మరో 181 పోస్టులకు నోటిఫికేషన్

# నిరుద్యోగ మహిళలకు సర్కారు శుభవార్త
# స్త్రీ, శిశు సంక్షేమశాఖలో కొత్త కొలువులు
# గ్రేడ్-1 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
# వచ్చే నెల 8 నుంచి దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతున్నది. ఈ సారి మహిళా అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ములుగు అటవీ కళాశాలలో 27 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి, వారంరోజులు గడవక ముందే మరో నోటిఫికేషన్ ఇచ్చింది. రాష్ట్రంలో 80,039 కొలువులు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించిన నాటినుంచీ శరవేగంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటివరకూ ఆర్థికశాఖ 49,455 ఉద్యోగాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. శనివారం టీఎస్పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ వెలువడింది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో 181 గ్రేడ్-1 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (సూపర్వైజర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే నెల 8 నుంచి 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. 18 నుంచి 44 ఏండ్ల మధ్య వయస్సు కలిగిన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని, దరఖాస్తుదారులు 1 జూలై 2004కు ముందు జన్మించినవారై ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేండ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు మూడేండ్లు, ఎన్సీసీ అభ్యర్థులకు మూ డేండ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాటగిరీకి ఐదేండ్లు, దివ్యాంగులకు మరో పదేండ్ల వయోపరిమితి కల్పించినట్టు వివరించారు. వేతన పరిధి రూ.35,720 -రూ.1,04,430 మధ్య ఉంటుందని వెల్లడించారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖలో గ్రేడ్-1 ఎక్స్టెన్షన్ ఆఫీసర్(సూపర్ వైజర్)కు వేతన పరిధి రూ.35,720 -రూ.1,04,430 మధ్య ఉంటుందని వెల్లడించారు. వివరాలకు https:// www.tspsc.gov.inను సంప్రదించాలని సూచించారు. సందేహాలు, ఫిర్యాదులకు 040-23542 185, 040-23542187 లేదా help desk@tspsc.gov.in సంప్రదించాలని అనితారామచంద్రన్ పేర్కొన్నారు.
జోన్ల వారీగా పోస్టుల వివరాలు…
జోన్ పోస్టుల సంఖ్య
కాళేశ్వరం 26
బాసర 27
రాజన్న 29
భద్రాద్రి 26
యాదాద్రి 21
చార్మినార్ 21
జోగుళాంబ 31
మొత్తం 181
- Tags
- Grade-1 Supervisor
- TSPSC
RELATED ARTICLES
-
INCOIS Recruitment | ఇన్‌కాయిస్‌లో ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులు
-
Power Grid Recruitment | పవర్ గ్రిడ్ లో 138 ఇంజినీరింగ్ ఉద్యోగాలు
-
ICMR-NIRTH Recruitment | ఎన్ఐఆర్టీహెచ్ జబల్పూర్లో ఉద్యోగాలు
-
NIEPID Recruitment | ఎన్ఐఈపీఐడీలో 39 పోస్టులు
-
DPH&FW, Nagarkurnool | నాగర్‌కర్నూలు జిల్లాలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు
-
TSNPDCL Recruitment | టీఎస్ఎన్పీడీసీఎల్లో 100 ఉద్యోగాలు
Latest Updates
Indian History | బల్వంతరాయ్ మెహతా కమిటీని ఎప్పుడు నియమించారు?
Telangana History | తెలంగాణ ప్రాంతీయ మండలిని రద్దు చేసిన సంవత్సరం?
PHYSICS Groups Special | విశ్వవ్యాప్తం.. దృష్టి శక్తి స్వరూపం
CPRI Recruitment | సీపీఆర్ఐలో 99 ఇంజినీరింగ్ పోస్టులు
UPSC Recruitment 2023 | యూపీఎస్సీలో 69 ఇంజనీరింగ్ పోస్టులు
Geography Groups Special | ‘రెడ్ డేటా బుక్’లో వేటి జాబితా ఉంటుంది?
Physics Groups Special | సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలో కనిపించే సూర్యభాగం?
Current Affairs March 31 | చీతాల రక్షణ.. ఏనుగుల బాధ్యత
NEEPCO Recruitment | నీప్కో మేఘాలయాలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు
RCFL Recruitment 2023 | ఆర్సీఎఫ్ఎల్లో ఆఫీసర్ పోస్టులు