Botany Study Material | మొక్కను సృష్టించే పత్రం.. ఫలాలనిచ్చే పుష్పాసనం
మొక్కల – వర్గీకరణ
- మొక్కలు ఉత్పత్తిదారులు. అన్ని వినియోగదారులకు ఆహారాన్ని అందిస్తున్నాయి. భూమిపై ఉన్న అన్ని జీవులు ప్రత్యక్షంగా, పరోక్షంగా మొక్కలపై ఆధారపడి జీవిస్తున్నాయి. మానవుడికి కావలసిన ఆక్సిజన్, ఆహార పదార్థాలు మొక్కల నుంచే లభిస్తున్నాయి. మొక్కలను వాటి నిర్మాణం, నివసించే ప్రాంతాన్ని బట్టి వివిధ రకాలుగా విభజించారు.
- మొక్కలను రెండు రకాలుగా వర్గీకరించారు. అవి. పుష్పించని మొక్కలు, పుష్పించే మొక్కలు.
పుష్పించని మొక్కలు - పుష్పించని మొక్కల్లో పుష్పాలు, ఫలాలు, విత్తనాలు ఏర్పడవు. వీటిని తిరిగి మూడు రకాలుగా విభజించారు. అవి.. 1. థాలోఫైటా 2. బ్రయోఫైటా 3. ట్రెనిడోఫైటా.
పుష్పించే మొక్కలు - ఇవి రెండు రకాలు అవి..
1. వివృత బీజాలు 2. ఆవృత బీజాలు
వివృత బీజాలు: వివృత బీజ మొక్కల విత్తనాలు ఫలంలో కాకుండా మొక్క భాగాలపై బహిర్గతంగా అతికి ఉంటాయి. అందువల్ల ఫలాలు ఏర్పడవు. ఇవి ఎక్కువగా సమశీతోష్ణ పర్వత ప్రాంతాల్లో పెరుగుతాయి. ఇవి అత్యంత ఎత్తుకు పెరిగే మొక్కలు. ఉదా : దేవదారు వృక్షం.
ఆవృత బీజాలు: వీటిలో ఫలాలు ఏర్పడటం వల్ల విత్తనాల్లో ఫలాలు ఉంటాయి. ఇవి బాగా అభివృద్ధి చెందిన మొక్కలు. ఆహారం నిల్వ ఉండే భాగాలను బీజదళాలు అంటారు. ఇవి రెండు రకాలు
1. ద్విదళ బీజాలు: ఇందులో రెండు బీజదళాలు ఉంటాయి. ఉదా : బఠానీ, వేరుశనగ, చిక్కుడు
2. ఏకదళ బీజాలు: వీటి విత్తనంలో ఒకే బీజదళం ఉంటుంది. ఉదా : వరి, గోధుమ, మొక్కజొన్న
మొక్కబాహ్య స్వరూపం
వేరు వ్యవస్థ
- పిండం నుంచి ప్రథమంగా అంకురించిన ప్రథమ మూలం భూమిలో వేరుగా పరిణామం చెందుతుంది.
- మొక్కకు చెందిన భూగత అక్షాన్ని వేరు వ్యవస్థ అంటారు.
- వేరు వ్యవస్థ సాధారణంగా భూమిలో గురుత్వాకర్షణ దిశలో, కాంతి ప్రసరణకు వ్యతిరేక దిశలో అభివృద్ధి చెందుతుంది. (మడ మొక్కల్లో పెరిగే శ్వాస వేర్లు దీనికి మినహాయింపు).
- వేరు వ్యవస్థ మొక్కకు స్థిరత్వాన్ని, నీరు, ఖనిజ లవణాలను నేల నుంచి గ్రహించి మొక్క పైభాగాలకు సరఫరా చేస్తుంది.
- వేరులో కణుపులు, కణుపు మాధ్యమాలు, పత్రాలు, మొగ్గలు ఉండవు.
- ద్విదళ బీజ మొక్కల్లో తల్లి వేరు, పార్శ వేర్లు ఉంటాయి. దీన్నే తల్లి వేరు వ్యవస్థ అంటారు.
