ఫాటి ఆమ్లాల నుంచి లవణాలు ఏర్పడటం?
మైనములు (waxes)
– ఇవి తినదగినవి కావు.
– వీటిని కీటకాలు ఉత్పత్తి చేస్తాయి.
– ఉదా. తేనేటీగల మైనము, లక్క, చెవిగూమిలి
సంయుగ్మ కొవ్వులు (Conjugated/ Compound Lipids)
– కొవ్వు (లిపిడ్) అణువుతో కొవ్వు కాని అణువు బంధం ఏర్పర్చుకుంటే అలాంటి లిపిడ్లను సంయుగ్మ లిపిడ్లు అంటారు. వీటినే హెటిరోలిపిడ్లు అని కూడా అంటారు.
– లైసిథిన్, స్పింగోమయోలిన్లు ప్లాస్మాత్వచం బయటిభాగంలో ఉంటాయి.
– లెసిథిన్ అనేది గుడ్డుసొన, మెదడులో ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల్లోని వాయుగోణుల తలతన్యతను తగ్గించడంలో తోడ్పడుతుంది.
– సెఫాలిల్ అనేది మెదడులో ఉంటుంది. ఇది మెదడును రక్షించడంలో తోడ్పడుతుంది.
ఉత్పన్న కొవ్వులు (Derived Lipids)
– జీవక్రియ ఫలితంగా ఏర్పడిన కొవ్వులను ఉత్పన్న కొవ్వులు అంటారు.
– స్టిరాయిడ్స్, పైత్యఆమ్లాలు, లైంగికహార్మోన్లు, కొవ్వులో కరిగే విటమిన్లు మొదలైనవి ఉత్పన్న లిపిడ్లలోని రకాలు.
ఉదా. కొలెస్టిరాల్, సహజరబ్బరు
కొలెస్టిరాల్
– ఇది తెల్లని ఘనరూప స్పటికపదార్థం
– ఇది ఒక స్టిరాయిడ్
– దీని అణుఫార్ములా- C27 H46O
– ఇది మెదడు, నాడీకణాలు, అడ్రినల్గ్రంథులు, గుడ్డుసొన లలో ఎక్కువగా ఉంటుంది.
– పిండిపదార్థాలు (కార్బొహైడ్రేట్లు), కొవ్వులను ఎక్కువగా తీసుకుని తక్కువ పనిచేస్తే ఎక్కువైన శక్తి కొలెస్టిరాల్ రూపంలోకి మార్చబడుతుంది.
– ఇది ఎడిపోజ్ కణజాలంలో నిల్వ చేయబడుతుంది.
– ఇది ఉపవాస సమయంలో శక్తిని ఇవ్వడానికి తోడ్పడుతుంది.
– ఇది శరీర ఉష్ణోగ్రతను బయటకు పోకుండా నిరోధిస్తుంది.
నోట్. మానవ శరీర ఉష్ణోగ్రత 37oC లేదా 98.4 F
– ఇది విటమిన్-డి తయారీలో ఉపయోగపడుతుంది.
– ఇది జంతువులు, మొక్కలలో ప్లాస్మాత్వచం తయారీలో తోడ్పడుతుంది.
– కొలెస్టిరాల్ ఎక్కువైతే హైబీపీ, స్థూలకాయం (Obesity), కామెర్లు, గుండెజబ్బులు వస్తాయి.
కొవ్వు ఆమ్లాలు
– కొవ్వు (లిపిడ్) అణువు ఏర్పడటానికు కొవ్వు ఆమ్లాలు (Fatty acids) అవసరం.
– కొవ్వు ఆమ్లాలు పొడవైన కర్బన శృంఖలంను కలిగి చివరన COOH గ్రూపును కలిగి ఉండును.
– కొవ్వు ఆమ్లాలన్నింటిలో ఫార్మిక్ ఆమ్లం అతిసరళమైనది.
– కొవ్వు ఆమ్లాలు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. అవి..
సంతృప్త కొవ్వు ఆమ్లాలు (Saturated Fatty acids)
అసంతృప్త కొవ్వు ఆమ్లాలు (UnSaturated Fatty acids)
సంతృప్త కొవ్వు ఆమ్లాలు
– ఒక ఫాటి ఆమ్ల (కొవ్వు ఆమ్ల) అణువులో రెండు కర్బన పరమాణువుల మధ్య ఎలాంటి ద్విబంధం లేకుంటే అలాంటి ఫాటీ ఆమ్లాలను సంతృప్త ఫాటీ ఆమ్లాలు అంటారు.
– జంతువుల నుంచి లభించే కొవ్వులలో సంతృప్త ఫాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి.
– ఇవి జీవక్రియ పరంగా మానవునికి అంత ఉపయోగకరమైనవికావు.
ఉదా: పామిటిక్ ఆమ్లం (Palamitic acid)
స్టియరిక్ ఆమ్లం (Stearic acid )
అరాఖిడిక్ ఆమ్లం (Arachidi acid)
అంసతృప్త కొవ్వు ఆమ్లాలు
– ఒక ఫాటీ ఆమ్ల (కొవ్వు ఆమ్ల) అణువలో రెండు కర్బన పరమాణువుల మధ్య ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ద్విబంధాలు ఉన్నట్లయితే అలాంటి ఫాటిఆమ్లాలను అసంతృప్త ఫాటీ ఆమ్లాలు అంటారు.
– మొక్కల నుంచి లభించే కొవ్వులలో అసంతృప్త ఫాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి.
– ఇది జీవక్రియ పరంగా మానవునికి ఉపయోగకరమైనవి.
ఉదా:
– ఓలిక్ ఆమ్లం (Oleic acid)- ఒక ద్విబంధం ఉంటుంది.
– లినోలిక్ ఆమ్లం (Linoleic acid)- రెండు ద్విబంధాలు ఉంటాయి.
– లినోలైనిక్ ఆమ్లం (Linolenic acid)- మూడు ద్విబంధాలు ఉంటాయి.
– అరాఖిడోనిక్ ఆమ్లం (Arachidonic acid)- నాలుగు ద్విబంధాలు ఉంటాయి.
– లినోలిక్, లినోలెనిక్, అరాఖిడోనిక్ ఫాటీ ఆమ్లాలను ఆవశ్యక కొవ్వుఆమ్లాలు (Essential fatty acid) అంటారు. ఇవి మానవ దేహంలో సంశ్లేషించబడవు. కావున వీటిని బయటి నుంచి ఆహర రూపంలో తీసుకోవాలి.
– మొక్కలు అన్ని రకాల ఫాటీ ఆమ్లాలను సంశ్లేషిస్తాయి.
– సాల్మన్, మెకరల్, ట్యూనా చేపలలో ఒమెగా-3 ఫాటీ ఆమ్లాలు లభిస్తాయి.
– చాల్ మూగ్రా నూనెను కుష్టువ్యాధి నివారణలో ఉపయోగిస్తారు.
LDL (Low Density Lipoprotien)
– దీనిని చెడు కొలెస్టిరాల్ అంటారు.
– ఇది సంతృప్త కొవ్వులను ఎక్కువగా తీసుకోవడం వలన ఏర్పడుతుంది.
HDL (High Density Lipoprotien)
– దీనిని మంచి కొలెస్టిరాల్ అంటారు.
– ఇది అసంతృప్త కొవ్వులను ఎక్కువగా తీసుకోవటం వలన ఏర్పడుతుంది.
హైడ్రోజనీకరణం
– మొక్కలలోని అసంతృప్త కొవ్వు ఆమ్లాలకు సరైన ఉష్ణోగ్రత పీడనాల వద్ద హైడ్రోజన్ వాయువును కలిపి వాటిని సంతృప్తస్థితిలోకి మార్చి డాల్డా/ వనస్పతి (Vegetable ghee) ని తయారుచేసే ప్రక్రియను హైడ్రోజనీకరణం అంటారు. ఈ ప్రక్రియకు నికెల్ (Ni) ప్లాటినం (pt) పెల్లాడియం (Pd) లను ఉత్పేరకాలుగా వాడుతారు.
సఫోనిఫికేషన్
– ఇది సబ్బులను తయారుచేసే ప్రక్రియ
– సోడియం హైడ్రాక్సైడ్ (NaOH), పొటాషియం హైడ్రాక్సైడ్ (KoH) లతో ఫాటి ఆమ్లాలను చర్య జరిపినప్పుడు ఫాటి ఆమ్లాల నుంచి లవణాలు ఏర్పడటాన్ని సఫొనిఫికేషన్ అంటారు.
– సోడియం (Na) లవణంతో తయారుచేయబడిన సబ్బులను డిటర్జెంట్లు (Detergents) అంటారు. పొటాషియం (K) లవణంతో తయారుచేయబడిన సబ్బులను స్నానపు సబ్బులు (bath soaps) అంటారు.
– సబ్బుల్లో ఎక్కువగా స్టియరిక్ ఆమ్లం అనే కొవ్వు ఆమ్లం ఉంటుంది.
– తిమింగలం, ధృవపు ఎలుగుబంటి, పెంగ్విన్ పక్షులు, డాల్ఫిన్ వంటి జంతువుల శరీరం కింద ఉండే మందమైన కొవ్వుపొరను బ్లబ్బర్ (Blubbar) అంటారు. ఇది శీతల పరిస్థితుల నుంచి తప్పించుకోవటంలో ఉష్ణప్రతిబంధకంగా పనిచేస్తుంది.
– మానవునిలో ఉండే 7-Dehydrocholestrol సూర్యరశ్మీ సమక్షంలో విటమిన్-డి తయారవుతుంది.
పౌష్టికాహర లోపాలు (Nutritional Deficiency Disorders)
– మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు ప్రధాన శక్తి సరఫరాదారులు- Chiefenergy providers), ప్రొటీన్లు (దేహనిర్మాణకారులు- Body builders), లిపిడ్లు (శక్తినిల్వలు- Energy Reseves), విటమిన్లు (సహజ ఎంజైములు- Co-Enzymes) ఖనిజమూలకాల వంటి ఆవశ్యకమైన పదార్థాలు ఉంటాయి.
– ఆహారపదార్థాలు తక్కువగా తీసుకుంటే కలిగే లోపాలను పౌష్టికాహార లోపాలు అంటారు.
.
క్వాషియార్కర్
– కార్బోహైడ్రేట్లు, లిపిడ్లను కెలోరీలు అంటారు.
– తీసుకునే ఆహారంలో కెలోరీ (కార్బోహైడ్రైట్లు, లిపిడ్) ల స్థాయి సాధారణంగా ఉండి ప్రొటీన్లు తగ్గితే క్వాషియార్కర్ వ్యాధి వస్తుంది.
– క్వాషియార్కర్ అనగా నిర్లక్ష్యం చేయబడ్డ శిశువు అని అర్థం.
– ఇది పిల్లలలో 18నెలల తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది.
మరాస్మస్
– ప్రొటీన్లు, కెలోరీల లోపం వలన వచ్చే వ్యాధిని మరాస్మస్ అంటారు.
– ఇది సాధారణంగా ఏడాది లోపు పిల్లల్లో కనిపిస్తుంది.
స్థూలకాయత్వం (Obesity)
– శరీర బరువులో 20శాతం కంటే ఎక్కువ కొవ్వు ఉన్నట్లయితే వచ్చే పోషకాహర సమస్యను స్థూలకాయత్వం అంటారు.
– శక్తిని ఇచ్చే ఆహర పదార్థాలైన కార్బోహైడ్రేట్లు, కొవ్వులను ఎక్కువగా తీసుకునే తక్కువ వ్యక్తులలో ఈ సమస్య వస్తుంది.
– ఇది వ్యాధి కాదు. ఒక పోషకాహర సమస్య మాత్రమే.
– స్థూలకాయత్వం గలవారిలో గల కొవ్వులను తీసివేసి సర్జరీ-బేరియాట్రిక్ సర్జరీ (Weight loss surgery/ Liposuction). ఈ సర్జరీలో జీర్ణాశయం చుట్టూ గల కొవ్వును తొలగిస్తారు.
– ఈ సమస్య గల వారికి పుట్ట గొడుగులను (Mushrooms) మంచి ఆహారంగా పరిగణిస్తారు.
– స్థూలకాయత్వం వలన Heart attack (గుండెసమస్య) హైబీపీ, హైపటైటిస్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు