Government Jobs 2023 | ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా?.. ఎల్లుండే చివరితేదీ
last date of application | నిరుద్యోగులకు అలర్ట్.. ఉద్యోగ ప్రకటనకు సంబంధించి పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు విడుదల చేసిన నోటిఫికేషన్ల గడువు ఎల్లుండితో ముగియనుంది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
1. TCIL Recruitment | టీసీఐఎల్‌లో మేనేజర్ పోస్టులు
TCIL Recruitment 2023 | జనరల్ మేనేజర్, చీఫ్ జనరల్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన టెలికమ్యునికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(టీసీఐఎల్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంటెక్, ఎంసీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు విధానం ఆఫ్‌లైన్ ద్వారా ఉండగా.. ఏప్రిల్ 19 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 09
పోస్టులు: జనరల్ మేనేజర్, చీఫ్ జనరల్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తదితరాలు
అర్హతలు: పోస్టును బట్టి బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంటెక్, ఎంసీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి
వయసు: 50-56 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు 1లక్ష-రూ.3లక్షలు
ఎంపిక : ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు : ఆఫ్‌లైన్ ద్వారా
అడ్రస్ : చీఫ్ జనరల్ మేనేజర్ (HR), టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్., TCIL భవన్, గ్రేటర్ కైలాష్ –I, న్యూఢిల్లీ – 110048.
చివరి తేది: ఏప్రిల్ 19
వెబ్సైట్: https://www.tcil.net.in.
2.CCL Recruitment | సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్‌లో 330 పోస్టులు
CCL Recruitment 2023 | మైనింగ్ సర్దార్ (Mining Sirdar), ఎలక్ట్రీషియన్ (నాన్ ఎగ్జిక్యూటివ్) టెక్నీషియన్, డిప్యూటీ సర్వేయర్ (Deputy Surveyor), అసిస్టెంట్ ఫోర్మాన్ (Assistant Foreman) & ఎస్ (ఎలక్ట్రికల్) తదితర పోస్టుల భర్తీకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ఝార్ఖండ్ రాంచీలోని సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి, పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాంక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 330
పోస్టులు : మైనింగ్ సర్దార్, ఎలక్ట్రీషియన్(నాన్ ఎగ్జిక్యూటివ్) టెక్నీషియన్, డిప్యూటీ సర్వేయర్, అసిస్టెంట్ ఫోర్మాన్ టీ & ఎస్ (ఎలక్ట్రికల్) తదితరాలు
అర్హతలు: పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు : 19-04-2023 నాటికి 18 ఏండ్లు నిండి ఉండాలి.
ఎంపిక : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాంక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: ఏప్రిల్ 19
రాత పరీక్ష తేదీ : మే 5
వెబ్సైట్ : http://centralcoalfields.in/
3.AIIMS Bathinda Recruitment | ఎయిమ్స్ భటిండాలో ఉద్యోగాలు
AIIMS Bathinda Recruitment 2023 | సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ ( Senior Technical Officer), పెర్ప్యూషనిస్ట్, ఎలక్ట్రో కార్డయోగ్రాఫిక్ టెక్నికల్ అసిస్టెంట్లు, సీనియర్ & జూనియర్ క్యాథ్ ల్యాబ్ టెక్నిషియన్లు తదితర పోస్టుల భర్తీకి పంజాబ్ భటిండాలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి బీఎస్సీ, డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 12
పోస్టులు : సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, పెర్ప్యూషనిస్ట్, ఎలక్ట్రో కార్డయోగ్రాఫిక్ టెక్నికల్ అసిస్టెంట్లు, సీనియర్ & జూనియర్ క్యాథ్ ల్యాబ్ టెక్నిషియన్లు తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి బీఎస్సీ, డిప్లొమా ఉత్తీర్ణత
వయస్సు : 21 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : నెలకు రూ.50268 నుంచి రూ.63758
ఎంపిక : రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
దరఖాస్తు ఫీజు: రూ.1000
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేది: ఏప్రిల్ 19
వెబ్సైట్ : https://aiimsbathinda.edu.in/
4.CSL Recruitment | కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో 76 పోస్టులు
Cochin Shipyard Limited Recruitment 2023 | డ్రాఫ్ట్స్‌మ్యాన్ ట్రెయినీ (Draftsman Trainee) పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మెకానికల్, ఎలక్ట్రికల్ తదితర విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి ఎస్ఎస్ఎల్సీ, కనీసం 60 శాతం మార్కులతో స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆన్లైన్ పరీక్ష, అకడమిక్ మార్కులు ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 76
పోస్టులు : డ్రాఫ్ట్స్‌మ్యాన్ ట్రెయినీ పోస్టులు
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్
అర్హతలు : పోస్టులను బట్టి ఎస్ఎస్ఎల్సీ, కనీసం 60 శాతం మార్కులతో స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ట్రెయినింగ్ వ్యవధి: రెండేళ్లు.
వయస్సు : 25 ఏండ్లు మించకూడదు.
స్టైపెండ్: నెలకు రూ.12600
ఎంపిక : అకడమిక్ మార్కులు, ఆన్లైన్ పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.600.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: ఏప్రిల్ 19
వెబ్సైట్ : www.cochinshipyard.com
5.NITW | వరంగల్ నిట్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
NITW Recruitment | డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో అడ్‌హక్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ ప్రకటన విడుదల చేసింది.
పోస్టులు : అడ్‌హక్ ఫ్యాకల్టీ
అర్హతలు: ఎంఈ, ఎంటెక్, పీహెచ్డీ (ఈఐ, ఈఎస్, వీఎల్ఎస్ఐ, ఏసీఎస్, కమ్యూనికేషన్స్, మైక్రోవేవ్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
జీతం : నెలకు పీహెచ్డీ అభ్యర్థులకు రూ.60,000; పీజీ అభ్యర్థులకు రూ.50,000.
దరఖాస్తు : గూగుల్ ఫాం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి.
చివరితేదీ: ఏప్రిల్ 19
వెబ్సైట్ : https://nitw.ac.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?