- ఏకదళ బీజ వేరు మొక్కల్లో గుబురు వేరు వ్యవస్థ ఉంటుంది.
- పార్శ వేర్లు పరిచక్రం నుంచి అంతర్గతంగా ఉత్పత్తి అవుతాయి.
- వేరు చివర వేరు తొడుగు (కాలిప్టా) ఉంటుంది. ఇది కాలిప్ట్రోజన్ అనే విభాజ్య కణజాలం నుంచి ఏర్పడతుంది.
- అతిపెద్ద వేరు తొడుగు పెండానస్ మొక్కల్లో ఉంటుంది.
వేరు రూపాంతరాలు
నిల్వ చేసే వేర్లు: ఆహారాన్ని వేర్లలో నిల్వ చేసే వాటిని నిల్వ వేర్లు అంటారు. ఉదా : బీట్రూట్ (మూపురాకారం), ముల్లంగి (కండె ఆకారం), క్యారెట్ (శంఖు ఆకారం).
పాసిక్యులేటెడ్ వేర్లు: గుత్తుల వలె ఉండే వేళ్లను పాసిక్యులేటెడ్ వేర్లు అంటారు.
ఉదా : ఆస్పరాగస్, డాలియా - దుంప వేర్లు పోషక పదార్థాలను నిల్వ చేయడం వల్ల ఈ మొక్కలను వేరు పంటలు అంటారు. (Root Crops)
కాండం
- పిండం అభివృద్ధి చెందేటప్పుడు వెలువడిన ప్రథమ కాండం నుంచి ఉత్పత్తి అయ్యే వాయుగత భాగాన్ని ప్రకాండ వ్యవస్థ అంటారు.
- ప్రకాండ వ్యవస్థ అక్షాన్ని కాండం అంటారు.
- కాండంపై శాఖలు, పత్రాలు, మొగ్గలు, పుష్పాలు, ఫలాలు ఏర్పడతాయి.
- కాండాగ్రంలో అనేక శాఖలు విస్తరించిన భాగాన్ని ఛత్రాకార కాండం అంటారు.
ఉదా : వేప, మామిడి, చింత - అనిశ్చితంగా పెరిగే కాండం నుంచి పార్శ శాఖలు అగ్రాబిసార క్రమంలో ఏర్పడితే శంఖ్వాకార కాండం అంటారు.
ఉదా : కాజురైనా, (సరుగుడు), ఫైనస్ - కొమ్మల కోణీయ పెరుగుదలను (ఏటవాలు) వాలు గురుత్వానువర్తనం అంటారు.
- ప్రధాన కాండంపై శాఖలు అభివృద్ధి చెందే విధానాన్ని శాఖీభవనం అంటారు.
- ద్విభాజీ శాఖీభవనం క్రిప్టోగామ్లలో ఉంటుంది.
ఉదా : శైవలాలు- డిక్టియేటా
బ్రయోఫైట్స్- రిక్సియా, మార్కాంషియా
టెరిడోఫైటా- లైకోపోడియం, సెలాజినెల్లా
కొమ్ము (రైజోమ్) : జింజిబర్ (అల్లం), కర్క్యుమా లాంగా (పసుపు)
కాండం రూపాంతరాలు
కందం : కొలకేషియా, అమార్ఫోపాలస్
దుంప కాండం : బంగాళదుంప
లశునం : వెల్లుల్లి, నీరుల్లి
పత్రం
- కాండం కణుపు నుంచి బహిర్గతంగా అభివృద్ధి చెందే నిర్మాణాలే పత్రాలు.
l కిరణజన్య సంయోగక్రియను నిర్వహించి ఆహార పదార్థాలను తయారు చేస్తాయి.
l అం కురించినప్పుడు ఏర్పడిన బీజదళాలను ప్రథమ పత్రాలు (పిండ సంబంధ ప్రతాలు)గా పేర్కొంటారు.
l పత్రాల ఆకుపచ్చదనానికి కారణం వాటి కణాల్లోని క్లోరోప్లాస్ట్ (హరితరేణువు)లో గల క్లోరోఫిల్ (పత్రహరితం).
l క్లోరోఫిల్లో ఉండే మూలకం-మెగ్నీషియం
l ఇది ఆకుపచ్చని కాంతిని పరావర్తనం
చెందించడం వల్ల మొక్కలు ఆకుపచ్చని రంగులో ఉంటాయి.
l కాండంపై పత్రాలు అమరి ఉండే విధానాన్ని పత్ర విన్యాసం అంటారు.
పత్రంలోని భాగాలు: పత్రదళం, పత్ర వృంతం, పత్ర పుచ్ఛాలు
l పత్రదళంపై బాహ్య చర్మంలో గల సూక్ష్మ రంధ్రాలను పత్ర రంధ్రాలు లేదా స్టోమేటా అంటారు.
l వీటి ద్వారా పత్రాల్లోకి వాయువుల రవాణా, బాష్పోత్సేకం జరుగుతుంది.
l పత్రదళంలో ఈనెలు అమరి ఉండే విధానాన్ని ఈనెల వ్యాపనం అంటారు.
l సాధారణంగా ద్విదళ బీజ మొక్కల్లో జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది.
l ఏక దళ బీజ మొక్కల్లో సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది.
పత్ర రూపాంతరాలు
ప్రత్యుత్పత్తి పత్రాలు: బ్రయోఫిల్లంలో పత్రోపరిస్థిత మొగ్గలు శాఖీయ ప్రత్యుత్పత్తిలో తోడ్పడి కొత్త మొక్కలను ఏర్పరుస్తాయి. ఉదా: బ్రయోఫిల్లం (రణపాల), బిగోనియా
కీటకాహార/మాంసాహార/బోను పత్రాలు: నత్రజని లోపించిన నేలలో ఈ మొక్కలు పెరుగుతాయి. వీటిలో పత్రాలు వివిధ ఆకారాల్లోకి మారి ప్రొటియోలైటిక్ ఎంజైమ్లను కలిగి ఉంటాయి. కీటకాలను ఆకర్షించి ప్రొటియోలైటిక్ ఎంజైమ్లతో జీర్ణం చేస్తాయి. ఈ మొక్కలు ఎక్కువగా అసోం అడవుల్లో పెరుగుతాయి.
ఉదా : డ్రాసిరా – దీనిలో చెంచా ఆకారపు బోను పత్రాలుంటాయి.
- నెపంథిస్- కూజా ఆకారపు బోను పత్రాలుంటాయి.
- యూట్రిక్యులేరియా – తిత్తుల వంటి బోను పత్రాలుంటాయి.
- డయోనియా – పుస్తకం ఆకారపు బోను పత్రాలుంటాయి.
పుష్పం
- పుష్ప విన్యాసాక్షం/పుష్ప విన్యాస వృంతంపై పుష్పాలు అమరి ఉండే విధానాన్ని పుష్పవిన్యాసం అంటారు.
- మొక్కల్లో లైంగికోత్పత్తి భాగం-పుష్పం
- పుష్పాల అధ్యయనాన్ని ఆంథాలజీ అంటారు.
- పుష్పాలనిచ్చే మొక్కల పెంపకాన్ని ఫ్లోరీకల్చర్ అంటారు.
- పుష్పించే మొక్కలను ఫెనెరోగామ్లు అంటారు.
- పుష్పించని మొక్కలను క్రిప్టోగామ్లు అంటారు.
- జీవితకాలంలో ఒకేసారి పుష్పించే మొక్కలను మోనోకార్ప్ అంటారు.
ఉదా: బాంబూసా (వెదురు) - ప్రతి సంవత్సరం పుష్పించే మొక్కలను పాలికార్ప్ అంటారు.
ఉదా: మామిడి, చింత మొదలైనవి
ఫలం
- ఫలం ఆవృత బీజాల ముఖ్య లక్షణం.
- ఫలదీకరణ తదుపరి అండాశయం ఫలంగా మారుతుంది.
- ఫలాల అధ్యయనాన్ని పోమాలజీ అంటారు.
- ఫలాల మొక్కలను సాగుచేయడానికి పోమి కల్చర్ అంటారు.
- ఫలాలు రెండు రకాలు అవి..
1. అనృత ఫలాలు (False Fruits)
2. నిజ ఫలాలు (True Fruits)
అనృత ఫలం: పుష్పంలోని అండాశయం కాకుండా ఇతర భాగం ఫలంగా మారితే దాన్ని అనృత ఫలం అంటారు.
ఉదా: జీడి మామిడిలో పుష్పవృంతం ఫలంగా మారుతుంది. ఆపిల్లో పుష్పాసనం ఫలంగా మారుతుంది.
నిజ ఫలం: పుష్పంలోని అండాశయం ఫలంగా మారితే దాన్ని నిజ ఫలం అంటారు.
మొక్కలు – ఆర్థిక ప్రాముఖ్యత
- మొక్కలు మానవుడికి ఆహారాన్ని అందించడంతో పాటు గృహ, వైద్యశాస్త్రంలో ఉపయోగపడతాయి.
ఆహార మొక్కలు: ఇందులో వరి, గోధుమ, మొక్కజొన్న, బార్లీ, ఓట్ తదితరాలు ఉంటాయి. ఈ మొక్కల్లో పిండి పదార్థం ఉంటుంది.
పప్పు దినుసులు: వీటిలో ఎక్కువగా ప్రొటీన్లు ఉంటాయి. లెగ్యుమినేసి కుటుంబానికి చెందినవి. కందులు, వేరుశెనగ, సోయాబీన్, పెసర, మినుములు, బఠానీ, చిక్కుడు పప్పు దినుసులు. పప్పు దినుసులను పరిమితికి మించి తినడం వల్ల ముఖ్యంగా ఎర్రటి పప్పు తినడం వల్ల ఎముకలు, నాడుల క్షీణత కలుగుతుంది. ఈ స్థితిని లాతిరిజం అంటారు.
కూరగాయలు
వీటిని నాలుగు రకాలుగా వర్గీకరించారు
1. ఫల కూరగాయలు: టమాటా, వంకాయ, బెండకాయ, కాకర మొదలైనవి.
2. కాండ కూరగాయలు: బంగాళదుంప, చామగడ్డ తదితరాలు.
3. వేరు కూరగాయలు: ముళ్లంగి, క్యారెట్, బీట్రూట్ మొదలైనవి.
4. ఆకుకూరలు: పాలకూర, బచ్చలి కూర, తోటకూర మొదలైనవి.
నూనెలు
- ఆహార పదార్థాల్లో నూనెగింజలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. మనం నిత్యం వినియోగించే పొద్దుతిరుగుడు, పామాయిల్, రైస్ బ్రాన్ నూనెలు మొక్కల నుంచి లభించే నూనెలు.
మసాలా దినుసులు: ఇవి ఆహారానికి రుచి, వాసన, నిల్వ చేసే సామర్థ్యాన్ని కలిగిస్తాయి. మిరప, మిరియాలు, యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క, పుదీనా, కుంకుమ పువ్వు, దనియాలు, రాతి పువ్వు ముఖ్యమైన మసాలాలు. మిరపలో కాప్సిసిన్ అనే పదార్థం కారాన్ని కలుగజేస్తుంది. మిరియాలను మసాలాల రాజుగా అభివర్ణిస్తారు. యాలకులను మసాలాల రాణిగా పేర్కొంటారు. లవంగాలు పూమొగ్గలు.
ఫలాలు
మామిడి: దీని శాస్త్రీయనామం మాంజిఫెరా ఇండికా. దీన్నీ ఫలరాజు (కింగ్ ఆఫ్ ఫ్రూట్స్, ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా) గా పిలుస్తారు.
అరటి: దీని శాస్త్రీయనామం మ్యూసా పారడైసికా. ప్రపంచంలో అతి ప్రాచీన ఫలం ఇదే. అరటిలో చాలా రకాల విటమిన్లు ఉంటాయి. (ఎ, బి, సి, డి, ఇ)
జామ: దీన్ని పూర్ మెన్ ఆపిల్ అంటారు. సి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు