Biology – JL/DL Special | జీవక్రియల నియంత్రణ.. దేహ భాగాల సమన్వయం
నాడీ వ్యవస్థ
- నాడీ మండలం, నాడుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని న్యూరాలజీ అంటారు.
- నాడీ మండలం నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణాన్ని నాడీ కణం(న్యూరాన్) అంటారు.
- ప్రతి నాడీకణంలో మూడు భాగాలుంటాయి. 1. కణదేహం (సైటాన్)
2. తంత్రికాక్షం (ఏక్సాన్) 3. డెండ్రైట్లు. - ఒక నాడీకణంలోని డెండ్రైట్లు వేరొక కణంలోని డెండ్రైట్లతో గానీ, ఆక్సాన్‌తో గానీ కలిసే ప్రదేశాన్ని నాడీకణ సంధి (సినాప్స్) అంటారు.
- జ్ఞానేంద్రియాల నుంచి ప్రచోదనాలను కేంద్రక నాడీ వ్యవస్థకు (మెదడు, వెన్నుపాము) తీసుకెళ్లే నాడులను జ్ఞాననాడులు (అభివాహి నాడులు) అంటారు.
- కేంద్ర నాడీవ్యవస్థ నుంచి ప్రచోదనాలను వివిధ శరీర భాగాలకు ప్రధానంగా ప్రభావక కండరానికి తీసుకెళ్లే నాడులను చాలక నాడులు (అపవాహి నాడులు) అంటారు.
- సమాచారాన్ని మెదడు విశ్లేషించకుండా వెన్నుపాము ఆధీనంలో సమాచారం విశ్లేషించబడే చర్యలను అసంకల్పిత ప్రతీకార చర్యలు అంటారు.
- ప్రచోదనాలు ప్రయాణించే మార్గాన్ని ప్రతీకార చర్యా చాపం అంటారు.
- నాడీ ప్రచోదనం ఉద్దీపనం నుంచి ప్రతిస్పందనకు 100 మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
- నాడీ వ్యవస్థలో రెండు విభాగాలు ఉంటాయి.
1. కేంద్ర నాడీ వ్యవస్థ
2. పరదీయ నాడీ వ్యవస్థ. - మెదడు, వెన్నుపాము కలిసి కేంద్ర నాడీ వ్యవస్థను ఏర్పరుస్తాయి.
- మెదడు
- మెదడు గురించి చదివే శాస్త్రం -ఫ్రీనాలజీ
- కపాలంలో మెదడు ఉంటుంది.
- కపాలం గురించి చదివే శాస్త్రం- క్రైనాలజీ
- మానవుడి మెదడు బరువు పురుషుల్లో- 1350-1400 గ్రాములు, స్త్రీలలో 1250-1300 గ్రాములు.
- చిన్న పిల్లల్లో మెదడు బరువు 370-400 గ్రాములు ఉంటుంది.
- మెదడు బరువు ఎక్కువగా ఉండే జంతువు- నీలి తిమింగలం (సుమారు 4 కిలోలు)
- మానవ శరీర బరువులో మెదడు బరువు శాతం- 2 శాతం
- మానవుడు తీసుకున్న ఆక్సిజన్‌లో మెదడు వినియోగించుకునే ఆక్సిజన్ శాతం- 20 శాతం
- మెదడు బయట వైపు బూడిద రంగు పదార్థంతో, లోపలి వైపు తెలుపు రంగు పదార్థంతో నిండి ఉంటుంది.
- మెదడును కప్పి మూడు పొరలుంటాయి. అవి బయటి పొర వరాశిక, మధ్య పొర లౌతికళ, లోపలి పొర మృద్వి. ఈ మూడింటిని కలిపి ‘మెనింజస్’ అంటారు.
- మెనింజస్ మెదడును బయటి నుంచి జరిగే ప్రమాదాల నుంచి రక్షిస్తుంది.
- మెదడును మూడు భాగాలుగా విభజించారు. అవి ముందు మెదడు, మధ్య మెదడు, వెనుక మెదడు.
ముందు మెదడు - దీనిలో మస్తిష్కం అనే భాగం ఉంటుంది.
మస్తిష్కం (సెరిబ్రం) - దీన్ని ‘పెద్ద మెదడు’ అని పిలుస్తారు. దీని బరువు 995 గ్రాములు.
- మస్తిష్కంలో ఎత్తులు, పల్లాలు ఉంటాయి. ఎత్తులను ‘గైరీ’ అని, పల్లాలను ‘సల్సీ’ అని అంటారు.
- గైరీ, సల్సీలు చేసే ముఖ్య పని- మానవుడి తెలివితేటలకు మూలంగా పనిచేస్తాయి.
- మస్తిష్కానికి దిగువ భాగాన ద్వార గోర్థం ఉంటుంది.
ద్వార గోర్థం:దీని ఆధీనంలో మానవుడి శరీరానికి సంబంధించిన భావోద్వేగాలు (కోపం, బాధ, ఆనందం, ప్రేమ, సంతోషం, సుఖం, దుఃఖం) ఉంటాయి. - మస్తిష్కానికి దిగువ భాగాన బఠానీ గింజ ఆకారంలో ఉండే గ్రంథి ఉంటుంది. దాన్ని పీయూష గ్రంథి అంటారు.
- పీయూష గ్రంథి ఒక కాడతో అంటిపెట్టుకుని ఉంటుంది. ఆ కాడను హైపోథలామస్ అంటారు.
హైపోథలామస్: మానవుడి శరీరానికి సంబంధించి ఉష్ణం, ఆకలి, దప్పిక వంటివి నియంత్రించే భాగాలు దీనిలో ఉంటాయి. - మస్తిష్కాన్ని రెండు సమాన అర్ధ భాగాలుగా విభజిస్తూ ‘కార్పస్ కెల్లోజమ్’ ఉంటుంది.
- రెండు మస్తిష్క అర్ధ గోళాలను మస్తిష్కార్ధ గోళాలు అంటారు. ఇవి రెండు రకాలు.
కుడి మస్తిష్కార్ధ గోళం: దీని ఆధీనంలో ఎడమవైపు శరీర భాగాలు ఉంటాయి. ఈ మస్తిష్కార్ధ గోళానికి ఏదైనా ప్రమాదం జరిగితే ఎడమవైపున ఉన్న భాగాలకు పక్షవాతం వస్తుంది.
ఎడమ మస్తిష్కార్ధ గోళం: ఈ మస్తిష్కార్ధ గోళం ఆధీనంలో కుడివైపు శరీర భాగాలు ఉంటాయి. దీనికి ఏదైనా ప్రమాదం జరిగితే కుడివైపున ఉన్న అవయవాలకు పక్షవాతం వస్తుంది. - మస్తిష్కం ఆధీనంలో జ్ఞాపకశక్తి, ఆలోచనలు, తెలివితేటలు ఉంటాయి.
మధ్య మెదడు
మధ్య మెదడులో నాడీ కణాలు గుంపులు గుంపులుగా విస్తరించి ఉంటాయి. - మధ్య మెదడులో ఉండే నాడీ కణాల సంఖ్య- 10 బిలియన్లు
- మానవ మెదడులో ప్రతిరోజు సుమారు 20,000 నాడీ కణాలు నాశనం అవుతాయి.
- ఒక్కసారి నశిస్తే మళ్లీ తిరిగి ఏర్పడే శక్తి నాడీ కణానికి ఉండదు.
వెనుక మెదడు - దీనిలో రెండు భాగాలుంటాయి. అవి అనుమస్తిష్కం, మజ్జాముఖం.
అనుమస్తిష్కం (సెరిబెల్లమ్): దీన్ని చిన్నమెదడు అంటారు. ఇది మానవుడి శరీర సమతాస్థితిని కాపాడుతుంది. శరీరాన్ని అదుపులో ఉంచే ప్రక్రియను సమతాస్థితి అంటారు.
మజ్జాముఖం (మెడుల్లా అంబ్లాగేటా): ఇది త్రికోణాకృతిలో ఉంటుంది. దీని ఆధీనంలో శ్వాసక్రియ, హృదయ స్పందన, రక్త పీడనం వంటివి ఉంటాయి. - మానవుడి శరీరంలోని వివిధ భాగాల నుంచి సమాచారాన్ని గ్రహించి, మెదడుకు చేరవేయడం వెన్నుపాము ముఖ్య విధి. కాబట్టి వెన్నుపామును ‘టెలిఫోన్ ఎక్సేంజ్’ అంటారు.
- వెన్నుపాము అడ్డుకోతను పరిశీలిస్తే H ఆకారం లేదా సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది.
- వెన్నుపాము బయటి వైపు తెలుపు రంగు పదార్థం, లోపలి వైపు బూడిద రంగు పదార్థం ఉంటుంది.
- వెన్నుపాములో రెండు రకాల శృంగాలు ఉంటాయి. అవి ఉదర శృంగం, పృష్ఠ శృంగం.
పృష్ఠ శృంగం: పృష్ఠ శృంగాల నుంచి ఏర్పడే నాడులను జ్ఞాన నాడులు/అభివాహి నాడులు అంటారు.
ఉదర శృంగం: ఉదర శృంగాల నుంచి ఏర్పడే నాడులను చాలక నాడులు/ అపవాహి నాడులు అంటారు. - వెన్నుపాము, మెదడుకు మధ్య రిలే కేంద్రంగా ‘ఫ్రాన్స్ వెరోలి’ పనిచేస్తుంది.
ప్రాక్టీస్ బిట్స్
1. శ్వాస కండరాల కదలికను నియంత్రించి తద్వారా ఉచ్ఛాస క్రియలో ఒక వ్యక్తి పీల్చే వాయువుల ఘనపరిమాణాన్ని నియంత్రించే కేంద్రం, ఆ కేంద్రాన్ని కలిగి ఉన్న అవయవం ఏవి?
1) పాన్స్‌వెరోలి, న్యూమోటాక్సిక్ కేంద్రం
2) న్యూమోటాక్సిక్ కేంద్రం, పాన్స్‌వెరోలి
3) కార్పోరా క్వాట్రిజెమైనా, మధ్య మెదడు
4) వర్మిస్, అనుమస్తిష్కం
2. సరికాని దాన్ని గుర్తించండి.
1) మొదటి పార్శ కోష్టకం- పారాసీల్- మస్తిష్కార్ధ గోళంలో
2) మూడో కోష్టకం- డయాసీల్- ద్వార గోర్థంలో
3) నాలుగో కోష్టకం- మెటాసీల్- అనుమస్తిష్కంలో
4) రెండో కోష్టకం- పారాసీల్- ద్వారగోర్థంలో
3. ప్రవచనం (ఎ): పీయూష గ్రంథి మానవుడి మెదడు అడుగు భాగాన ఉంటుంది
ప్రవచనం (ఆర్): పీయూష గ్రంథి సొమాటోట్రోఫిన్ అనే హార్మోన్‌ను స్రవిస్తుంది
1) ఎ కు ఆర్ సరైన వివరణ
2) ఎ మాత్రమే సరైనది
3) ఎ కు ఆర్ సరైన వివరణ కాదు
4) ఆర్ మాత్రమే సరైనది
4. కింది వాటిని జతపరచండి.
మెదడు భాగాలు
ఎ. ముందు మెదడు 1. మస్తిష్కం
బి. మధ్య మెదడు 2. దృక్ గోళాలు
సి. వెనుక మెదడు 3. అనుమస్తిష్కం
1) ఎ-1, బి-2, సి-3
2) ఎ-3, బి-2, సి-1
3) ఎ-2, బి-3, సి-1
4) ఎ-3, బి-1, సి-2
5. జ్ఞాపకశక్తి, నియంత్రిత కదలికలను నియంత్రించే మానవ మెదడు భాగం?
1) మస్తిష్కం 2) అనుమస్తిష్కం
3) మజ్జాముఖం 4) పాన్స్‌వెరోలి
6. కింది వాటిని జతపరచండి.
1. మస్తిష్కం ఎ. శరీర సమతాస్థితి
2. ద్వారగోర్థం బి. దృష్టికి, వినడానికి ప్రతిక్రియ చర్యలు
3. మధ్య మెదడు సి. భావావేశాలు, శరీర ఉష్ణోగ్రత
4. అనుమస్తిష్కం డి. శ్వాసక్రియ, నాడీ స్పందన చర్యలను నియంత్రించే కేంద్రకం
5. మజ్జాముఖం ఇ. మానసిక సామర్థ్యాలకు స్థావరం
సరిగా జతపర్చిన క్రమాన్ని గుర్తించండి.
1) 1-ఇ, 2-సి, 3-డి, 4-బి, 5-ఎ
2) 1-ఇ, 2-బి, 3-సి, 4-డి, 5-ఎ
3) 1-ఇ, 2-సి, 3-బి, 4-ఎ, 5-డి
4) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి, 5-ఎ
7. కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ. అనుమస్తిష్కం, మజ్జాముఖం ముందు మెదడులో భాగంగా ఉంటాయి
బి. అనుమస్తిష్కం, మజ్జాముఖం వెనుక మెదడులో భాగంగా ఉంటాయి
సి. హైపోథలామస్ పీయూష గ్రంథిని నియంత్రిస్తుంది
1) ఎ, సి 2) బి, సి
3) సి మాత్రమే 4) బి మాత్రమే
8. ఎ: మానవుడిలో ఆలోచనలకు, ఊహాశక్తికి, ఉద్వేగాల నియంత్రణకు ప్రధాన కారణం
బి: మస్తిష్కంలోని రెండు అర్ధ గోళాలు
సి: అనుమస్తిష్కంలోని గైరీ, సల్సీలు
1) ఎ కు బి, సి రెండూ సరైనవి
2) ఎ కు బి మాత్రమే సరైనది
3) ఎ కు సి మాత్రమే సరైనది
4) ఎ కు బి, సి లు రెండూ సరికావు
9. రాన్వియర్ కణుపులు, నిస్సల్ రేణువులు ఏ కణాల ప్రత్యేకత?
1) కాలేయ కణాలు 2) కండర కణాలు
3) మూత్రపిండ కణాలు
4) నాడీ కణాలు
10. కింది వాటిని జతపరచండి.
1. 8 జతలు ఎ. త్రిక కశేరు నాడులు
2. 12 జతలు బి. అనుత్రిక కశేరు నాడి
3. 5 జతలు సి. గ్రీవ కశేరు నాడులు
4. 1 జత డి. ఉరఃకశేరు నాడులు
1) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి
2) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి
3) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
4) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
11. వెన్నుపాము గురించి కింది వ్యాఖ్యానాల్లో ఏది సరైనది?
1) వెన్నుపాము చాలా వేగంగా వెంటనే ప్రతిస్పందనలు చూపుతుంది
2) ఈ నాడీ ప్రచోదనాలు నిమిషానికి 100మీ వేగంతో ప్రయాణిస్తాయి
3) వెన్నుపాములో ఉండే కుల్యని, నాడీ కుల్య అంటారు
4) వెన్నుపాము ఎటువంటి అసంకల్పిత ప్రతీకార చర్యలో పాల్గొనదు
12. మెనింజైటిస్ అనేది దేనికి సంబంధించిన వ్యాధి?
1) కాలేయం 2) క్లోమం
3) ఊపిరితిత్తులు 4) మెదడు
13. మానవ శరీరంలో ఉండే అతిపొడవైన కణం?
1) రాడ్స్, కోన్స్ 2) ఎర్ర రక్తకణం
3) నాడీ కణం 4) తెల్ల రక్తకణం
14. కింది వాటిని జతపరచండి.
ఎ. ఘ్రాణ లంబికలు 1. సమతాస్థితి
బి. ద్వార గోర్థం 2. హృదయ స్పందన
సి. అనుమస్తిష్కం డి. మజ్జాముఖం
3. దృష్టి
4. ద్రవాభిసరణ క్రమత
5. వాసన
1) ఎ-5, బి-4, సి-1, డి-2
2) ఎ-5, బి-1, సి-4, డి-2
3) ఎ-5, బి-4, సి-2, డి-1
4) ఎ-1, బి-2, సి-3, డి-4
15. మానవుడి కపాల నాడుల్లో జ్ఞాననాడులు?
1) I, II, VIII 2) V, VII, IX
3) III, IV, VI 4) I, III, V
16. అంత్య తంతువు అంటే?
1) మెదడు చివరి భాగం
2) మెదడు కాండం
3) వెన్నుపాము చివరి భాగం
4) వెన్నెముక చివరి భాగం
17. దృష్టి, వినికిడి ప్రక్రియలను మెదడులోని ఏ భాగం నియంత్రిస్తుంది?
1) మస్తిష్కం 2) ద్వార గోర్థం
3) మధ్య మెదడు 4) అనుమస్తిష్కం
సమాధానాలు
1.2 2.4 3.1 4.1
5.2 6.3 7.2 8.2
9.4 10.3 11.4 12.4
13.3 14.1 15.1 16.3
17.3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు