Government Jobs 2023 | ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? నేడే చివరితేదీ
last date of application | నిరుద్యోగులకు అలర్ట్.. ఉద్యోగ ప్రకటనకు సంబంధించి పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు విడుదల చేసిన నోటిఫికేషన్ల గడువు నేటితో ముగియనుంది.
1. SPA Bhopal recruitment | స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్లో 24 పోస్టులు
SPA Bhopal Recruitment : 24 ప్రోఫెసర్, అసోసియేట్ ప్రోఫెసర్, అసిస్టెంట్ ప్రోఫెసర్, లైబ్రరీ ట్రైనీ పోస్టుల భర్తీకి భోపాల్‌లోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు : 24
పోస్టులు : ప్రోఫెసర్, అసోసియేట్ ప్రోఫెసర్, అసిస్టెంట్ ప్రోఫెసర్, లైబ్రరీ ట్రైనీ
అర్హతలు : సంబదిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
లైబ్రరీ ట్రైనీకి 55 శాతం మార్కులతో ఎంఎల్ఐసీ ఉత్తీర్ణత
ఎంపిక : రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్/ ఆఫ్‌లైన్
చివరి తేదీ : ఆన్లైన్లో మార్చి 31, ఆఫ్‌లైన్‌లో ఏప్రిల్ 10, లైబ్రరీ ట్రైనీ పోస్టులకు మార్చి 3
వెబ్సైట్ : https://spabhopal.ac.in/vacantposition.aspx
2. Mail Motor | చెన్నై మెయిల్ మోటార్ సర్వీసులో 58 పోస్టులు
తమిళనాడు సర్కిల్లో స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల భర్తీకి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్‌కు చెందిన చెన్నైలోని మెయిల్ మోటార్ సర్వీస్… ప్రకటన విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు : 58
పోస్టులు : స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులు
అర్హతలు: 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్‌లో పాటు మూడేళ్ల పని అనుభవం, మోటార్ మెకానిజంపై పరిజ్ఞానం
వయస్సు : 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.19,900 – రూ.63,200.
ఎంపిక : రాత పరీక్ష, డ్రైవింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.100(ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.150)
దరఖాస్తు : ఆఫ్‌లైన్
దరఖాస్తు విధానం : దరఖాస్తులను సీనియర్ మేనేజర్, మెయిల్ మోటార్ సర్వీస్, గ్రీమ్స్ రోడ్, చెన్నై అడ్రస్‌కు పంపించాలి.
చివరి తేదీ: మార్చి 31
3.IAF Recruitment | ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నివీర్ పోస్టులు
Indian Air force Agniveer Recruitment 2023 | కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్.. అగ్నిపథ్ స్కీంలో భాగంగా అగ్నివీర్ ఎయిర్‌ఫోర్స్ పోస్టులకు సంబంధించి ప్రకటన విడుదలైంది.
పోస్టుల వివరాలు : ఇండియన్ ఎయిర్‌ఫోర్స్-అగ్నిపథ్ స్కీం అగ్నివీర్ వాయు (02/2023) బ్యాచ్ రిక్రూట్మెంట్
అర్హతలు : కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్ (10+2)/ ఇంటర్ (సైన్స్ కాని ఇతర సబ్జెక్టులు) లేదా మూడేండ్ల ఇంజినీరింగ్ డిప్లొమా(మెకానికల్/ ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఆటోమొబైల్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఐటీ)/ తత్సమాన ఉత్తీర్ణతతో పాటు.. నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
ఎంపిక : ఫేజ్-1(ఆన్లైన్ రాత పరీక్ష), ఫేజ్-2(ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, టెస్ట్-2), ఫేజ్-3(మెడికల్ ఫిట్నెస్ టెస్ట్), సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక.
వయస్సు : 26.12.2002 నుంచి 26.06.2006 మధ్య పుట్టి ఉండాలి.
దరఖాస్తు : ఆన్లైన్ లో
దరఖాస్తు ఫీజు: రూ.250 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ కేటగిరీ అభ్యర్ధులు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు)
దరఖాస్తు ప్రారంభ తేదీ: మార్చి 17
చివరి తేదీ : మార్చి 31
వెబ్సైట్: agnipathvayu.cdac.in లేదా indianairforce.nic.in
4.IIPE Recruitment | విశాఖపట్నం ఐఐపీఈలో ఫ్యాకల్టీ పోస్టులు
ఆంధ్రప్రదేశ్‌కు చేందిన విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (IIPI) ఫ్యాకల్టీ (ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
పోస్టులు: ఫ్యాకల్టీ (ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్)
విభాగాలు : కెమికల్ ఇంజినీరింగ్, ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, పెట్రోలియం ఇంజినీరింగ్
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీటెక్, బీఈ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు ప్రొఫెసర్‌కు 10 ఏండ్లు, అసోసియేట్ ప్రొఫెసర్‌కు 5 ఏండ్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు 3 ఏండ్ల అనుభవం ఉండాలి.
జీతం : 1.ప్రొఫెసర్ నెలకు రూ.159100. 2.అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.139600
3.అసిస్టెంట్ ప్రొఫెసర్ రూ.101500
ఎంపిక: స్క్రీనింగ్, ఇంటరాక్షన్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: మార్చి 31
వెబ్సైట్: https://recruitment.iipe.ac.in/
5.CPCB Recruitment 2023 | సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌లో 163 ఖాళీలు
Central Pollution Control Board | భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్(CPCB).. ఖాళీగా ఉన్న 163 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య : 163
పోస్టులు: సైంటిస్ట్ బీ, అసిస్టెంట్ లా ఆఫీసర్, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నికల్ సూపర్వైజర్, అసిస్టెంట్, అకౌంట్స్ అసిస్టెంట్, సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ తదితరాలు.
అర్హతలు: 10వ తరగతి, ఇంటర్ డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత.
ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్/ ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు: ఆన్లైన్లో
వయస్సు : 18నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయసులో మినహాయింపు)
దరఖాస్తు ఫీజు: రూ.1000
చివరితేదీ: మార్చి 31
వెబ్సైట్: https://cpcb.nic.in/
6.Nalsar Unversity | నల్సర్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టులు
NALSAR Recruitment | ప్రొఫెసర్(లా, మేనేజ్మెంట్), అసోసియేట్ ప్రొఫెసర్(లా, మేనేజ్మెంట్), అసిస్టెంట్ ప్రొఫెసర్(లా, మేనేజ్మెంట్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్), డైరెక్టర్(డైరెక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్), హెడ్, కార్పొరేట్ ఇంటర్ఫేస్, ప్లేస్మెంట్ ఆఫీసర్ తదితర ఫ్యాకల్టీ, అకడమీక్ పోస్టుల భర్తీకి హైదరాబాద్(Hyderabad)లోని నల్సర్ యూనివర్సిటీ ఆఫ్ లా (NALSAR UNIVERSITY OF LAW).. ప్రకటన విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు : 58
పోస్టులు : ప్రొఫెసర్(లా, మేనేజ్మెంట్), అసోసియేట్ ప్రొఫెసర్(లా, మేనేజ్మెంట్), అసిస్టెంట్ ప్రొఫెసర్(లా, మేనేజ్మెంట్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్), డైరెక్టర్(డైరెక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్), హెడ్, కార్పొరేట్ ఇంటర్ఫేస్, ప్లేస్మెంట్ ఆఫీసర్ తదితరాలు.
అర్హతలు : పోస్టును బట్టి పీజీ, ఎంఫిల్, పీహెచ్డీ, ఐజీడబ్యూఏ, సీఎంఏ ఉత్తీర్ణత.. నెట్, సెట్, స్లెట్ అర్హతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : మార్చి 31
వెబ్సైట్ : https://www.nalsar.ac.in/
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?