలం తీరానికి దగ్గరగా ఉండి లోతు తక్కువగా ఉన్న ప్రాంతాన్ని వేలాంచల మండలం అంటారు.
-ఈ మండలాన్ని యూఫోటిక్ ప్రాంతం అనికూడా అంటారు.
-వేలాంచల మండలం కిరణజన్య సంయోగక్రియా రేటు అధికంగా ఉండి ఆక్సిజన్ సంవృద్ధిగా ఉంటుంది. ఇది అధిక కాంతివంతమైన ప్రాంతం.
లిమ్నోటిక్ మండలం
-ఇది సరస్సులో తీరానికి దూరంగా ఉండేప్రాంతం. కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. దీనిలో కాంతిప్రసరణ జరుగుతుంది.
ప్రొఫండల్ మండలం ఇది లిమ్నోటిక్ మండలానికి కింద ఉన్న లోతైన నీటి ప్రదేశం. ఇందులో కాంతి ఉండదు కావున కిరణజన్య సంయోగక్రియ జరగదు.
-ఈ మండలంలో అవాయు శ్వాసక్రియ జరిపి కుళ్లిన ఆహార పదార్థాలను తినే డెట్రిటస్ జీవులు ఉంటాయి.
వేలాంచల మండలం జీవ సమాజం (బయోటా)ఉత్పత్తిదారులు
-వేలాంచల మండలంలోని వివిధ రకాల ఆకుపచ్చని మొక్కలు ఉత్పత్తిదారులుగా పనిచేస్తాయి.
ఉదా: నింఫియా, హైడిల్లా, డయాటమ్‌లు మొదలగునవి.
వినియోగదారులు
-న్యూస్టాన్ జీవులు నీటి ఉపరితలం మీద స్వేచ్ఛగా తిరిగే జీవులు.
-గాలి, నీటి అంతర ప్రదేశంలో నివశించే జీవులు
ఉదా: దోమ డింభకాలు, వాటర్ స్పైండర్లు మొదలగునవి.
నెక్టాన్ జీవులు
-నీటిలో ఈదే సామర్థ్యం గల జీవులను నెక్టాన్ జీవులు అంటారు. ఉదా: చేపలు పెరిఫైటాన్ జీవులు
-నీటి మొక్కలపై అంటిపెట్టుకొనే/పాకుతూ ఉన్న జీవులను పెరిఫైటాన్లు అంటారు. ఉదా: హైడ్రా, బయోజోవన్లు లిమ్నోటిక్ మండలంలోని జీవ సమూహం
-ఇది సరస్సులో అదిపెద్ద మండలం
-లిమ్నోటిక్ మండలంలో నీటిస్థాయి, ఉష్ణోగ్రత, ఆక్సిజన్ లభ్యత వంటి అంశాలు వేగవంతంగా మారుతాయి.
-ఈ మండలంలో ఉత్పత్తిదారులు అధికంగా ఉంటాయి.
ఉదా: యూగ్లినాయిడ్లు, డయాటమ్‌లు, సయనో బ్యాక్టీరియా బెంథాస్ జీవులు
-సరస్సు అడుగుభాగంలో విశ్రాంతి తీసుకొనే లేదా చరించే జీవులను బెంథాస్ జీవులు అంటారు.
ఉదా: అనెలిడ్‌లు, మొలస్కా జీవులు
వినియోగదారులు
-జంతుప్లవకాలు: కాపిపోడ్స్
-నెక్టాన్ జీవులు: చేపలు, నీటి సర్పాలు, కప్పలు ప్రొఫండల్ మండలంలోని జీవ సమాజం
-ఈ మండంలోని విచ్ఛిన్నకారులు, చనిపోయిన మొక్కలు, జంతువులను విచ్ఛిన్నం చేసి అందులోగల పోషక పదార్థాలను నీటిలోకి విడుదల చేస్తాయి. ఈ విధంగా విడుదలైన పోషక పదార్థాలను వేలాంచల మండలం, లిమ్నోటిక్ మండలంలోని జీవ సమాజాలు వినియోగించుకొంటాయి.
బయోస్పియర్ రిజర్వ్‌లు
-నందాదేవి బయోస్పియర్ రిజర్వ్-ఉత్తరాఖండ్
-దిబాంగ్-దిబాంగ్ బయోస్పియర్ రిజర్వ్-అరుణాచల్‌ప్రదేశ్
-నాక్రేన్ బయోస్పియర్ రిజర్వ్- మేఘాలయ
-కాంచన్ జంగ్ బయోస్పియర్ రిజర్వ్- సిక్కిం
-సుందర్బన్ బయోస్పియర్ రిజర్వ్- పశ్చిమబెంగాల్
-దిబ్రూ-సికామ్ బయోస్పియర్ రిజర్వ్-అసోం
-మానస బయోస్పియర్ రిజర్వ్-అసోం
-రాణి ఆఫ్ కచ్ బయోస్పియర్ రిజర్వ్-గుజరాత్
-పాంచ్‌మర్హి బయోస్పియర్ రిజర్వ్-మధ్యప్రదేశ్
-అమరకంటక-అబానకర్ బయోస్పియర్ రిజర్వ్-మధ్యప్రదే&ఛత్తీస్‌గఢ్
-సిమ్లిపాల్ బయోస్పియర్ రిజర్వ్-ఒడిశా
-గల్ఫ్ ఆఫ్మన్నార్ బయోస్పియర్ రిజర్వ్-తమిళనాడు
-అగస్త్యమళై బయోస్పియర్ రిజర్వ్- కేరళ
-నీలగిరి బయోస్పియర్ రిజర్వ్-తమిళనాడు
-గ్రేట్ అండమాన్ బయోస్పియర్ రిజర్వ్-అండమాన్ దీవులు
గతంలో అడిగిన ప్రశ్నలు
1. ఆవరణక్రమం దేని పరస్పర అనుబంధాన్ని సూచిస్తుంది (గ్రూప్-1,1994)
1) ప్రకృతిలో జీవించి ఉన్న వాటిలో
2) మొక్కలు, జంతువులు, సూర్యుడు
3) జీవం ఉన్న, జీవం లేని, ప్రకృతిలో శక్తి చక్రాలు
4) మైక్రోబులు, జంతువులు, వృక్షాలు, సౌరకుటుంబం
2. ఆవరణ వ్యవస్థలో గతిశీల భాగంగా దేన్ని పరిగణించవచ్చు? గ్రూప్-1, 2008
1) విచ్ఛిత్తి 2) ఆహార శృంఖలం
3) వాతావరణ పీడనం 4) ఉత్పన్నం చేసేది
3. మడ అడవులు అంటే ? (గ్రూప్-1, 1999)
1) నీటి మొక్కలు 2) ఉప్పునీటి వృక్షాలు
3) పండ్లనిచ్చే వృక్షాలు 4) మంచినీటి శైవలాలు
4. కిందివాటిలో ఏది సరైన ఆహార వరుస (గ్రూప్-1, 1994)
1) గడ్డి-తోడేలు-జింగ గేదె
2) గడ్డి-కీటకం-పక్షి-పాము
3) బ్యాక్టీరియా-గడ్డి-కుందేలు-తోడేలు
4) ఏదీకాదు
5. సరస్సులు, చెరువులు దేనికి ఉదాహరణ?
1) లోటిక్ ఆవరణ వ్యవస్థ 2) లెంటిక్ ఆవరణ వ్యవస్థ
3) రెండింటికీ 4) భౌమ ఆవరణ వ్యవస్థ
6. న్యూస్టాన్లు అని వేటినంటారు ?
1) నీటి అడుగుభాగంలో నివసించేవాటిని
2) నీటిలోపల స్వేచ్ఛగా ఈదేవాటిని
3) నీటిపై తేలేవాటిని 4) పైవన్నీ
7. నిర్ణీత కాలంలో ప్రతీ పోషకస్థాయిలో ఉండే నిర్ణీత జీవ పదార్థ ద్రవ్యరాశిని ఏమంటారు ?
1) స్టాండింగ్ స్టేట్ 2) ఎకోటోన్
3) బయోమ్ 4) స్టాండింగ్ క్రాప్
8. యూఫోటిక్ ప్రాంతంగా పిలువబడేది ?
1) వేలాంచల మండలం 2) ప్రొఫండల్ మండలం
3) లిమ్నోటిక్ మండలం 4) ఏదీకాదు
9. జీవ వైవిధ్య పరిరక్షణ చట్టం ఏర్పాటైన సంవత్సరం ?
1) 1986 2) 1996 3) 2002 4) 1992
10. కిందివానిలో సరికాని జతను గుర్తించండి
1) ఎల్పీజీ-బ్యూటేన్
2) బయోగ్యాస్-మీథేన్
3) ప్రాజెక్ట్ టైగర్-1974
4) దిబ్రూ-సికామ్ బయోస్పియర్ రిజర్వ్-అసోం
11. జీవావరణం మూల ప్రమాణం ?
1) బయోమ్ 2) సముదాయం
3) ఆవాసం 4) ఆవరణ వ్యవస్థ
12. సరికాని జతను గుర్తించండి ?
1. ఎకోసిస్టమ్-టాన్స్లే 2. ఆవరణశాస్త్రం-రీటర్
3. భారత ఆవరణ శాస్త్ర పితామహుడు-ఆర్ మిశ్రా
4. ఎకలాజికల్ పిరమిడ్-ఎర్నెస్ట్ హుకెల్
1) 1,2 2) 2,3 మాత్రమే
3) 4 మాత్రమే 4) 2,4 మాత్రమే
13. ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహం ఎల్లప్పుడూ ఏకదిశా మార్గంలో జరగడానికి కారణం ?
1. సూర్యరశ్మి నుంచి పొందిన శక్తి ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు, విచ్ఛిన్నకారులకు చేరేసరికి క్రమంగా తగ్గుతూ పోవడం.
2. మొక్కల్లో నిల్వఉన్న శక్తి ఇతర పోషక స్థాయిలకు యథావిధిగా చేరుతుంది
3. మొక్కల్లో స్థితిశక్తి వినియోగదారులకు చేరే ప్రక్రియ, పునఃచక్రీయం కాదు
4. ఆహారపు గొలుసులోని పోషక స్థాయిల్లో శక్తి ఉష్ణ రూపంలో సమానంగా విడుదల కావడం
1) 1,2 మాత్రమే 2) 1,3 మాత్రమే
3) 1,2,3 మాత్రమే 4) 1,2,3,4
14. ప్రపంచ ఊపిరితిత్తులు(Lungs of World) అని వేటినంటారు?
1) వృక్షాలు 2) జంతువులు
3) వృక్ష ప్లవకాలు 4) వృక్షాలు&వృక్ష ప్లవకాలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు