పెరుగుదల నియంత్రకాలు.. పోషణ ప్రేరేపితాలు!
మొక్కల పెరుగుదలను పరిసరాలు, పరిస్థితులకు అనుగుణంగా నియంత్రణలో ఉంచే రసాయనాలనే వృద్ధి నియంత్రకాలు అంటారు. ఇవి మొక్కల్లోని అన్ని జీవక్రియలను అదుపులో ఉంచుతాయి. అన్ని భాగాలకు పోషక పదార్థాలను రవాణా చేయడంలో ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. ఈ నేపథ్యంలో మొక్కల్లో వృద్ధి నియంత్రకాల రకాలు, విధుల గురించి తెలుసుకుందాం..
వృద్ధి నియంత్రకాలు (Growth Regulators)
-మొక్కల పెరుగుదల నియంత్రకాలను మొక్కల హార్మోన్లు/ఫైటో హార్మోన్లు అంటారు.
-హార్మోన్ అనే పదాన్ని ప్రతిపాదించినది- స్టార్లింగ్
– హార్మోన్ అనే పదానికి అర్థం ప్రేరేపించడంం లేదా ఉత్తేజపర్చడం.
– వృక్ష హార్మోన్లు రెండు రకాలు. అవి.. వృద్ధి ప్రేరేపకాలు, వృద్ధి నిరోధకాలు.
వృద్ధి ప్రేరేపకాలు (Growth Stimulators)
-ఇవి మొక్కల పెరుగుదలను ప్రేరేపిస్తాయి.
ఉదా: ఆక్సిన్లు, జిబ్బరెల్లిన్లు, సైటోకైనిన్లు
వృద్ధి నిరోధకాలు (Growth Inhibitors)
-ఇవి సుప్తావస్థ, అంగాలు రాలిపోవడం లాంటి పెరుగుదల నిరోధక క్రియల్లో తోడ్పడుతాయి.
ఉదా: అబ్‌సైసిక్ ఆమ్లం, ఇథిలీన్
గమనిక: ఇథిలీన్ పై రెండు వర్గాలకు చెందుతుంది కానీ ఎక్కువగా ఇది పెరుగుదల నిరోధక క్రియలను చూపిస్తుంది. కాబట్టి వృద్ధి నిరోధకంగానే చెబుతారు.
ఆక్సిన్లు
– దీన్ని ఇండోల్-3-ఎసిటికామ్లం (IAA) అంటారు.
-ఇవి కాండం, వేరు కొనల్లో ఉత్పత్తి అవుతాయి.
– IAA & IBAలు సహజ ఆక్సిన్లు (మొక్కల నుంచి లభించేవి).
-NAA & 2, 4 – Dలు సంశ్లేషిత ఆక్సిన్లు.
ప్రభావాలు
– కాండం విచ్ఛేదాల్లో వేర్లను ఉత్పత్తి చేస్తాయి.
-పత్రాలు, పుష్పాలు ప్రథమ దశలో రాలిపోకుండా నివారిస్తాయి.
– పరిపక్వమైన పత్రాలను, ఫలాలను రాలిపోయేటట్లు ప్రేరేపిస్తాయి.
– అగ్రాధిక్యతను ప్రేరేపిస్తాయి.
– పార్శ మొగ్గల పెరుగుదలను నిరోధిస్తాయి.
-2, 4-D ఆక్సిన్ కలుపు మొక్కలను నివారిస్తుంది.
-కణ విభజనను ప్రేరేపిస్తాయి.
– టమాటా మొక్కల్లో అనిశేక ఫలనాన్ని కలిగిస్తాయి.
– పైనాపిల్ మొక్కల్లో పుష్పోత్పత్తిని ప్రేరేపిస్తాయి.
– దారువు విభేదనాన్ని ప్రారంభిస్తాయి.
జిబ్బరెల్లిన్లు
-దీన్ని జిబ్బరెల్లిక్ ఆమ్లం – GA…3 అంటారు. ఇవి ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటాయి.
ప్రభావాలు
-ఇవి కాండాల్లో దీర్ఘవృద్ధిని ప్రోత్సహిస్తాయి.
-వార్ధక్యతను (జీర్ణతను) ఆలస్యం చేస్తాయి.
-సారాయి పరిశ్రమల్లో మాల్టింగ్ ప్రక్రియను వేగిరపరుస్తాయి.
-క్యాబేజీ, బీట్ మొక్కల్లో బోల్డింగ్ను ప్రేరేపిస్తాయి.
సైటోకైనిన్లు
-దీన్ని N…6 ఫర్ ఫ్యూరైల్ అమైనో ఫ్యూరిన్, కైనిటిన్ అంటారు.
– సహజ సైటోకైనిన్లు వేరుకొనల్లో, అభివృద్ధి చెందుతున్న మొగ్గల్లో అపరిపక్వ ఫలాల్లో సంశ్లేషితం అవుతాయి.
ప్రభావాలు
-కణ విభజనను ప్రేరేపిస్తాయి.
– కొత్త పత్రాల ఏర్పాటును ప్రేరేపిస్తాయి.
-పత్రాల్లో హరితరేణువులు ఏర్పడటానికి తోడ్పడుతాయి.
-పార్శ కాండాల పెరుగుదలను ప్రేరేపిస్తాయి.
-అబ్బురపు ప్రకాండ వృద్ధికి తోడ్పడుతాయి.
-అగ్రాధిక్యతను పోగొడుతాయి.
-పత్ర వార్ధక్యాన్ని ఆలస్యం చేస్తాయి.
ఇథిలీన్
– పోషకాల రవాణాను ప్రేరేపిస్తాయి.
-దీన్ని వాయురూప హార్మోన్ అంటారు.
– పరిపక్వం చెందుతున్న ఫలాల నుంచి, వార్ధక్యత చూపుతున్న మొక్క భాగాల నుంచి ఇథిలీన్ విడుదలవుతుంది.
ప్రభావాలు
-పత్రాలు, పుష్పాల్లో వార్ధక్యాన్ని ప్రోత్సహించి అవి రాలిపోయేలా చేస్తాయి.
– ఫలాల పరిపక్వతను ప్రేరేపిస్తాయి.
– శ్వాసక్రియ వేగం పెంచడం (శ్వాసక్రియ క్లెమాక్టిరిక్)
– విత్తనాల్లో, మొగ్గల్లో సుప్తావస్థను తొలగించడం.
-వరి నారు మొక్కల్లో కణుపు మాధ్యమాలు/పత్రవృంతాల దీర్ఘవృద్ధిని ప్రేరేపించడం.
– వేరు వృద్ధిని, మూలకేశాల వృద్ధిని ప్రేరేపిస్తాయి.
-పైనాపిల్ మొక్కల్లో పుష్పాలన్నింటిని ఒకేసారి ఫలవంతం చేస్తాయి.
– దోస (కుకుంబర్)లో స్త్రీ పుష్పాల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి.
-నారు మొక్కల సమాంతర పెరుగుదల, అక్షం ఉబ్బడం, కొక్కెం లాంటి అగ్రం ఏర్పడటం జరుగుతాయి.
అబ్‌సైసిక్ ఆమ్లం
-దీన్ని ప్రతిబల హార్మోన్ అంటారు.
– ఇది వృద్ధి నిరోధకంగా పనిచేస్తూ విత్తనాల్లో సుప్తావస్థను, మొక్కల అంగాలు రాలిపోవడాన్ని ప్రేరేపిస్తుంది.
ప్రభావాలు
– పొడి వాతావరణంలో ఉన్నప్పుడు పత్రరంధ్రాలు మూసుకునేలా చేస్తుంది.
– జిబ్బరెల్లిన్ చర్యలకు విరుద్ధంగా పనిచేస్తుంది.
-పత్రాలు, పుష్పాలు, ఫలాలు ప్రథమ దశలో ఉన్నప్పుడే రాలిపోయేలా చేస్తుంది.
మొక్క శాస్త్రీయ నామం ప్రత్యేకత
వరి ఒరైజా సటైవా దీని తవుడులో B, థయమిన్ విటమిన్లు ఉంటాయి దీని నుంచి బ్రాన్ ఆయిల్ తయారు చేస్తారు దీనిలో పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి.
గోధుమ ట్రిటికం ఈస్టివం ఆల్కహాల్ తయారీకి దీనిని వాడుతారు – దీని గడ్డిని ప్యాకింగ్ అట్టలు
గృహనిర్మాణానికి పైకప్పుగా వాడుతారు
మొక్కజొన్న జియామేజ్ అతి పొడవైన గడ్డి జాతి మొక్కదీన్ని కూడా ఆల్కహాల్ తయారీకి వాడుతారు
బార్లీ హార్డియం వల్గేర్ ——————-
ఓట్ అవీనా సటైవా ——————
రై సికెల్ సిరేల్ ———————
జొన్న సోర్గం వల్గేర్ దీన్ని గ్రేట్ మిల్లెట్ అంటారు
సజ్జ పెన్నిసెటం టైఫాయిడం దీన్ని పెరల్ మిల్లెట్ అంటారు.ఇది పురాతన ధాన్యపు మొక్క
రాగులు ఇల్యుసిన్ కొరకానా దీన్ని ఫింగర్ మిల్లెట్ అంటారు
మొక్కలు – ఆర్థిక ప్రాముఖ్యత
(Economic Importance of Plants)
-మొక్కలు మానవునికి ధాన్యాలు, పప్పు దినుసులు, కూరగాయలు, మసాలా దినుసులు, నూనెలు మొదలైన రకాలుగా నిత్య జీవితంలో ఉపయోగపడుతాయి.
ధాన్యాలు
– ఇవి పిండి పదార్థాలను ఎక్కువగా కలిగి ఉంటాయి. ఇవి గ్రామినే (పొయేసి) కుటుంబానికి చెందిన మొక్కలు.
– వరి, గోధుమ, మొక్కజొన్నలను ప్రధాన ధాన్యాలు (Major Cereals) అని, రాగులు, సజ్జలు, జొన్నలను చిరు ధాన్యాలు/తృణ ధాన్యాలు (Minor Cereals/Millets) అంటారు.
పేపర్‌ను ఇచ్చే మొక్కలు
వెదురు
-దీని శాస్త్రీయ నామం బాంబూసా.
-ఇది తక్కువ కాలంలో అతి ఎక్కువ ఎత్తుకు పెరుగుతుంది.
– ఇది జీవిత చివరిదశలో ఒకే ఒక్కసారి పుష్పిస్తుంది.
నీలగిరి
-దీని శాస్త్రీయ నామం యూకలిప్టస్ గ్లాబులస్.
-దీని నుంచి నీలగిరి తైలం లభిస్తుంది. ఇది ముక్కు, గొంతుకు సంబంధించిన ప్పిని తగ్గిస్తుంది.
– ఇది పొడవైన ఆవృతబీజ మొక్క.
కలప మొక్కలు
– కలప మొక్కల అధ్యయనాన్ని డెండ్రాలజి అని, పెంపకాన్ని సిల్వికల్చర్ అని అంటారు.
– గట్టిగా, దృఢంగా ఉన్న కాండాన్ని కలప అంటారు.
-మొక్క వయస్సు పెరిగిన కొద్దీ కాండం లావెక్కడాన్ని ద్వితీయ వృద్ధి (Secondary Growth) అంటారు.
-మొక్క కాండాన్ని ఛేదించినప్పుడు కనిపించే వలయాలను వార్షిక వలయాలు లేదా వృద్ధి వలయాలు అంటారు. వీటి అధ్యయనాన్ని డెండ్రోక్రోనాలజి అంటారు. మొక్క వయస్సును వార్షిక వలయాల సంఖ్యను బట్టి నిర్ణయిస్తారు. (మొక్క వయస్సు = వార్షిక వలయాల సంఖ్య/2).
పప్పు దినుసులు (అపరాలు (Pulses)
-ఇవి ఎక్కువగా ప్రొటీన్లను, ఆ తర్వాత పిండి పదార్థాలను, చాలా తక్కువ మోతాదులో లిపిడ్లను కలిగి ఉంటాయి. ఇవి ఎక్కువగా పాబేసి/లెగ్యుమినేసి కుటుంబానికి చెందినవి.
ఉదా: కందులు (కజానస్ కజాన్), వేరుశనగ (అరాఖిస్ హైపోజియా), కేసరి పప్పు (లాథిరస్ సెటైవస్), సోయాబీన్ (గ్లెసిన్ మాక్స్), శనగలు (సైసర్ అరైటినమ్), చిక్కుడు (డాలికస్ లాబ్ లాబ్), పెసర (ఫాసియోలస్ అరియస్).
– సోయాబీన్లో అధిక ప్రొటీన్లు ఉంటాయి.
నూనెలు (Oils)
– పామె/ఎరికేసి, యుఫర్బియేసి, ఆస్టరేసి కుటుంబాలకు చెందిన మొక్కలు నూనెలను ఇస్తాయి.
ఉదా: పామ్ (ఇల్యుసైన్ గైనెన్సిస్), ఆవ (బ్రాసికా నైగ్రా), సన్‌ఫ్లవర్/పొద్దు తిరుగుడు (హీలియాంథస్ అన్యువస్), వేరుశనగ (అరాఖిస్ హైపోజియా), కుసుమ (కార్థమస్ టింక్టోరియస్), కొబ్బరి (కోకస్ న్యూసిఫెరా), ఆముదం (రిసినస్ కమ్యూనికస్), నువ్వులు (సిసామమ్ ఇండికమ్).
-కొబ్బరి మొక్క అంకురచ్చదం నుంచి లభించే నూనెను కోప్రా ఆయిల్ (Copra Oil) అని, ఆవాల నుంచి లభించే నూనెను టోరియా ఆయిల్ (Toria Oil) అని అంటారు.
చక్కెరలు (Sugers)
ఉదా: చెరుకు (శాఖరమ్ అసిఫినారమ్), బీట్రూట్ (బీటా వల్గారిస్).
– ధృవ ప్రాంత ప్రజలు చక్కెరను బంగాళదుంప, బీట్రూట్ నుంచి తయారు చేస్తారు.
మసాలా దినుసులు (Condiments)
– భారతదేశపు మసాలాల తోట (Spice garden of India) అని కేరళ రాష్ట్రాన్ని పిలుస్తారు.
– మసాలాలు ఆహార పదార్థాలను నిల్వచేసే సామర్థ్యాన్ని కలిగి ఉండటంతోపాటు రుచి, వాసనను ఇస్తాయి.
మొక్క శాస్త్రీయ నామం ప్రత్యేకత
మిరియాలు పైపర్ నైగ్రమ్ సుగంధ ద్రవ్యాల రాజు
యాలకులు ఎలట్టేరియా కార్డమామమ్ సుగంధ ద్రవ్యాల రాణి
లవంగాలు సిజిజియం ఆరోమాటికం వీటి నుంచి తీసిన నూనెను
——– —— యూజినాల్ (Clove Oil) అంటారు.
దాల్చిన చెక్క సిమినం జెలానికా దీని బెరడును వంటల్లో వాడుతారు
కుంకుమ పువ్వు క్రోకస్ సెటైవస్ ఎండిన కీలాగ్రాన్ని ఉపయోగిస్తారు
పుదీనా మెంథా దీని ఆకును ఉపయోగిస్తారు
రాతిపువ్వు పర్మోట్రెమా ఇది ఒక రకమైన లైకెన్
మిరప కాప్సికం ప్రూటిసెన్స్ కాప్సిసిన్ అనే పదార్థంవల్ల కారం వస్తుంది
డాక్టర్ మోదాల మల్లేష్
విషయ నిపుణులు
పాలెం, నకిరేకల్, నల్లగొండ
9989535675
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు