Vikarabad DWO Recruitment | వికారాబాద్ జిల్లా సంక్షేమ కార్యాలయంలో ఉద్యోగాలు
Telangana District Welfare Office Vikarabad Recruitment | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వికారాబాద్ జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్, మహిళా శిశు దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలోని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లో ఖాళీగా ఉన్న జిల్లా మిషన్ కోఆర్డినేటర్, కౌన్సిలర్, చైల్డ్ హెల్ప్‌లైన్ సూపర్వైజర్, కేస్ వర్కర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు స్థానిక జిల్లాకు చెంది ఉండి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమాతోపాటు పని అనుభవం ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో జూన్ 13వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా సంబంధిత సర్టిఫికెట్లతోపాటు దరఖాస్తులను పంపించవల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు : 08
పోస్టులు : మిషన్ కోఆర్డినేటర్, కౌన్సిలర్, చైల్డ్ హెల్ప్‌లైన్ సూపర్వైజర్, కేస్ వర్కర్ తదితరాలు
అర్హతలు : సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమాతోపాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో
దరఖాస్తు విధానం : ఆఫ్‌లైన్ దరఖాస్తులను జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, డబ్ల్యూడీఎస్సీడీ, రూమ్ నం.ఎస్-9, కలెక్టరేట్, వికారాబాద్ అడ్రస్‌కు పంపించాలి.
చివరి తేదీ: జూన్ 13
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
వయస్సు : 25 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి.
వెబ్సైట్ : https://Vikarabad.telangana.gov.in/recruitment/
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు
జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం?
అణువిద్యుత్ సామర్థ్యం.. మూడింతల లక్ష్యం
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు