TET- Child Development Pedagogy | ప్రతిభావంతులైన శిశువుల ఎంపికకు ఉపయోగించే పరీక్షలు?
1. ప్రజ్ఞకు సంబంధించి సరికానిది?
1) వ్యక్తిలోని అభ్యసనా శక్తి
2) అమూర్త ఆలోచన శక్తి
3) గ్రాహ్యక శక్తి
4) ప్రత్యేక వృత్తిలోని సామర్థ్యం
2. ఒక శిశువు ఎక్కువ అవధానంలో చదరంగం ఆడటంలో ఎక్కువ కాలం గడుపుతున్నాడు. దీన్ని వివరించే మానసిక అంశం?
1) వైఖరి 2) అభిరుచి
3) శ్రద్ధ 4) సాధన
3. కింది వానిలో వైఖరి లక్షణము కానిది?
1) ఇవి వ్యక్తిలో స్వతఃసిద్ధంగా ఏర్పడతాయి.
2) వైఖరులను కొలవొచ్చు
3) వైఖరులు గతిశీలకమైనవి
4) వైఖరులు వృద్ధి చెందుతాయి
4. వైఖరి విషయంలో సరైన ప్రవచనం?
1) వైఖరి అనేది ధనాత్మక ప్రతిస్పందన
2) వైఖరి అనేది రుణాత్మక ప్రతిస్పందన
3) వైఖరి అనేది ధనాత్మక లేదా రుణాత్మక ప్రతిస్పందన
4) నిర్థారించలేని ప్రతిస్పందన
5. కిందివాటిలో ప్రజ్ఞా నికష లోపం?
1) ఇవి అన్నీ ప్రజ్ఞాంశాలను మాపకం చేయలేవు.
2) ప్రజ్ఞాలబ్ధి ఖచ్చితమైనదని అనటానికి అవకాశం లేదు
3) ప్రజ్ఞామాపనంలో సుశిక్షుతులైన పరీక్షకులు అందుబాటులో లేరు
4) పైవన్నీ
6. ఒక ఊరిలో ఉండే 50 మంది నిరక్షరాస్యుల ప్రజ్ఞను ఒకేసారి పరీక్షించదలచుకున్న ప్రయోక్తం ఉపయోగపడే పరీక్షను కింది వాటిలో గుర్తించండి?
1) భాటియా ప్రజ్ఞామాపని
2) బినే సైమన్ ప్రజ్ఞామాపని
3) రావెన్స్ ప్రోగ్రెసివ్ మాట్రిసిస్ పరీక్ష
4) ఆర్మీ-అల్ఫా పరీక్ష
7. ప్రత్యేక వృత్తులకు ఉద్యోగులను ఎంపిక చేయడంలో ఏ పరీక్షలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి?
1) ప్రజ్ఞ 2) వైఖరి
3) సహజ సామర్థ్యం 4) సాధన
8. ప్రజ్ఞాలబ్ధి ప్రకారం సరైన క్రమం?
1) సురక్షణ స్థాయి, అభ్యసించగల, శిక్షణ ఇవ్వగల బుద్ధిమాంద్యత
2) అభ్యసించగల,శిక్షణ ఇవ్వగల సురక్షణ స్థాయి బుద్ధిమాంద్యత
3) సురక్షణ స్థాయి, శిక్షణ ఇవ్వగల, అభ్యసించగల బుద్ధిమాంద్యత
4) శిక్షణ ఇవ్వగల, అభ్యసించగల, సురక్షణస్థాయి బుద్ధిమాంద్యత
9. ప్రతిభావంతులైన శిశువులను ఎంపిక చేయటకు ఉపయోగించే పరీక్షలు?
1) సహజ సామర్థ్య 2) ప్రజ్ఞ
3) సాధన 4) పైవన్నీ
10. ఒక వ్యక్తి ప్రజ్ఞాలబ్ధి 100 అయితే అతని మానసిక వయస్సు?
1) శారీరక వయస్సుకంటే ఎక్కువ
2) శారీరక వయస్సుకంటే తక్కువ
3) శారీరక వయస్సుతో సమానము
4) ఊహించలేము
11. స్ట్రాంగ్ ఔద్యోగిక అభిరుచి మాపనికి సంబంధించి సరైన ప్రవచనం గుర్తించండి?
1) దీనిని అమెరికా మనోవైజ్ఞానిక వేత్త స్ట్రాంగ్ రూపొందించెను
2) దీన్ని 16 సంవత్సరాలు పైబడిన వారికి ఉపయోగిస్తారు
3) దీనిలో కెరీర్, లీజర్ అంశాలకు సంబంధించి అభిరుచులను గుర్తించే ప్రవచనాలుంటాయి
4) పైవన్నీ
12. 8 సంవత్సరాల విద్యార్థి 8 సం॥ల ప్రజ్ఞా పరీక్షను పూర్తిగా చేసి 9 సం॥ల అంశాలను నాలుగింటిని 10 సం॥ల అంశాలను రెండింటిని పూర్తి చేస్తే అతని మానసిక వయస్సు ఎంత?
1) 108 నెలలు 2) 96 నెలలు
3) 100 నెలలు 4) 102 నెలలు
13. కింది వాటిలో ఏది అసత్యం?
1) భాటియా ప్రజ్ఞామాపని – వైయక్తిక అశాబ్దిక పరీక్ష
2) బినే సైమన్ పరీక్ష- వ్యక్తిగత శాబ్దిక పరీక్ష
3) ఆర్మీ అల్ఫా పరీక్ష – సామూహక శాబ్దిక పరీక్ష
4) రావెన్స్ ప్రోగ్రెసివ్ మాట్రిసిస్ పరీక్ష – వ్యక్తిగత శాబ్దికేతర పరీక్ష
14. కింది వాటిలో నిరక్షరాస్యులను ఆర్మీలోకి ఎంపిక చేసే పరీక్ష?
1) ఆర్మీ అల్ఫా 2) ఆర్మీ బీటా
3) ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్
4) పైవన్నీ
15. DAT ఏ పరీక్ష?
1) ప్రజ్ఞా పరీక్ష 2) సహజ సామర్థ్య పరీక్ష
3) వైఖరి మాపని 4) మార్తిమత్వ పరీక్ష
16. ఉపాధ్యాయుడు ఒక ప్రత్యేక పద్ధతిని ఉపయోగించి బోధించినప్పటికీ విద్యార్థులందరు సమానంగా లాభపడకున్నా లేక అభ్యసించకున్న దానికి కారణమైన అంశం?
1) అభిరుచులు 2) వైయక్తిక భేదాలు
3) సామర్థ్యాలు 4)సహజసామర్థ్యాలు
17. సహజ సామర్థ్యాన్ని ఎలా నిర్వచించవచ్చు?
1) ఏదైనా ప్రత్యేక రంగంలో ప్రావీణ్యతను అర్జించే అంతర్గత సామర్థ్యం
2) కొత్తదనాన్ని పెంపొందించగలిగే అంతర్గత సామర్థ్యం
3) అమూర్త ఆలోచన చేసుకోగలిగే అంతర్గత సామర్థ్యం
4) పరిసరాలతో సర్దుబాటు చేసుకోగలిగే అంతర్గత సామర్థ్యం
18. అలవాటుకు ముఖ్యమైన అధారం?
1) అభిరుచి 2) ప్రజ్ఞ
3) వైఖరి 4) సహజ సామర్థ్యం
19. వెష్లర్ బాలల ప్రజ్ఞామాపనిలో ఉపమాపని కానిది ఏది?
1) చిత్ర పూరణం 2) చిత్ర నిర్మాణం
3) చిత్రక్రమీకరణం 4) వస్తు సమాఖ్య
20. ఉగ్రవాదం అనేది సమాజభివృద్ధిని నాశనం చేస్తుంది. దాన్ని గట్టిగా సమర్థించే వ్యక్తి వైఖరి గుణం?
1) వ్యాప్తి 2) దిశ
3) తీవ్రత 4) ఏదీకాదు
21. ‘బాగా మాట్లాడే నైపుణ్యం కలిగి, చేతిరాత బాగాలేని శిశువు’ – కింది వాటిలో ఒక భావనను వివరిస్తుంది.
1) వ్యక్తంతర తరగతి భేదం
2) అంతర వైయక్తిక భేదం
3) వ్యక్తంతర – వ్యక్తిగత భేదం
4) వ్యక్తంతర – వైయక్తిక భేదం
22. శాబ్దికేతర ప్రజ్ఞా పరీక్షను ఎవరికి ఉపయోగించవచ్చు?
1) నిరక్షరాస్యులకు 2) అక్షరాస్యులకు
3) పిల్లలకు మాత్రమే 4) 1, 3
23. ఒక పిల్లవానికి గణితంలో సామర్థ్యం, ప్రజ్ఞ చాలా ఎక్కువ. కానీ ఆ పిల్లవానికి సాధనపట్ల కాంక్షాస్థాయి తక్కువ. ఆ పిల్లవాడి సామర్థ్యాలతో పోల్చితే గణితంలో అతని సాధన ఇలా ఉంటుంది.
1) ప్రాగుక్తీకరించలేం 2) తక్కువ
3) ఎక్కువ 4) సగటు
24. కింది వాటిలో స్వతఃసిద్ధం ఏది?
1) ప్రేరణ 2) అభిరుచి
3) సహజ సామర్థ్యం 4) వైఖరి
25. ఒక ప్రత్యేక వృత్తిలో వ్యక్తి సాధనను గురించి ప్రాగుక్తీకరించటానికి ఆ వ్యక్తిలోని దేన్ని మనం ఎక్కువగా తెలుసుకోవాలి?
1) అభిరుచులు 2) సామర్థ్యాలు
3) ప్రజ్ఞ 4)సహజ సామర్థ్యాలు
26. ‘ప్రాగుక్తీకరణ’ అనేది ఏ మనోవైజ్ఞానిక భావన లక్షణం
1) సహజ సామర్థ్యం 2) సృజనాత్మకత
3) వైఖరి 4) అభిరుచి
27. సృజనాత్మకత, ప్రజ్ఞ మధ్య గల సంబంధం?
1) ధనాత్మక 2) రుణాత్మక
3) నిర్దిష్ట సంబంధం లేదు
4) ప్రజ్ఞ ఎక్కువగా వున్న విద్యార్థుల్లో
ధనాత్మకత
28. కింది పరీక్షలలో వివిధ సంస్కృతుల వ్యక్తుల ప్రజ్ఞను మదింపు చేసేది?
1) సంస్కృతి న్యాయశీల
2) సంస్కృతి రహిత
3) సంస్కృతి మాంద్యం
4) సంస్కృతి ప్రాధాన్య
29. రాము చేతిరాత బాగుంటుంది. గణితంలో అతని నిష్పాదన సగటుగా ఉంది.అతని సహోధ్యాయులతో పోలిస్తే మొత్తం మీద అతని నిష్పాదన బాగుంది.ఈ ఉదాహరణ ఏ రకమైన వైయక్తిక భేదాన్ని తెలుపుతుంది?
1) మధ్యంతర 2) వ్యక్తంతర్గత
3) జ్యోక్యసహిత 4)వ్యక్తంతర్గత, వ్యక్తంతర
30. డేనియల్ గోల్‌మెన్ ఏ భావనను ప్రచారం చేశాడు?
1) ప్రజ్ఞాలబ్ధి 2) బహుళప్రజ్ఞ
3) ప్రజ్ఞావర్గీకరణ 4) ఉద్వేగాత్మక ప్రజ్ఞ
సమాధానాలు
1-4 2-2 3-1 4-3
5-4 6-3 7-3 8-3
9-2 10-3 11-4 12-1
13-4 14-2 15-2 16-2
17-1 18-1 19-2 20-3
21-4 22-4 23-2 24-4 25-4 26-1 27-3 28-2 29-2 30-4
ఆగస్టు 29 తరువాయి
14. 8వ తరగతి విద్యార్థుల ప్రజ్ఞను వ్యక్తిగతంగా మాపనం చేయడానికి ఒక సైకాలజీ తెలిసిన ‘ఉపాధ్యాయుడుగా నీవు కింది ఏ ప్రజ్ఞామాపని ఎంపిక చేస్తావు?
1) వెప్లర్ శాబ్దిక పరీక్షలు
2) భాటియా ప్రజ్ఞామాపని
3) ఒటిన్ మానసిక సామర్థ్యాల పరీక్ష
4) ఆర్మీ బీటా
15. సుబ్బు అనే ఇంజనీరింగ్ విద్యార్థి భవిష్యత్తులో ఏ వృత్తిలో రాణిస్తాడో తెలుసుకునేందుకు ఒక ఉపాధ్యాయుడువిగా ఉపయోగించే పరీక్ష?
1) DATB
2) మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్
3) GATB
4) సీషోర్ మ్యూజికల్ టాలెంట్ టెస్ట్
16. కింది ఏ విద్యార్థిని సృజనాత్మకత కలిగిన విద్యార్థిగా గుర్తిస్తాడు?
1) రాము వివేకవంతమైన ఆలోచనతో సమస్యను ఒక మంచి పరిష్కారాన్ని అందించాడు.
2) సుబ్బు చదివిన విషయాలను ఒక నెలపాటు గుర్తుపెట్టుకుని రాయగలిగే సామర్థ్యమున్నవాడు.
3) రాధ ఒక వస్తువు అసాధారణ ఉపయోగా లను భిన్న విధాలుగా చెప్పగలిగే విద్యార్థిని.
4) నాగేశ్వరరావు కళారంగంలో నిర్దిష్ట జ్ఞానం, నైపుణ్యమున్న విద్యార్థి.
17. ఒక ఉపాధ్యాయుడుగా విద్యార్థిని ఒక కొత్త కథను రాయమన్నప్పుడు ఆ విద్యార్థిలోని సృజనాత్మకత దశలను ఏ క్రమంలో గుర్తిస్తావు?
1) సన్నాహదశ, అంతర్దృష్టి, నిరూపణం, గుప్తదశ
2) సన్నాహదశ, అంతర్దృష్టి, గుప్తదశ, నిరూపణం
3) సన్నాహాదశ, గుప్తదశ, అంతర్దృష్టి, నిరూపణం
4) గుప్తదశ, సన్నాహాదశ, అంతర్దృష్టి, నిరూపణం
18. రావెన్స్ ప్రోగ్రెసివ్ మాట్రిసిస్ పరీక్షను విద్యార్థిలోని ఏ మానసిక చర్యను మాపనం చేయడానికి ఉపయోగిస్తావు?
1) సృజనాత్మగకత 2) మూర్తిమత్వం
3) సహజసామర్థ్యం 4) ప్రజ్ఞ
19. 5 ఏళ్ల రాము మానసిక వయస్సు 6 ఏళ్లు. ప్రజ్ఞలబ్ధి స్థిరమనుకున్నట్లయితే మరో 10 సంవత్సరాల తర్వాత అతని మానసిక వయస్సు ఎంత?
1) 15 2) 12 3) 18 4) 24
20. కింది వాటిలో అంతఃపరిశీలన, ఆత్మ స్పందన సామర్థ్యాలతో కూడిన గార్డనర్ ప్రజ్ఞాసిద్ధాంతంలోని ప్రజ్ఞ?
1) వ్యక్తంతర్గత ప్రజ్ఞ 2) వ్యక్తంతర ప్రజ్ఞ
3) శారీరక గతి సంవేదన ప్రజ్ఞ
4) ప్రాదేశిక ప్రజ్ఞ
21. విద్యార్థులకు ఒక కథను సగం చెప్పి దాని ముగింపునకు రెండు రకాలుగా ఇవ్వాలని విద్యార్థులకు చెప్పాడు. అయితే ఉపాధ్యాయుడు మాపనం చేయాలనుకుంటున్న అంశం?
1) ప్రజ్ఞ 2) సహజ సామర్థ్యం
3) సృజనాత్మకత 4) అభిరుచి
22. విద్యార్థిని Cell కు అర్థం అడిగినప్పుడు కణం అని, జైలు అని, సెల్‌ఫోన్ అని ఇలా అనేక సరైన వినూత్నమైన జవాబులు ఇచ్చాడు. ఇది ఆ విద్యార్థిలోని ఏ మానసిక అంశాన్ని తెలియచేస్తుంది?
1) సహజ సామర్థ్యము 2) ప్రజ్ఞ
3) సృజనాత్మకత 4) వైఖరి
23. ఒక విద్యార్థి తన నోట్‌బుక్ అట్టమీద ఉన్న గాంధీ బొమ్మకు, జుట్టును వేసి, చెవులకు రింగ్‌లు పెట్టి మెడలో హారం వేసి ఒక మోడ్రన్ యువకుడిగా వినూత్నమైన మార్పు చేశాడు. అయిన ఈ అంశము అతనిలోని ఏ సామర్థ్యాన్ని తెలియజేస్తుంది?
1) ప్రజ్ఞ 2) సృజనాత్మకత
3) సాధన 4) వైఖరి
24. ఒక విద్యార్థి ప్రయోగంలో పరికరాలను చాలా నేర్పుగా వేగంగా అమర్చగలుగుతున్నాడు. దాన్ని ఏ ప్రజ్ఞగా గుర్తిస్తావు?
1) అమూర్త ప్రజ్ఞ 2) యాంత్రిక ప్రజ్ఞ
3) సాంఘిక ప్రజ్ఞ 4) ఏదీకాదు
25. ఒక విద్యార్థి చాలా నేర్పుగా మాట్లాడుతూ ఇతర విద్యార్థలను త్వరగా ఆకర్షించే సామర్థ్యమున్నట్లుగా గుర్తించావు. అందువల్లనే ఆ విద్యార్థిని ఏడో తరగతికి నాయకుడిగా ఎంపిక చేశావు. గార్డెనర్ ప్రకారం ఏ ప్రజ్ఞను ఆధారంగా చేసుకుని ఉపాధ్యాయుడుగా నీవు అతనిని CPLగా ఎంపిక చేశావు?
1) వ్యక్తంతర్గత ప్రజ్ఞ
2) పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ
3) శారీరక గతి సంవేదన ప్రజ్ఞ
4) ప్రాకృతిక ప్రజ్ఞ
సమాధానాలు
14-1 15-3 16-3 17-3
18-4 19-4 20-1 21-3
22-3 23-2 24-2 25-2
శివపల్లి
సైకాలజీ ఫ్యాకల్టీ
టీఎస్, ఏపీ
ఏకేఆర్ స్టడీ సర్కిల్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?