Biology | సమరూప కవలలు జన్మించడానికి కారణం?
బయాలజీ ( మార్చి 14 తరువాయి )
99. కారు నడపడం, నేర్చుకోవడం దేనికి ఉదాహరణ?
1) నియంత్రిత ప్రతిచర్య
2) సరళ ప్రతిచర్య 3) వెన్ను ప్రతిచర్య
4) కపాల ప్రతిచర్య
100. పామును చూసి వెంటనే వనక్కి జరగడం, జనగణమన గీతం అనగానే లేచి నిలబడటం, వేడికి చేయి వెంటనే వెనక్కిలాగడం, చీకటి కంటిపైన కాంతి పడినప్పుడు కళ్లు మూసుకోవడం వంటి ప్రతీకార చర్యలను నియంత్రించేది?
1) మెదడు 2) వెన్నుపాము
3) స్వయం చోదిత నాడీ వ్యవస్థ
4) పరిధీయ నాడీ వ్యవస్థ
101. కింది వాటిలో మెదడులో అతి పెద్ద భాగం?
1) మెడుల్లా అబ్లాంగేటా
2) మస్తిష్కం
3) అనుమస్తిష్కం
4) హైపోథాలమన్
102. మానవునిలో కపాల నాడులు, వెన్నునాడుల సంఖ్య వరుసగా?
1) 10, 31 జతలు 2) 12, 13 జతలు
3) 12, 31 జతలు 4) 31, 12 జతలు
103. అమ్నీషియా అనే వ్యాధి లోపం వల్ల ఏది కలుగుతుంది?
1) ఆకలి 2) నిద్ర
3) వినికిడి 4) జ్ఞాపకశక్తి
104. మానవుడు అన్ని జంతువుల కంటే ఉన్నతం. దానికి కారణం?
1) అనుమస్తిష్కం 2) మస్తిష్కం
3) మజ్జాముఖం 4) వెన్నుపాము
105. దృక్నాడులు అనేవి ఒక?
1) జ్ఞాననాడులు 2) చాలకనాడులు
3) మిశ్రమనాడులు 4) పైవన్నీ
106. ఏ నాడుల వల్ల మెదడు, శరీర భాగాలను నియంత్రిస్తుంది?
1) జ్ఞాననాడులు 2) చాలక నాడులు
3) మిశ్రమనాడులు 4) పైవన్నీ
107. లిట్మస్ పేపర్ (ప్రయోగశాలలో రసాయన సూచిక) దేని నుంచి తయారవుతుంది?
1) పుట్టగొడుగులు 2) లైకెన్స్
3) సముద్రకలుపు మొక్కలు
4) వృక్షప్లవకాలు
108. కింది వాటిలో ఏ శిలీంధ్రాలు ఆవృత బీజ మొక్కల వేర్లపై నివసించి భూమి నుంచి పాస్ఫేట్‌ను శోషించి మొక్కలకు అందిస్తుంది?
1) కాండిడా 2) ఆస్పర్జిల్లస్
3) పెన్సీలియం 4) మెకోరైజల్
109. సూప్స్ చిక్కదనానికి, పేస్ట్రీ ఐస్క్రీమ్స్లలో ఉపయోగించే పదార్థం?
1) అగార్-అగార్ 2) గ్లూ
3) Sea Lettuce 4) Kelp
110. తోళ్లశుద్ధి, Shampoo తయారీలో ఉపయోగించేది?
1) Irish Moss 2) Ceylon Moss
3) Agar – Agar 4) Kelp
111. బాయిలర్స్, కొలిమిలు, రిఫ్రిజిరేటర్లలో ఇన్సులేటర్‌గా వినియోగించేది?
1) డయాటమ్స్ 2) కెల్ప్
3) అగార్-అగార్ 4) లైకెన్
112. ఏ శైవలాలు అయోడిన్‌కు ప్రధాన వనరులు?
1) నీలి ఆకుపచ్చ శైవలాలు
2) ఎరుపు శైవలాలు
3) గోధుమ శైవలాలు
4) ఆకుపచ్చ శైవలాలు
113. ప్రపంచంలో అతి పెద్ద మొక్క?
1) సికోయా 2) నీలగిరి
3) మర్రి 4) మాక్రోసిస్టస్
114. ఏ సముద్రంశైవలాలు పశువుల మేతగా ఉపయోగం?
1) ఆకుపచ్చ శైవలాలు
2) డయాటమ్స్
3) గోధుమ శైవలాలు
4) ఎరుపు శైవలాలు
115. ఎర్రసముద్రం ఎరుపు వర్గానికి కారణం?
1) ఎరుపు శైవలాలు
2) నీలి ఆకుపచ్చ శైవలం
3) గోధుమ శైవలం 4) ఆకుపచ్చ శైవలం
116. కింది వాటిలో అనువంశిక/ జన్యుసంబంధ వ్యాధి కానిది?
1) ఆల్కాప్టోన్యూరియా
2) హీమోఫీలియా
3) సికిల్‌సెల్ ఎనీమియా 4) గాయిటర్
117. కింది వాటిలో మొక్కల కణానికి సంబంధించినది?
ఎ. మైటోకాండ్రియా బి. కణకవచం
సి. రిక్తిక డి. హరిత రేణువు
1) ఎ, బి 2) ఎ, సి
3) ఎ 4) పైవన్నీ
118. జన్యు సమాచారం, సంకేతాలు నిల్వ చేసే ప్రదేశం?
1) RNA 2) DNA
3) జన్యువు 4) 1, 2
119. సాధారణ స్త్రీ జన్యుకణంలో క్రోమోజోమ్‌లు?
1) 43+xx 2) 44+xxx
3) 44+xy 4) 44+xx
120. కింది వాటిలో ఏ నత్రజని క్షారం డీఎన్ఏలో ఉండక ఆర్ఎన్ఏలో ఉంటుంది?
1) అడినిన్ 2) యురాసిల్
3) గ్వానిన్ 4) సైటోసిన్
121. న్యూక్లియోటైడ్‌లో భాగం కానిది?
1) చక్కెర 2) సోడియం క్షారం
3) పాస్ఫేట్ 4) నత్రజని క్షారం
122. క్రోమోజోమ్‌లలో ఉండే ప్రొటీన్లు?
1) కెరటిన్ 2) ఆల్బుమిన్
3) హిస్టోన్ 4) ప్రోటమైన్
123. క్షయకరణ విభజనలో పారగతి/ వినిమయం జరిగే దశ?
1) Leptotene 2) Zygotene
3) Pachytene 4) Diplotene
124. RNA ఉండే ప్రదేశం?
1) కణద్రవ్యం 2) కేంద్రక ద్రవ్యం
3) కేంద్రకాంశాం 4) పైవన్నీ
125. జంతుకణంలో మాత్రమే ఉండేది?
1) రిక్తిక 2) మైటోకాండ్రియా
3) రైబోజోమ్ 4) సెంట్రియోల్
126. పెరాక్సీసోమ్ విధి?
1) ప్లాస్టిడ్స్ తయారీ
2) ప్రొటీన్స్ తయారీ
3) కణకవచ తయారీ
4) కాంతి శ్వాసక్రియ
127. జతపరచండి.
ఎ. మైటోకాండ్రియా 1. కణమేధస్సు
బి. రైబోసోమ్స్ 2. కిచెన్ హౌస్
సి. హరిత రేణువు 3. పవర్ హౌస్
డి. కేంద్రకం 4. ప్రొటీన్ ఫ్యాక్టరీ
1) ఎ-3, బి-4, సి-1, డి-2
2) ఎ-3, బి-2, సి-1, డి-4
3) ఎ-3, బి-1, సి-2, డి-4
4) ఎ-3, బి-4, సి-2, డి-1
128. శ్వాసక్రియలో విడుదలైన నిల్వశక్తి రూపం?
1) ADP
2) Adenosine Mono Phosphate
3) Adenosine Triphosphate
4) 1, 3
129. కింది వాటిలో Sexually Transmitted Desease (STD) కానిది?
1) AIDS 2) ఆంథ్రాక్స్
3) గనేరియా 4) సిఫిలిస్
130. నిల్వచేసిన రొట్టెముక్క కొన్ని రోజుల తర్వాత ఆకుపచ్చగా మారడానికి కారణం?
1) ఆకుపచ్చగా శైవలాలు
2) నీలి-ఆకుపచ్చ శైవలాలు
3) శిలీంధ్రాలు 4) గోధుమ శైవలాలు
131.కొవ్వుల ఎమల్సీకరణ/చిలుకుటలో పాల్గొనే Na కోలేట్ వంటి లవణాలను మాత్రమే కలిగి ఎంజైమ్‌లు లేని ఏకైక జీర్ణరసం?
1) లాలాజలం 2) పైత్యరసం
3) క్లోమరసం 4) ఆంత్రరసం
132. కింది వాటిలో కాలేయ విధి?
1. ఫైబ్రినోజన్, ప్రోథ్రాంబిన్ వంటి రక్తస్కందక పదార్థాలు, హెపారిన్ వంటి రక్తస్కందక నివారణ పదార్థ తయారీ
2. ైగ్లెకోజన్ అనే పిండిపదార్థం, యూరియా పదార్థ నిల్వ
3. పైత్యరసం, ఆర్బీసీ ఉత్పత్తి
4. విషపదార్థాల తటస్థీకరణం, రక్తంలోని గ్లూకోజ్‌ను సంతులనం చేయడం
1) 1, 2 2) 1, 4
3) 1, 2, 4 4) 1, 2, 3, 4
133. మాస్టర్ గ్రంథి (లేదా) కింగ్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్ అయిన పీయూష గ్రంథి అన్ని గ్రంథులను తన ఆధీనంలో ఉంచుకొంటుంది. కానీ దీని ఆధీనంలో లేని గ్రంథి?
1) థైరాయిడ్ 2) పారాథైరాయిడ్
3) అధివృక్కగ్రంథి 4) క్లోమం
134. హార్మోన్స్ తటస్థం చేందే ప్రదేశం?
1) కాలేయం 2) మూత్రపిండం
3) ప్లీహం 4) శోషరసగ్రంథం
135. టెస్ట్‌ట్యూబ్ బేబీకి సంబంధించినది?
1) అండం టెస్ట్‌ట్యూబ్‌లో ఫలదీకరణం చెంది గర్భాశయంలో అభివృద్ధి చెందుతుంది
2) అండం ఫాలోపియన్ నాళంలో ఫలదీకరణం చెంది టెస్ట్‌ట్యూబ్‌లో అభివృద్ధి చెందుతుంది
3) అండం టెస్ట్‌ట్యూబ్‌లో ఫలదీకరణం చెంది టెస్ట్‌ట్యూబ్‌లో అభివృద్ధి చెందుతుంది
4) అండం ఫలదీకరణం చెందకుండా టెస్ట్‌ట్యూబ్‌లో అభివృద్ధి చెందుతుంది
136. సమరూప కవలలు జన్మించడానికి కారణం?
1) ఒక అండం, ఒక శుక్రకణంతో ఫలదీకరణం చెంది 2 కణాలుగా విడిపోవడం
2) ఒక అండం, రెండు శుక్రకణాలతో ఫలదీకరణం చెంది 2 కణాలుగా విడిపోవడం
3) రెండు అండాలు, రెండు శుక్రకణాలతో ఫలదీకరణం చెంది రెండూ వేర్వేరుగా పెరగడం
4) రెండు అండాలు, ఒక శుక్రకణంతో ఫలదీకరణ చెంది 2 ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతుంది
137. అలైంగిక ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుంది?
1) లైంగికత్వంతో సంబంధం లేని వేర్వేరు జీవుల్లో జరుగుతుంది
2) పరస్పర వ్యతిరేక లింగత్వం ఉన్న 2 జీవుల మధ్య జరుగుతుంది
3) ఒకే ఆడజీవిలో జరుగుతుంది
4) ఆడజీవిలోనైనా, మగజీవిలోనైనా జరుగవచ్చు
138. కింది వాటిలో గుడ్లు పెట్టే క్షీరదాలు?
1) అపోజం, ప్లాటిపస్
2) గబ్బిలం, ఎకిడ్నా
3) ప్లాటిపస్, ఎకిడ్నా
4) ఎకిడ్నా, గబ్బిలం
139. మొక్కల్లో పురుష, స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణాలు వరుసగా?
1) కేసరావళి, ఆకర్షణ పత్రావళి
2) అండకోశం, ఆకర్షణ పత్రావళి
3) ఆకర్షణ పత్రావళి, రక్షక పత్రావళి
4) కేసరావళి, అండకోశం
140. జతపరచండి.
ఎ. అపోజం 1. 336 రోజులు
బి. ఏనుగు 2. 600 రోజులు
సి. గొర్రె, మేక 3. 12 రోజులు
డి. గుర్రం 4. 149 రోజులు
1) ఎ-1, బి-4, సి-2, డి-3
2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-3, బి-2, సి-4, డి-1
141. పెరుగుతున్న పిండాన్ని, జరాయువుతో కలిపేది?
1) ఉల్బము 2) పరాయువు
3) గర్భాశయం 4) బొడ్డుతాడు
142. శిశువు లైంగికత్వం నిర్ధారణ అయ్యే సమయం?
1) శుక్రకణం అండంలోకి ప్రవేశించినప్పుడు
2) అండంతో, శుక్రకణం ఫలదీకరణం చెందినప్పుడు
3) ఫలదీకరణ జరిగిన ఏడు వారాల తర్వాత
4) గర్భనిర్ధారణ జరిగిన మూడు నెలల తర్వాత
143. లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా జన్మించిన ప్రతి వ్యక్తి ఒకే కణం నుంచి ప్రారంభమవుతుంది?
1) సంయోగబీజం 2) పిండం
3) సంయుక్తబీజం 4) భ్రూణం
144. ద్విసంయుక్త బీజకవలలు / అసమరూప కవలల్లో ఇద్దరు శిశువులు పురుషులుగా జన్మించడానికి సంభావ్యత (లేక) అవకాశం?
1) 25 శాతం 2) 50 శాతం
3) 75 శాతం 4) 90 శాతం
145. గర్భావధి కాలంలో ఏ దశ నుంచి మానవునిలో లక్షణాల అభివృద్ధి జరుగుతుంది?
1) సంయుక్త బీజం 2) పిండం
3) సంయోగబీజం 4) భ్రూణం
146. ఫలదీకరణ చెందిన తర్వాత అండంలో విభజన ప్రారంభమయ్యే సమయం?
1) 3 గంటల తర్వాత
2) 12 గంటల తర్వాత
3) 24 గంటల తర్వాత
4) 30 గంటల తర్వాత
147. జతపరచండి.
ఎ. బొద్దింక 1. 3
బి. సొరచేప 2. 2
సి. కప్ప, పాములు 3. 13
డి. నెమలి 4. 4
1) ఎ-1, బి-2, సి-4, డి-3
2) ఎ-2, బి-4, సి-1, డి-3
3) ఎ-3, బి-2, సి-1, డి-4
4) ఎ-4, బి-1, సి-3, డి-2
148. మానవ రక్తనిధి?
1) కాలేయం 2) ప్లీహం
3) ఎముక మజ్జ 4) ఊపిరి తిత్తులు
149. గుండె విధులు నిర్వర్తించడానికి కావాల్సిన విద్యుత్ కరెంట్ ఎక్కడ నుంచి ఉద్భవిస్తుంది?
1) లాంగర్‌హాన్స్ పుటికలు 2) హిస్ కట్ట
3) లయారంభకం
4) పైవేవీకావు
150. హృదయ స్పందన, దగ్గు, వాంతులు, మింగడం, శ్వాస, బీపీ, మెదడులోని దేని ఆధీనంలో ఉంటాయి?
1) మజ్జాముఖం 2) క్రూరా సెరిబ్రై
3) వెన్నుపాము 4) అనుమస్తిష్కం
151. గుండెలోని పెద్దగది?
1) కుడి జఠరిక 2) ఎడమ కర్ణిక
3) కుడి కర్ణిక 4) ఎడమ జఠరిక
152. ధమనులకు సంబంధించి నిజం కానిది?
1) రక్తాన్ని గుండె నుంచి శరీరభాగాలకు సరఫరా చేయడం
2) కవాటాలు లేకపోవడం
3) సిరల కన్నా వ్యాసం ఎక్కువ ఉంటుంది
4) అవిచ్ఛిన్న రక్త సరఫరా ఉండదు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు