Alliances-Meetings | కూటములు-సమావేశాలు
బిమ్స్టెక్
-బంగాళాఖాత తీర దేశాలు సాంకేతిక, ఆర్థిక రంగాల్లో పరస్పరం సహకరించుకోవడానికి బే ఆఫ్ బెంగాల్ ఇన్నోవేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కోఆపరేషన్ (బంగాళాఖాత తీర దేశాల బహుళార్థ సాంకేతిక, ఆర్థిక సహకార సంస్థ-బిమ్స్టెక్) 1997, జూన్ 6న ఏర్పడింది.
-ఇందులో భారత్, బంగ్లాదేశ్, బర్మా (మయన్మార్), భూటాన్, శ్రీలంక, థాయ్‌లాండ్, నేపాల్‌లు సభ్యదేశాలు. ఈ ప్రాంతీయ కూటమిలో మొదట బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయ్‌లాండ్‌లు (బీఐఎస్టీ-ఈసీ) సభ్యులుగా ఉన్నాయి.
-1997, డిసెంబర్ 22న మయన్మార్ చేరడంతో బీఐఎంఎస్టీ-ఈసీగా, 2014లో నేపాల్, భూటాన్‌లు శాశ్వత సభ్యత్వం తీసుకోవడంతో అది బిమ్‌స్టెక్‌గా మారింది.
-ఈ కూటమి మొదటి సమావేశం 2004, జూలై 31న థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో, రెండో సమావేశం న్యూఢిల్లీలో 2008, నవంబర్ 13న జరిగింది.
-మూడో సమావేశం మయన్మార్‌లోని నేపిడాలో 2014, మార్చి 4న జరుగగా, 2017లో జరుగనున్న నాలుగో సమావేశానికి నేపాల్ రాజధాని కఠ్మాండు ఆతిథ్యం ఇవ్వనుంది.
ఒపెక్
-ప్రధాన కార్యాలయం ఆస్ట్రియాలోని వియన్నాలో ఉంది.
-ఇది 1960, సెప్టెంబర్‌లో ఇరాక్‌లోని బాగ్దాద్‌లో ఏర్పడింది.
-సభ్యదేశాలు: 13 (ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీఅరేబియా, వెనిజులా (1960, సెప్టెంబర్‌లో సభ్యత్వం తీసుకున్నాయి), ఖతార్ (1961), లిబియా, ఇండోనేషియా (1962), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ-1967), అల్జీరియా (1969), నైజీరియా (1971), ఈక్వెడార్ (1973), గబాన్ (1975), అంగోలా (2007)).
-1992లో ఈక్వెడార్‌ను ఒపెక్ నుంచి తొలగించగా, 2007లో మళ్లీ సభ్యత్వం పొందింది.
-ఇండోనేషియాను 2009, జనవరిలో కూటమి నుంచి తొలగించగా, 2016, నవంబర్‌లో తిరిగి చేరింది.
-గబాన్ను 1995లో జనవరిలో కూటమి నుంచి బహిష్కరించారు.
-మొదటి సమావేశం 1960, సెప్టెంబర్ 10 నుంచి 14 వరకు ఇరాక్‌లోని బాగ్దాద్‌లో జరిగింది.
-170వ సమావేశం 2016, సెప్టెంబర్ 28న అల్జీరియాలోని అల్జీర్స్లో, 171వ సమావేశం ఆస్ట్రియాలోని మియన్నాలో 2016, నవంబర్ 30న జరిగింది.
-172వ సమావేశం 2017, మే 22న ఆస్ట్రియా రాజధాని వియన్నాలో జరుగనుంది.
ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు
-ఆసియా ప్రాంతాల్లో సామాజిక, ఆర్థిక అభివృద్ధిని సాధించడమే ప్రధాన లక్ష్యంగా 1966, డిసెంబర్ 19న ఆసియా అభివృద్ధి బ్యాంకును ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం ఫిలిప్పైన్స్‌లోని మనీలాలో ఉంది.
-ప్రపంచ బ్యాంకు విధివిధానాలను పోలి ఉండే ఈ బ్యాంకుకు ప్రస్తుతం అధ్యక్షుడిగా జపాన్‌కు చెందిన తకెహికో నకావో ఉన్నారు (2013 నుంచి ఆయన కొనసాగుతున్నారు). బ్యాంకు మొదటి అధ్యక్షుడు తకేషీ వతనబె (1966-72)
-ఇందులో మొత్తం 67 దేశాలు (ఆసియా పసిఫిక్ దేశాలు 48, ఇతర ప్రాతాలకు చెందిన దేశాలు 19) సభ్యత్వం కలిగి ఉన్నాయి. అయితే మొదట 31 దేశాలు మాత్రమే సభ్యులుగా చేరాయి.
-ఈ బ్యాంకులో చివరగా ఐర్లాండ్ 2006లో సభ్యత్వం తీసుకున్నది.
-ఇది ప్రతి ఏడాది సమావేశమవుతుంది.
-1966, నవంబర్ 24 నుంచి 26 వరకు ప్రారంభ సమావేశాలు జరుగగా, మొదటి సమావేశం మనీలాలోని మనీలా హిల్టన్‌లో ఏప్రిల్ 4-6 వరకు జరిగాయి.
-రెండో సమావేశాలు 1969, ఏప్రిల్ 10 – 12 వరకు ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీలో, మూడో సమావేశం కొరియా రాజధాని సియోల్‌లో 1970, ఏప్రిల్ 9 – 11 వరకు జరిగాయి.
-49వ వార్షిక సమావేశం 2016, మే 3-5 వరకు జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగాయి.
-50వ వార్షిక సమావేశాలను 2017, మే 4 నుంచి 7 వరకు జపాన్‌లోని యొకొహామాలో నిర్వహించారు.
-ఏడీబీ సమావేశాలకు భారత్ ఇప్పటివరకు మూడు సార్లు ఆతిథ్యమిచ్చింది.
-మొదటి సమావేశం 1990, మే 2-4 వరకు (23వ సమావేశం) న్యూఢిల్లీలో, రెండో సారి 2006, మే 4-6 వరకు హైదరాబాద్‌లో (39వ సమావేశం), మూడోసారి 2013, మే 4, 5 తేదీల్లో (46వ సమావేశం) న్యూఢిల్లీలో జరిగాయి.
నామ్ (అలీనోద్యమం)
-అమెరికా, సోవియట్ యూనియన్ దేశాలకు చెందిన కూటముల్లో చేరకుండా తటస్థంగా ఉన్న దేశాలన్నీ కలిసి 1961లో బెల్గ్రేడ్లో అలీనోద్యమ కూటమి (నాన్ అలైన్డ్ మూవ్మెంట్)గా ఏర్పడ్డాయి.
-దీని ప్రధాన కార్యాలయం ఇండోనేషియాలోని జకార్తాలో ఉంది.
-కూటమిలోని సభ్యదేశాల స్వాతంత్య్రం, సార్వభౌమత్వం, సమగ్రత, భద్రతలను పరిరక్షించడమే దీని ప్రధాన ఉద్దేశం.
-అలీనోద్యమ రూపకర్తలు భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, ఇండోనేషియా తొలి అధ్యక్షుడు సుకర్నో, ఈజిప్టు రెండో అధ్యక్షడు గామెల్ అబ్దుల్ నాసర్, ఘనా తొలి అధ్యక్షుడు క్వామేక్రుమా, యుగోస్లేవియా అధ్యక్షుడు జోసిప్ టిటో.
-ఇందులో మొత్తం 120 దేశాలకు సభ్యత్వం ఉండగా, 17 దేశాలు పరిశీలక హోదా కలిగి ఉన్నాయి.
-కూటమి ప్రస్తుత సెక్రటరీ జనరల్- నికోలస్ మదూరో
-ఇది ప్రతి మూడేండ్లకు ఒకసారి సమావేశమవుతుంది. ఇలా ఇప్పటివరకు 17 సమావేశాలు జరిగాయి.
-ఈ కూటమి మొదటి సమావేశం 1961లో బెల్గ్రేడ్లో జరిగింది.
-రెండో సమావేశం యునైటెడ్ అరబ్ రిపబ్లిక్‌లోని కైరోలో 1964, అక్టోబర్ 5-10వ జరిగింది.
-2012, ఆగస్టు 26-31 వరకు ఇరాన్‌లోని టెహ్రాన్‌లో 16వ సమావేశం జరిగింది.
-17వ సమావేశం 2016, సెప్టెంబర్ 13-18 వరకు వెనిజులాలోని మార్గరెటా ద్వీపంలో జరిగింది.
-ఈ సమావేశాలకు భారత్ ఒకసారి ఆతిథ్యమిచ్చింది. 1983లో న్యూఢిల్లీలో (7వ సమావేశం) జరిగాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు