Hall-Ticket | SCT SI హాల్ టికెట్స్ విడుదల.. ఈ నెల 21న వెబ్సైట్లో అందుబాటులోకి.. 26న పరీక్ష
హైదరాబాద్: తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) ఈ నెల 26న జరగాల్సిన SCT SI టెక్నికల్ పేపర్ రాత పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను విడుదల చేసింది. ఈ నెల 21న ఉదయం 8 గంటల నుంచి ఈ హాల్‌టికెట్స్ వెబ్సైట్లో అందుబాటులోకి రానున్నాయి. మార్చి 21న ఉదయం 8 గంటల నుంచి 24న అర్ధరాత్రి 12 గంటల వరకు అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు TSLPRB అవకాశం కల్పించింది. ఈ మేరకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది.
SCT SI టెక్నికల్ పేపర్ రాత పరీక్షను ఈ నెల 26న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనుంది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్ల డౌన్లోడ్ కోసం అభ్యర్థులు TSLPRB వెబ్సైట్ www.tslprb.inను సంప్రదించాలి. వెబ్సైట్లో వివరాలను పొందుపర్చి హాల్ టికెట్‌ను పొందవచ్చు. ఒకవేళ వెబ్సైట్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ కానివారు support@tslprb.inకు ఈ మెయిల్ చేయడం ద్వారా లేదంటే 93937 11110, 93910 05006 నెంబర్లకు ఫోన్ చేయడం ద్వారా హాల్ టికెట్లను పొందవచ్చు.
కాగా, SCT SI పోస్టుల భర్తీ కోసం నిర్వహించే మిగతా రెండు పేపర్లకు సంబంధించిన హాల్ టికెట్లను విడిగా జారీచేయనున్నట్లు TSLPRB తెలిపింది. ఆ హాల్ టికెట్ల డౌన్‌లోడ్‌కు సంబంధించిన తేదీలను మరో ప్రకటన ద్వారా తెలియజేయనున్నట్లు వెల్లడించింది. ఇదిలావుంటే అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోగానే తప్పనిసరిగా దానిపై సంబంధిత ప్రదేశంలో పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోను అంటించాలని TSLPRB సూచించింది. హాల్‌టికెట్‌పై పాస్ ఫొటో లేకపోతే పరీక్ష హాల్లోకి అనుమతించరని తెలిపింది.
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






