Biology | విటమిన్ల లోపం వల్ల చర్మానికి వచ్చే వ్యాధి?
1. కంటి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ ఏది?
1) విటమిన్-ఎ 2) విటమిన్-బి
3) విటమిన్-సి 4) విటమిన్-డి
2. ఇంద్రియ జ్ఞానమనేది ఒక సంక్లిష్టమైన విధానం. దీనిలో పాల్గొనేది?
1) జ్ఞానేంద్రియాలు
2) జ్ఞానేంద్రియాలు, నాడీ ప్రేరణలు
3) జ్ఞానేంద్రియాలు,
నాడీ ప్రేరణలు, మెదడు
4) మెదడు, నాడీ ప్రేరణ
3. ఒక వ్యక్తి నాలుక ఎక్కువ ఉప్పగా ఉన్న పదార్థం రుచి చూసింది. అప్పుడు ఆ వ్యక్తి?
1) ఉప్పటి పదార్థాలను తినడం
నేర్చుకుంటాడు
2) ఉప్పటి పదార్థాలను తినడానికి
ఇష్టపడతాడు
3) ఉప్పటి పదార్థాలను తినడానికి
ఇష్టపడడు
4) అంతకంటే తక్కువ ఉప్పదనం కలిగిన పదార్థాల రుచిని తెలుసుకోలేడు
4. ఇంద్రియ జ్ఞానాలు అయిదింటి గురించి మొదటగా తెలియజేసింది ఎవరు?
1) ప్లేటో 2) అరిస్టాటిల్
3) 1, 2 4) ఆల్బర్టస్ మేగ్నస్
5. వెలుపలి చెవి గనుక శబ్ధ తరంగాలను
కేంద్రీకరించకపోతే శ్రవణ కుల్య?
1) అనేక రకాల శబ్ధాలను గట్టిగా వినగలదు
2) ఏమీ వినలేదు
3) కొద్దిగా వినగలదు
4) శబ్ధం పుట్టుకను, రకాన్ని తెలుసుకోలేదు
6. ఆధార్ వంటి గుర్తింపు కార్డుల్లో కంటి ఏ భాగాన్ని ఫొటో ద్వారా బంధిస్తారు?
1) కంటిపాప 2) కంటి మొత్తం భాగం
3) కనుగుడ్డు 4) పైవన్నీ
7. కంటిలోని శంకువుల సంఖ్య సుమారుగా?
1) 6 మిలియన్లు 2) 7 మిలియన్లు
3) 8 మిలియన్లు 4) 9 మిలియన్లు
8. ఒక వ్యక్తి కంటి గుడ్డు కండరాలు పనిచేయకుండా పాడైతే తప్పనిసరిగా కలిగే ప్రభావం?
1) ఆ వ్యక్తి కళ్లు మూసుకోలేడు
2) కన్ను కదపలేడు, రంగులను
బాగా చూడగలడు
3) కంటిలో నొప్పి వస్తుంది
4) ఆ కండరాలకు చేరే నాడులు పనిచేయవు
9. కంటి గుడ్డులో మనకు బయటకు
కనపడే భాగం?
1) 1/2వ వంతు 2) 1/3వ వంతు
3) 1/4వ వంతు 4) 1/6వ వంతు
10. నేత్ర పటలంలోని సిరలో రక్త ప్రవాహానికి ఆటంకం ఏర్పడటాన్ని ఏమంటారు?
1) సెంట్రల్ రెటినల్ వీన్ ఆక్లుసన్
2) కండ్ల కలక
3) ఆప్టిక్ న్యూరైటిస్ 4) స్లీరైటిస్
11. ఎ: నేత్రపటలంలోని మాక్యులా ఉబ్బుటం వల్ల మాక్యులార్ ఎడిమా వస్తుంది
బి: మాక్యులా లేదా పచ్చ చుక్క ఉబ్బటం వల్ల దృష్టి దోషం కలగవచ్చు
పై ప్రవచనాల్లో సరైనది?
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
12. కంటిలోని దృక్నాడీ పెద్దదిగా మారడాన్ని ఏమంటారు?
1) ఆప్టిక్ మైక్రోమా 2) ఆప్టిక్ న్యూరైటిస్
3) స్లీరైటిస్ 4) కెరోటైటి
13. నెలలు నిండకుండానే పుట్టే పిల్లల్లో
నేత్రపటలం మీద అసాధారణంగా
రక్తనాళాలు పెరగడాన్ని ఏమంటారు?
1) రెటినోపతి ఆప్ ప్రీమెచ్యూరిటీ
2) గ్లూకోమా
3) ట్రాకోమా 4) జిరాఫ్తాల్మియా
14. కంటిలోని దండాల సంఖ్య సుమారుగా?
1) 7 మిలియన్లు 2) 125 మిలియన్లు
3) 9 మిలియన్లు 4) 150 మిలియన్లు
15. పచ్చ చుక్కను ఏమంటారు?
1) మాక్యులా 2) ఫోవియా
3) 1, 2 4) టపేటమ్
16. చర్మంలోని అంతరశ్చర్మంలో ఉండేవి?
1) స్వేద గ్రంథులు
2) సెబేషియన్ గ్రంథులు, రక్తనాళాలు
3) రోమ పుటికలు, కొవ్వులు
4) పైవన్నీ
17. విటమిన్ల లోపం వల్ల చర్మానికి వచ్చే వ్యాధి?
1) కుష్టు 2) పెల్లాగ్రా
3) బొల్లి 4) తామర
18. నాలుకలోని రుచి గుళికల సంఖ్య ఎంత?
1) 100 2) 1,000
3) 10,000 4) 1,00,000
19. నేత్రపటలంలోని ఏ భాగంలో కాంతి
గ్రాహకాలు ఉండవు?
1) అంధచుక్క 2) పసుపు చుక్క
3) ఆకుపచ్చ చుక్క 4) నల్ల చుక్క
20. మధ్య చెవి అంతర చెవిలోకి దేని ద్వారా
తెరుచుకుంటుంది?
1) గుండ్రని కిటికీ 2) అండాకార కిటికీ
3) వర్తులాకార కిటికీ
4) దీర్ఘ వృత్తాకార కిటికీ
21. నేత్రపటలంలోని దండాల్లో ఉండే వర్ణద్రవ్యం?
1) రొడాప్సిన్ 2) అయోడాప్సిన్
3) ఫొటాప్సిన్ 4) కీటాప్సిన్
22. మధ్య చెవి ఎముకల గొలుసులో ఉండేవి?
1) కూటకం 2) దాగిలి
3) కర్ణాంతరాస్థి 4) పైవన్నీ
23. మెటాలిక్ టేస్ట్ ఏ ఆహార పదార్థాల్లో ఉంటుంది?
1) సహజ ఆహార పదార్థాలు
2) కృత్రిమంగా తయారైన ఆహార పదార్థాలు
3) పచ్చి ఆహార పదార్థాలు
4) వండిన ఆహార పదార్థాలు
24. యుక్త వయస్సు వచ్చిన వారిలో శరీరాన్ని
కప్పి ఉంచే చర్మ ఉపరితల వైశాల్యం?
1) 1 1/2 చదరపు మీటర్లు
2) 2 1/2 చదరపు మీటర్లు
3) 3 1/2 చదరపు మీటర్లు
4) 4 1-2 చదరపు మీటర్లు
25. MSG అంటే?
1) మోనోసోడియం గ్లుటామేట్
2) మెగ్నీషియం సోడియం గ్లుటామేట్
3) మోనోసల్ఫర్ గ్లుటామేట్
4) మెగ్నీషియం సల్ఫర్ గ్లుటామేట్
26. హ్రస్వ దృష్టి ఉన్నవారిలో ప్రతిబింబం
ఏర్పడే ప్రదేశం?
1) నేత్రపటలానికి ముందు
2) నేత్ర పటలంపై
3) నేత్ర పటలానికి వెనుక 4) పైవేవీ కాదు
27. అప్పుడే తయారైన కాఫీలో వెంటనే ఆవిరయ్యే ఎన్ని సంయోగ పదార్థాలుంటాయి?
1) 500 2) 600
3) 700 4) 800
28. చర్మాన్ని కాంతి నుంచి రక్షించేది?
1) టానిన్ 2) మెలనిన్
3) టయలిన్ 4) మైలీన్
29. చర్మంలో నిర్జీవకాలు ఉండే పొర?
1) కార్నియా పొర 2) గ్రాన్యులర్ పొర
3) మాల్ఫీజియన్ పొర
4) క్యుటేనియస్ పొర
30. శరీర సమతాస్థితి నిర్వహించే అవయవం?
1) కన్ను 2) ముక్కు
3) చెవి 4) నాలుక
31. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు ఎన్ని రకాల వాసనలను ఉత్పత్తి చేయగలిగే రసాయనాలను వర్గీకరించారు?
1) 1000 2) 1500
3) 2000 4) 2500
32. స్థిరంగా చర్మంలో విభజనలు
చెందుతూ ఉండే పొర?
1) కార్నియా పొర
2) గ్రాన్యులార్ పొర
3) మాల్ఫీజియన్ పొర
4) క్యుటేనియస్ పొర
33. కంటిలో ఏర్పడే ప్రతిబింబ లక్షణం?
1) మామూలుగా నిలువుగా
2) మామూలుగా తలకిందులుగా
3) ఎడమ, కుడి, నిలువుగా
4) ఎడమ, కుడి, తలకిందులుగా
34. భూ భ్రమణం, పరిభ్రమణం గురించి వివరించి జ్ఞానేంద్రియంగా కన్ను పాత్రను వివరించే ప్రయత్నం చేసిన శాస్త్రవేత్త?
1) ఆల్బర్టస్ మేగ్నస్ 2) అరిస్టాటిల్
3) ప్లేటో 4) జోహన్స్ కెప్లర్
35. జ్ఞానేంద్రియాలు చేసే పనులన్నింటికి కేంద్రం?
1) మెదడు 2) వెన్నుపాము
3) 1, 2 4) కాలేయం
36. దండాలు, శంకువులు అనే కణాలు ఎక్కడ ఉంటాయి?
1) దృఢస్తరం 2) రక్తపటలం
3) నేత్రపటలం 4) పై అన్నింటిలో
37. పేటిక ముందుభాగాన్ని ఏమంటారు?
1) యుట్రిక్యులార్ 2) సాక్యులస్
3) కాక్లియా 4) అర్ధవర్తుల కుల్యలు
38. మెలనిన్ అనే వర్ణద్రవ్యం దేనిలో ఉంటుంది?
1) చెవి 2) నాలుక
3) ముక్కు 4) చర్మం
39. కంటిలోని ఏ భాగాన్ని సరిచేయవచ్చు?
1) కను గుడ్డు
2) ద్వికుంభాకార కటకం
3) ముక్కు 4) చర్మం
సమాధానాలు
1. 1 2. 3 3. 4 4. 3
5. 2 6. 1 7. 2 8. 2
9. 4 10. 1 11. 3 12. 2
13. 1 14. 2 15. 3 16. 4
17. 2 18. 3 19. 1 20. 3
21. 1 22. 4 23. 2 24. 1
25. 1 26. 1 27. 2 28. 2
29. 1 30. 3 30. 3 31. 2
32. 3 33. 4 34. 4 35. 3
36. 3 37. 2 38. 4 39. 2
Biology, Groups Special, TSPSC, Competitive exams
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






