TS KGBV Recruitment | తెలంగాణ కేజీబీవీల్లో 1,241 పోస్టులు.. దరఖాస్తులకు ఇంకా 2 రోజులే గడువు
TS KGBV Recruitment 2023 | ఎకనామిక్స్, ఫిజిక్స్, బయాలజీ, బయో సైన్స్, ఇంగ్లిష్, హిందీ, గణితం, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, తెలుగు సబ్జెక్టుల్లో స్పెషల్ ఆఫీసర్, పీజీసీఆర్టీ, సీఆర్టీ తదితర మహిళా ఫ్యాకల్టీ పోస్టులు అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో స్పెషల్ ఆఫీసర్, సీఆర్టీ తదితర పురుష, మహిళా ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్రంలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ దరఖాస్తు గడువు జూలై 05తో ముగియనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీ, బీఈడీ, యూజీపీఈడీ, బీపీఎడ్ ఉత్తీర్ణతతోపాటు టెట్, సీటెట్‌లో అర్హత సాధించి ఉండాలి. మొత్తం 1,241 ఖాళీల్లో ఎస్ఓలు 42, పీజీసీఈటీ 849, సీఆర్టీ 273, పీఈటీ పోస్టులు 77 ఉన్నట్టు పేర్కొన్నది. రాత పరీక్ష(ఆబ్జెక్టివ్ విధానంలో), పని అనుభవం ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 1241
పోస్టులు : ఎస్ఓలు 42, పీజీసీఈటీ 849, సీఆర్టీ 273, పీఈటీ పోస్టులు 77
సబ్జెక్టులు : ఎకనామిక్స్, ఫిజిక్స్, బయాలజీ, బయో సైన్స్, ఇంగ్లిష్, 16. హిందీ, గణితం, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, తెలుగు తదితరాలు.
అర్హతలు : సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీ, బీఈడీ/ బీఈడీ(స్పెషల్ ఎడ్యుకేషన్)/ యూజీపీఈడీ/ బీపీఎడ్ ఉత్తీర్ణతతోపాటు టెట్/ సీటెట్‌లో అర్హత సాధించి ఉండాలి.
వయస్సు: జూలై 01 నాటికి 18 నుంచి 44 ఏండ్ల మధ్య ఉండాలి. (ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అయిదేళ్లు, మాజీ సైనికులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది).
ఎంపిక : రాత పరీక్ష, పని అనుభవం ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు : రూ.600.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : జూలై 05
వెబ్సైట్ : https://schooledu. telangana.gov.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?