BIOLOGY | స్వేద గ్రంథులు క్రియారహితంగా ఉండే జంతువు?
జన్యు సంబంధ వ్యాధులు
1. సింప్టమాలజీ అంటే?
1) గాయాల అధ్యయనం
2) వ్యాధుల అధ్యయనం
3) వ్యాధి లక్షణాల అధ్యయనం
4) వ్యాధి నిరోధక అధ్యయనం
2. చిన్నపిల్లలకు ఇవ్వాల్సిన 5 రకాల టీకాల్లో మొదటిది, చివరిది వరుసగా?
1) B.C.G, తట్టు
2) B.C.G, O.P.V
3) O.P.V, D.P.T
4) D.P.T, పోలియో
3. జాతీయ టీకా కార్యక్రమంలో భాగంగా ఇచ్చే ఏకైక రీకాంబినెంట్ వ్యాక్సిన్?
1) హెపటైటిస్
2) B.C.G
3) D.P.T
4) O.P.V
4. వ్యాధుల నివారణకు ఏ యాంటీబయాటిక్ బ్యాక్టీరియా నుంచి ఉత్పత్తి చేసిన వైరస్ ఉపయోగపడుతుంది?
1) పెన్సిలిన్ 2) సల్ఫా
3) క్లోరోమైసిన్ 4) క్లోరోక్విన్
5. అతి నిద్ర వ్యాధి దేనిద్వారా వ్యాప్తి చెందుతుంది?
1) సీ-సీ ఈగ 2) శాండ్ ఫ్లై
3) రాట్ ైఫ్లై 4) ఏడిస్
6. కింది వాటిలో ఉపయోగకరమైన వైరస్?
1) TMV 2) HPV
3) Tago Virus
4) NPV
7. దండకణాలు, శంకుకణాల నిష్పత్తి?
1) 15:1 2) 1:15
3) 1:12 4) 12:1
8. థిసియాలజీ అంటే?
1) టీబీ అధ్యయనం
2) టెటానస్ అధ్యయనం
3) న్యుమోనియా అధ్యయనం
4) డిఫ్తీరియా అధ్యయనం
9. కోలాపానీయాల్లో నిల్వ కోసం ఉపయోగించే రసాయనం?
1) సిట్రిక్ యాసిడ్
2) సోడియం బెంజోయేట్
3) పొటాషియం మెటా బై సల్ఫేట్
4) ఆస్కార్బిక్ ఆసిడ్
10. ఎలుకల ద్వారా వ్యాప్తి చెందే రక్త ప్రసరణ, కండరాలకు సంబంధించిన వ్యాధి?
1) ప్లేగు 2) ఆంత్రాక్స్
3) మెనింజైటిస్ 4) కుష్ఠు
11. టీబీ వ్యాధి నిర్ధారణ పరీక్ష?
1) వైడల్ పరీక్ష 2) మాంటాక్స్
3) VDRL 4) పైవన్నీ
12. కింది వాటిలో నిశ్శబ్ద హంతకి ?
1) కలరా 2) క్షయ
3) న్యుమోనియా 4) ప్లేగు
13. ప్రపంచంలో మొదట తయారు చేసిన కృత్రిమ డ్రగ్ ఏ వ్యాధి నివారణకు ఉపయోగించారు?
1) టెట్రాసైక్లిన్, ప్లేగు
2) పెన్సిలిన్, ఆంత్రాక్స్
3) క్లోరోమైసిటిన్, టీబీ
4) ప్రాంటోసిల్, మెనింజైటిస్
14. అతినిద్ర వ్యాధిని కలిగించే కారకం?
1) లీష్మానియా 2) క్లాస్ట్రీడియం
3) ట్రిపనోసోమా 4) ఎంటామీబా
15. ‘సిగ్నల్ కా’ అనే కిట్‌ను ఏ వ్యాధి నిర్ధారణకు ఉపయోగిస్తారు?
1) కాలా అజార్
2) అతినిద్ర వ్యాధి
3) టెటానస్
4) డిఫ్తీరియా
16. కింది వాటిలో వైరస్ వ్యాధి కానిది?
1) నెక్రోసిన్
2) మొజాయిక్ తెగులు
3) పిశాచాల చీపురుకట్ట
4) ఆపిల్ క్రౌన్‌గాల్
17. ట్రైకోఫైటాన్ వల్ల వచ్చే వ్యాధి?
1) అథ్లెట్ఫుట్
2) మధురాఫుట్
3) తామర
4) కాలాఅజార్
18. పంది మాంసం ద్వారా మానవునిలో వ్యాపించే వ్యాధి?
1) ఫైలేరియా
2) టీనియాసిస్
3) ఆస్కారియాసిస్
4) కాండిడియాసిస్
19. ‘రాయల్ డిసీజ్’ అని దేన్ని అంటారు?
1) హీమోఫీలియా
2) తలసేమియా
3) అల్కాప్టోన్యూరియా
4) సికిల్‌సెల్ ఎనిమియా
20. వర్ణాంధత్వం వల్ల ఆకుపచ్చరంగును గుర్తించకపోవడం?
1) ప్రోటోనోపియా
2) ట్రయటోనోపియా
3) డ్యుటిరోనోపియా
4) క్లోరోనోపియా
21. కింది వాటిలో దేన్ని చూసి భయపడటాన్ని ట్రైకోఫోబియా అంటారు?
1) వెంట్రుకలు
2) సాలెపురుగు
3) పెద్ద జంతువులు
4) దంతాలు
జవాబులు
1.3 2.1 3.1 4.2
5.1 6.4 7.1 8.1
9.1 10.1 11.2 12.2
13.4 14.3 15.1 16.4
17.1 18.2 19.1 20.3
21.1
మొక్కల వర్గీకరణ
1. వర్గీకరణకు ప్రాథమిక (లేదా) మూల ప్రమాణం ఏది?
1) ప్రజాతి 2) జాతి
3) వర్గం 4) రాజ్యం
2. టాటోనీమ్ అంటే?
1) జాతి, ప్రజాతి ఒకే పేరును కలిగి ఉండటం
2) రెండు జీవులకు ఒకే పేరు ఉండటం
3) జాతి, ప్రజాతి వేర్వేరు పేర్లను కలిగి ఉండటం
4) ఒక జాతిలోని వేర్వేరు ఉపజాతులకు ఒకే పేరు ఉండటం
3. కింది వాటిలో సరైనది?
ఎ. జంతురాజ్యంలో ప్రొటోజొవా జీవులు మొదటి, ప్రాచీన, సరళ, ఏకకణ జీవులు
బి. యూగ్లీనా ప్రొటోజొవా వర్గానికి చెందినది
1) ఎ 2) బి
3) ఎ, బి 4) పైవేవీ కావు
4. కింది వాటిలో సరైనది గుర్తించండి.
ఎ. కుల్యా వ్యవస్థ పొరిఫెరా జీవుల్లో కనిపిస్తుంది
బి. క్లయోనా అనే జీవిని ‘బోరింగ్ స్పాంజ్’ అని కూడా అంటారు
1) ఎ 2) బి
3) ఎ, బి 4) పైవేవీ కావు
5. కింది వాటిలో సరైనది గుర్తించండి.
ఎ. మొదటగా కణజాలాలు ఏర్పడిన జీవులు సిలెంటిరేటా
బి. మొదటి బహుకణజీవులు పొరిఫెరా
1) ఎ 2) బి
3) ఎ, బి 4) పైవేవీకావు
6. విసర్జనకు తోడ్పడే జ్వాలా కణాలు కింది జీవుల్లో ఉంటాయి?
1) సిలెంటిరేటా 2) ప్లాటీహెల్మెంథిస్
3) నిమాటిహెల్మెంథిస్
4) పొరిఫెరా
7. కింది వాటిలో సరైనది గుర్తించండి.
ఎ. నిమాటి హెల్మెంథిస్ జీవులన్నీ పరాన్నజీవులే
బి. అవయవస్థాయి మొదటగా నిమాటి హెల్మెంథిస్లో ఏర్పడింది
1) ఎ 2) బి
3) ఎ, బి 4) పైవేవీ కావు
8. సముద్ర ఎలుక అని కింది వాటిలో దేన్ని పిలుస్తారు?
1) పేడలో పురుగు 2) జలగ
3) వానపాము 4) ఆఫ్రోడైట్
9. జీవసందీప్తిని వెదజల్లడానికి కారణమయ్యే ప్రొటీన్, ఎంజైమ్ వరుసగా?
1) ల్యూసిఫెరేజ్, ల్యూసిఫెరిన్
2) ల్యూసిఫెరిన్, ల్యూసిఫెరేజ్
3) ల్యూమినిన్, ల్యూమినేజ్
4) ల్యూమినేజ్, ల్యూమినిన్
10. తేనెటీగ లార్వాను ఏమని పిలుస్తారు?
1) మగట్ 2) రిగ్లర్
3) టంబ్లర్ 4) గ్రబ్
11. ఫెరామోన్స్ అంటే?
1) వృక్ష హార్మోన్స్
2) జీర్ణక్రియను నియంత్రించే జంతు హార్మోన్స్
3) పునరుత్పత్తి శక్తిని ప్రేరేపించే హార్మోన్స్
4) తమ జాతి జీవులను గుర్తించే కీటక హార్మోన్స్
12. సీతాకోకచిలుక ముఖ భాగాలు?
1) కొరికి నమిలేవి 2) చూషకరకం
3) గుచ్చి పీల్చేవి 4) సైఫనింగ్
13. కార్సినాలజీ అంటే?
1) క్రస్టేషియా జీవుల అధ్యయనం
2) కీటకాల అధ్యయనం
3) ఇఖైనోడర్మేటా జీవుల అధ్యయనం
4) అరాక్నిడా జీవుల అధ్యయనం
14. మొలస్కా జీవుల్లో నీటి శుద్ధతను గుర్తించే నిర్మాణం?
1) ముసిరగోణి 2) ఒస్ప్రేడియమ్
3) రాడ్యులా 4) టార్షన్
15. మిల్ట్ అంటే?
1) కప్పల, చేపల శుక్రకణాల సమూహం
2) కప్పల అండాల సమూహం
3) చేపల శుక్రకణాల సమూహం
4) చేపల అండాల సమూహం
16. పై దవడను కదిల్చే ఏకైక పక్షి?
1) ఆల్బిట్రోస్ 2) రామచిలుక
3) గాడ్విట్ 4) పెంగ్విన్
17. శిశువును రక్షించడానికి శిశుకోశం గల జీవులు?
1) ప్రోటోథీరియా 2) మెటాథీరియా
3) యూథీరియా 4) పైవేవీ కావు
18. స్వేద గ్రంథులు క్రియారహితంగా ఉండే జంతువు?
1) కుక్క 2) పులి
3) ఏనుగు 4) ఒంటె
19. దంతాలు లేని క్షీరదం?
1) రైనోసిరాస్ 2) పాంగోలిన్
3) అపోజం 4) కంగారూ
20. ఏకస్థితి అంకురచ్ఛదం ఉన్న మొక్కలు?
1) టెరిడోఫైటా 2) వివృత బీజాలు
3) ఏకదళ బీజాలు 4) ద్విదళ బీజాలు
21. కింది వాటిలో వేర్లు లేని మొక్క?
1) చిక్కుడు 2) బఠానీ
3) గోధుమ 4) ఉల్ఫియా
22. వెలామిన్ వేళ్లు ఏ మొక్కలో కనిపిస్తాయి?
1) చెరకు 2) వెదురు
3) వాండా 4) మర్రి
23. అల్లం మొక్క కింది ఏ భాగ రూపాంతరం?
1) వేరు 2) కాండం
3) పత్రం 4) ఏదీకాదు
24. కాండం క్షీణించిన ఫలంగా మారి దాని చుట్టూ రసభరిత పొలుసాకులు గల కాండ రూపాంతరం?
1) కొమ్ము 2) కందం
3) దుంపకాండం 4) లశునం
25. వీనస్ ఫ్లై ట్రాప్ అని ఏ మొక్కను పిలుస్తారు?
1) డయోనియా 2) యుట్రిక్యులేరియా
3) డ్రాసిరా 4) నెపంథిస్
26. అంథాలజీ అంటే వేటి అధ్యయనం?
1) వేర్లు 2) కాండం
3) పత్రాలు 4) పుష్పాలు
జవాబులు
1.2 2.1 3.3 4.3
5.3 6.2 7.1 8.4
9.2 10.4 11.4 12.4
13.1 14.2 15.1 16.2
17.2 18.4 19.2 20.2
21.4 22.3 23.2 24.4
25.1 26.4
విన్నర్స్ పబ్లికేషన్స్ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు